Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందలపదవ అధ్యాయము - గంధర్వక్షోభ వర్ణనము మార్కండేయః : ఆహ్వాన దుందుభిం శ్రుత్వా శైలూష తనయా స్తతః | ఆసేదుః పార్థివం సర్వే శైలూషం తం సమాగతాః || సముచిః కామపాలశ్చ గవేషణ సుదర్శనౌ | వీరబాహుః సుబాహుశ్చ వాయువేగ సువర్చసౌ ||
2 నికుంభః కుంభ నా మా చ బలాకో బలక స్తథా | హరికేశో మహౌజా శ్చ సూర్యరశ్మిః ప్రభంకరః ||
3 బృందారకో జ్యౌతిషికో దృఢస్యు రవరా జితః | కుముదః కుముదా పీడో వసునాధః సులోచనః ||
4 చంద్రాపీడో గదీ మౌళీ కిన్నరో೭జగరో రుహః | కేసరీ వరవాణాశ్చ భాను రాభావహో రయిః ||
5 ఏకలవ్యో విశాలశ్చ కలవింకః కలాప్రియః | భీమనాదో మహానాదో వాసుకిః వససో గదః ||
6 చంద్రవర్మా మహావర్మా వసుసేనో೭గ్ర జాదకః | ఏతే చాన్యేచ గంధర్వాః శైలూషస్య సుతాః ప్రభో ||
7 దివ్య మాల్యాంబరధరాః దివ్యచందన భూషితాః | అసనేషు మాహర్ఘేషు సభాయాం వివిశు స్తథా ||
8 శైలూషస్య సుతైర్గుప్తా సభాసౌ రత్నచిత్రితా | రరాజ తారకా చిత్రా నిశేవ నృపః శారదీ ||
9 మార్కండేయుడనియె ఆహ్వాన దుందుభిని విని శైలూషుని కొడుకులా గంధర్వునిం జేరి నముచికామపాలుడుగవేషణుడు సుదర్శనుడు వీరబాహువు వాయువేగుడు సువర్చుడు నికుంభుడు కుంభుడు బలాకుడు బలకుడు హరి కేశుడు మహౌజుడు సూర్యరశ్మి ప్రభంకరుడు బృందారకుడు జ్యౌతిషికుడు దృఢశ్యుడు అపరాజితుడు కుముదాపీడుడు వసునాథుడు సులోచనుడు చంద్రాపీడుడు గది మౌలి కిన్నరుడు అజగరుడు రహుడు కేసరి వరవాణుడు భానువు ఆభావహుడు రయి ఏకలవ్యుడు విశాలుడు కలవింకుడు కలాప్రియుడు భీమనాదుడు మహానాదుడు వాసుకి పనసుడు గద్యుడు చంద్రవర్మ మహావర్మ వసుషేణుడు అగ్రజాదనుడు నను వీరు మఱి యితరులు దివ్య మాల్యాంబరధారులై దివ్య చందన లిప్తులై మహార్హములైన యాసనములందు గూర్చుండిరి. తారకలచే చిత్రమైన శరత్కాల రాత్రివలె శైలూషుని కొడుకులచే రత్న చిత్రితమైన యాసభ రాజిల్లెను. తేషాం సముప విష్టానాం శైలూష స్తా నథా ೭బ్రవీత్ | గార్గ్యస్య వచనం సర్వ మనుమానం తథా స్వకమ్ ||
10 తే೭భియోగం తదాశ్రుత్వా మానుషాన్ మనుజేశ్వర ! | చక్రుర్నానా విధా శ్చేష్టాః మన్యునా క్రోధచేతసః ||
11 గంధర్వరాజ పుత్రాస్తే క్రోధా దశ్రు ప్రవర్షిణః | రేజుర్యు గాంత మేఘాభా అచిరాఖా స దృగ్దృశా ||
12 బభార సముచి ర్వక్త్రం క్రోధ రాగాను రంజితమ్ | దిక్సౌమ్యేవ దిశాదాహం మహాసంగ్రామ సూచకమ్ ||
13 కామపాల లలాటస్థా త్రిశిఖా భ్రుకుటీ బభౌ | త్రిభిః ప్రపాతై ర్గంగేవ విపతన్తీ హిమాచలమ్ ||
14 కృష్ణే స శుక్ల వర్యన్తే క్రోధరాగాను రంజితే | కుముదా పీడ నేత్రేతు సంధ్యా తామ్రే బభూవతుః ||
15 క్రోధాక్రాన్తేన వపుషా కుముదః కుముద ప్రభః | రక్తోత్పల నిభాకారః క్షణన సమవద్యత || 16 చంద్రాపీడ ముఖం చారు క్రోధ ధూమ్రాను కారితమ్ | బభార రూపం తన్వభ్ర సంభృతస్య నిశాభృతః || 17 క్రోధ నిశ్శ్వాస ధూమేన భానో ర్వక్త్ర మథా వృతమ్ | భభూవ భానో స్సదృశ ముపరాగే యదూత్తమ || 18 కరనిష్పేష సంజాత ధూమధూమ్ర ముఖాం గకః ! అన్వర్థనా మతా మావ తస్మిన్ కాతే సుదర్శనః || 19 అందరునువిష్టులై యుండ శైలూషుడు వారితో నిట్లనియె గార్గ్యునివచనమును తమవైపు ననుమానించిన విషయమును (ఊహలను) తమమనుష్యులయెడ జరుపనున్న అభియోగమును (శత్రుకృతమైన మెదిరింపును) విని క్రోధచిత్తులై యీసుచే నానా విధ చేష్టలు నొనరించిరి. వారు కోపముచే కన్నుల నీరుగురిసి కనుచూపులు మెరుపులట్లు మెరయ యుగాంతకాల మేఘములట్లు విజృంభించిరి సముచి కోపముచే సౌమ్యదిక్కు (ప్రశాంతమైనదిక్కు) మహాసంగ్రామ సుచకమయిన దిశాదాహమునటు లెరుపెక్కిన మొగముంబూనెను. కామపాలుని నుదుటనున్న మూడుకొసలుదేరిన కనుబొమలముడి మూడు ప్రసాతములచే హిమాలయముపై బడు గంగవలె భాసించెను. అంతట తెలుపై నల్లని కనుపాపలతోడి నేత్రముల క్రోధముచే నెరుపెక్కి కుముదా పీడుని కన్నులు సంధ్యారాగమట్లయ్యెను. కుముదుడనువాడు కుముదమట్లు (నల్లగలువయట్లు) నల్లనైనవాడు క్షణములో క్రోధాక్రాంతమైన శరీరముతో నెఱ్ఱతామరపూవట్లయ్యెను. చంద్రాపీడుని ముఖముకోపధూమానుకారితమై చిరుమబ్బులలుముకొన్న చంద్రుని రూపువహించెను. కోప నిశ్శ్వాసధూమముచే భానుని మొగము గ్రహణ సమయమందలి భాను బింబముంబోలెను. రెండుచేతులచే నొరయించుటచే పుట్టిన పొగచే ధూమమైన (పొగనలుపుగొన్న) ముఖము శరీరముగల సుదర్శను డత్తరి సార్థకనాముడయ్యెను. సులభముగా జూడనైన వాడయ్యెనన్నమాట (పొగగ్రమ్మినయగ్నిని జూచుట సులభ##మైనట్లు సహజ క్రోధ దుర్దర్శనుడైన వాడప్పుడలమిన తాత్కాలిక మయిన పొగచే దర్శనీయుడయ్యెనని భావము) గవేషణ ప్రవేగేన వహ్నిగర్భో జ్జ్వలాత్మనా | తారాభి వర్షణనైవ సూచితో భూపతిక్షయః || 20 వీరబాహు భుజాఘాత రత్న నిష్పేష రేణునా | విజృంభిత మథాస్థానే క్రోధేనేవ వపుష్మతా || 21 సుబాహు బాహు నిష్పేషో బభూవాశని నిస్స్వనః | నిర్ఘాత ఇవ గంభీరో రాజ్ఞాం నిధన సూచకః || 22 వాయువేగ మహావేగ చరణో ల్లిఖితా క్షితిః | విదద్రే పృథివీపాల వినాశ భయశంసినీ || 22 ఆయాసజాత సంస్వేద పులకోద్గమ భూషితమ్ | సువర్చా ధారయా మాస లలాట తట వట్టకమ్ || 24 ప్రస్విన్న గాత్ర సంక్రాంత కాంచన స్తంభ పింగళః | బభూవ కుంభనాభస్తు క్రోధో విగ్రహవానిప || 25 సువిని స్సృత రోమాగ్ని జ్వాలా కేసర మాలినా | నృసింహ వపుషశ్చక్రే రవిణాసుకృతి ర్హరేః || 26 ప్రస్విన్న గాత్ర సంక్రాంత సర్వగంధర్వ మండలః | విశ్వరూపధర మౌళః ప్రజహాస జనార్దనమ్|| 27 గంధర్వ రాజ పుత్రాస్తే మన్యునా హృతచేతసః | తదా బభూవు ర్భూపాల! సర్వేఏవ విశేషతః || 28 ఇత్థం సుతానాం ప్రసమీక్ష్య కోపం సంస్మృత్య వాక్యాని పురోహితస్య | జగామ మన్యుం సుతరాం సరాజా సందష్ట దంతచ్ఛద భీమ వక్త్రః || 29 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గంధర్వ సభాక్షోభవర్ణనం నామ దశోత్తర ద్విశతతమో೭ధ్యాయః. నిప్పు నడిమి మంటవోలె నుద్దీపించు మేనుగల గవేషణుడనువాని మహావేగముచే చుక్కలు గురిసినట్లయి రాజు వినాశము సూచింపబడెను. వీరబాహుని జబ్బల చఱపుచే వాని బాహులందలి భుజకీర్తులందున్న రత్నాలు పిండిపిండియై రాలిన రేణువుచే నసమయమందు మూర్తీభవించి కోపము విజృంభించినట్లయ్యెను. సుబాహుని బాహు నిష్పేషమున (బాహువుల క్రోధ నిమిత్తమైన రాపిడిచే) పిడుగులుపడిన సడి యేర్పడెను. అది అతి గంభీరమైన నిర్ఘాతమై రాజనాశన సూచకమయ్యెను. వాయువేగుడనువాని మహావేగముగల చరణములచే గట్టిగ రాయబడిన నేల రాజనాశన భయసూచకమైన దద్దరిల్లిపోయెను. సువర్చుడను వాడాయసముచే బొడమిన చెమటచే పులకలచే సొంపారు లలాట పట్టికంబూనెను. కుంభనాభుడు చెమటెక్కిన మేనియందు సంక్రమించిన బంగారు స్తంభమువంటి పింగళవర్ణముతో మూర్తీభవించిన క్రోధమాయన్నట్లుండెను. రవి యను నాతడు మిక్కిలిగ వెడలిని రోమకూపాగ్ని జ్వాలల కేసరముల యొక్క (మిణుగురుల యొక్క నిప్పురవ్వల యొక్క) వరుసలం బూని నృసింహావతారడైన హరి పోలిక నొనరించెను. మౌలుడనువాడు చెమటెక్కిన శరీరమందు సంక్రాంతమైన (ప్రతిబింబించిన) సర్వగంధర్వ మండలముతో విశ్వరూప ధరుడైన జనార్దనుని బరిహరించెను. ఆ గంధర్వరాజు కొడుకులందరు నెక్కువగ మన్యువుచే (క్రోధముచే) మతులుపొయినట్లయిరి. తన తనయుల కోపముంగని పురోహితుడగు గార్గ్యుని మాటలు జ్ఞప్తిసేసికొని గంధర్వరాజు పండ్లు పటపటలాడించి దానిచే నతిభయంకరముఖుడై మిక్కిలి క్రోధముం దాల్చెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గంధర్వసభాక్షోభవర్ణనమను రెండువందలపదియవ యధ్యాయము.