Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల తొమ్మిదవ అధ్యాయము - యుద్ధప్రసంగము మార్కండేయః : తస్మిన్ రాత్ర్యవసానే తు భూమిపానాం పృథక్ పృథక్|
కటకేష్వభ్యహన్యస్త సంజ్ఞాతూర్యాణి యాదవ ! ||
1 బహూనాం బలముఖ్యానం నానాలింగాని భాగశః ! తేషాం కోలాహలం శబ్దో బభూవ గగనంగమః ||
2 వివిశు ర్భరతస్యాపి తతః ప్రాభోధికా జనాః | వైణికా గాయనా ముఖ్యా వంశ వాద్యవిదశ్చయే ||
3 మార్దంగికాః పాణవికా ః శంఖ వాదనకాశ్చయే | రక్తకంఠా సుమధురా యేచ మంగళపాఠశాః ||
4 సుతమాగధ మాఖ్యాశ్చ వందినశ్చ నరాధిప | తుష్టువుర్భరతం వీరం సుఖసుప్తం మహామతిమ్ ||
5 సుప్రభాతం సముత్తిష్ఠః ప్రభాతా రజనీ శుభా | దిక్ ప్రాచీ రఘుశార్దూల ! వర్తతే7రుణరం జితా|| 6 నూనమస్యాం హి వేళాయం మతలిః త్రిదశాధిపమ్ | విబోధమతి రాజేంద్ర ! సుఖాయ జగతాం విభుమ్ ||
7 త్వయి సుప్తే జగత్ సుప్తం విబుద్దేచ సుఖాన్వితమ్ | తస్మాదు త్తిష్ట ః లోకానాం శివాయ రఘునందన ః ||
8 త్వం హి సర్వగుణారామో యథారామో మహీవతి ః | గుణౖ ః శశాంకరశ్య్మాభైస్త్వయా వైరంజితం జగత్ ||
9 అత్యాశ్చర్యం మహాబాహో ః యశసా సుసితేన తే | ముఖాన్యరాతిబృందానాం క్రియన్తే మలినాని యత్ ||
10 కృపాణధారా పానీయం దృష్ట్యా7రాతి గణస్తవ | తృష్ణయైవ భవత్యాశు రంజితానిలయో భయాత్ ||
11 అక్షోభ్యశ్యాతిగంభీరో భవన్ రత్నాకరస్తథా | ఆగ్రాహ్యత్వాత్సముద్రేణ స సమః ప్రతిభాతి నః ||
12 సౌమ్యః కలావాన్ లక్ష్మీవాన్ నయనానందకారః | దోషాకరేణక్షయిణా నౌపమ్యం తే నరాధిపః
13 బహుభోజ్యా7తివి స్తీర్ణా సర్వాశ్రాయవతీ దృఢా | నౌపమ్యంయాతి తే సమ్మక్ క్షోణీ విన్ధ్యేన కంపినా || 14 యత్తే7సి తదవశ్యం త్వం దదాసి రిపుసూదన | అవిద్యమానాభీర్దత్తా భవతారిగణ కుతః ||15 నిమేషయపి యే దృష్టః త్వయాపాంగ నిరీక్షణౖః | సమగ్ర దృష్ట్యాయం దృష్టో నిత్యమేవేక్షణౖః శ్రియః || 16 క్షురవర్యన్తధారేణ చక్రేణారిగణస్య తే | శిరాం స్యపహరత్యాజౌ దేవదేవో జనార్ధన ః || 17 కపాలమాలీ ఖట్వాంగి శశాంకకృత భూషణ ః | వామార్ధదయితాకారః శంకరః శం కరోతు తే || 18 పద్మాసనః పద్మజన్మా సర్వలోకపితామహః | బుద్దిం మేధాం ధృతిం లక్ష్మీం బలంచ విదధాతు తే || 19 నభశ్చరో7బుజో దేవో దిగ్వధూకర పూరకః | బ్రహ్మాండమండపే దీపం సుప్రభాతం కరోతు తే || 20 కేశయక్షేశ దేవేశ ప్రేతేశ్వర నిశాచరాః | సర్వదేవ గుణౖస్సార్థం సుప్రభాతం దిశస్తుతే || 21 ఋషయ స్సరితశ్శైలాః సాగరశ్చ దిశో దశ | కాలప్యావయవాశ్చైవ సుప్రభాతం దిశన్తుతే || 22 ఇతి శృణ్వన్ గిరం పుణ్యా మేషాం మంగళవాదినామ్ | మహాపుణ్యా హఘోషేణ తత్యాజ శయనం తదా || 23 అయవ్వయం స శుశ్రావ లేఖకైర్గణకైస్సహ | వేగోత్సర్గం తతః కృత్సా య¸° స్నానగృహం శుభమ్ || 24 స్నానారంభం తతశ్చక్రే దంతధావన పూర్వకమ్ | ఉత్సాదితః కషాయేణ బలవద్భిర్నరై స్తదా || 25 సుఖం భద్రాసనాసీనః సూక్ష్మాంబరధర ః ప్రభు ః సస్నౌ సవివిధై స్తోయైర్నదీ సాగరజైః శుభైః || 26 కుంభై ః సువర్ణ మాహైయై స్తామ్రైరౌప్యమయైస్తథా | శతాధికై ర్మహారాజ ః సర్వౌషధి సమన్వితైః || 27 క్షీర ప్రవాహ సంయుక్తై ర్మాల్యంకఠైస్సు పూజితై ః | ఆవర్ణితై ర్మహీపాల ః సుస్నా తా 7లంకృతై ర్నరై ః || 28 చందన స్రావ సంపూర్ణైక ద్విజమంత్రాను మంత్రితై ః | బభార వసనం చారు స్నాన తో¸°ఘ సంకులమ్ || 29 శశాంక మండల పూర్థం తన్వభ్రైరివ సంవృతమ్ | వాద్యపుణ్యాహ ఘోషేణ తథా గీతస్వనేనచ || 30 స్నాత్వోపస్పృశ్య విధివత్ పూర్వాం సంధ్యాం సమాహితః | దదర్శ వదనం చారు దర్పణచాథ సర్పిషి || 31 స సువర్ణే మహారాజా ః దైవజ్ఞేనా 7భి మంత్రితే | దినేశం తిథి నక్షత్రం తతశ్శుశ్రావ రాఘవః || 32 సాంవత్సరముఖోద్గీర్ణం కలిదుస్స్వప్న నాశనమ్ | చకారాభ్యర్చనం చాథ దేవదేవస్య చక్రిణః || 33 గంధమాల్య నమస్కారధూపదీపాన్న సంపదా | స్తవైర్భలి ప్రదానైశ్చ గీతవాద్య స్వనేన చ || 34 సంపూజ్య దేవదేవేశం వివేశా7గ్నిగృహం శుభమ్| తత్రాగ్నిం సముపస్థాయ హుతం పూర్వం పురోధసా || 35 దుస్స్వప్న నాశనం కర్మసిద్దివృదిజయప్రదమ్ | ప్రాగేవ తస్య కృతవాన్ విద్యాన్ నృప పురోహిత ః || 36 తతస్త్వౌపసదే వహ్నౌ భరతః ప్రీతమానసః | శ్రీ సూక్తం పౌరుషం సూక్తం జుహావ ప్రయత స్తదా || 37 ఆజ్యేన మంత్రపూతేన విధినా సుసమాహితః | దత్వా పూర్ణాహుతిం ః చాగ్నౌ కృతజప్యో మహామతిః || 38 ఉదకే నార్చనం చక్రే దేవానం పితృభి స్పహ | తతస్స నిర్య¸° తస్మాద్భరతోవహ్నివేశ్మనః || 39 మార్కండేయుడనియె. అరేయిచివర రాజుల వేర్వేరు కటకములందు సంజ్ఞాతూర్యములు (ఒకానొక విషయము గుర్తు సేయుటకు వాయింపబడు వాద్యములు) పెక్కుమంది సేనాధిపతులకు పెక్కు విధములయిన లక్షణములుగలవి వేర్వేర మ్రోగింపబడెను. వాని కోలాహలరవ మాకసమునంటెను. అవ్వల భరతుని మేల్కొలుపు ప్రాబోదికులుగూడ యాయనశిబిరమును బ్రవేశించిరి. వారు వైణికులు గాయకులు వేణువాదన నివుణులు మార్ధంగికులు పణవములు వాయించువారు శంఖములు పట్టువారు బెక్కు మంది యుండిరి. చక్కని కంఠస్వరమగలిగి వారు సుమధురముగా బాడువారునైన మంగళ పాఠకులు నూతపందిమాగధ శ్రేష్టులు సుఖసుప్తుడైన వీరుని మతిమంతుని భరతుని స్తుతించిరి. ఓ రఘుశార్దూలా! నీకుసు ప్రభాతము మేల్కొనుము. సుశోభన రాత్రియిదే తెలవారినది. తూర్పదిశ అరుణ (రాగ) రంజితమైనది. రాజేంద్రా! ఇదేవేళ యందు మాతలి ఇంద్రు మేల్కొలుపుచుండును. నీవునిదురింప జగము నిదురించును. మేల్కొన మేల్కొనును (సుఖమునందునన్న మాట) అందువలన రఘునందనా ! లోకములకు శివము (మంగళము) కలుగ మెళకువగొనుము.నీవు భూపతియగు రాముడట్లు సర్వగుణారాముడవు. శశాంకకిరణము లచ్చమైన చల్లనైన నీటిగుణములచే జగము రంజితమైనది అత్యద్భుతము మహావీర ! మిక్కిలి యచ్చమైన నియశస్సుచే నరాతి (శత్రు)బృందముల ముఖములు మలినములు. (నల్లనివి) గావింపబడచున్నవి. (తెలుపుచే నలుపగుట యిక్కడ యద్భుతమన్న మాట) నీశత్రుగణము నీకృపాణ (ఖడ్గ) ధారా (అంచు)రూపమైన పానీయముంజూచి దప్పింబోలె భయమువలన వేవేగ రజితానిలయమగు చున్నది. కలగింపరానివాడు అతిగంభీరుడు (మిగులలోతైన మనస్సు గలవాడు అగాధమైనదియని రెండవయర్థము)నై రత్నాకరుడు గుణరత్న నిధివైన (రత్నాలగనియైనవాడని సముద్రపరమైన రెండవ యర్థము (శ్లేష) నీవు ఆగ్రహ్యుడ వగుట వలన (మారు గ్రహింపరానివాడుగుట వలన) గ్రామములకు (మొసళ్ళకు) వాసయోగ్యము కానందున నీవు సముద్రునకు సరివాడవుగా మాకు భాసించుట లేదు. నీవు సౌమ్యుడవు (శాంతుడవు) కలావాన్ - కళలు విద్యలు కలవాడు లక్ష్మీవాన్=ఐశ్వర్యసంపన్నడవు సయనముల కానందముగూర్చు వాడవును నై నందున నీకు దోషాకరునితో దోషమునకుగని ( దోషా= రాత్రిని కరుడు= చేయువాడు చంద్రుడన్న మాట (నిశాకరుడు) క్షయి=క్షయముగలవాడు (కృష్ణపక్షమందు తగ్గుచుండువాడు) నైనవానితో జంద్రునితో నీకుపోలికలేదు. అతడును సౌమ్ముడు=బుధునికుమారుడు కళావాన్ =పదునారుకళలుగలవాడు లక్ష్మీవాన్=చంద్రేలక్ష్మీః అనుటంబట్టి లక్ష్మి గలవాడు (చెల్లెలుగా లక్ష్మిగలవాడని యుంజెప్పవచ్చును) అయినను నతనికి దోషాకరత్వము క్షయస్వభావము నున్నందున నీకతని పోలిక చెప్పరాదని యిటు శ్లేషమూలకమైన వ్యతిరేకాలంకారము బాహుభోజ్మా=బాహులచే డాహుపరాక్రమముచే రాజులకు ఆనుభవింపదగినది. అతివిస్తీర్ణా=మిగులవిశాలమైనది సర్వాశ్రయవతీ=సర్వులకు ఆశ్రయముకలది ( అందరికి నిలువనీడయైనదన్న మాట) దృఢా=దృఢమైనదియునైన క్షోణి=భూమి వింధ్యేన=వింధ్యపర్వతముచే, కంపితా=కంపింపబడునదై నీకులెస్సగ (చక్కని) పోలికను పొందకున్నది. నీవు బహుభోజ్యుడవు పెక్కుమంది కనుభవింపదగినవాడవు అతివి సీర్ణుడవు కీర్తచే ప్రతాపాది గుణములచే మిక్కిలి విస్తరించినవాడవు సర్వాశ్రయవంతుడవును. అయి ఏశత్రువుచేతను కంపింపబడనివాడవై యున్నందున నీకు భూమితో సామ్యముకుదురుటలేదని యిదియు శ్లేషానుప్రాణిత వ్యతిరేకాలంకారమే. ఓ శత్రుసూదన ! భరతా ! నీకెదిగలదదియవ శ్యమిత్తువు. అట్టివాడవు నీవు నీకులేనిచేతిని శత్రుకూటమున కిత్తువిదిచయెట్లు? ఎందుచేత? ఒకనిమిషమేని నీ యపాంగవీక్షములచేత (కటాక్షములచేత) చూడబడినయాతడు నిత్యము లక్ష్మీయొక్క చూపుల సమగ్రదృష్టిచే చూడబడును. లక్ష్మీ పరిపూర్ణ కటాక్షములకు బాత్రుడగు నన్నమాట. నీ సగముచూపు లక్ష్మీ నిండచూపునకు సరిపోవుననుటలో నీవు లక్ష్మికంటె గొప్పవాడవను భావమున నిక్కడను వ్యతిరేకాలంకారమే. నీ యొక్క క్షురపర్యంతధారమైన = పదునైన అంచుగల చక్రముచే యుద్దమందు నీ శత్రుకూటము యొక్క తలలను జనార్థనుడు ఖండించును. పునుకలమాలందాల్చి మంచపుకోడాయుధముగాదాల్చి ఖశాంకములనగా సర్పములు అవి భూషణములుగా దాల్చి సగముమేన బ్రియురాలిం దాల్చి యుండు శంకరుడు నీకు శంకరుడుగుగాక. శం =సుఖమును కరుడు=చేయువాడు అగుగాక,పద్మమాసనముగా గలవాడు పద్మమునం బుట్టినవాడు సర్వలోక పితామహుడు నీకు సర్వసమృద్ధినిమేధను ధైర్యమును బలమును నీకు జేకూర్చుగాక ! అకాశ సంచారి దిశాంగల హస్తముల నింపువాడు బ్రహ్మాండమండపమందు దీపమైనవాడు (సూర్యుడు) నీకు సుప్రభాతమొనరించుగాక ! కేశ (క = ఉదకములకు ఈశ=ప్రభువైన) వరుణడు యక్షేకుడు=కుబేరుడు దేవేశ =ఇంద్రుడు ప్రేతేశ్వర=యముడు నిశాచర=రాక్షసుడు (నిరృతి, సర్వదేవగణములతోనీకు సుప్రభాతమును గూర్తురుగాక! ఋషులు నదులు పర్వతములు సాగరములు దిక్కులు కాలావయవములు తృటినివేషము మొదలు యుగములు కల్పములదాకగల కాలావయవముల కధిష్టానదేవతలు నీకు సుప్రభాతమొనరింతురుగాకా! ఈ విధమైన మంగళపాఠకుల మంగళవాక్యము లాలించుచు మహాపుణ్యహఘోషముచే సయ్యెడ భరతుడు తల్పమునుండి లేచెను. లేవగానే లేఖకులు (గుమాస్తాలు) గణకులు వినిపించు నాదాయ వ్యయమునువినెను. వేగోత్సర్గముంగావించికొని స్నానగృహమునకేగెను. దంతధావనముగావించి మంచిబలశాలులైన నరులచే వేనికి కషాయముపూయబడి వర్దనముసేయబడి స్నానారంభముసేసెను. సుఖముగ భ్రదాసనమందుగూర్చుండి వీరాక్షవస్త్రముగట్టుకొని వివిధ పుణ్యనదుల సాగరముల జలములచే స్నానము చేసెను. సర్వౌషదులదో గూడిన బంగారు రాగి వెండిబిందెలతో శతాధికములు పాలప్రవాహములతోగూడినవి పూజలమాలలచే నలంకృతములు చక్కగ పూజింపబడినవి నిండ చందనోదకములు గలిపినవి మంత్రపూరితములైనవియుచక్కగతాము స్నానము చేసి అలంకరించుకొన్న నరులచేఅపర్జితములు=పోయబడిన ఉదకములచే భరతుడు స్నానముచేసెను. స్నానోదకముతో సంకులమైనది (తడిసినది) చిన్న చిన్న మబ్బులతో గూడిన పూర్ణచంద్రమండలం మట్లున్న చక్కని జిలుగు వలువను ధరించెను. మంగళవాద్య పుణ్యఘోషముతో పాటల మధురధ్వనితో స్నానముచేసి యథావిధిగా నుపస్పర్శనము సేసి (నీటితో చక్షురారాదీంద్రియములను స్పృశించి) కుదురుకొని పూర్వసంధ్యవార్చి (ప్రాతః సంధ్యావందనము సేసి) అటుపై మంగళాచార మగుటచేనద్దమందు నవ్వల నేతియందు జోతిషికునిచే నభిమంత్రితమైన బంగారమందు దన చక్కని ముఖమును జచికొనెను. అటుపై సాంవత్సరుని (జ్యోతిషికుని) ముఖమున బలుకబడినది కలి దోషమును దుస్స్వప్నములను నశింపజేయు దినేశుని (సూర్యుని సూర్యసంచారరాశి మొదలయినవానిని తిథిని నక్షత్రమునువినెను. అనాటి పంచాగస్థితిని శ్రవణము సేసెనన్నమాట. అటుపై దేవదేవుడగు విష్ణువునర్చించెను. గంధమాల్యనమస్కార ధూపదీప మృష్టాన్న సంపదచేదేవతార్చనముసేసి అన్ని కాక బలి యిత్యాది వైశ్వదేవవిషయములైన బలులువేసి గీతవాద్య మంగళధ్వనితో హరినిబూజింజి యగ్ని శాలంబ్రవేశించెను. అంతమున్ను పురోహితుడు హోమముసేసిన యగ్నికుపస్థానముసెప్పెను. ఆ ప్రక్రియ దుఃస్వప్న నాశనము సిద్ధి వృద్ధి జయ ప్రదమునుంగూడ. అంతకు ముందే విద్యాంసుడగు రాజపురోహితు డాయగ్నికార్యమును జేసియుండెను. అటుపై నౌపాస నాగ్నియందు సంప్రీతమనస్కుడై మంత్రపూరితమైన అజ్యముతో భరతుడు శ్రీసూక్త పురుషసూక్త సంపుటిగా యథావిధి హోమముగావించెను. అగ్నియందు పూర్ణా హుతింగూడ నొసంగి జపము సేసి అటుపై దేవతలకు పితరులకును నుదకముతో తర్పణము సేసెను. అవ్వల నాతడాయగ్ని గృహమును వెడలెను. నిష్ర్కమ్య పూజయామాస బ్రాహ్మణాన్ వసునా తదా ః గోభిరశ్వైః సువర్ణేన దధిపుష్పఫలాన్వితే ః || 40 మొదకైశ్చ తథా రత్నై ర్వసై#్తశ్చ రఘనందునః | పూజితానాం ద్విజేంద్రాణాం భరతేన మహాత్మనా || 41 పుణ్యాహ ఘోష స్త్రీదివం జగామ మధురస్వరః స పూజయిత్యా విప్రేంద్రాన్ ప్రవిశ్య చ తథా గృహమ్ || 42 నిత్యకర్మ చ కృత్వేదం చందనేన సుగంధినా | సూక్ష్మ శుక్ల పరీధానో వరధూ పేన ధూపిత ః || 43 అభూష్య సర్వగా త్రాణాం భూషణాని రఘూద్వహః | శుక్లం సుగంధి మాల్యం చ స్రజశ్చ వివిధ స్తథా || 44 మంగళాలంభనం కృత్వా నిశ్చక్రామ సభాగృహమ్ | అటువెడలి వెలికివచ్చి ధనముతో గోవులతో గుఱ్ఱములతో బంగారముతో పెరుగు పూవులుపండ్లతో మోదకములతో (లడ్డులు)రత్నములతో వస్త్రములతో బ్రాహ్మణులను బూజించెను. భరత పూజితులైన బ్రాహ్మణుల పుణ్యాహ ఘోషము మధురస్వర పూరితమై త్రిదివమును స్వర్గమునంటెను. అతడట్లు విప్రవరుల పూజించి లోగిటం బ్రవేశించి నిత్యకర్మ మొనరించి చక్కని పరిమళము నించు చందనముచే పూయబడి తెల్లని జిలుగువసనముదాల్చి ఘమఘమలాడు ధూపముచే ధూపితుడై అన్ని యవయవములను భూషణములం జక్కగ నిండుగ నలంకరించుకొని పరవశించు తెల్లని పూలమాలికను మరియు బెక్కు విధములయినపూలమాలలను గైసేసి మంగళాలభనము సేసి సభామందిరమునకు బయలుదేరెను. క్లుప్తం శయ్యాసనం తత్ర వరరత్న విభూసితమ్ | 45 మహార్ఘతోరణోపేత సోత్తర చ్ఛద మృద్దిమత్ | వితానం చ తథా దత్తం తస్యోపరి మహర్దిమత్ || 46 ఆసీన మాసనే తస్మిన్ భరతం సత్యం సంగరమ్ | ప్రాంశవో బద్ధనిస్త్రింశాః కవచోత్తమ భూషితాః || 47 రక్తాంబరధరాః వీరా రరక్షుః పృష్ఠ సంస్థతాః | తథై వోభయపార్శ్వస్థాః పూర్ణ చంద్రనిభాననాః || 48 వారముఖ్యాః సువేశా స్త ముపాసాంచక్రిరే తదా | వాలవ్యజనధారిణ్య స్తాలవృంతకరాః పరాః || 49 తాంబూలభాండధారిణ్యో నీలనీరజలోచనాః | కుండలీ బద్దనిస్త్రింశో దండపాణిః సువేశవాన్ || 50 ఉవాచ భరతః క్షత్తాభూమివిన్యస్త జానుకః దిదృక్షవస్తే సంప్రాప్తా బ్రాహ్మణాః సంశయచ్చిదః || 51 శ్రేణిమహత్తరా యేచ బలముఖ్యా స్తథైవచ | ప్రవేశ యైనా నిత్యుక్తో ద్వాఃస్థాన్ క్షత్తాతతో7 బ్రలీత్ || 52 బ్రాహ్మణాన్ బలముఖ్యాంశ్చ ప్రవేశయత సత్వరమ్ | అశీర్భి రభి నంద్యైనం సంప్రవిష్ఠా ద్విజోత్తమాః || 53 బృసీషు దంతపిఠేషు వివిశు శ్చ యథాసుఖమ్ | తతస్తు బలముఖ్యానాం సమతాం భరతం తదా || 54 క్షత్తా జగ్రాహ నామాని కంఠా రక్తస్వరాన్వితః | అక్కడ శయ్యాసనము చక్కగనమరుపబడినది. అది దివ్యరత్న భూషితము అమూల్యతోరణోపేతము. సర్వసమృద్ధి మంతము. మీద చక్కని పరిచ్ఛదము (తివాసీవంటిది) పరువబడినది. దానిపై వెలలేని చాందినీకట్టబడియుండెను. అట్టి శుభాసన మందుగూర్చున్న సత్యసంగరు నా భరతుని మిగుల యెత్తైనవారు ఒరలో కత్తులుకట్టుకొన్నవారు ఉత్తమ కవచభూషితులు రక్తాంబర ధారులు వీరులు వెనుకనిలబడి రక్షయిచ్చిరి. వారే అంగరక్షకులనబడుదురు అట్లే స్వామియిరువైపుల నిలువబడి పూర్ణచంద్ర బింబాననలు సువేషులు వారాంగనామణులు భరతప్రభువును వాలవ్యజనములు (చామరములు) తాటియాకు విసనకఱ్ఱలుంలూని వీచుచు సేవించిరి. తాంబూల భాండములు (కరండములు) పూని నీలనీరజనేత్రలట నిలిచి కొలిచిరి. అయ్యెడ కుండలములు దాల్చి నాడు ఒఱలో ఖడ్గముం గట్టుకొన్నాడు చేత దండమూనినాడు చక్కనివేషము వేసికొన్నాడు నైక్షత్త=ద్వారపాలుడు మోకాళ్ళు భూమినానించి (వినతుడై) బ్రాహ్మణులు సర్వసంశయములం దీర్చువారు తమ దర్శనముగోరి దయసేసినారు. అట్లే శ్రేణీ మహత్తరులు =రణరంగమందు ముందువరుసలో నుండువారు సేనాధిపతులును వచ్చియున్నారని ప్రభువునకు విన్నవించెను. అజ్ఞ గొని క్షత్తద్వారపాలురతో బ్రాహ్మణులు సేనానులను త్వరగ బ్రవేశ##పెట్టుమనెను. వారట్లుసేసిరి. ప్రవేశింపజేయబడిన ఆ ద్విజోత్తము లీతనిని ఆశీర్వచనములచే లోనం బ్రవేశింపబడిరి. వారు దంతమయముల బృసీషు =సుఖముగ గూర్చుండిరి. అటుపై ప్రభువునకు మ్రొక్కుచున్న యా సేనాధిపతుల పేర్లను మధురకంఠస్వరముతో (కంఠారక్తస్వరసహితుడై) వేర్వేరబేర్కొనెను. తతస్తే మాపవిష్టేషు ద్వారేషు వివృతేషు చ || 55 ప్రవి వేశ జన స్సర్వో న