Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలరెండవ అధ్యాయము - భరతప్రస్థానము

వజ్రః : శైలూష పుత్రా గంధర్వా భరతేన కథం హతాః | కిమర్థం తు మహాభాగ! తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

మార్కండేయః: అయోధ్యాయా మయోధ్యాయాం రామే దశరథాత్మజే | కైకేయాధిపతిః శ్రీమాన్‌ యుధాజిన్నామ పార్థివః || 2

రామాయ ప్రేషయామాస దూతం భరత మాతులః | వృద్ధం పురోహితం గార్గ్యం యేన కార్యేణ తచ్ఛృణు ! 3

సింధో రుభయ కూలేషు రామ దేశో మనోహరః | హుత్వా రణ మనుష్యేంద్రాన్‌ గంధర్వై ర్విని వేశితః || 4

గంధర్వాస్తే చ రాజేంద్ర! రాజ్ఞాం విప్రియ కారకాః | లక్ష్మణం భరతం వాపి శత్రుఘ్న మథవా నృప ! 5

విసర్జ యిత్వా గంధర్వాన్‌ తాన్వినాశయ రాఘవ ! | రాజానో నిర్భయా స్సన్తు దేశశ్చాస్తు తథా తవ || 6

దూతస్య వచనం శ్రుత్వా చింతయామాస రాఘవః | మేఘనాద వధే కర్మ లక్ష్మణన మహత్‌ కృతమ్‌ || 7

శత్రుఘ్నేన కృతం కర్మ లవణం చ వినిఘ్నతా | ప్రేషయిష్యామి భరతం గంధర్వస్య చ నిగ్రహే || 8

ఇత్యేవం మనసి ద్యాత్వా రామో భరత మబ్రవీత్‌ | గచ్ఛ గార్గ్యం పురస్కృత్య వత్సరాజ గృహం స్వయమ్‌ || 9

మాతులేన సమాయుక్తః కైకయేంద్రగృహా త్తతః | జహి శైలూష తనయాన్‌ గంధర్వాన్‌ పాప నిశ్చయాన్‌ || 10

ఏవముక్త స్స ధర్మాత్మా భరతో భాతృ వత్సలః | రామస్య పాదౌ శిరసా చాభివంద్య కృతాంజలిః | 11

గృహం గత్వా చకారాథ సర్వం ప్రాస్థానికం విధిమ్‌ ||

వజ్రనృపతి శైలూష పుతులగు గంథర్వులు భరతునిచే నెందుల కెట్లు హతులైరి తెల్పుమన మార్కండేయు డిట్లనియె. అయోధ్య (యుద్ధముసేసి గెలువరానిది) యగు నయోధ్యయందు దశరథకుమారుడైన రాముడుండగా కైకేయదేశాధిపతి శ్రీమంతుడు యుధాజిత్తు అను రాజు భరతుని మేనమామ రామునిదరికి వృద్ధుడైన పురోహితుని గార్గ్యుని దూతగాంబపెను. ఆ పంపిన పని వినుము. రామా! సింధువున కిరువైపులందు మనోహరమైన దేశమున్నది. మనుష్య రాజులం జంపి గంధర్వులు దాని నాక్రమించు కొన్నారు. ఆ గంధర్వులు రాజులకు బాధ గల్గించుచున్నారు. లక్ష్మణుని భరతుని శత్రుఘ్నుని గాని పంపి రాఘవా! ఆ గంధర్వులను నశింప జేయము. ఆ రాజులు నిర్భయులగుదురుగాక! ఆ దేశము నీదియు నగుగాక! అను దూతమాట విని రామచంద్రప్రభు వాలోచించెను. మేఘనాథుని (ఇంద్రజిత్తును) జంపుటలో లక్ష్మణుడు పెద్దపని సేసెను. రావణాసురవధలో శత్రుఘ్నుడు గొప్ప కార్యము నిర్వర్తించెను. గంధర్వ నిగ్రహమునుకు భరతునంపెదను. అని మనుసులో ధ్యానముసేసి రాముడు భరతునితో నిట్లనెను. వత్సా! భరతా! గార్గ్యునితో రాజ గృహమున కేగి మామయ్యతో గలిసి కైకయేంద్ర మందిరము నుండి యాపై జనిపాపనిశ్చయులైన శైలూఘులను గంధర్వులం గూల్పుము. అన విని యా ధర్మాత్ముడు భ్రాతృవత్సలుడు భరతుడు రామపాదములం దలమోపి మ్రొక్కి దొసిలొగ్గి తన సౌధమున కేగి ప్రాస్థానిక మంగళము సర్వము నొనరించెను.

ఓషధీనాం కషాయేణ తదోత్ల్పావిత విగ్రహః || 12

గౌత సర్షప కల్కేన ప్రసాదిత శిరోరుహః | తీర్థ సారస నాదేయైః సలిలైశ్చ స సాగరైః 13

చందన స్రావ సంమిశ్రైః కుంకుమ క్షోద సంయుతైః | సర్వౌషధి స మాయుక్తైఃసర్వగంధ సమన్వితైః || 14

మంత్రపూతై ర్మహాతేజాః సస్నౌ రాఘవ వర్ధనః | శంఖ భేరీ నినాదేన పణవానాం స్వనేనచ || 15

ఆనకానాంచ శ##బ్దేన నిస్వనేన చ వందినాం | సూత మాగధ శ##బ్దేన జయకారై స్తథైవచ || 16

తుష్టువుః స్నానకాలే తం స్తవై ర్మంగల పాఠకాః ! తథోపతస్థు ర్గీతేన గంధర్వాప్సరసాం గణాః || 17

అనేక మూలికల కషాయముల నొడలికిం బూసికొని తెల్ల ఆవాలముద్ద తలకుం బూసికొని తీర్థముల సరస్సులు పుణ్య నదులయు నుదకములతో సముద్రోదకములతో చందన ద్రవముతో కుంకుమపూవు చూర్ణముతో సర్వౌషధులతో సర్వవిధ పరిమళములతోడి మంత్ర పూతములైన జలములతో నామహాతేజస్వి మంగళ స్నానము సేసెను. శంఖ భేరీపణవానక వాద్యములు మ్రోయ వందిమాగధసూతాదులు మంగళపాఠములు జయజయ నినాదములు నెఱపుచు నా మహానుభావుని స్నాన సమయమున స్తోత్ర పాఠముల స్తుతించిరి. అట్లె గంధర్వాప్సరోగణములు పాటలు పాటలు వాడుచు సేవింపవచ్చిరి.

స్నాతః స భరతో లక్ష్యా యువ రాజాభి రూపయా | విలిప్తః చారు సర్వాంగః చందనేన సుగంధినా || 18

అహతాంబర సంవీత్యః శ్వేత మాల్య విభూషణః | కుండలీ సాంగదీ మౌళీ సర్వ రత్న విభూషితః || 19

అంతస్థః పూజయా మాస దేవదేవం త్రివిక్రమమ్‌ | గంధ మాల్య నమస్కార ధూపదీపాది కర్మణా || 20

పూజ యిత్వా జగన్నాధ ముపతస్థే హుతాశనమ్‌ | సుహుతం బ్రాహ్మణంద్రేణ రాఘవానాం పురోధసా || 21

గోభిర్వస్త్రెర్హిరణ్యౖశ్య తురంగ కరి పుంగవైః మోదకైః సఫలైః ర్దధ్నా గంధై ర్మాల్యై స్థథాక్షతైః || 22

స్వస్తి వాద్యాం స్తథా విప్రాన్‌ మహాత్మా భూరిదక్షిణః | వ్యాఘ్ర చర్మోత్తరే రమ్యే సూప విష్టో వరాసనే || 23

ఆయుధా నంతరం చక్రే ధ్వజ చ్ఛత్రాభి పూజనమ్‌ | స్వస్తికాన్‌ వర్ధమాననాంశ్చ నంద్యా వర్తాం స్తథైవచ || 24

నద్యః కాంచన విన్యస్తాః శంఖః సత్కమలాంజనమ్‌ | పూర్ణ కుంభం గజ మదం దూర్వాః సార్ద్రంచ గోమయమ్‌ || 25

రత్నా నాదాయ బిల్వం చ చాపమాదాయ సత్వరః | సశరం రాఘవ శ్రేష్ఠః పద ద్వాత్రింశకం య¸° || 26

శ్రేష్ఠ మశ్వం సుచంద్రాభం హేమ భాండ పరిచ్ఛదమ్‌ | ఆరుహ్య నిర్య¸° శ్రీమాన్‌ జయ కారాభి పూజితః || 27

పౌర జానపదా మాత్యైః వాద్యఘోషేణ భూరిణా | హ్రేదేన గజఘంటానాం బృంహితేన పునః పునః || 28

హ్రేషితేన తురంగాణాం నరాణాం క్ష్వేడితేనచ | ద్విజ ఫుణ్యాహ ఘోషేణ ప్రయాతో భూరిదక్షిణః || 29

