Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటతొంబదిరెండవ అధ్యాయము - విష్ణు స్తుతి మహిమానువర్ణనము వజ్రః : శ్రుతవానస్మి ధర్మజ్ఞ! దేవవేశ్మోపలేఖనే | ఫలం గదతి బ్రహ్మన్ ! శ్రోతు మిచ్ఛామ్యహం పునః ||
1 లేపనాదపి యత్స్వర్గ ఫలదంచ యథాభ##వేత్ | తన్మేకర్మ త్వమాచక్ష్వ సర్వజ్ఞో೭సి భృగూత్తమ ! 2 మార్కండేయః : స్తుతి ర్లఘుతరా తస్యలేపనాదపి యాదవ ! తథా బహుఫలాప్రోక్తా తాం కురుష్వ యదీచ్ఛసి || 3 యే స్తువన్తి మహాదేవం శంఖచక్ర గదాధరమ్ | తేషాం న దుర్లభం కించిదిహలోకే పరత్రచ || 4 వాసుదేవం స్తువన్ మర్త్యః సర్వపాపం వ్యపోహతి | స్వర్గంచానన్త్య మాప్నోతి నాత్రకార్యా విచారణా || 5 ధర్మార్థీ ప్రాప్నుయా ద్ధర్మ మర్థార్థీ చాప్నుయాద్ధనమ్ | కామాన వాప్నుయాత్కామీ ప్రజార్థీ స్రాప్ను యాత్ర్పజాః || 6 రోగార్తో ముచ్యతే రోగాద్భద్ధో ముచ్యేత బంధనాత్ | భయాన్ముచ్యేత భీతశ్చ ముచ్యేతాపన్న ఆపదః || 7 దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ | స్తువన్ మనుజశార్దూల ! నాత్రకార్యా విచారణా || 8 తస్మాత్సర్వ ప్రయత్నేన దివ్యైః ఋషికృతైః స్తవైః | స్తూయాన్న రేంద్ర ! సతతం దేవదేవం సుభాషితైః || 9 కమలపత్ర శుభామర లోచనం హరి మరిఘ్న మచింత్య పరాక్రమమ్ | శరణమేత్య మహాభయ పీడితా భువి భవన్తి నరా భయవర్జితాః || 10 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే స్తుతిమహాత్మ్య వర్ణనంనామ ద్వినవత్యధిక శతతమో೭ధ్యాయః. మార్కండేయ ప్రభూ ! ధర్మజ్ఞ! దేవాలయోపలేపనఫలము నీవానతీయ నేనాలించితిని. బ్రహ్మణ్యా! ఇంకనునేను వినగోరెదను లేపనముకంటెను స్వర్గఫలదమైనది మరియేమి పనియో నాకానతిమ్ము. భృగువంశోత్తమా నీవు సర్వజ్ఞుడవు అని వజ్రుడన విని మార్కండేయుడనియె. యాదవా ! లేపనముకంటెను నావిష్ణువుయొక్క స్తుతి మిక్కిలి ఫలప్రదముగా పెద్దలచే బలుకబడినది. నీవిష్టపడెదేని యది నీవుసేయుము. శంఖచక్రగదాధారియైన హరినిస్తుతించువారికి లభింపనిదొకటి యిహమందును బరమందుగూడలేదు. మర్త్యుడు వాసుదేవుని స్తుతించి సర్వపాపముల బాయును. ఆనంతస్వర్గముంబొందును. ఇటువిమర్శ సేయదగదు. పురుషోత్తమున స్తుతించు నాతడు ధర్మముంగోరునేని ధర్మమును అర్థము గోరునేన యర్థమును కామ పురుషార్థము కోరు నేని కామములను సంతానముంగాంచును. రోగి రోగముక్తుండగును. బద్ధుడు బంధముక్తినందును. భయస్థుడు భయమెడలును అపన్ను డాపదలంగడుచును. దుర్గములను దరించును ఇందు విచారణసేయ నవరసములేదు కావున దివ్యస్తుతులచే ఋషి ప్రోక్త ములయిన వానిచే సర్వ ప్రయత్నముల చేత సుభాషితములచే (మంచిమాటలచే) దేవ దేవుని కమలలోచనుని శత్రు సంహరణుని అచింతత్యపరాక్రముని హరిని స్తుతించుచు శరణొంది భువిలో మహాభయపీడనందినవారు భయవివర్జితులగుదురు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున స్తుతిమహిమాను వర్ణనమను నూటతొంబది రెండవ యధ్యాయము