Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలఏడవ అధ్యాయము - భరతుని రాజగృహగమనము

మార్కండేయః : భరతేతు సముత్తీర్ణే గంగాం గగనమేఖలాం | వివేశ కటకం తస్య త మన్యః కౌరవో నృప! || 1

బలేన చతురంగేణ సముద్రాభేన సంయుతః | ఈశ్వరశ్చ కిరాతానాం దమనోనామ పార్థివః || 2

గంధినాం బహుసాహస్త్రెః బలైర్యుక్తో వ్యదృశ్యత | యథార్హం పూజయిత్వా తం భరతో ధర్మవత్సలః || 3

ఆససాదార్క తనయాంయమునాం పాపనాశినీమ్‌ | యమస్య భగినీం పుణ్యాం నీల నీలాం మనోహరామ్‌|| 4

యత్రక్వచన సద్యాం హి కృత్వా శ్రాద్ధం నరాధిప | అక్షయం ఫల మాప్నోతి నాకపృష్ఠేచ మోదతే|| 5

యత్ర కృష్టచతుర్దశ్యాం ప్రాత స్సంపూజ్య భానుజామ్‌ | ముచ్యతే పాతకైస్సర్వై ర్నాకలోకం సగచ్ఛతి|| 6

అనర్కాభ్యుదితే కాలే మాఘకృష్ణ చతుర్దశీమ్‌ | యస్యాం స్నాతస్తు సంపూజ్య ధర్మరాజం తిలాంభసా|| 7

న దుర్గతి మవాప్నోతి మలంచైవ సముద్ధరేత్‌ | యత్రక్వచన నద్యాం హి మాఘకృష్ణచతుర్దశీమ్‌ || 8

నాదేయంభసి సర్వస్మిన్‌ స్నాతః పాపైః విముచ్యతే | యమునా ఈ విశేషేణ యమస్య భగినీతిసా|| 9

స్నాతశ్చ యామునే సంతర్ప్య పితృదేవతాః| న దుర్గతి మవాప్నోతి నాకలోకం చ గచ్ఛతి|| 10

తాం సమాసాద్య యమునాం యథా గంగాజలం తథా | విహృత్య భరత స్తద్వ దుత్తతార మహానదీమ్‌ || 11

మార్కండేయు డనియె : అకాశ మొడ్డాణమయియున్న గంగను (గంగ త్రిపథగ గావున శివుని జటాజూటమామె శిరస్సుగాను అంతరిక్షము నడుముగాను భూమి పాతాళములు ఊరువులు పాదములుగా నుండుటను భావించి ఆతల్లికి గగనము నడుమున కలంకరించుకొను నొడ్డాణముగను అందలి సూర్య చంద్ర తారా నక్షత్రాదులా యొడ్డాణములందలి రత్నాలుగను దీపించుచున్న వను భావమిట ధ్వనించుచున్నది. భరతుడు దాటినతరి నాతని కటకమును (స్కంధావారమును) కౌరవుడను ఇంకొక రాజు సముద్రమట్లున్న చతురంగబలముతో వచ్చిచేరెను. కిరాత రాజు దమనుడనువాడును అనేక వేలమంది గంధులతో గంధి = గర్వితుడు బలగర్వితులయిన కాల్బలముతోనని యిక్కడ తాత్పర్యము కానోపును) భరతునికి గానబడెను. మిత్రబలముగా నీ యిద్దరు చేరిరన్నమాట. ధర్మవత్సలుడగు భరతుడు వారిం దగినరీతి బూజించి పాపనాశిని సూర్యుని కూతురు యమాని చెల్లెలు నలుపు నలుపుగా నున్నదియునగు చక్కని యమునానదిని దరిసెను. ఆ నదీ తీరమందెక్కడనో యొకచోట శ్రాద్ధము పెట్టిన యాత డక్షయ ఫలమందును. స్వర్గమందానందించును. కృష్ణచతుర్దశినాడు స్నానము సేసి యాయనను బూజించు నాతడు సర్వపాపముక్తుడై నాకలోకమునకేగును. సూర్యోదయము గాక ముందు మాఘకృష్ణచతుర్దశినాడందు స్నానము సేసి యమధర్మరాజును తిలోదకముల బూజించు నాతడు దుర్గతిపాలుగాడు. కులము నెల్ల నుద్ధరించును. మాఘకృష్ణచతుర్దశినాడేదేని నదీజలముల స్నానముసేయు నతడు పాపవిముక్తుడగును. యముని చెల్లెలగుట యమునయెడ నదియొక విశేషము. అందు స్నానము సేసి పితృదేవతాతర్పణము సేసినవాడు దుర్గతి నందడు. నాకమునందును. గంగాజలమునట్లా యమునం జేరి భరతుడారీతి విహరించి యానదిం దాటెను.

సముత్తీర్ణస్య యమునాం భరతస్య మహాత్మనః | వివేశ కటకం రాజా మత్స్యానాం సురథ స్తదా || 12

గోరసేనశ్చ సాల్వానాం శిబీనాంచ ప్రభద్రకః | సతైర్నృతిభిః సార్ధం కురుక్షేత్ర ముపాయ¸° || 13

యదర్థమేషా చరతి లోకే గాథా పురాతనీ | పాంసవో7పి కురుక్షేత్ర వాయునా సమమీరితాః|| 14

ఆపి దుష్కృత కర్మాణో నయన్తి పరమాం గతిమ్‌ | సమన్త పంచకే పుణ్య యే మృతా మనుజేశ్వరః || 15

తే సర్వే నాక మాసాద్య రాజన్తే దివి దేవవత్‌ | సన్నీతి ర్యత్ర రాజేంద్రః తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్‌ || 16

తీర్థ సన్నయనా దేవ సన్నీ తిరితి విశ్రుతమ్‌ | పృథివ్వాం యాని తీర్థాని అసముద్ర సరాంసిచ || 17

మాసాన్తే సతతం తత్ర నిత్యమాయాన్తి యాదవ! | తత్ర శాద్ధంతు యః కుర్యాత్‌ రాహుగ్రస్తే దివాకరే || 18

అశ్వమేధశ తస్యాగ్రం ఫలం విందతి మానవః | భరతస్తు సమాసాద్య తత్రోవాస సుఖీ తదా || 19

పప్రచ్ఛ బ్రాహ్మణాం స్తత్ర తీర్థ సన్నీతి కారణం | వృష్టస్తు భరతేనాథ బ్రాహ్మణస్తు ఘటోదకః || 20

ఉవాచ భరతం తత్ర కథాం పాప ప్రణాశినీమ్‌ |

యమునను దాటిన తరువాత భరతుని యొక్క కటకమును మత్స్యదేశాధిపతి సురథుడనురాజు సాల్వాధిపతి గోరసేనుడు శిబిదేశాధీశుడు ప్రభద్రకుడు నను రాజులు మిత్రులైవచ్చి ప్రవేశించిరి. ఆరాజులతో గూడి భరతుడు కురుక్షేత్రమున కేగుదెంచెను. ఈ కురుక్షేత్రమును గూర్చి యీ పురాతన గాధ ప్రచారములో నున్నది. దానిభావమిది.

''కురుక్షేత్రమందు వాయువుచే నెగయింపబడు పరాగములు (ధూళి) పాపాత్ములనైనను పరమగతికి గొనిపోవును'' రాజా ! పుణ్యమైన సమంతపంచకమందు జనిపోయినవారెల్లరు స్వర్గముంజేరి యచట దేవతలట్లు రాజిల్లుదురు. అక్కడనే సన్నీతియను తీర్థము త్రిలోక ప్రసిద్దమొకటి గలదు, తీర్థముల నన్నిటిని నచట మార్చినది యగుటచేతనే సన్నీతి యను పేరు దానికి బ్రసిద్దమైనది. పృథివియందున్న సర్వ తీర్థములు సముద్రపర్యంతములైన సంస్సలెల్పపుడు పత్రిమాసము చివర నచ్చటికి వచ్చునుగావున దాని కాపేరు వచ్చినది. రాహుగ్రస్తసూర్య గ్రహణకాలమం దక్కడ శ్రాద్దముపెట్టు నతడశ్వమేథ శతఫలమునందును. భరతుడు అక్కడకు వచ్చి సుఖముగా వసించెను. అక్కడి బ్రాహ్మణులను సన్నీతి తీర్థమేర్పడుటకు గారణము నడిగెను. అట్లడుగబడిన ఘటోదరుడను బ్రాహ్మణుడు పాపప్రణాశినియైన యక్కడ జరిగిన కథను వచించెను.

ఘటోదరః శ##క్రే వృత వధాక్రాంతే త్రైలోక్యే దై త్యసాద్గతే || 21

సబ్రహ్మాకాస్సురాస్సర్వే విష్ణుం శరణమాయయుః తానువాచ హరిర్దేవః చ్యవన స్యాత్మ సంభవః || 22

భార్గవో బ్రాహ్మణ ః శ్రీమాన్‌ దధీచ ఇతి విశ్రుతః || అస్థిభిః క్రియతాంతస్య దేవేంద్రస్య వరాయుధమ్‌ || 23

ప్రవిశ్య దేవాం స్తత్రాహం హన్తావృత్ర మసంశయమ్‌ | ఏవముక్తా ః సురాస్సర్వే దధీచస్యాశ్రమం యమః || 24

దదృశుశ్చ మహాభాగం దధీచం తపసా నిధిమ్‌ | పూజాయిత్వా మహాభాగం తమూచః సంహతాస్సురాః || 25

త్వదస్థిభి ః కరిష్యామో వజ్రం దైత్య నిబర్హణమ్‌ | అన్యాని చ తథస్త్రాణి సురకార్యార్థ సిద్దయే || 26

తత్ర త్వం దేవకార్యార్థం సన్యాసం ద్విజః రోచయ | ఏవముక్తో దధీచస్తు ప్రత్యువాచ సతాన్సురాన్‌ || 27

తీర్థయాత్రా ప్రతిజ్ఞాతా సర్వతీర్థేషు వై మయా | తాం తు కృత్వా కరిష్యామి దేహన్యాసం సురోత్తమాః || 28

దేవాః : శ క్తస్త్వం సర్వతీర్థానా మహ్వానే ద్విజపుంగవ | ఇహాద్యైవ సమాయాన్తు

సర్వతీర్థాని తే 7నఘ || 29

ఘటోదరః : తేజసాచ త్వదీయేన తథా7స్మాకంచ భార్గవ | ఏవము క్తస్సురై స్సర్వైస్థీర్థాని సరిత స్తథా || 30

సరాంసిచ సముద్రాశ్చ తత్రాజగ్ము ర్నరాధిపః | కామ్యేన మహతా రాజన్‌ : యోగేన పరమేణ చ || 31

స్నాత్వాచ తేషాం సాన్నిధ్యం తత్రస్నాతో ద్విజోతమః| తర్పణంచ తథా కృత్యా సురాణాం పితృభి స్సహ || 32

ఉవాచ దేవాం స్తత్రస్థాన్‌ ఇదంవచన మర్థవత్‌ | దధీచః : అద్య ప్రభృతి మాస్తానే భవదృః సతతం సురాః || 33

సాన్నిధ్య మిహక ర్తవ్యం తీర్థెశ్చైవ యథాగతై ః | ఘటోదరః : ఏవముక్తైస్తథే త్యుక్తో దేవై స్తీర్థెశ్చ స త్వథ || 34

త్యక్త్యా దేహం దివం యాతో దధీచః స్వేన తేజసా | విశ్వకర్మాచ తస్యాస్థ్నాం భాగై ర్వజ్ర మథా 7కరోత్‌ || 35

ఆయుధాని చ దేవానాం తథైవచ పృథక్‌ పృథక్‌|

ఘటోదరుడు సన్నీత తీర్థ మహిమ సెప్పుట

ఇంద్రుడు వృత్రాసుర వధ యందుండ ముల్లోకములు దైత్యుల వశముకాగా బ్రహ్మతో సురలెల్ల విష్ణువును శరణొంద వచ్చిరి. వారితో హరి, చ్యవనునియాత్మజుడు శ్రీమంతుడు దధీచడనువాడు భార్గవ వంశ్యుడు బ్రాహ్మణుడు ప్రసిద్దుడు, ఆ అతని యెముకలతో దేవేంద్రుని కొక యాయుధము గావింపుడు. నేనక్కడ దేవతలలో బ్రవేశించి వృత్రుని సంహరింతును సంశయము లేదనెను. ఇట్లుపలుక వేలుపులెల్ల దిధీచాశ్రమమునకేగిరి. ఆ మహాభాగుని తపోనిధిని దర్శించి పూజించి యందురుంగలసి యతనితో నీయెముకలతో దైత్యసంహారకమైన వజ్రహుం దయారుసేసెదము, దానితో సురకార్యసిద్దికి అందీవు దేవకార్యనిమిత్తము సన్యాసమున= దేహత్యాగమున కిష్టపడుమనిరి. దధీచి విని వారితో నేను సర్వతీర్థయాత్ర సేయవలెనని ప్రతినసేసి కొంటిని. ఓ సురోత్త ములార ! ఆ యాత్రగావించి యప్పడు దేహన్యాసముం జేసెదనన దేవతలు ఓ ద్విజపుంగవా ! నీవు సర్వతీర్థముల నాహ్వానింప సమర్థుడవు. సర్వతీర్థములును నీయొక్కయు మాయొక్కయు తేజస్సుచే నిక్కడకిపుడే నీకొరకు వచ్చునుగాక ! అని వేల్పులందరు ననగా సర్వతీర్థములు నదురు సరస్సులు సముద్రములు నాతని మహత్తరము పరమమునగు కామ్యయోగమున నటకవచ్చినవి. వాని సాన్నిధ్యము నెరింగి యా ద్విజోత్తముడందు స్నానము సేసెను దేవ పితృతతర్పణములు గూడ సేసి యటనున్న దేవతలతో ఇప్పటి నుండి ప్రతిమాసముచివర తామెల్లరు నిచటకేతెంచిన తీర్థములతో పాటిచ్చట సాన్నిధ్యము సేయవలెనని యర్థవంతమగు వచనము పలికెను. అదివిని దేవత తీర్థముల నట్లే యన దధీచుడప్పుడు దేహమును విడిచి తనతేజస్సుతో దివమ్మునకేగెను. విశ్వకర్మ యాయన యస్థిభాగముంచే వజ్రముంజేసెను అదెరీతిగ దేవతలకు వేర్వర నాయుధములనుం గావించెను.

తేచ వజ్రేణ మహతా వృత్రం హత్యా మహాసురమ్‌ || 36

జఘాన దైత్య ముఖ్యానాం నవతి ర్నవతి స్తథా | తతః ప్రభృతి మాసాన్తే నిత్యమేవ రఘూద్వహ || 37

సాన్నిధ్య మిహ తీర్థానాం దేవతానంచ కల్పితమ్‌ | 38

మార్కండేయ ః : ఏతచ్చ్రుత్వా మహాతేజా దత్వా దానాని రాఘవః |

య¸° సైన్యేన మహతా భరతో 7 మరకంటకమ్‌ | తత్ర విష్ణు పదం ప్రాప్య పూజయిత్వాచ రాఘవః || 39

అససాద నదీం గౌరీం పుణ్యాం పాప భయాపహామ్‌ | విశ్వామిత్రాజ్ఞయా రక్షః ప్రవివేశ పురా నృపమ్‌ || 40

కళాహతేన మార్గస్థం శప్తం భూపాల శక్తినా | సౌదాసం స ప్రవిష్టస్తు భయామాస శక్తినమ్‌ || 41

తతః పుత్ర శతం రాజన్‌: వసిష్ట సై#్యవ సత్వరః | హృతే పుత్రశ##తే దుఃఖా ద్వసిష్టో భగవానృషి ః || 42

వివేశ నిమ్నగాం గౌరీం పాణత్యాగచీకీర్షయా | విప్రస్య భూపః యతస్య విద్రూతా సాతదా 7భవత్‌ || 43

తతః ప్రభృతి లోకే 7స్మిన్‌ శతద్రురితి శబ్దితా | సర్వపాప ప్రశమనీ సర్వకళ్యాణ కారిణీ ||

44

స్నాతానాం చ తథా రాజన్‌ : దశ##ధేనుఫలం ప్రదా | తాం సమాసాద్య తత్రాపి దత్వాదానం స రాఘవః || 45

ఉత్తీర్య తాం య¸° తత్ర సా చాంత్యా యత్ర నిమ్నగా | యస్యాం స్నాత్యా విముచ్యంతే సర్వపాపభ##యైర్నరాః || 46

యస్యాం స్నానా దవాప్నోతి దశగోదానజం ఫలమ్‌ | ఆషాఢేచ తథా కృత్యా గో సహస్ర ఫలం లభేత్‌ || 47

గౌరీతోయా ద్వినిర్ముక్తో వసిష్టో భగవా సృషిః | పాశబంధభ##రైర్యస్యాం పపాత సహసా నృపః 48

విపాశశ్చ తథా దేవ్యా వృత్వా తీరే విసర్జితః | శక్తి పుత్రం తతో దృష్ట్యా పసిష్ఠో7పి పరాశరమ్‌ || 49

అస్త సన్తాన మిత్యుక్త్యా మరణా ద్వినివర్తత | సా చాంత్త్యాచ తథా లోకే విపాశే త్యభీధీయతే || 50

విపాశాం చ సముత్తీర్ణే భరతే ధర్మవత్సలే | వివేశ కటకం తస్య కుణి దేశో మహోదయః || 51

త్రైగర్తో వసుధానశ్చ కులూతా7ధిపతిర్జయః | దాశేరక స్తథా రాజా గోవాశన ఇతి శ్రుతః || 52

ఇరావతీం శీఘ్రగమాం భరతో7పి తదా య¸° | దశ##ధేను ఫలం యాత్ర స్నాత ఏవ సమశ్నుతే || 53

షష్టితీర్థ సహస్రాణి వహత్యేకా ఇరావతీ | అష్టమ్యాంతు విశేషేణ యత్ర యజ్యేత రేవతీ || 54

తత్ర దత్వా బహువిధం దానం రఘుకులోద్వహః | ఉత్తీర్యతాం య¸° శీఘ్రం దేవికాం పాపనాశినీమ్‌ || 55

ఆ వజ్రాయుధముచే సురపతి మహాసురుని వృత్తునిం జంపి దైత్యుల నరతినపతి సంఖ్యాకులను సంహరించెను. అదిమొదలు మాసముచివర నోరఘువంశరత్నమా! ఇక్కడ దేవతలయు తీర్థములయు సాన్నిధ్యము కల్పింబడినది. అదివిని భరతుడు దానములు సేసి మహాసైన్యముతో అమరకటకమునకు జనెను. అక్కడ విష్ణుపదమును దరిసి పూజించి పాపభహారిణియగు గౌరీనరింజెరెను. అక్కడ విశ్వామిత్రుడ నాజ్ఞచే రక్షస్సోకడక్కడ రాజునందు బ్రవేశించెను. అ రక్షస్సు మున్ను కొరడాలో దారిలోనున్నాడని శక్తియను మహర్షిం గొట్టగా నాయన శపించగా రక్షోజన్మమందినవాడు. వాడు సౌదాస నృపతిం బ్రవేశించి శక్తిని దినివైచెను. వశిష్ణుని నూర్దురపుత్రులంగూడ వాడుతొందరగ దినివైచెను. వశిష్టభగవానుడు మహర్షి పుత్రశతము సమయింపబడ దుఃఖముతో బ్రాణములు విడువనెంచి గౌరీనదిం జొచ్చెను అవ్విప్రుడటు చనినంత నానది పారిపోయెను. అదిమొదలానది లోకమందు ''శత దువు'' అని పిలువబడినది. అది సర్వపాప ప్రశమని సర్వకళ్యాణ కారిణియై స్నానముసేసిన వారికీ పదిదేనువులు దానము సేసిన ఫలమిచ్చునది యయ్యెను. అనదింజేరి యక్కడగూడ రాఘవుడు దానములు సేసి యా నదించాటి యానది అంత్యానదికేగెను. అక్కడ స్నానముచేసిన సర్వపాపములు పోవును. పది గోడానముల పుణ్యమునందును. ఆషాడ మాసమునందట్లు సేసిన గోసహస్రదానఫలము లభించును. గైరీనదీజలములందుండి వశిష్ఠభగవానుడు లేచినవానుడు లేచినవాడై పాశములం బంధించుకొని తటాలున నుందుదూకెను. ఆ నదీదేవి యాతని పాశములను విడిచి యొడ్డునందు విడచెను. అంతట నట వశిష్టుడును శక్తిపుత్రుడైన పరాశరునింజూచి సంతానమున్నదని పలికి మరణమునుండి వెనుదిరిగెను. ఆ అంత్యానదియు లోకమందు విపాశయని పిలువబడుచున్నది.

దృష్టమాత్రైవ యా దేవీ సర్వకల్మషనాశనీ | శరీర బహుళాసాతు హరస్య దయితా ఉమా || 56

తత్రాపి దత్వా దానాని పూజాయామాస శంకరమ్‌ | భరతే చాథ తత్రస్థే వివిశుః పంచ పార్దివాః || 57

పార్వతీయా మహారాజః పదాతిగణ సంకులాః | కుమార శ్రేణిమాన్‌ శూరో బలబందుః సుయోధనః | 58

మద్రరాజో7 శుమాంశ్చైవ తథైవచ మహాబలః పూజితో మద్రరాజేన శాకలేన నరోత్తమః || 59

త్రిరాత్రముషిత ః శ్రీమాన్‌ చంద్రభాగం నదీం య¸°| చంద్రాంశు శీతం జలాం సర్వపాప ప్రణాశినీమ్‌ || 60

బహుతీర్థ సమాయుక్తాం స్నానాత్‌ సర్వప్రదాం నృణామ్‌ | విశేషణ మహారాజః మాఘపుష్య త్రయోదశీమ్‌ || 61

భరతే తా సముత్తీర్ణే వివేశ కటకం తతః | ఏతగ్య్కదక జయః శ్రీమాన్‌ 1భిచారః కృతంయః||62

కాశ్మీరకశ్చ ధర్మాత్మా సుబాహురితి విశ్రుతి ః | ఆససాద సతై స్సార్థం వితస్తాం తు మహనదీమ్‌ ||63

స్వర్గలోక ప్రదాంస్నానే సర్వకల్మషనాశినీమ్‌ | ప్రోష్ఠపాదస్య మాసస్య శుక్ల పక్షత్రయోదశీమ్‌ || 64

విశేషేణ మహారాజ ః పుణ్యాం పరమపావనీమ్‌ | భరతస్తాం సముత్తీర్య సుదామాం చైవ నిమ్నగామ్‌ || 65

ఆససాద మహాతేజా ః కైకేయాన్‌ యదునస్దన| బలేన చతురంగేణ యుధాజిత్‌ కైక యాధివః || 66

నిర్య¸° భరతం ప్రాప్తం శ్రుత్వా భరతమాతులః | నాగరాశ్చ తథాముఖ్యా రాజగృహనివాసినః || 67

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా యేచ వర్ణవరా జనాః | యానైరుచ్చావచై స్సర్వే నగరాత్తు వినిర్గతాః || 68

వాదిత్రాన్‌ పురతః కృత్వా గణిశాక్చ వినితాః| ప్రతి గ్రహ నిమిత్తం తు రాఘవస్య మహాత్మనః || 69

భరతుడు విపాశానదిందాటినంత నతని కటకమును మణిదేశరాజు మహోదయుడు చేరెను. త్రిగర్త దేశాధిపతి వసుధనుడు కులూతాధిపతి జయుడుదాశేరక దేశాధిపతి గోవాశనుడను రాజును నతని కటకమందు బ్రవేశించిరి.

అప్పుడు భరతుడిరావతి నదిని దరిసెను. ఆనది చాలవేగము గలది అందుస్నానము చేసినవాడు దశగోదానఫలమందును. అరువదివేల తీర్థముల నా నది వహించెను. అష్టమినాడు రేవతి నక్షత్రము కలసివచ్చిననటనది చాలా విశేషము. అచట పెక్కు విధములగు దానములు సేసి రఘుకులోద్వహుడానదిందాటి పాపనాశిని యైన దేవికానదికేగెను. ఆ పుణ్యనది దర్శనమాత్రముననే సర్వ పాపముల హరింపగలది. ఆమె యనేక శరీరములు గల హరుని ప్రియురాలగు ఉమాదేవియొక్క యొకానొక మూర్తియే. దేవికానది భరతుడటను స్నానము చేసి దానములిచ్చి శంకరునర్పించెను. అచ్చట భరతుడున్నప్పుడు పార్వతేయులు(కొండరాజులు) అనేక పదాతి దళములవారు ఐదుగురు 1 కుమారుడు 2 శ్రేణిమంతుడు 3 శూరుడు 4 బలబంధువు 5 సుయోధనుడుననువారు భరతుని కటకముం బ్రవేశించిరి. ముద్రదేశాదిపతి అంశుమంతుడను నతడు మహాబలశాలి భరతునికి మిత్రుడయ్యెను. ముద్రరాజగు శాకలునిచే బూజితుడై భరతుడక్కడ మూడు రాత్రులు వసించి చంద్రభాగానదికేగెను. ఆనది చంద్రకిరణ శీతలజలం, సర్వపాపహారిణి, ఓహు తీర్థములతోగూడినది స్నానమాత్రమున సర్వప్రద. మాఘపుస్యత్రయోదశినాడు ఇట చాల విశేషము పుష్య= పుష్యమీ నక్షత్రముతోగల త్రయోదశి) దానినిదాటి ఆమీద భరతుడు సుదామానదినిజేరి కైకయదేశముల కేగెను. చతురంగ బలముతో యధాజిత్తు భరతుని మేనమామ భరతుడువచ్చి నాదనివిని యెదురేగెను. రాజగృహనివాసులు బ్రహ్మనద వర్ణనమువారు నాగరులు వాద్యములతో గణికలతో రఘువంశవర్ధమని ప్రతిగ్రహనిమిత్తము (స్వాగతమిచ్చి స్వీకరించుటకు) మహాయానములతో బయలుదేరిరి.

భరతో7పి మహాతేజాః స సమేత్య యథాజితా | అభ్యధావత తత్ర్సీత్యా మాతులం కేకయాదిపమ్‌ || 70

కంఠే గృహీత్వా భరతం మూర్ఖ్న్య పాఘ్రాయ చాసకృత్‌ | భరతో7 పి సమాచాయ రాజగేహ ముపాగమత్‌ || 71

సమే మనోరమే దేశే ప్రభూతయవ సేంధనే | శిబిరం భరత శ్చక్రే నగరస్యా7విదూరతః || 72

పృథక్‌ పృథక్‌ తథా చక్రుః స్కధావార నివేశనమ్‌ | మనః ప్రియేషు దేశేషు నానా దేశ్యా సరాధిపాః || 73

కృత్వా నివేశాన్‌ మనుజేశ్వరాణా మాదిశ్వ భోగాన్‌ సకలాన్‌ స తేషాః |

వివేశ నాగేన స మాతుల్యస్య పురం ప్రహృష్టో రఘువంశ చంద్రః || 74

ఇతి శ్రీవిష్ణధర్మోత్తరే ప్రథముఖండే మార్కండేయ వజ్రసంవాదే

రాజగృహ గమనం నామ సప్తోత్తర ద్విశత తమో7ధ్యాయః.

భరతుడును మేనమామయను యధాజిత్తు రాజుదరికేగెను. అతడు భరతుని కౌగిలించుకొని. శిరముమూర్కొనిరాజ గృహము చేర్చెను. నగరసమీపమున ప్రదేశమున సమృద్ధియైన గడ్డిపంట చెరుకుగల చోట భరతుడు శిబిరమును చేయించెను. స్కంధవారనివేశనము వేర్వేర భరతానుయాయులగు నానాదేశాధిపతులు మనః ప్రియముగ వేరువేరు శిబిరములు నేర్పరచుకొనిరి. భారతస్వామి మనుజేవ్వరులకు నివేశనము లేర్పరచి వారికి సకల భోగములుం జరుగనాజ్ఞయచ్చి హర్షభరితుడైన భరితుడు రఘవంశ చంద్రుడు మేనమామగారి గృహముల బ్రవేశించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున భరతుని రాజగృహమనమను రెందువందలయేడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters