Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల యధ్యాయము - ప్రహేతివంశ కీర్తనము

మార్కండేయః : 

పులోమ్నస్తనయః శ్రీమాన్‌ మధుర్నామ నిశాచరః | వినిష్కృష్య స్వకాచ్ఛూలా చ్ఛూలం ప్రాదా ద్వృషధ్వజ || 1

తపసా తోషితోయస్య సపుత్రస్య మహాత్మనః | త్రైలోక్య విజయాసక్తేతేన రాజేంద్ర! రావణ || 2

దీక్షితే మేఘనాదేచ తథాయాతే నికుంభిలామ్‌ | అంతర్జలగతే వీరే తథైవచ విభీషణ || 3

నిద్రావశగతే రాజన్‌! కుంభకర్ణే సురద్విషి | మాలిన స్తనయా తేన రావణస్య స్వసా హృతా || 4

కుంభీనసీ మహాభాగా రూపద్రవిణ సంయుతా | యస్యా మస్య సుతా జజ్ఞే లవణోనామ రాక్షసః || 5

యేనశూల ప్రభావేణ మాంధాతా వినిపాతితః | న తస్య పుత్రో భార్యా వా బభూవాతి దురాత్మనః || 6

ప్రాణినాం పురుషాద్యానాం సహస్త్రెర్దశభిర్నృప! ఆహార మాహ్నికం తస్య భవత్యౌదరికస్య తు || 7

రామాజ్ఞయా తస్య బభూవ రాజన్‌! రామానుజో మృత్యురదీనసత్వః |

శత్రుఘ్ననామా భువనస్య వీరో మహాంతరస్థో హరి రప్రమేయః || 8

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే ప్రహేతి వంశాను కీర్తనం నామ ద్విశతతమో7ధ్యాయః.

మార్కండేయుడనియె. పులోముని కొడుకు మధువను రాక్షసుడు. శివుడు తనశూలమునుండి యింకొకశూలమును ఆకర్షించి వానికిచ్చెను. వాడును వానికుమారుడును చేసిన తపస్సునకు సంతోషించి యిదియిచ్చెను. రావణుడు ముల్లోకములం గెలువనుండ మేఘనాథుడు యజ్ఞదీక్షలో నికుంభిలా గుహలోనుండ వీరుడగు విభీషణుడు నీటిలోపలనుండ కుంభకర్ణుడు నిద్రవోనుండ నామధుడు రావణుని చెల్లెలు మాలియొక్క కూతురును కుంభీనసి యనుసుందరిని హరించెను. ఆమెయందు వీనికి లవణాసురుడు పుట్టెను. వాడు శూలముగొని మాంధాతను గూల్చెను. ఆ దుష్టునికి భార్యలేదు. పుత్రుడునులేడు. వాడు (ఔదరికుడు) పొట్టచేతబట్టుకొనిపోయి (మిక్కిలి ఆకలికొని) పదివేలమంది ప్రాణులను పురుషాదులను జంపి పగటిభోజనము చేయుచుండెను. రాముని యనుమతింగొని శత్రుఘ్నుడు సాక్షాద్విష్ణువు నంశ##మైనవాడు భువనైకవీరుడు వానిపాలిటికి మృత్యువయ్యెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున ప్రహేతివంశకీర్తనమను రెండువందల అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters