Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందలమూడవయధ్యాయము - భరతానుయాత్రిక వర్ణనము మార్కండేయః : గృహాత్ ప్రయాతే భరతే ప్రస్థానార్థిని యాదవ! ప్రాగేవ లక్ష్మణం రామో నిత్యోద్యుక్త మభాషత ||
1 అనుయానం కుమారస్య భరతస్య మహాత్మనః | ప్రేషయా7శ్వ సహస్రాణాం శతాని త్రీణి రాఘవ! 2 దశదంతి సహస్రాణి రథానాం షడ్ గుణానిచ | కోట్యః పంచ పదాతీనాం సమరేష్వనివర్తినామ్ ||
3 ధనాధ్యక్షాస్తథావత్స మనుగచ్ఛన్తు లక్ష్మణ! | గోరథై తథా ప్యుష్టైస్తథైవచ||
4 వ్యాయత్తేః పురుషైరశ్వైర్గర్దభైశ్చ తథా వరైః | వస్త్రరూప్య సువర్ణానాం మణీ నామపి భాగశః ||
5 విసర్గాయ కుమారస్య పరిపూర్ణా యథా సుఖమ్ | బ్రాహ్మణాః కథయా ముఖ్యాస్తథైవ నటనర్తకాః ||
6 గీతే నృత్తే తథాలాస్యే ప్రవీణాశ్చ వరాంగనాః | ప్రాస్థాని కాశ్చయేకేచి త్పాన విక్రయిణశ్చయే ||
7 రూపాజీవాశ్చ వణజో నానా పణ్యోప జీవినః | నానా రూపము పాదాయ బహు పణ్యం వ్రజన్తువై ||
8 విషవైద్యా శ్శల్య వైద్యాఃతథా కాయ చికిత్సకాః | కర్మాంతికాః స్థపతయో మార్గిణో వృక్షరోపకాః ||
9 కూపకారాః సుధాకారాః వంశకర్మకృతస్తథా | వారిక్కారాశ్చ యేకేచిత్ కర్మకా రాశ్చ శోభనాః ||
10 పరికర్మకృతశ్చైవ తథా వస్త్రోప జీవినః ! మాయూరికా సై#్తత్తిరాకా శ్చేతకా భేదకాశ్చయే ||
11 రంజకా దంత కారాశ్చ తథా దంతోప జీవినః | ఏరండ వేత్రకారాశ్చవట కారాశ్చ శోభనాః ||
12 ఆరకూటకృతశ్చైవ తామ్రకూటా స్తథైవచ | భూర్జకూటాః ఖడ్గకారాః గుడసీధు ప్రపాచకాః ||
13 ఔరభ్రకాః మాహిషకాస్తున్న వాయాశ్చ లక్ష్మణ! | యేచాభిష్టావకాః కేచిత్సూత మాగధ వందినః ||
14 చైల నిర్ణేజకాశ్చైవ చర్మకారా స్తథైవచ | అంగార కారాశ్చతథా లుబ్ధకా యేచ ధీవరాః || 15 కబంధ ధారిణోయేచ యేచ కాష్ఠ ప్రపాటకాః | వస్త్రసీవన సక్తాశ్చ గృహకారాశ్చ యేనరాః || 16 కుంభకారాశ్చ యేకేచి చ్ఛ్మశ్రువర్ధకినశ్చయే : లేఖకా గుణకాయేచ తథా తందుల కారకాః || 17 సక్తుకారాశ్చ యేకేచి చ్ఛాక పణ్యోపజీవినః | తైలికా గాంధికాశ్చైవ తీర్థ సంశుద్ధి కారకాః || 18 చిత్రకర్మవిదోయేచ యేచ లాంగూలికాజనాః | సూతాః పౌరోగవాశ్చైవ సౌవిదల్లాశ్చ లక్ష్మణ! || 19 గోపా వనచరాయేచ నదీతీర విచారణాః | గోసంగై ర్మహిషీ సంగైస్తే7నుయాన్తు యథాసుఖమ్ || 20 శ్రేణి మహత్తరాయేచ గ్రామఘోష మహత్తరాః | తథైవాటవికాయేచ యేచ శైలవిచారిణః || 21 సౌమిత్రే! సర్వ ఏవైతే సుభృతాశ్చ సుపూజితాః ! అనుయాన్తు కుమారం మేభరతం భ్రాతృవత్సలమ్ || 22 ఇత్యేవ ముక్తస్సతు తాన్సమస్తా నాజ్ఞాపయామాస నఠేంద్రవాక్యాత్ | ఆమంత్ర్య రామంశిరసాచసర్వే వినిర్యయుస్తే నగరాత్ ప్రహృష్టాః || 23 ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఆనుయాత్రిక వర్ణనం నామ త్ర్యధిక ద్విశతతమో7ధ్యాయః. మార్కండేయుడిట్లనియె. విజయప్రస్థానమెంచి భరతుడు గృహమువెడలు నంతమున్న రాముడు నిత్యోద్యుక్తుడైయున్న (రామచంద్రుని నాజ్ఞసేయ నిరంతరము సన్నద్ధుడైయుండు) లక్ష్మణుని మహాత్ముడగు భరతకుమారుని కనుయానము సేయవలెనని పలికెను. ఆ వెంబడింపవలసినవి పదివేలయేనుగులు అరువదివేల రథములు అని వెనుదిరుగని పదికోట్లమంది కాల్బలము ధనాధ్యక్షులు నీవత్సననుగమింపవలెననియె. మరియు పుష్టములయిన యెడ్లంబూన్చిన బండ్లు. ఒంటెలు గుఱ్ఱాలు గార్దభములు నరులును మోయు బండ్లును భరతకుమారునివెంట నేగవలయును. వస్త్రములు రూప్యములు (వెండి) సువర్ణములు మణులు దానముసేయునిమిత్తమనుపుము. లక్ష్మణా! భరతయశః కథలుసెప్పు బ్రాహ్మణశ్రేష్ఠులు నటులు నర్తకులు పాటలో నాటలో లాస్యములో ప్రవీణలైన యలివేణులు ప్రాస్థానికులయిన పానవిక్రయులు రూపాజీవలైన విలాసినులు (భోగవనితలన్నమాట) నానావస్తువ్యాపారముసేయు వణిజులు నానావిధమైన పణ్యసమృద్ధిని (సమృద్ధసామగ్రులను) గొని వెంబడింతురుగాక ! విషవైద్యులు శల్యవైద్యులు శరీరచికిత్సకులు కర్మాంతికులు (ఇనుము మొదలయిన పనులుచేయు కమ్మరులు) స్థపతులు (శిల్పులు) మార్గిణులు (దారిబాగుసేయువారు) వృక్షరోపకులు (చెట్లునాటువారు) కూపకారులు (సూతులుత్రవ్వువారు) సుధాకారులు (వెల్లవేయువారు) వంశకర్మకరులు (వెదురుపనులుసేయువారు మేదరులన్నమాట) వాణిక్కారులు శోభనులైన కూర్చకారులు పరికర్మ (అలంకరణ) కరులు బట్టలునేయువారు మాయూరికులు తైత్తిరికులు చేతకులు భేదకులు రంజకులు దంతకారులు దంతోపజీవులు ఏరండ వేత్రకారులు కటకారులు (చాపలల్లువారు) ఆరకూటకరులు (ఇత్తడి పనివాండ్లు) తామ్రకూటులు (రాగిపనివాండ్రు) భూర్జకూటులు ఖడ్గకరులు (కత్తులు తయారుసేయువారు) గుడసీధు ప్రపాచకులు (బెల్లపుకల్లు కాచువారు) ఔరభ్రకులు మాహిషకులు తున్నవాయులు (నేతగాండ్రు) అభిష్టావకులు (పాటలుపాడి స్తుతించువారు) సూత వంధిమాగధులు చైలనిర్ణేజకులు బట్టలకు రంగు వేయువారు (అద్దకాల పనివాండ్రు) చర్మకారులు అంగారకారులు లుబ్ధకులు (బోయలు) ధీవరులు చేపలుపట్టువాండ్రు (పల్లెవాండ్రు) కబంధధారులు కాష్ఠప్రపాటకులు (కట్టెలుగొట్టువాండ్రు) వస్త్రసీవనసక్తులు (బట్టలుకుట్టువారు, దర్జీలు) గృహకారులు (ఇండ్లుకట్టువారు) కుంభకారులు (కమ్మరులు) శ్శశ్రువర్ధకులు (గడ్డపుపని చేయువారు) లేఖకులు (వ్రాతకారులు, గుమాస్తాలు) గణకులు (లెక్కగాండ్రు) తండులకారకులు (బియ్యముదంపువారు) సక్తుకారులు (పేలపిండి వగైరాలు చేయువారు) కూరలమ్మువాండ్రు తైలికులు (తెలుకలవాండ్రు) గ్రాంథికులు తీర్థసంశుద్ధికారకులు (రేవులనూడ్చి బాగుసేయువారు) చిత్రకర్మవిదులు (చిత్రకరులు) లాంగూలికులు సూతులు పౌరోగవులు సౌవిదల్లులు గోపులు వనచరులు నదీతీరచరులు నీ మొదలుగనందరు మనచే జక్కగ పోషింపబడుదురు. లెస్సగా సత్కరింపబడినవారు వీరందరు. సౌమిత్రీ ! భ్రాతృవత్సలుడైన భరతునివెంట ఆలమందలతో గేదెలమందలతో సుఖముగ నేగలవలయును. అని యిట్లు రామునిచే నానతీయబడి యా సార్వభౌము వాక్యానుసార మయ్యందరను భరతుడాజ్ఞాపించెను. శిరమువంచి నమస్కరించిరాముని సెలవుగైకొని యయ్యందరు నానందభరితులై నగరమువెడలిరి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున భరతానుయాత్రిక వర్ణనమను రెండువందలమూడవ అధ్యాయము.