న్యవార్యేత కశ్చన | ఏతస్మిన్నేవ కాలేతు శుశ్రువే తుములో ధ్వనిః || 56 భరతం ద్రష్టుకామానాం భూమిపానాం మహాత్మనామ్ | హ్రాదేన గజఘంటానాం బృంహితేన తథైవ చ || 57 హ్రేషితేన తురంగాణాం రథనేమిస్వనేన చ | నామభిః కీర్త్యమానైశ్చ వందిభిః పృథివీక్షితామ్ || 58 శంఖవాదిత్రఘోషేణ పటహానాం స్వనేన చ | అజగ్ముర్భరతం ద్రష్టుం నరేంద్రాః ప్రియ దర్శనాః || 59 వారు కూర్చున్నతర్వాత సభామండపద్వారములు తెరచినంతట సర్వజనమందు నిరభ్యంతరముగ బ్రవేశించెను. ఇదే సమయమందు తుముల ధ్వని విననయ్యెను. భరతుని దర్శింపగోరిన మహానుభావుల మెడగంటల సడితో నాగజముల బృంహితము లతో (ఘీంకారములతో జాతిగుఱ్ఱముల సకిలింపులతో రథముల పట్టాల చప్పుడుతో వందిజనము పేర్కొను నాయా సామంత భూపతుల పేర్లతో శంఖవాద్రిఘోషముతో పటహముల సవ్వడితో నా సభాప్రాంతమున బెను సందడియయ్యెను. నరేంద్రులు బ్రయదర్శనులు భరతదర్శనార్థమేతెంచిరి. తోరణా దవతీర్వైవ వాహనేభ్యో మహీక్షితః | సర్వే స్వల్ప పరీవారాః వివిశుస్తే సభాం శుభామ్ || 60 శిరఃకంపేన భరతం సమస్కృతం నివేదితాః | ప్రతీహారేణ దక్షేణ తేన చక్రుర్వరాసనమ్ || 61 సింహాసనస్థాన్ నృపతీన్ భరతస్త్వను రూపయన్ | గిరా పప్రచ్ఛ కుశలం పూజయామాస చాప్యథ || 62 తుష్టువు ర్వందిన స్తత్ర నానాదేశ్యా న్న రాధిపాన్ | నివేదయన్తః స్తుత్యన్తే భరతాయ మహాత్మనే || 63 స్తువతాం భరతం తత్ర వందినాం సమహాస్వనః | ప్రాసాదభోగ సంరుద్ధో విపుల స్సమపద్యత || 64 క్ష్మాపాలమౌళిమాణిక్యమరీచివికటోజ్జ్వలమ్ | బాలాతపాంశుచ్ఛురితం బభూవచ సభాగృహమ్ || 65 రాజులు రాజద్వారతోరణముదగ్గరనే వాహనములు దిగి కొలది పరివారము వెంటగొని యందరు నా సుశోభనమైన సభం బ్రవేశించిరి. భరతునికి మ్రొక్కి దక్షుడైన (సమర్థుడైన) ప్రతిహారునిచే భరతునికి నివేదితులై (పరిచయముచేయబడినవారై) యాతనికి నమస్కరించి, యాతని శిరఃకంపనముచే (వారి రాకను నమస్కారములను స్వీకరించిన సూచనగా ప్రభువు తలంచెనన్నమాట) నట నుత్తమాసనముల నలంకరించిరి. సంహాసనములధిష్ఠించిన నృపాలురను భరతుడు అనురూపించుచు (తాను వారిని గుర్తించినట్లు వారికి దానసుకూలుడైనట్లు సూచించుచు) వారికి కుశలమడిగెను. అటుపై వారిం బూజించెనుగూడ. అక్కడ పందిమాగధులు భరతుని గొనియాడి స్తుతియైనతర్వాత నానాదేశీయులగు నా నరాధిపతులను మహాత్ముడగు భరతునికి వారివారిని నివేదించిరి. అట భరతుని స్తుతించు నా స్తోత్రపాఠకుల కంఠధ్వని యా సభాప్రసాదముయొక్క భోగములచే (పాము పడగలం బోలు నట్టాలకములచే నిరోధింపబడి మిగుల హెచ్చయ్యెను. క్ష్మాపాలుర కిరీట మాణిక్య కాంతిపుంజముచే మిరుమిట్లుగొను లేత యెండయొడచే నా సభామందిరమలముకొనెను. తత స్స భరతః శ్రీమాన్ విససర్జ నరాధిపాన్ | స్వహస్తద త్తతాంబూలాన్ ప్రతీహార నివేదితాన్ || 66 తతస్సవ్థుుతాయ య¸° ద్వితీయ గృహ ముత్తమమ్ | తత్ర చక్రే తదా మన్త్రం మాతులేన యుధాజితా || 67 పురోధసాచ గార్గ్యేణ స్వేన కాలవిదా తథా | యుధాజిదువాచ - కాలేత్వమీప్సితే ప్రాప్తో గంధర్వాణాం వధేచ్చయా || 68 తత్ర యావ న్న జానన్తి గంధర్వాస్తే త్వదాగమమ్ | అవస్కందేన తానద్య తావ ద్రాత్రౌ జహి ప్రభో! 69 అనస్కందేన నిధనం సుఖం తేషాం భవిష్యతి | కాలవిత్ : సుప్తేప్రమత్తే విశ్వస్తే తథా రాజన్! శ్రమాన్వితే : అవతీర్ణే బలే చైవ సరితం వహతీం తథా | రాత్రౌ జాగరణ శ్రాన్తే ఛద్మయుద్ధం విధీయతే || 71 రాత్రౌ విహార శీలాస్తే గంధర్వాః సతతం ప్రభో! నతే೭ వస్కంద మర్హన్తి రాత్రై కేకయ నన్దన || 72 విజయశ్చ దివా యుద్ధే భరతస్య ప్రదృశ్యతే | ఆవ్వల శ్రీమంతుడు భరతుడు ప్రతీహారుడు వేర్వేర నివేదించినవారిని (పరిచయముసేసినవారిని) తన చేతితో తాంబూలము లొసంగి పంపెను. అటుపైలేచి చక్కని రెండవగృహముం బ్రవేశించెను. అక్కడ మేనమామ యుధాజిత్తుతో కాలజ్ఞుడు (జ్యౌతిషికుడు) అయిన పురోహితుడు గార్గ్యునితో నేకాంతమున మంతనము సేసెను. (రహస్యాలోచన సేసెనన్నమాట) అప్పుడు యుధాజిత్తిట్లనియె ; నీవు గంధర్వ సంహార వాంఛతో ననుకొన్న సమయమునకు వచ్చితివి. ఆ గంధర్వులు నీరాకనెరుంగునంతలోన అవస్కందించి (హఠాదాక్రమణముసేసి) యిప్పుడు ఈరాత్రి ప్రభూ! వారిం గూల్పుము. అవస్కందముచే వారి సంహారము సుఖమగును. అది విని కాలజ్ఞుడు (జ్యౌతిషికుడు) నిద్రపోగా ప్రమత్తుడై యుండగా నమ్మియుండగా శ్రమతోనుండగా సేన ప్రవాహ మెత్తియున్న నదిలోనికి దిగినపుడు రాత్రి జాగరణముచే నలసియున్నప్పుడు ఛద్మయుద్ధము (మోసపుపోరు) చేయవలెనని విధింప బడియున్నది. ప్రభూ ! గంధర్వులు వాండ్రు రాత్రివిహారశీలురు. ఓకైకేయినందనా ! అట్టివారు రాత్రివేళ నవస్కందమునకు తగరు. అదిగాక యుద్ధమందు భరతునికి విజయము పగలే కనబడుచున్నదనియె. గార్గ్యః: ఆదౌ దూతేన కర్తవ్యం గంధర్వాణాం ప్రయోజనమ్ || 73 యథా దేశమిమం త్యక్త్వా వ్రజధ్వం తుహినాచలమ్ | గంధర్వాణాం నివాసస్తు హిమవ త్యచలోత్తమే || 74 పూర్వమేవ కృతస్తేన యేనేదం నిర్మితం జగత్ | స్థానమేత న్మనుష్యాణాం త్యక్తు మర్హథ! మాచిరమ్ || 75 తేచ దూతవచః శ్రుత్వా స్థానం దద్యుర్నరాధిప | అసంశయ ముపారుహ్య చైతన్మమ మతం భ##వేత్ || 76 భరతః : రాఘవా స్సత్యసంధాస్తు కూటయుద్దం న శిక్షితాః | తస్మా త్తేషాం వధః కార్యః సుయుద్ధేన మయా నృప! || గార్గ్యవాక్యం తథా బుద్ధ్యా రోచతే೭తిశ##యేన మే | ప్రయాతు తేషాం దౌత్యేన గార్గ్య ఏవ మహాయశాః || 78 యుధాజిత్ : గచ్చ గార్ధ్య మహాభాగ! గంధర్వాధిపతిం ప్రతి | తం చ శ్రావయ వాక్యాని త్వయోక్తానీహ యానిమే || అక్రియాయాం తథా తేషాం శ్రావయాగ్ర్యాణి మాచిరమ్ | అసై#్యవ నామ్నా ధర్మజ్ఞ! భరతస్య మహాత్మనః || 80 మార్కండేయః : ఏవ మస్త్విత్యథోక్తో೭సౌ య¸° గార్గ్యో మహాయశాః | రథేన కాంచనాంగేన గంధర్వ నగరం ప్రతి || అపుడు గార్గ్యుండు పురోహితుండిట్లనియె మొదట దూతముఖమున గంధర్వులకు మనరాక ప్రయోజనము కర్తవ్యము. నెరింగింపవలయును. ఈ దేశమును విడిచి హిమాచలమునకు వెళ్ళుడు. అక్కడ గంధర్వుల నివాసమున్నది. ఈ జగన్నిర్మాణము సేసిన బ్రహ్మచేతనే యది యేర్పరుపబడియున్నది. ఇది మనుష్యుల స్థానము. దీనిని మీరు శీఘ్రముగ వదలదగుదురు. వారాదూతమాట విని వారు సంశయముపడక మనకే చోటిచ్చెదరు. ఇది నా మతము (తలంపు) అన విని భరతుం డనియె : రాఘవులు (రఘువంశరాజులు) సత్యసంధులు. వారు కూటయుద్ధము శిక్షణ యీయబడినవారుగారు. కావున ఆ గంధర్వ సంహారమును నేను న్యాయయుద్ధముచేతనే చేయదగునది. గార్గ్య వచనము నాబుద్ధికెక్కువ రుచించుచున్నది. మహాయశస్వి వారికడకు దౌత్యముతో గార్గ్యుడే వెళ్ళుంగాక ! అన యుధాజిత్తనియె. మహానుభావ ! గంధర్వరాజు దరికి నీవేగుము. ఇపుడు నీవు చెప్పిన యీ మాటలే యతనికి వినిపింపుము. వారట్లాచరించనపుడు శీఘ్రముగ నీ మహాత్ముడు భరతుని మాటలుగ పై మాటలు వారికి వినిపింపుము. అని యిట్లు పలుకబడి గార్గ్యుండు మహాయశస్వి దౌత్యముని బంగారురథముపై గంధర్వనగరములగూర్చి చనెను. గతే పురోహితే గార్గ్యే భరతో೭పి మహాయశాః : హస్తివృష్ఠే రథే చాశ్వే శ##స్త్రే తథైవచ || 82 వ్యాయామం చ తథా చక్రే నియుద్ధేచ యదూత్తమ! ఉత్సారిత స్తథా పద్భ్యాం ధావద్భిః కుశ##లై ర్జనైః || 83 స్నాతై స్సంపూజితో విష్ణుం విధివత్ సాత్వతోత్తమైః | నమ స్కృత్య తథై వాగ్నిం హుతం సుష్ఠు పురోధసా || 84 తథా భుక్తవతాం శ్రుత్వా పూజితానాం ద్విజన్మనామ్ : పుణ్యాహఘోషం విత్తేన భూమిపాల! విసర్జ్య తాన్ || 85 పరార్ధ్య చంగనాక్తాంగ స్తనుచారుసింతాంబరః | సర్వాలంకరణోపేతః స్రగ్వీధూపేన ధూపితః || 86 ఆసీన స్త్వాసనే దివ్యే బుభుజే స్వజనై ర్వృతః | మాతులస్య మహార్ఘాణి శుచీని గుణవన్తిచ || 87 అపరీక్షితపూర్వాణి పురుషై రాప్తకారిభిః | నరపక్షి మృగాణాంతు లింగై ర్వహ్నౌ తథైవచ || 88 భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ పేయం చోష్యం తథై వచ | పాత్రేషు రుక్మరౌప్యేషు తథా మణిమయేషుచ || 89 భుక్త్వాన్నం గీత శ##బ్దేన చాపై#్తః కతిపయైస్సహ | తథో పస్పృశ్య ధర్మాత్మా దంతధావన పూర్వకమ్ || 90 చక్రస్య శయనం భేజే వామ పార్శ్వేన శ తుహా | ఇతిహాసం సశుశ్రావ తత్రస్థః పురుషోత్తమః || 91 తత స్స శయనం త్వక్త్వా శాస్త్రాభ్యాసం మహా యశాః | చకార రఘు శార్దూలః సతాం మార్గమను వ్రజన్ || 92 గార్గ్యుండు పురోహింతుడటుసన మహాయశస్వి భరతుడు గజపృష్ఠమున (గజారోహణము) అశ్వమునందు శస్త్రమందు యుద్ధశాస్త్రమునందు బాహుయుద్ధమందు వ్యాయమము సేయబూనెను. పాదములంబరువులెత్తు కుశలురైన జనములచే తరుమబడెను. విష్ణుభక్త శిరోమణులచే స్నానముచేసి విష్ణువు పూజింపబడెను. పురోహితుడగ్నిని నమస్కరించి చక్కగవేల్చెను. అట్లే భోజనములుసేసి పూజలందుకొనిన ధనమిచ్చి పంపబడిన ద్విజుల పుణ్యాహఘెషముమువిని అత్యుత్తమ చందనముపూసికొని చక్కని తెలిమడుపులందాల్చి యెల్లతోడవులుతొడి పూలమాలలు గైనేసి ధూపధూపితుడై దివ్యాసనమందు కూర్చుండి తనజనముతో భోజనముసేసెను. మేనమామగారిడిన వెలగలవి శుచియైనవి గుణముకలవి అప్తకారులచే నరులు పక్షు మృగములయొక్క చిహ్నము లతో నగ్నియందు ముందుపరీక్షింపబడనివియునైన భక్ష్య భోజ్య లేహ్య పేయ చోష్యములయిన యైదువిధములయిన యాహారము లను బంగారు వెండిపాత్రలందు మణిపాత్రములందును వడ్డింపబడినవానిని పాటలుపాడుచుండ వినుచు పరిమితులైన యాప్తులతో గూడ భరతుడారగించి దంతధావనము మున్నుగా సువస్పర్శనముసేసి (ఆచమించి శుద్ధిచేసికొనుటయన్నమాట) ఎడమవైపుకొరిగి చక్ర (చక్రముయొక్క) శయనముంబొందెను. పురుషోత్తము డాతడటనుండి యితిహాసమువినెను. అవ్వల పాన్పువిడిచి సత్పురుషుల మార్గమంటి శాస్త్రాభ్యాసముసేసెను. ఏత స్మిన్నేవ కాలేతు సహ గార్గ్యో యుధాజితా | వివేశ భరతం ద్రష్టుం రథరేణు పరిప్లుతః || 93 సుఖాసీన శ్చ భరతం వాక్యమేత త్తతో೭బ్రవీత్ | గార్గ్యః: | తతోవాక్యాని సర్వాణి శైలూషశ్ర్శా వితోమయా || 94 నతని తస్య రోచన్తే సంగ్రామ స్తస్య రోచతే | భరతేన సమాగమ్య శ్వోభూతే ద్విజ పుంగవ || 95 భరతం నాశయిష్యామి నీహారం చంద్రమా యథా | ఇత్యుక్త్వా సతు మాం రాజా ప్రేషయామాస సత్వరః || 96 ఆహ్వాన దుందుభి స్తత్ర నిష్క్రాన్తే మయి చాహతః | ఏతత్ జ్ఞాత్వా స యుద్ధాయ ప్రాతః సబ్జోభ##వేత్తవ || 97 ఇదేవేళ గార్గ్యుండు రథపరాగము గ్రమ్ముకొని యుధాజిత్తుతో భరతుని దర్శింప నట బ్రవేశించెను. సుఖాసనముండి భరతునితో నిట్లుపిలికెను. నామాటలన్నియు శైలూషునకు (గంధర్వునకు) వినిపించితిని. అవి వానికి రుచింపలేదు. యుద్ధము వాని కిష్టమగుచున్నది. భరతునితో గదిసి రేపు చంద్రుడుమంచునట్లు నేను భరతుని నశింపజేసెదను. ఇట్లని యా రాజు నన్ను వెంటనే పంపివేసెను. నేను నిష్క్రమించినదేతడవుగ యట ఆహ్వాన దుందుభి మ్రోయింపబడెను. (యుద్ధమునకు పిలుపుగా నది మ్రోగినదన్న మాట) ఇదివిని యాతడుదయమంద నీతోడియుద్ధమునకు సన్నద్ధుడైనాడు. మార్కండేయః : ఇతి గార్గ్యవచః శ్రుత్వాభరతో గార్గ్య మబ్రవీత్ | గచ్ఛ: శీఘ్రం గృహం బ్రహ్మన్ ! శ్రాన్తోరథబలాధ్వతః || 98 అహ మాజ్ఞాపయిష్యామి సర్వం సాంగ్రామికం విధిమ్ | ఏతావ దుక్త్వా విజయం సేనాధ్యక్ష మథా೭బ్రవీత్ || 99 మమోష్ట్ర వాహిభి శ్శీఘ్రం శిబిరేషు మహీక్షితామ్ | యోధా నాజ్ఞాపయ త్వద్య శ్వోభూతాయరణాయవై || 100 యుద్ధావధానికం సర్వం కర్తవ్యం చ తథా త్వయా | ఏవమాజ్ఞాప్య నాగానాం తురంగాణాం తథైవచ || 101 ప్రత్యావేక్షాం తతః కృత్వా సంధ్యా మన్వాస్య పశ్చిమామ్ | రహోగత స్స శుశ్రావ నరాణాం గూఢ భాషితమ్ || 102 ఆరురోహ తదా శ్రుత్వా ప్రసాదం హిమ పాండురమ్ | కైలాస శిఖరాకారం నిర్వాతం రజనీ ముఖే || 103 తత స్తు సైనికః కశ్చిత్ శిబిరే భరతస్య తు | తలం తలే నాభ్యహనత్ వపనార్థం యదౄచ్ఛయా || 104 తతస్తు సైనికైః సర్వైస్తల తాలైర్మహా స్వనమ్ | చక్రిరే పురుషవ్యాఘ్ర! తస్మిన్‌కాలే దివం గతమ్ || 105 ప్రవవౌచ తదానీతో వాయుర్మనుజ పుంగవ! ఏతస్మిన్నేవ కాలేతు మద్రరాజ స్తదాంశు మాన్ || 106 ప్రాసాదవర మారూఢో జ్ఞాతవాన్ భరతం తదా | దీపాలోకేన లక్ష్మ్యాచ ప్రాసాదస్య వివృద్ధయా || 107 నజగామ తదారాజా ప్రహసన్ సైనికం జనమ్ | గార్గ్యుని యిమ్మాటలువిని భరతుడు గార్గ్యునితో బ్రహ్మణ్య! రథప్రయాణమున నలసితివి. శీఘ్రమ గృహమ్మరుగుము. సర్వసాంగ్రామిక విధిని నేనాజ్ఞాపింతును. అని యింతదాక పలికి సేనాధ్యక్షుని విజయునింగని యట్లనియె. రేపుజరుగు యుద్ధమునకు నా యొంటెల మీద రౌతులద్వారా శిబిరమ్ములందున్న రాజులకు వెంటనే యాజ్ఞయిమ్ము, యుద్ధ నిమిత్తముగ జ్ఞప్తి చేసికొని సిద్ధము సేయవలసిన కర్తవ్యమంత నీవు సేయుమని యాజ్ఞాపించి ఏనుగుల గుఱ్ఱములను పర్యవేక్షించి పశ్చిమసంధ్యవార్చి (సాయం సంధ్యావందనముసేసి) ఏకాంతమున నుండి రహస్య గూఢచారుల రహస్య భాషణములు వినెను. అదివిని మంచువలె నచ్చము తెల్లనైన పాసాదమెక్కెను. అది కైలాసశిఖరమట్లున్నది, అందు రజనీముఖమందు (రేయి మొదట) వాయువు వీచలేదు. అంతట భరతశిబిరమందున్న యొక సైనికుడు గాలికొర కరచేతి నరచేతిని గొట్టెను. అవ్వల సైనికులందరు నట్లుసేసిరి. దాన నక్కడ పెరుసవ్వడియయ్యెను. అచప్పుడాకాశమంటెను. ఓ మనుజేశ్వర ! అప్పుడా దాన రప్పింపబడిన వాయువు వీచెను. ఇదే సమయమందు మద్రదేశాధిపతి యంశుమంతుడు ప్రాసాదమెక్కి భరతు నటనున్న వానిం దెలిసికొనెను. దీపము వెలుతురుచే పెంపొందిన ప్రసాద శోభ##చే భరతు నట గుర్తించి నవ్వుచు సైనికజనముతో నిట్లనియె. భరతస్య ప్రదాస్యామి యుక్తైవ బల దర్శనమ్ || 108 తృణ ముష్టి ముపాదీప్య సర్వో೭పి కటకే జనః | పాణా వాదాయ ముదితః క్ష్వేడాశబ్దం కరోతువై || 109 పార్థివేనైవ ముక్తేతు కటకే తస్యధీమతః | సోల్కా హస్తో జన స్సర్వఃక్షణన సమపద్యత || 110 శిబిరం మద్రరాజస్య ద్వితీయ మివ చాంబరమ్ | బభూవ తారకాచిత్ర ముల్కహసై#్త స్తదా నరైః || 111 తద్బలౌఘ మపర్యన్తం సోల్కాహసై#్తర్జనై ర్వృతమ్ | దృష్ట్వా జగామ ధర్మాత్మా పరాం ప్రీతం రఘూ ద్వహః || క్ష్వేడాః కిలకిలా శ్చైవ శ్రుత్వా హర్ష ముపాగతః | తస్మిన్ ప్రశాన్తే జ్వలనే మందీభూతేచ నిస్స్వనే || 113 అభ్యహన్యన్త భూపానాం శిబిరేషు పృథక్ పృథక్ || సంజ్ఞా తూర్యాణి రమ్యాణి నానా లింగాని చాప్యథ || 114 సుబహూని మహారాజ ! తేన కోలాహలం మహత్ | బభూవ ప్రీతి జననం భరతస్య మహాత్మనః || 115 ఇప్పుడు భరతునికి సైన్య ప్రదర్శనముయుక్తితో జేసెద. ఈ కటక మందున్న జనమందరు గుప్పెడు గడ్డికొని వెలిగించి చేతగొని సంబరమున (క్ష్వేడ) అట్టహాసము (కోలాహలము) గావింపుడు. అనవిని యా బుద్ధిమంతుని మాట విని కటక మందలి జనము ఉల్కాహస్తులై (కొరవులచేబూని) క్షణములో నటకు సిద్ధమైరి. ఉల్కాహస్తులైన యానరులచే మద్రరాజు శిబిరము తారకా చిత్రమైన రెండవ యాకాశమట్లుండెను. అంతులేని అతని సైన్యముల్కాహస్తులైన జనులతో నావరింప బడుట చూచి భరతుడు పరమప్రీతి నందెను. క్ష్వేడములు కిలకిలా రావములు విని హర్షముం బొందెను. ఆ యగ్ని సాంతముకాగా యా సవ్వడి మందగింప ఆయా రాజుల శిబిరము లందు వేర్వేర రమ్యములయిన సంజ్ఞాతూర్యములు నానావిధ లింగములు (పెక్కుగుర్తులు గలవి) వాయింప బడెను. దానిచే నో మహారాజా పెద్ద కోలాహలమయ్యెను. మహాత్ముడు భరతుని కది ప్రీతి గలిగించెను. మంత్రయిత్వా తతః శ్రీమాన్ క్షణమాత్రం యుధాజితా | తేనైవ సహ భుక్త్వా చ సుష్వాప శయనోత్తమే || 116 హిమావదాతే వరమాల్యచిత్రే వితాన కాధో విహితే మనోజ్ఞే | సుష్వాప రాత్రిం స మహానుభావో భోగీంద్ర భోగే మధుజిద్యథైవ || ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే యుద్ధప్రసంగ వర్ణనం నామ నవోత్తర ద్విశతయో೭ధ్యాయః అవ్వల శ్రీమంతుడు ఆతడు యుధాజిత్తుతో నాలోచనసేసి అతనితోనే విందారగించి హంసతూలికా తల్పమందు శయనించెను. వీణావేణు మధుర రవముచే మధురములయిన మేల్కొలుపు పాటలచే దని వొందుచు మంచు వలె తెల్లనిది చక్కని మాల్యములచే చిత్రమయినది వితానముల క్రింద నేర్పరుప బడిన మనోజ్ఞయైన పాన్పునందు మధువైరి. భోగీంద్ర భోగమందట్లు భరతుడు నిదురవోయెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున భరతయుద్ధ ప్రసంగమను రెండువందలతొమ్మిదవ యధ్యాయము.