Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఇరువదియవ అధ్యాయము గంగ జాహ్నవియగుట వజ్ర ఉవాచ : భాగీరథీత్వం గంగాత్వం దేవనద్యా మయాశ్రుతమ్ | కిమర్థం జాహ్నవీ లోకే కథ్యతే సాగరం గమా ||
1 మార్కండేయ ఉవాచ : పంచాలాఖ్యో7స్తి విషయో మధ్యదేశే మహీపతే ! | స్వధర్మ కర్మ నిరతైర్యుతో వర్ణాశ్రమైస్సదా ||
2 మహోదయం పురం తత్ర కుశస్తంభేన నిర్మితమ్ | సర్వరత్న సమాకీర్ణం కాన్యకుబ్జేతి విశ్రుతమ్ ||
3 తస్మి& బభూవ భూపాలో జహ్నుః పరమధార్మికః | యస్యకీర్తిమతః కీర్తిః బ్రహ్మాండం వ్యాప్య తిష్ఠతి ||
4 స కదాచి న్మహీపాలో హయమేధ ముపాహరత్ | దీక్షితస్య నరేంద్రస్య యజ్ఞవాటంతు నిమ్నగా ||
5 ప్లావయామాస వేగేన జలౌఘై ర్యదుసత్తమ | ప్లావితే యజ్ఞవాటేతు రాజా గంగాం తదాబ్రవీత్ ||
6 అస్యగంగే ! 7వలేపస్య సద్యః ఫలమవాప్నుహి ! | పిబామి సకలం తోయం తవ సాగరవల్లభే !
7 ఏవముక్త్వా పపౌరాజా సర్వం భాగీరథీ జలమ్ | తపసా మహతా రాజ& ! తథా యోగ బలేన చ ||
8 దృష్ట్వైవ గంగాం నిస్తోయాం దీనైర్ముని జనైస్తతః | ప్రసాదితస్తు గంగార్థే తత్యాజ శ్రవణనతామ్ ||
9 దుహితృత్వేచ జగ్రాహ రాజా భాగీరథీం తదా | తేజసా కథితా లోకే జాహ్నవీ యదునన్దన ! ||
10 అతీవ దర్పితో రాజా గంగాయా స్సయదానృప ! | యశో7ర్థం ప్లావయామాస యజ్ఞవాటం తదా7నఘ !
11 ఏవం త్రిలోకే నృప ! జహ్నుకన్యా ప్రోక్త్వా బుధైర్విష్ణు పదీ పవిత్రా | హిమాచలస్యాద్రిపతే స్తనూజా సముద్రపత్నీ వరదా విశోకా ||
12 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే జహ్నుకన్యో పాఖ్యానం నామ వింశతి తమో7ధ్యాయః. మార్కండేయు డిట్లనియె:- రాజా ! భారత మధ్య దేశమందు పాంచాల రాజ్యమున్నది అది వర్ణాశ్రమాచార స్వధర్మ నిరతులయిన ప్రజల కావాసము, కుశస్తంభడు నిర్మించిన మహోదయమను పురః మందున్నది. దానినే కాన్య కుబ్జమందురు (కనూజ్ అని నేటి వాడుక) దాని రాజు జహ్నువు. పరమ ధార్మికుడు. ఆతని కీర్తి బ్రహ్మాండమెల్ల వ్యాపించినది ఆతడొకప్పు డశ్వమేధము సేయగా నాతని యజ్ఞవాటమును గంగ ముంచివేసెను, అతడప్పుడు గంగనుద్దేశించి ఓ గంగా ! గర్వము గొని నా యజ్ఞశాలను ముంచితివి. దీనిఫలమనుభవింతువులెమ్మని యా సాగరవల్లభ జలములం ద్రావివైచెను. ఆతని తపోబలము యోగబలమట్టిది గావున భాగీరథి నంతను ద్రావినంతట మహామునులతిదీనులయి వేడుకొన అతడు ప్రసన్నుడై చెవినుండి యామెను వదలెను. మరియు నా భాగీరథిని తన కూతురట్లు గైకొనెను. దాన నా పుణ్యనది జాహ్నవి యను పేరందెను. తన యజ్ఞవాటము నాతడా జాహ్నవిచే నింపి కీర్తిశాలియయ్యెను. విష్ణుపదియననైన పవిత్ర నది యిట్లు హిమాద్రింజనించి సముద్రు నిల్లాలై జాహ్నవి భాగీరథియునై సర్వశోకాపహారిణియు వరదయునై విలసిల్లుచున్నది. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున గంగ జాహ్నవి యగుట అను ఇరువదవ యధ్యాయము.