Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొంబదిఐదవ అధ్యాయము - విష్ణుపంజరస్తోత్రము

వజ్రః : భగవన్‌ ! కీదృశీం రక్షాం సచకార ద్విజో త్తమః | యథా నిర్ధూత వీర్యోసౌ నిస్రరో రజనీచరః || 1

మార్కండేయః : ఏకాగ్ర చిత్తో గోవిందే తజ్జన స్తత్పరాయణః | సర్వదుష్టోవ శమనం ప్రవిష్టో విష్ణు పంజరమ్‌ || 2

వజ్రః - విష్ణు పంజర మిచ్ఛామి శ్రోతుం ధర్మభృతాంవర | సదా సర్వభ##యేభ్య స్తు రక్షాయా పరమాభ##వేత్‌ || 3

మార్కండేయః - త్రిపురం జఘ్నుషః పూర్వం బ్రాహ్మణా విష్ణుపంజరమ్‌ | శంకరస్య యదుశ్రేష్ఠ! రక్షణాయ నిరూపితమ్‌ ||

వాగీశేన తు శుక్రస్య బలం హస్తుం ప్రయాస్యతః | తస్య స్వరూపం పక్ష్యామి తన్నిబోధ మహీపతే || 5

స్వామీ! ఆ ద్విజోత్తముడు చేసిన రక్షయేమి? దాని వలన గదా దుస్తరుడైన యీ రాక్షసుడు చచ్చువడి నాడు. ఆ రక్షా విశేషమే మోతెలుపుమని వజ్రుండడుగ మార్కండేయుడనియె : గోవిందునియందేకాగ్రమనస్కుడై యా గోవిందజపమే సేయుచు నమ్మి సర్వదుష్టోపశమనమైన విష్ణు పంజరము నాతడు (బ్రాహ్మణుడు) ప్రవేశించెనన వజ్రనృపతి విష్ణుపంజర స్తోత్రములు వినగోరెద. అది సర్వభయముల నుండి రక్షంచును గదా! ఆనతిమ్మన మార్కండేయు డిట్లనియె. మున్ను త్రిపుర సంహారము సేయనున్న శంకరునకు రక్షణకొఱకే విష్ణు పంజరమును బ్రహ్మ నిరూపించెను. బలాసురుని జంప నేగుచున్న శక్రునకు దీనిని బృహస్పతి యుపదేశించెను. రాజా! ఆస్తోత్రస్వరూపము వచించెద నిదెయెఱుంగుము.

విష్ణుః ప్రాచ్యం స్థిత శ్చక్రీ విష్ణు దక్షిణతో గదీ | ప్రతీచ్యాం శార్జ భృద్విష్ణుః దేవః ఖడ్గీ మమోత్తరే || 6

హృషీకేశో వికోణషు తచ్ఛద్రేషు జనార్దనః | క్రోడరూపీ హరిర్భూమా హన్తుం ప్రేతనిశాచరాన్‌ || 7

గదా చేయం సహస్రాంశు రుద్వమత్పాప కోల్బణా | రక్షోభూత పిశాచానాం డాకినీనాం చశాతనీ || 8

శార్జ విస్ఫూర్జితం చైవ వాసుదేవస్య మద్రిపూన్‌ | తిర్యజ్‌ మనుష్య కూష్మాండ ప్రేతాదీన్‌ హన్త్వశేషతః || 9

ఖడ్గధారామల జ్యోత్స్నా నిర్ధూతాయే సమాహితాః | తేయాన్తు సౌమ్యతాం సద్యో గరుడేనేన పన్నగాః || 10

యేకూష్మాండా స్తథాయక్షాః యేదైత్యాయే నిశాచరాః | ప్రేతా వినాయకాః క్రూరా మనుష్యాజంబుకాః ఖగాః || 11

సింహాదయోయే పశవో దందశూకాశ్చ పన్నగాః | సర్వేభవన్తుతే సౌమ్యః కృష్ణశార్జ రవాహతాః || 12

చిత్తవృత్తి హరాయేయే యేజనాః స్మృతి హారకాః | బలౌజసాంచ హన్తారః ఛాయావిభ్రంశకాశ్చయే || 13

యే చోపభోగహర్తారో యేచలక్షణ నాశకాః | కూష్మాండాస్తే ప్రణశ్యన్తు విష్ణుచక్రదయాహతాః || 14

బుద్ధిస్వాస్థ్యం మనస్స్వాస్థ్యం స్వాస్థ్యమైంద్రియకం తథా | మమాస్తు దేవదేవస్య వాసుదేవస్య కీర్తనాత్‌ || 15

వృష్ఠేపురస్తాన్మమ దక్షిణో త్తరే వికోణతశ్చాస్తుజనార్దనోహరిః |

తమీడ్యమీశాన మనంత విక్రమం జనార్దనం ప్రణిపతితోన సీదతి || 16

యథా పరబ్రహ్మ హరిస్తథా పరం జగత్స్వరూపంచ సఏవ కేశవః |

సత్యేన తేనాచ్యుత నామకీర్తనాత్‌ ప్రణాశ##మేతు త్రివిధం మమాశుభమ్‌ || 17

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే విష్ణుపంజర స్తోత్ర వర్ణనం నామ పంచనవత్యధిక శతతమోధ్యాయః.

విష్ణువు చక్రాయుధము దాల్చి తూర్పునను గదదాల్చి దక్షిణమునను శార్గమను ధనుమందాల్చి పడమటను నందకమనెడి భడ్గము పూని నాకుత్తరమునను హృషీకేశుడు వికోణములందు (మూలలందు) జనార్దనుడు అయాదిశాచ్ఛిద్రములందు రూపి హరి ప్రేత నిశాచరులం జంప భూమియందును రక్షయిచుగాక! ఈ గద సహస్ర కిరణములూని నిండ నిప్పుల గ్రక్కుచు రక్షోభూత పిశాచ డాకినుల నదలించు గాక. వాసుదేవుని శార్జధను ష్టంకారము (విస్ఫురణము) పశుపక్షి మనుష్య కూష్మాండ ప్రేతాదులను నిశ్శేషముగ జంపుగాక ! హరియొక్క నందక ఖడ్గధారా నిస్సృతమగు నచ్చవు వెన్నెలచే నాయెడ పగగొనియున్న వారప్పటికప్పుడే మనుష్యులు నక్కలు పక్షులు సింహాది పశువులు దందశూకములు (పాములలో నొకరకము) పన్నగములు కృష్ణుని శార్జధనుష్టం కారముచే శాంతములగుం గాక! నా చిత్తవృత్తిని జ్ఞాపక శక్తిని హరించినవారు బలమును ఓజస్సును బెఱచినవారు ఛాయావిభ్రంశ కులు క్రాంతిని జెఱచినవారు) ఉపభోగ సామగ్రిని హరించిన వారు లక్షణముచెఱచినవారు నగు నా కూష్మాండులు విష్ణుచక్ర వేగహతులై పూర్తిగ నశింతురు గాక ! బుద్ధి స్వాస్థ్యము మన స్స్వాస్థ్యము నింద్రియ స్వాస్థ్యము దేవదేవుడగు వాసుదేవుని సంకీర్తనముచే నాకు గల్గు గాక! నా వెనుక ముందు దక్షిణోత్తరములందు మూలలందు జనార్దనుడు హరియుండు గాక ! ఆ స్తపనీయుని యీ శానునిననంతవిక్రముని జనార్దనుని గూర్చి ప్రణతుడైన వాడు దుఃఖమందడు పరబ్రహ్మమెట్లో హరియునట్లే సర్వజగత్స్వరూప మయిన పరాత్పరుడా కేశవుడే. సత్యమైన యీ ప్రరబహ్మ వస్తువుచే అచింత్య నామ సంకీర్తనము వలన నా త్రివిధ పాపము (కాయిక మానసిక వాచికము) ప్రశమించు గాక!

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున విష్ణు పంజరస్తోత్ర వర్ణనమను నూటతొంబదియైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters