Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొంబదిఒకటవ అధ్యయము - శక్రశాంబరాయణీయ కథ

శక్రః : కేనకర్మ విపాకేన స్వర్గతా త్వం వరాననే! | దీర్ఘకాల మిహస్థాసి తథాచైవా ప్యనాగతాన్‌ || 1

కథం మన్వంతరాన్‌వేత్సి? తన్మమాచక్ష్వ పృచ్ఛతః | త్వత్సమా దివినైవాన్యా కచిదస్తి చిరంత నీ || 2

ఏకరూపః కథం కర్తా త్వయాదృష్టః సురేశ్వరి ! మన్వంతరాణాం జానాసి భవిష్యాణాం తథాగతిమ్‌ || 3

శాంబరాయణీ: త్రిదివే సప్తమఃకల్పో మమాయం త్రిదివేశ్వర ! దేవదేవ ప్రసాదేన వసన్త్యా వర్తతేనఘ || 4

పరార్ధశ్చ తథాబ్రాహ్మో జనలోకే గతామమ | ఏకరూపా స్తథాకల్పా మయాదృష్టాః సురేశ్వర ! 5

మన్వంతరాణాం జానామి భవిష్యాణాం తథాగతిమ్‌ | మయా మానుష్య మాసాద్య మాసనక్షత్ర పూజనమ్‌ || 6

ప్రతిమాసం కృతంవిష్ణో ర్యావజ్జీవం సురేశ్వర ! తేనకర్మ విపాకేన త్రిదివే వసతిశ్చిరమ్‌ || 7

మయేయం సమనుప్రాప్తా దేవదేవ ప్రసాదజా 7 అస్మాదపి మహాభాగ ! బ్రహ్మలోకం నయత్యుత || 8

మార్కండేయః : ఏతదుక్త్వా మహాభాగ! శక్రంసా శాంబరాయణీ ! జగామా దర్శనం రాజన్‌! తత్రైవ సురపూజితా || 9

మాసర్షపూజా మధికృత్య విష్ణో ర్మయా తదేవం కథితం సమగ్రమ్‌ |

తస్మా త్ర్పయత్నేన నరేంద్రచంద్ర ! మానర్షపూజాం ప్రయతేత కర్తుమ్‌ || 10

శ్రోతవ్యమే తత్ర్పయతేన వజ్ర! పాపావహం ధర్మ వివృద్ధిదం చ |

సంవాద మగ్ర్యం త్రిదశేశ్వరస్య సిద్ధాంగనాయాశ్చ పరం పవిత్రమ్‌ || 11

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్ర శాంబరాయణీ కథానకంనామ ఏకోననవత్యధిక శతతమోధ్యాయః

ఇంద్రుడు నీవే కర్మపరిపాకముచేతనో సుముభి స్వర్గమున కేగితిని. దీర్ఘ కాలమిక్కడ నుంటివి. అనాగతములయిన మన్వంతరగతుల నీవెట్లు తెలిసికొనుచున్నావు. అడుగుచున్న నాకు నానతిమ్ము. దేవి! నీతో సమురాలింకొకతె చిరంతని (సనాతని) లేనేలేదు. ఓ సురేశ్వరీ! నీకు జగత్కర్త ఏక రూపుడుగనెట్లు గనబడెను? భవిష్యమన్వంతరముల గతినెట్లు ఎరుంగుచున్నా వన శాంబయణి యిట్లనియె: ఓ త్రిదివాధీశ్వరా! స్వర్గ మందిప్పుడు నాకు సప్తమ కల్పము జరుగుచున్నది. ఇది దేవదేవుని ప్రసాదమున నైనది. నాకు పరార్ధ కాలము సగము కల్పకాలములన్నియు నేకరూపములయి కనబడినవి. అట్లే భవిష్య మన్వంతరముల గమనమేను తెలిసి కొనుచున్నాను. నేను మనుష్య జన్మయొంది విష్ణుదేవునకు మాసనక్షత్ర పూజ ప్రతిమాసము యావజ్జీవము గావించితిని. ఆ కర్మ విపాకముచే చిరకాలము త్రిదిన (స్వర్గ) నివాసము నాకు దేవదేవుని ప్రసాదమున లభించినది. అది ఇట నుండి నన్ను బ్రహ్మలోకమునకుం గొంపోవును అని ఇంత పలికి ఆ మహానుభావురాలు (శాంబరాయణి) దేవపూజితయై యక్కడనే యంతర్దాన మందెను. నేను విష్ణువు మాసనక్షత్ర పూజను గురించి సమగ్రముగ వచించితిని. కావుననో నరేంద్రచంద్ర! నీవు కూడ మాసనక్షత్ర పూజ గావింప ప్రయత్నము సేయుము. ఓ వజ్రప్రభూ! ఇది పాపాపహము ధర్మ వివృద్ధిప్రదము త్రిదశేశ్వరునికి సిద్ధాంగనకు జరిగిన పరమోత్తమ సంవాదము పరమ పవిత్రము శ్రద్ధమోయి వినవలసినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శక్ర శాంబరాయణీకథ యను నూటతొంబదియొకటవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters