Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదియొకటవ అధ్యాయము

గంగ విష్ణుపదియైన కథ

వజ్ర ఉవాచ :

గంగా విష్ణుపదీ లోకే కిమర్థం కథితాబుధైః | తన్మమాచక్ష్వ తత్త్వేన భృగువంశ వివర్ధన ! || 1

మార్కండేయ ఉవాచ :

స్వాయం భువేంతరే పూర్వం చత్వారో దేవతా గణాః | జయాఖ్యా శ్చాజితాఖ్యాశ్చశుక్రాఖ్యాశ్చ ప్రకీర్తితాః || 2

తేషాం బభూవ దేవేంద్రో విశ్వభుక్‌ లోకపూజితః | ఆసంస్తస్యాసురా ఘోరాస్తదా దాయాద బాంధవాః || 3

బభూవ రాజా తేషాంచ బాష్క లిర్నామ నామతః | యేన విక్రమ్య శక్రస్య హృతం రాజ్యం తదా బలా& || 4

హృత రాజ్యస్తు దేవేంద్రో బ్రహ్మాణం శరణం గతః | బ్రహ్మాపి శక్రమాదాయ జగామ శరణం హరిమ్‌ || 5

నివేదయామాస తదా దేవదేవాయ శాఙ్గి& ణ | బాష్కలే ర్విజయం సర్వం బ్రహ్మాశుభ చతుర్ముఖః || 6

శ్రీ భగవానువాచ :

బ్రహ్మ& ప్రత్యాహరిష్యామి రాజ్యమస్య శతక్రతోః | దివి దేవేషు ధర్మాత్మ& ! నివృత్తో భవ మాచిరమ్‌ || 7

అహం వామన రూపేణ ప్రయాస్యే బాష్కలిం నృపమ్‌ |

మాందృష్ట్వా విస్మితం తంతు గత్వా యాచతు దేవరాట్‌ || 8

లోకత్రయం మమ హృతం త్వయా విక్రమ్య బాష్కలే | తత్రాగ్ని శరణార్థాయ దీయతాంమే క్రమత్రయం || 9

ఆతీవ హ్రస్వ గాత్రస్య వామనస్యాస్య మాచిరమ్‌ | ఏవ ముక్తస్తు శ##క్రేణ తదా దాతా క్రమత్రయమ్‌ || 10

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవముక్తో దేవేన బ్రహ్మా స్వభవనం గతః | దేవో7పి వామనో భూత్వా ప్రయాతో యత్ర బాష్కలిః || 11

బాష్కలి ర్వామనం దృష్ట్వా విస్మయోత్ఫుల్ల లోచనః | నిరీక్ష్యతం యథాకామ మసురై ర్బహుభిర్వృతః || 12

ఏతస్మిన్నేవ కాలేతు శక్రస్తందేశ మాయ¸° | పాదార్ఘ్యా చమనీయోద్యైః శక్రంసంపూజ్య బాష్కలిః || 13

కిమాగమన కార్యంతే తమువాచ ప్రహృష్టవా& | అత్యాశ్చర్య మిదం మన్యే తవాగమన కారణమ్‌ || 14

శక్ర ఉవాచ :

లోక త్రయంమే7పహృతం విక్రమేణతు బాష్కలే | తత్రాగ్ని శరణార్థాయ దీయతాం మే క్రమత్రయమ్‌ || 15

అతీవ హ్రస్వగాత్రస్య వామనస్యాస్య పార్థివ ! | భూమి భాగేతు పారక్యే వస్తుం న త్వహ ముత్సహే || 16

బాష్కలిరువాచ :

క్రమత్రయం వామనకే దేవరాజకృతమ్‌ శుభం | తత్రాస్స్వ ముదితః ప్రాప్తః సుఖీ సురపతే ! భవ ! 17

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తో బాష్కలినా త్యక్త్వా రూపంతు వామనం || 18

హరి ర్విచక్రమే లోకా& దేవానాం హితకామ్యయా బ్రహ్మలోకం తతో గత్వా ........

దేవస్య వామశ్చరణో నివిష్టో దానవాలయే || 19

తతః క్రమం స ప్రథమం దదౌ సూర్యే ! జగత్పతిః | ద్వితీయంచ ధ్రువే దేవః తృతీయేనచ యాదవ ! 20

బ్రహ్మాండం తాడయామాస హ్యసం పూర్ణేన కేశవః | బ్రహ్మాండ స్తాడితస్తేన ఛిద్రతా మగమత్‌ ప్రభో ! 21

బ్రహ్మాండ బాహ్యతోయేన శతఘ్నేనాం భసావృతమ్‌ | తేనచ్ఛిద్రేణ తత్తోయం వివేశాండం మహీపతే || 22

అంగుష్ఠాక్షతా దండాద్యత్‌ ప్రవిష్టం జలం శుచి | ప్రాప్తా దేవ నదీత్వంతు సాతు విష్ణుపదీ నదీ! 23

దేవనద్యా తయావ్యాప్తం బ్రహ్మాండం సకలం నృప! | విభూతిభిర్మహాభాగ ! సర్వాను గ్రహకామ్యయా || 24

వామనేన సమాక్రాంతా సర్వేలోకాః యదానఘ | అసురైస్తే తదాత్యక్తా దేవానాం సత్యబాంధవైః || 25

పాతాలంచ యదాతేన నాక్రాంతం హరిమేధసా | అసురైసై స్తదాఘోరై రుష్యతే యదునందన ! || 26

దేవో7పి హత్వాత్రైలోక్యం జగామా7దర్శనం తదా | పాతాల నిలయశ్చాపి సుఖమాస్తే స బాష్కలిః || 27

శక్రో7పి పాలయామాస విపశ్చిద్భువనం తదా | ఇమం త్రివిక్రమం నామప్రాదుర్భావం జగద్గురోః || 28

గంగా సంభవ సంయుక్తం సర్వ కిల్బిష నాశనమ్‌ || 29

తేనైవ దేవదేవేన ప్రాప్తేవైవస్వతేం7తరే | భూయో లోకాస్త్రయః క్రాంతాః పదాసంయమినో నృప! 30

అనేన కారణనోక్తా గంగా విష్ణుపదీ నృప ! | యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్‌ || 31

గంగా సముత్పత్తి రియం మయోక్తా శ్రుత్వైవ యాంముంచతి సర్వపాపమ్‌|

పాపైర్విశిష్టో7పినరో నృవీర ! సాధు వ్రతస్తు త్రిదివం ప్రయాతి || 32

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే త్రివిక్రమోపాఖ్యానంనామ ఏకవింశతి తమో7ధ్యాయః.

గంగానది లోకమున విష్ణుపదియని యేల చెప్పబడుచున్నదని వజ్రుడడుగ మార్కండేయు డిట్లనియె : స్వాయంభువ మన్వంతరమందు నాల్గు దేవతాగణములుండెను. జయము, అజితము, శుక్రముననునవి. (నాల్గవ పేరు మూలములో లేదు) గణములకు ప్రభువుదేవేంద్రుడు, అతని దాయాదు లసురులు. అసురులకు రాజు బాష్కలి. విక్రమించి యింద్రరాజ్యమును హరించెను. ఇంద్రుడు బ్రహ్మను శరణందెను. ఆయన యేగి చక్రహస్తునకు విన్నవించెను. విని విష్ణువు త్వరలో నే నీ యింద్రుని రాజ్యమును పునరుద్ధరింతునని వామనావతారమెత్తి బాష్కలి దరికేగెను. అతడా మూర్తింగని యచ్చెరువంది యసురులతో నానందించు సమయమున నింద్రుండచ్చటికేతెంచెను అతనింగూడ బాష్కలి పాద్యాదులచే బూజించి నీ రాకకు గారణమేమన శక్రుడు (ఇంద్రుడు) నా త్రిలోకసామ్రాజ్యమపహరింపబడినది. అగ్ని శాలకై మూడడుగుల భూమి కావలయును మిక్కిలి పొట్టివాడీవామనుడు పరస్థలమందుండుట నాకిష్టముగాదన బాష్కలియు వామనమూర్తికి శుభదమైన మూడడుగుల మేర యేర్పరుపబడియేయున్నది. నీవు సుఖ సంతోషములతో నుండుమన వామనమూర్తి యా రూపమును విడిచి సాక్షాద్విష్ణువుగావున దేవహిత మొనరింప విక్రమించెను. దేవ దేవుని తొలి యడుగు దేవలోకమునను ఎడమ పాదము దానవాలయమున నుంచబడెను. రెండవ యడుగు ధ్రువు నందు నిలుపబడెను. మూడవయడుగున హరి బ్రహ్మాండము గొట్టెను. దాన నది పగిలి రంధ్రమేర్పడి బ్రహ్మాండమవ్వలనున్న యుదకము శతఘ్నివోలెనై యావరింప నారంధ్రమునుండి యది లోనికిం జొచ్చెను. కాలి బొటనవ్రేలి తాకునం దాటువడి లోనం బ్రవేశించిన యాపవిత్రోదకమున దేవనది విష్ణుపది యనంబడెను. ఆ దేవనదిచే సర్వ బ్రహ్మాండము వ్యాప్తమైనది. విష్ణువు యొక్క యణిమాది విభూతి వైభవమే యీ వింతకు గారణము. ఇది సర్వలోకానుగ్రహకారణమైనది. ఇట్లు వామనునిచే సర్వలోకములాక్రమింపబడి దేవతల సహజబంధువులగు నసురులచే బరిత్యక్తములై సురలపాలైనవి. హరిమేధసుడైన వామనునిచే పాతాళము నాక్రమింపబడినందున నందు ఘోరులగు నసురులు నివసింపనేగిరి. ఇట్లు విష్ణువు ముల్లోకములంగొని యంతర్ధానమొందెను.

భాష్కలి పాతాళమందు సుఖముగా వసించుచున్నాడు ఇంద్రుడును భువనపాలనము నొనరించుచున్నాడు. ఈ త్రివిక్రమాకారము జగద్గురువగు విష్ణువుది. గంగావతరణము సర్వకిల్బిషహరము. ఆవిష్ణువుచేతనే వైవస్వత మన్వంతరమందు మరల ముల్లోకము లాక్రమింపబడినవి. ఇందుచే గంగ విష్ణుపది యనంబడినది. ఆమెచే ముల్లోకములు వ్యాప్తములయినవి. ఈ గంగావతరణవృత్తాంతమును విన్నవాడు సర్వపాపవిముక్తుడై సాధువ్రతుడై త్రిదివమును (స్వర్గమును) బొందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున గంగావతరణమను నిరువదియొకటవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters