Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటతొంబదియారవ అధ్యాయము - సత్త్వబాధాప్రశమనము వజ్రః : ఆత్మరక్షా త్వయోక్తామే సర్వబాధా వినాశినీ | కృపాన్వితైః కథం కార్యా పరరక్షా భృగూత్తమః ||
1 ఏతన్మే సంశయం ఛింధిత్వం విజ్ఞానమయోనిధిః | వైష్ణవాని రహస్యాని సర్వాణి విదితానితే ||
2 మార్కండేయః : స్తోత్రేణానేన ధర్మజ్ఞ! కుశాగ్రైర్మార్జయన్ నరమ్ | ఉపస్పృశ్య శుచిః కుర్యాద్రక్షాం పార్థివ సత్తమ ||
3 సోపవాసేన సంపూజ్య దేవ దేవం జనార్దనమ్ | అమోఘైషా భ##వేద్రక్షా కృతానాస్త్యత్ర సంశయః ||
4 యథాకథంచిత్కృత్వైనాం నరోమోచయతే రుజః | ఆధివ్యాధి గృహీతానాం రక్షైషా భేషజం పరమ్ || 5 ఓం నమః పరమార్థాయ పురుషాయ మహాత్మనే || 6 అరూపబహురూపాయ వ్యాపినే వరమాత్మనే | నిష్కల్మషాయ శుద్ధాయధ్యాతృ పాపహరాయచ || 7 నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతుకేవచ | వరాహ నారసింహాయ వామనాయ మహాత్మనే || 8 వక్ష్యామిత్వాం నమస్కృత్య యత్తత్సిధ్యతు మేవచః | త్రివక్రమాయ రామాయ వైకుంఠాయ నరాయచ || 9 వక్ష్యామి త్వాం నమస్కృత్య యత్తత్సిధ్యతు మేవచః | 10 వరాహ! నరసింహేశ! వామనేశ ! త్రివిక్రమ! 11 హయగ్రీవేశ! సర్వేశ! హృషీకేశ! హరా7శుభమ్ | అపరాజిత! చక్రాద్యైశ్చతుర్బిః పరమాయుధైః || 12 అఖండితానుభావైస్త్వం సర్వదుఃఖహరో భవ! హరా7ముకస్య దురితం దుష్కృతం దురుపోసితమ్ || 13 మృత్యుబంధా7తిభయదం దురిష్టస్యచ యత్పలమ్ | పరాపధ్యాన సహితం ప్రయుక్తం చాభిచారికమ్ || 14 గరస్పర్శమహారోగ ప్రయోగం జరయాజర ! ఓం నమోవాసుదేవాయ నమః కృష్ణాయ శారిఙ్గణ || 15 నమః పుష్కర నేత్రాయ కేశవాయాది చక్రిణ | నమః కమల కింజల్క పీత నిర్మల వాససే || 16 మహాహవరిపుస్కంధ పృష్ఠ చక్రాయ చక్రిణ | దంష్ట్రోద్ధృత క్షితిభృతే త్రయీమూర్తిమతే నమః || 17 మహాయజ్ఞ వరాహాయ శేషభోగోరు శాయినే | తప్తహాటక కేశాయ జ్వలత్పావక లోచన || 18 వజ్రాధిక నఖస్పర్శ దివ్యసింహ నమో7స్తుతే | కాశ్యపాయాతి హ్రస్వాయ ఋగ్యజు స్సామరూపిణ || 19 తుభ్యం వామన రూపాయ క్రమతే గాం నమోనమః | వరాహా7శేషదుష్టాని సర్వపాప ఫలానివై || 20 మర్ద మర్ద! మహాదంష్ట్ర! మర్ద మర్దచ యత్ఫలమ్ | నరసింహ! కరాళాస్య! దంతప్రాంతా7నలోజ్వల! 21 భంజ భంజ! నినాదేన దుష్టాన్ భక్తార్తినాశన! | ఋగ్యజుస్సామ గర్భాభిర్వాగ్భి ర్వామనరూపపధృక్ || 22 ప్రశమం సర్వదుఃఖాని నయైతస్య జనార్దన! ఏకాహ్నికం ద్వ్యాహ్నికంచ తథా త్రిదివసజ్వరమ్ || 23 ఆత్మరక్షను గురించి నీవు తెల్పితివి. ఎదుటివారిపై జాలిగలవారు సర్వబాధావినాశినియైన రక్ష నితురులకెట్లుసేయవలయునో యానతిమ్ము. నీవు జ్ఞాననిధివి. విష్ణుదేవతారహస్యములన్నియు నీకు దెలియునన మార్కండేయుడిట్లనియె : శుచియై యాచనమనము సేసి ఎదుటివానిని యీ స్తోత్రముతో కుశాగ్రములతో మార్జనము సేయవలెను. ఉపవాసముండి దేవదేవుని హరిని బూజించి యీ విష్ణుపంజర స్తోత్ర పారాయణము సేసి కుశాగ్రోదకము ప్రోక్షించి చేసిన యీ యంగరక్ష అమోఘము. సంశయములేదు. ఏదో విధముగా నిది సేసి యితర మానవుని వ్యాధులు హరింపవచ్చును. ఆధి = మనోవ్యాధి వ్యాధి = శరీరవ్యాధి గలవారి కిది పరమౌషధము. పరమార్థమైనపురుషునకు మహాత్మునికి అరూపుడై బహురూపుడగువానికి సర్వవ్యాపియైన పరమాత్మకు నమస్కారము. నిష్కల్మషునికి శుద్ధునికి తనను దలచువాని పాపములను హరించువానికి నమస్కరించి నేనేది పలుకుదు నామాట సిద్ధించుగాక. వరాహనరసింహమూర్తికి వామనునకు నమస్కరించి నీతో నేమందు నా నామాట సిద్ధించుగాక. త్రవిక్రమునకు రామునికి వైకుంఠునికి నరునికి నీకు మ్రొక్కి నీతో నేమందునామాట సిద్ధించుగాక. వరాహ! నరసింహస్వామివామనేశ త్రివిక్రమ హయగ్రీవేశ సర్వేశ హృషీకేశ యశుభమును హరింపుము. చక్రాది పరమాయుధములు నాల్గింటిచే నపరాజితుడా ఎడతెగని నీ యనుభవములచే (లీలలచే) సర్వదుఃఖహరుడవుగమ్ము. వీనిపాపము వీని యకార్యకరణము దురుపవాస దోషమును దుష్టముగా జేసిన యజ్ఞములవలన గల్గు ఫలము మృత్యవుబంధము మొదలైనవానిం గూర్చిదానిని పరుని గూర్చి తప్పుడాలోచనలతోగూడ ప్రయోగించిన యాభిచారికమును (చేతబడిని) విషస్పర్శ మహారోగ ప్రయోగమును నో అజరా! = జలింపనివాడా! హానిలేనివాడా! జరయ = జరింపజేయుము. హరింపుము అను నర్థముగల యీ శ్లోకములు పారాయణ సేయవలెను. అటుపైని 15వ శ్లోకము మొదలు 22వ శ్లోకము దాక గల స్తోత్ర శ్లోకములు మంత్రరూపములు పఠించవలెను. చాతుర్థికం తథాత్యుగ్రం తథైవ సతతజ్వరమ్ | దోషోత్థం సన్నిపాతోత్థం తథైవాగంతుకం జ్వరమ్ || 24 శమం నయతు గోవిందశ్ఛిత్వా ఛిత్వా7స్య వేదనామ్ | నేత్రదుఃఖం శిరోదుఃఖం దుఃఖం చోదర సంభవమ్ || 25 అనుచ్ఛ్వాస మతిశ్వాసం పరితాపం చ వేపథుమ్ | గుదఘ్రాణాది రోగాంశ్చ కుష్ఠరోగం తథా క్షయమ్ || 26 కామలాదీంస్తథా రోగాన్ ప్రమేహాం శ్చాతిదారుణాన్ | భగంద రాతిసారాంశ్చ ముఖరోగం సవల్గువిమ్ || 27 అశ్మరీ మూత్రకృచ్ఛ్రాంశ్చ రోగా నన్యాంశ్చదారుణాన్ | యేవాత ప్రభవా రోగాయేచపిత్త సముద్భవాః || 28 కిఫోద్భవాశ్చ యేకేచిద్యేకేచి త్సాన్ని పాతికాః | ఆగంతవశ్చయేరోగాః లూతా విస్ఫోటకాదయః || 29 తే సర్వే ప్రశమం యాంతు వాసుదేవా7 పమార్జితాః | విలయం యాస్తుతేసర్వే విష్ణోరుచ్చారణనచ || 30 క్షయం గచ్ఛన్తుచా7 శేషాస్తే చక్రాభిహాతా హరేః | అచ్యుతా7నన్త గోవింద నామోచ్చారణ భేషజాత్ || 31 నశ్యన్తి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహమ్ | స్థావరం జంగమంచైవ కృత్రిమం చాపియద్విషమ్ || 32 దంతోద్భవం నఖభవ మాకాశప్రభవం విషమ్ | లూతాది ప్రభవం యచ్చ విషమత్యంత దుఃఖదమ్ || 33 శమం నయతు తత్సర్వం కీర్తితో హిజనార్దనః | గ్రహాన్ ప్రేతగ్రహాంశ్చైవ తథా చైవార్యకగ్రహాన్ || 34 ముఖమండలికాన్ క్రూరాన్ రేవతీం వృద్ధిరేవతీం | వృద్ధికాఖ్యాన్ గ్రహాం శ్చోగ్రాంస్తథా మాతృగ్రహానపి | 35 బాలస్య విష్ణోశ్చరితం హన్తు బాలగ్రహానిమాన్ | వృద్ధానాం యేగ్రహాః కేచిద్యేచ బాలగ్రహాః క్వచిత్ || 36 నరసింహస్య దృష్ట్యాతే దగ్ధాయేచాపి యేవనే | సటాకరాళ వదనో నరసింహో మహారవః || 37 గ్రహా నశేషాన్నిఃశేషాన్ కరోతు జగతో హితః || వీని సర్వదుఃఖములను పోగొట్టుము. ఏకాహ్నిక ద్వ్యహ్నిక త్ర్యహ్నిక చాతుర్థిక జ్వరములను అత్యుగ్రమైన నిత్య జ్వరమును దోషజన్యము సన్నిపాత జన్యము ఆగంతుకములునైన జ్వరములను బ్రశమింప జేయుము. గోవిందుడు వీని వేదనను ఛేదించియు ఛేదింపకయు శమింపజేయు గాక! నేత్ర దుఃఖము శిరోదుంఖము ఉదరవ్యాధి ఊపిరాడక పోవుటను అతిశ్వాస రోగమును పరితాపమును వేపథువును (వణకును) గుదఘ్రాణాది రోగములను కుష్ఠరోగమును క్షయను కామలాదులను అతి దారుణ ప్రమేహములను భగందరములను అతిసారములను ముఖరోగమును వల్గులివ్యాధిని అశ్మరి మూత్రకృచ్ఛ్రములను (నీరుకట్టు రోగము) వాటి దారుణ వాత పిత్తశ్లేష్మక ఫజములయిన వ్యాధులను సాన్ని పాతిక రోగములను ఆగంతుకములను లూతావిస్పోట కాదులగు సాలీడువలె పోయు దద్దుర్లు పొక్కులు గల స్ఫోటకము సర్వరోగములు వాసుదేవునిచే దుడిచి వేయబడి ప్రశమించుగాక! విష్ణూచ్చారణచే నవి విలయించు గాక! హం చక్రనిహతమలై యవి నిశ్శేషముగ క్షయించు గాక! అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజము వలన సర్వరోగమలు నశించును. సత్యము సత్యము నేను జేప్పుచున్నవి. స్థావర జంగమ కత్రిమ రూప తరివిధవిషము దంతముల వలన గోళ్ల వలన బుట్టినది ఆకాశమున బొడమినది లూతాదులవలన బుట్టినది యగు మిక్కిలి దుఃఖము గూర్చు విషము నెల్లను జనార్దనుడు సంకీర్తితుడై శమింపజేయు గాక! గ్రహములను ప్రేత గ్రహములను ఆర్యక గ్రహములను ముఖ మండలికములను గ్రూరములను రేవతిని వృద్ధరేవతిని వృద్ధికములనుపేరుగల రోగములను మాతృగ్రహములను బాలవిష్ణు చరిత్ర మీ బాలగ్రహములను జంపుగాక! వృద్ధుల గ్రహ బాలగ్రహ బాధలను యావనమందున్న గ్రహములను నరసింహస్వామి దృష్టిచేనవెల్ల దగ్ధములగుగాక! కేశరముల భయంకరమగు ముఖముగల నరసింహస్వామి ఉద్భటముగ గధ్జించువాడు జగద్ధితుడు అశేష గ్రహములను నిశ్శేషములం గావించు గాక! నరసింహ! మహాసింహ! జిహ్వాజ్వాలో జ్జ్వలానన! || 38 గ్రహా నశేషాన్ సర్వేశ: ఖాదఖాదాగ్నిలోచన! | యేరోగా యే మహోత్పాతా యద్విషం యేమహాగ్రహాః || 39 యాని చక్రూర భూతానిగ్రహాపీడాశ్చ దారుణాః | శస్త్ర క్షతేషు యేదోషాః జ్వాలా గర్దభి కాదయః || 40 తాని సర్వాణి సర్వాత్మన్ పరమాత్మన్ జనార్దన! | కంచి ద్రూపం సమాస్థాయ వాసుదేవాశు నాశయ! || 41 క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలా విభీషణమ్ | సర్వదుష్టో పశమనం కురు దేవవరా7చ్యుత! || 42 సుదర్శన! మహాజ్వాల! ఛిన్ధి ఛిన్ధిన మారయ | సర్వాణి దుష్టరక్షాంసి క్షపయా7తి విభీషణ || 43 ప్రాచ్యాం ప్రతీచ్యాంచ దిశి దక్షిణోత్తరత స్తథా | రక్షాం కరోతు సర్వస్మా న్నరసింహః స్వగర్జితైః || 44 భువ్యన్తరిక్షే చదివి పార్శ్వతః పృష్ఠతో7గ్రతః | రక్షాం కరోతు భగవాన్ బహురూపీ జనార్దనః || 45 యస్మా ద్విష్ణుర్జగత్సర్వం సదేవాసుర మానుషమ్ | తేన సత్యేన దుష్టాని శమ మస్య వ్రజన్తువై || 46 యథా విష్ణు స్మృతౌ సద్యః సంక్షయం యాతి పాతకమ్ | సత్యేన తేన సకలం దుష్టమస్య ప్రశామ్యతు || 47 నరసింహ మహా సింహ! నాలుకయనెడి జ్వాలచే మిగుల వెలుగొందు ముఖము గల వాడా! సర్వేశ అగ్నిలోచన సర్వ గ్రహములను దినుము దినుము. రోగములు మహో త్పాతములు విషమ మహాగ్రహములు క్రూరభూతములు దారుణ గ్రహపీడలు శస్త్రములచే నరుక బడినపుడు గలుగు దోషములు జ్వాలాగర్దభికాది క్షుద్ర రోగములవి యెల్ల ఓ సర్వాత్మా ! పరమాత్మా జనార్దనా యొక యనిర్వచనీయమైన రూపము దాల్చి ఓ వాసుదేవ! అచ్యుత! దేవవర! అన్నిటిని నశింపజేయుము. జ్వాలామాలాతిభీషణమైన సుదర్శనమును (చక్రమును) విసరి సర్వదుష్టోపశమన మొనరింపుము. ఓ సుదర్శనమా? మహాజ్వాలామయమా నఱకు నఱకు నఱకుము చంపుము. అతివిభీషణమూర్తీ సర్వదుష్ట రక్షస్సులను జంపుము. తూర్పున పడమట దక్షిణమందుత్తర దిశను నరసింహుడు తన గర్జనములచే సర్వోపద్రవములనుండి రక్షసేయుగాక! భూమి పై అంతరిక్షమున నిరు ప్రక్కలను ముందు వెనుకను భగవంతుడు బహురూపియై జనార్దనుడు రక్షను సేయుగాక! సర్వదేవాసుర మానుషమైన జగత్తెల్ల విష్ణువు. గావున యా సత్వ స్వరూపునిచే వీని దుష్ట గ్రహాదులు శమించు గాక! విష్ణు స్మరణ మందెట్లు సకల పాప మప్పటి కప్పుడు నశించునో అట్లే సత్యుడైన యా హరిచేత వీని సకల దుష్టము = చెడు (చేతబడి మొదలయిన) ప్రశమించు గాక! పరమాత్మాయథా విష్ణుర్వేదాన్తేష్వభి గీయతే | తేన సత్యేన సకలం యన్మయోక్తం తథా7స్తుతత్ || 48 శాన్తిరస్తు శివంచాస్తు ప్రణశ్య త్వసుఖంచ యత్ | వాసుదేవ శరీరోత్థైః కుశైః సంమార్జితో మయా || 49 అపామార్జతి గోవిందో నరో నారాయణ స్తథా | తథా7స్తు సర్వదుఃఖానాం ప్రశమోవచనాద్ధరేః || 50 శాన్తా స్సమగ్ర రోగాస్తే గ్రహాస్సర్వే విషాణిచ | భూతానిచ ప్రశాన్తాని సంస్మృతే మధు సూదనే || 51 ఏత త్సమస్త రోగేషు సర్వభూత భ##యేషుచ | అపామార్జనకం శస్త్రం విష్ణు నామాభి మన్త్రితమ్ || 52 శాన్తిరస్తు శివంచాస్తు దుష్టమస్య ప్రశామ్యతు | యదస్య దురితం కించిత్ తత్క్షిప్తం లవణాంభసి || 53 స్వాస్థ్యమస్య సదైవా7స్తు మృషీకేశస్య కీర్తనాత్ | యత్ ఏవాగతం పాపం తత్రైవ ప్రతి గచ్ఛతు || 54 ఏతద్రోగాది పీడాసు జన్తూనాం హితమిచ్ఛతా | విష్ణుభ##క్తేన కర్తవ్య మపామార్జనకం పరమ్ || 55 అనేన సర్వదుఃఖాని ప్రశమం యాన్త్యసంశయమ్ | సర్వభూత హితార్థాయ కుర్యాత్తస్మాత్స దైవహి || 56 నాద్యంత వంతః కవయః పురాణాః సూక్ష్మా బృహన్తో హ్యనుశాసితారః సర్వజ్వరాన్ ద్యన్తు తవానిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాః || 57 ఏతే కుశా విష్ణుశరీర సంభవా జనార్దనో7హం స్వయమేవ చాగతః | 58 హతం మయా దుష్టమశేష మస్య స్వస్థో భవత్వేష యథా వచోహరేః || 59 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సత్త్వ బాధా ప్రశమనం నామ షణ్ణవత్యధిక శతతమో7ధ్యాయః. వేదాంతములందు విష్ణువు పరమాత్మయని కీర్తింప బడును. కావున యా సత్య వస్తువుచే నేన్నది యన్నట్లగు గాక! తాను దేవ శరీరమందుండి బయలు దేరిన కుశలనే సంమార్జనముచేయబడి శాంతి యగుగాక! శివమగుగాక! అసుఖమెల్ల శాంతించుత. గోవిందుడు నారాయణుడు నరుడునైన విష్ణువు చేతిలో తుడిచి వేసినట్లు హరి వచనముచే సర్వ దుఃఖోప్రశమన మగుగాక! సర్వ రోగములు గ్రహములు భూతములు సమగ్రముగ మధుసూదన స్మరణము సేసినంత ప్రవాంతించు గాక! ఇది సర్వ రోగము లందు సర్వవిధ భూత భయము లందు విష్ణునామాభిమంత్రితమైన అపమార్జనమైన (తుడిచి వేయునట్టి) శస్త్రము. (ఆయుధము) శాంతి యగుత శివమగు గాక! వీని చెడు నశించు గాక! వీని పాతకము కొచెమున్న నది ఉప్పేనీటి సముద్ర మందు జిమ్మి వేయబడినది. వీనికి సదా స్వస్థత గల్గుగాక! హృషీకేశ కీర్తనము వలన నెటనుండి పాపము వచ్చినదో యక్కడకే యది తిరిగి పోవుగాక! జీవులకు రోగాది పీడలు వచ్చినపుడు విష్ణుభక్తుడు వాని హితముగోరి మా అపమార్జనమను పరమ రక్ష చేయవలెను. దీనిచే సర్వ దుఃఖములు నిస్సంశయముగ శమించును. అందుకే సర్వభూత హితము కొఱకు రక్షసేయ వలెను. ఆద్యంతములు లేని కవులు (జ్ఞానులు) పురాణులు (పురాతనులు) బృహద్రూపులు (గొప్పవారు) అనుశాసకులునైన అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవులు నీ సర్వ జ్వరములను (బాధలను) ఖండింతురుగాక. ఈ కుశలు (దర్భలు) విష్ణు శరీర మందు బుట్టినవి. నేను జనార్దనుడనై స్వయముగా వచ్చితిని. వీని దుష్టము(చెడు) నిశ్శేషముగ ని హతమైనది. హరి వచనామ సార మితడు స్వస్థుడగును. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున సత్త్వబాధా ప్రశమనమను నూటతొంబదియాఱవ యధ్యాయము.