భరతుడు మంగళస్నానముసేసి యువరాజలక్ష్మీవైభవముతో మేనెల్ల సుగంధము చక్కగా బూసికొని మడుపు దోవతులు దాల్చి తెల్లని మాల లలంకరించికొని కుండలములు భుజకీర్తులు కిరీటము సర్వరత్నభూషణములు దాల్చి గృహమునందున్న దేవ దేవుని ద్రివిక్రముని గంధమాల్య నమస్కార ధూపదీపాదులచే పూజించెను. ఆమీద రాఘవుల పురోహితుడగు బ్రాహ్మణుడు వేల్వ నగ్ని కుపస్థానముసేసెను. గోవులు వస్త్రములు బంగారపు కాసులు గుఱ్ఱములు గజశ్రేష్ఠములు మోదకములు (లడ్డులు) పండ్లు గంధమాల్యములు అక్షతలు మొదలగు మంగళపదార్థములచే భూరిదక్షిణలిచ్చి విప్రులం బూజించి, వ్యాఘ్రచర్ముపైన పరచిన శుభాసనమునందు గూర్చుండి యాయుధములం బూజించిన మీద ధ్వజచ్ఛత్రములను బూజించి పూర్ణకుంభములలో రకాలు స్వస్తికములు వర్ధమానములు (మూకుళ్ళు) నంద్యావర్తములను కాంచనకుంభములందు బవిత్ర నదీజలముల శంఖము కమలాంజనము పూర్ణకుంభము గజమదము దూర్వలు (గరిక) తడిగోమయమును రత్నములను బిల్వము బాణములతో ధనువును జేకొని సత్వరుడై ముప్పదిరెండడుగులునడచెను. ఆమీద చంద్రునట్లు శోభించు బంగారుకుంభాలంకృతమైన జీనుతోడి శ్రేష్ఠమైన గుఱ్ఱము నధిష్ఠించి శ్రీమంతుడతడు జయజయ నాదములచే బూజింపబడుచు పౌదజానపదమంత్రులతో వాద్యములు మ్రోయ ఏనుగుల గంట సడితో మరిమరి వినవచ్చు గజ బృంహితములతో, ఉత్తమాశ్వముల సకిలింపులతో నరులయొక్క (పరివారభటవర్గముయొక్క) క్ష్వేడితములో (ఉత్సాహముతో జేయు శబ్దములతో) ద్విజులు సేయు పుణ్యాహవాచనఘోషముతో నా భూరిదక్షిణుడైన (అనేక యజ్ఞములు చేసిన) భరతుడు జైత్రయాత్ర వెడలెను.

భరతస్య ప్రయాణతు దేవాః శక్ర పురోగమాః | ముముచుః వుష్ప వర్షాణి వాచ ఊచుః శుభాస్తథా || 30

ఏష విగ్రహ వాన్‌ ధర్మః ఏష సత్యవతాం వరః | ఏష వీర్యవతాం శ్రేష్ఠో రూపేణా7 ప్రతిమో భువి || 31

అనేన యత్కృతం కర్మ రామే వన ముపాగతే | న తస్య కర్తా లోకే7స్మిన్‌ దివివా విద్యతే క్వచిత్‌ || 32

అనేక రాజ్యం సంత్యక్తం గృహందగ్ధ మివాగ్నినా | అనేన దుఃఖ శయ్యాసు శయితం సు మహాత్మనా || 33

నిత్య మాసన్న భోగేన జటా వల్కల ధారిణా | ఫల మూలాశినా 7నేన రామరాజ్యం హి పాలితమ్‌ || 34

శృణ్వన్‌ సువాక్యాని సురేరితాని రామానుజో రామగృహం జగామ |

శూరా77ర్య విద్వ త్పురుషోపకీర్ణం రత్నైర్యథాసాగర మప్రమేయమ్‌ || 35

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే భరత ప్రస్థాన వర్ణనం నామ ద్వ్యధిక ద్విశత తమో7ధ్యాయః.

భరతుని ప్రయాణమందు శక్రాది దేవతలు పూలవానలం గురియించి శుభవచనములు పల్కిరి. వారి వచనము లివి : ఇతడు రూపుగొన్న ధర్మము. ఇతడు సత్యవంతులలో మేటి. ఇతడు వీర్యవంతులలో శ్రేష్ఠుడు. రూపముచే నవని మరి సాటిలేనివాడు. రాముడు వనవాసమునకేగినపుడీతడు సేసినపని సేయువాడీలోకమందు మరియొకడులేడు. ఇతడు రాజ్యము ద్యజించెను ఇల్లు పాడువెట్టెను. ఈమహానుభావుడు కటికనేల శయనించెను. భోగములరచేతనున్నను నిత్యము జటావల్కములు ధరించి పండ్లు దుంపలు దిని రామరాజ్యము పాలించెను. ఇటు వేల్పులు పలుకు వాక్యములాలించుచు రామానుజుడు రామగృహమునకేగెను. ఆ గృహము రత్నములతో సాగరమట్లు శూరులు ఆర్యులు (పెద్దలు పూజ్యులు) విద్వాంసులతో సమ్మర్దమై యుండెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భరత ప్రస్థానవర్ణనమను రెండువందలరెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters