Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందలపదునొకండవ అధ్యాయము - గంధర్వ గర్జనము మార్కండేయః ! దృష్ట్వా గంధర్వరాజస్య క్రొధే నాకులితం మనః | తమూచు ర్నృప! గంధర్వాః స్వబాహుబల దర్పితాః || అపరాజితః : సర్వ మాలభ##తే రాజన్ ! అశోకః శూరబాహుషు ! తస్మా చ్ఛౌర్యేణ నిధనం రఘూణాం మమ రోచతే ||
2 నికుంభః : యో೭యం మన్యుః సముద్భూతః కాకుత్థ్సాన్ ప్రతి మేప్రభో | అవినాశి జగత్ కృత్స్నం వినాశం సముషేష్యతి || 3 కిన్నరః : యాలక్ష్మీరనులిప్తాంగీ వైరిశోణిత కుంకుమైః | కాంతాపి సరసాం ప్రీతిం ససాధత్తే మనస్వినామ్ || 4 వసునాభః : కృపాణ ధారా విధ్వస్త శత్రుసంఘ సముద్భవా | న యాశ్రీః కిం తయా కార్యం రాజన్ ! సత్వవతాం నృణామ్ || 5 అజగరః : అజితారి గణోపాత్త సంపదో భూషణ క్రియా | విపద్వరీయసీ తాభిర్యా న సంప ద్విభూషణా || 6 రుహః : శోభ##న్తే కర్కశాః శూరాః స్తనా ఇవ సమున్నతాః | శూరాణాంచస్తనానాంచ పరావజ్ఞా కరీరతిః || 7 కేశః : తేజస్వినా మభ్యుదయం వందనీయం జగత్త్రయే | యథా భాస్కర ముద్యన్తం జన స్సర్వో೭భినందతి || 8 వరవాణః : సత్త్వాధి కస్య సింహస్య లీలోన్మథిత పాదపాః | నశక్తాః పురతః స్థాతుం శైల కూటోపమాః గజాః || 9 ఆభావహః : నజాతుశమనం యస్య తేజస్తేజసి తేజసామ్ | పృథా జాతేన కింతేన మాతు ర్వార్ధక్య కారిణా || 10 ఏకలవ్యః : నామ్ని సంకీర్తితే యస్య నభవంత్యరయె భయాత్ | వివర్ణ వదనచ్ఛాయాః కా దయా తస్య జీవనే || 11 విశాలః : లక్ష్మీ సంగమ లుబ్ధానాం శూరాణాంచ రణోద్భవా | కీర్తి ర్భవతి సైవాశు సంయోగ కరణా సఖీ || 12 కలిప్రియః : రిపు రక్త పరా సిక్తా రిపుస్త్రీ నేత్ర వారిణా | నయస్య సించితా కీర్తిః కాస్పృహా తస్య జీవనే || 13 భీమనాదః : తేజసైవ సమాక్రాన్త సమ స్త భువనో రవిః | కరోతి పదవిన్యాసం సర్వేషా మేవ మూర్ధసు || 14 మహాదర్పః : శత్రు మస్తక విన్యస్త పదక్రమ విలాసినీ | కవిదత్త కరాలంబా కీర్తి ర్యాతు దివం తవ || 15 వాసుకిః : మాయా నిహతమాతంగ మధ్య ద్వీప విదారితామ్ | క్షితిం భిత్త్వా೭విశత్ కన్యా కీర్తితో వసుధాతలమ్ || 16 వసనః : హతారిలక్ష్మీ సంయోగ వికస ద్వదనస్యతే | ప్రయాతు త్వరితా కీర్తిః క్రోధనేవ దిశోదశ || 17 గదః : సతోయ తో యదాకారైర్నాగై ర్దాన ప్రవర్షిభిః | అక్రాన్త దిజ్ముఖే యుద్ధేవిద్యుత్త్వం మేకరోత్వసిః || 18 మహానాదః : మదీయ సింహ నాదేన విత్రాసిత గజా కులమ్ | బలం నిపాత యారీణాంశ##రైః సన్నత పర్వభిః || 19 వసుః : గజాశ్వరథ పాదాత చరణో ల్లిఖితం రజః | ద్రష్టాసి ప్రశమం యాతం పరిత స్త్వరి శోణితైః || 20 బృందారకః : గజకుంభ సముద్రస్థ ముక్తాఫల వికాసిషు | తిష్ఠత్సు రాజన్ ! భ##డ్గేషు కస్స హేత పరాభవమ్ || 21 జ్యౌతిషికః కాపిశ భ్రూలతా భంగ కుటిల ద్వయ కోటిషు ! విద్యమానేభు చాపేషుక స్స హేత పరాభవమ్ || 22 దృఢస్యుః : రాజన్! తీక్ష్నాః సన్తియస్య విశిఖాః పంచమానినః | కిమన్యై స్తస్య కర్తవ్యం పక్ష పాతిభి రాహవే || 23 చంద్రాపీడః : కిమాయుధైః సత్వవతాం చారు దోర్దండ శాలినామ్ | సద్యః సంజాత మన్యూనాం యుద్ధ వ్యాక్షేప కారకైః || గద్యుః : ఖడ్గా స్తి ష్ఠంతు మే తుచ్ఛాః భుక్త భుంగాట్ట హాసినః | ఏక దోర్దండ శేషో೭పి కస్సహేత పరాభవమ్ || 25 కలవింకః : మద్బాహు మందర క్షుబ్ధవైరి సైన్య మహార్ణవాత్ | భుంక్ష్వ లక్ష్మీం సముత్పన్నాం చిరాయ జగతీ పతే! || గజః : కిమాయుధై స్యత్వవతాం కుపుంసాంచ కిమయుధైః | అరాతి శస్త్రాణ్య తేషా మన్యేషా మఫలాని హి || 27 బలకః : దుర్బలోత్ఖాత శ##క్రేభ దశనాభి హతే హరౌ | మయా೭ద్య సురరాడస్తు భవాన్ త్రిభువనేశ్వరః || 28 ప్రనష్ట దేవతా పూజం బలహీనం సుదుర్దశమ్ | మయా కృత మథా೭ద్యాస్తు త్రైలోక్యమపి సుప్రభో! || 29 హరికః : కీనాశ మహిషేణా೭ద్య హరస్య వృషభేణ తు | అయోధ్యాం వాహయిష్యామి శేషాహే ర్లాంగలేనచ || 30 మహోదరః నిరస్త యమ మార్తండే మయాలోకే చరాచరే | యమస్య మహిషం పశ్య క్రమన్తం సూర్య వాజిషు || సూర్యః : నిశ్శేష దేవతా సంఘే మయా లోకత్రయే కృతే | దుర్గాసింహ వినిర్భిన్నం పశ్యాద్య మఘవద్గజమ్ || 32 ప్రభసః : నిరస్తాంబు పిపాసేన సమాకృష్ట ధనేశ్వరాః | ప్రణమన్తు తవాద్యైవ దేవ సంఘాః హత త్విషః || 33 భద్రకః : స్కంద శంకర శూన్యే೭స్మిన్ మయా త్రిభువనే కృతే | శిఖీ సంభక్షయత్వద్య శర్వాభరణ పన్నగాన్ || 34 మార్కండేయః : క్రోధాంధకార కలుపీ కృత చారు వక్త్రాన్ గంధర్వ రాజ తనయాన్ ప్రసమీక్షమాణః | జగాద రాజాన మదీన సత్త్వో నారాయణాభ్యస్తు తదాపురోధాః || ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే గంధర్వ గర్జనం నామ ఏకాదశోత్తర ద్విశతతమో೭ధ్యాయః. మార్కండేయుడనియె. గంధర్వరాజుమనస్సు కోపముచే వ్యాకులమగుటచూచి గంధర్వులు తమ బాహుబలముచే గర్వితులై యిట్లు పలుకజొచ్చిరి. అందు అపరాజితుడనునతడు రాజా ! శూరుల బాహువులుండగా శోకింపవలదు సర్వము చక్కబడునని రఘువులతో యుద్ధము నాకిష్టమనియె. నికుంభుడు ప్రభూ ! కకుత్థ్సవంశీయులయెడ నాకుగలిగిన పగవలన నశింపని జగమెల్ల నశింపగలదయె. కిన్నరుడు వైరుల రక్తకుంకుము లలదుకొన్న విజయలక్ష్మి పొందునట్టి ప్రీతిని మనస్వులు (దృఢమనస్వులు) అగువారి భార్యకూడ యింతసరసమైన (ఆనురాగభరితయైన) యానందమునందజాలదనియె వసునాభుడు ఖడ్గధారలం ధ్వంసమైన శత్రుకూటమునుండిపుట్టిన శ్రీ = సిరి సిరికాని అట్లుకాని శ్రీవిలసముతో సత్వవంతులయిన మానవులకేమిపని? ఏమియుపయోగము ! అజగరుండనియె. ఓడింపబడని శత్రుగణముయొక్క సమీపమునందున్న సంపదచే తానలంకరించుకొనుటకంటె విపత్తు గొప్పది. అట్లుగాక శత్రులంగెలిచి గైకొనినసంపద నిజమైన యలంకారము. రుహుడనియె. శూరులు కర్కశులై స్తనములవలె సమున్నతులై శోభింతురు. శూరులకు కుచములకును పరులనవమానించుటయందే యభిలాష. కేశుడనియె. ముల్లోకములందు తేజశ్శాలురయొక్క అభ్యుదయము (అభివృద్ధి) వందనీయము. ఉదయించు భాస్కరు నెల్లజనమభినందించును వరవాణుడనియె. బలాధికుని ముందు సింహముముందు నవలీలగ మహావృక్షములంగూల్చు పర్వతకూటములంబోలిన యేనుగులు నిలువసమర్థములుగావు. అభావహుడనియె. ఎవ్వని తేజమునందు (ప్రతాపమునందు) తేజస్వులయొక్క తేజస్సు శమింపదో అట్టి వ్యర్థజన్మునివలన యొక్కతల్లికి ముదిమిగూర్చు వాడు (తల్లి ¸°వనముపాలి కాధారమయినవాడు) ఎందులకు బుట్టినట్టు? (వానిజన్మము వ్యర్థమన్నమాట) ఏకలవ్యుండు ఎవనిపేరు చెప్పినంతన హడలిపోయి శత్రువులు శాంతిదొరగి విన్ననైనమొగములకారో అట్టివాని బ్రతుకువిషయమున దయమెందులకు? విశాలుడనియె. లక్ష్మిసంగమమందాశగల శూరులకు యుద్ధముచేగలుగు నాకీర్తియే అయిద్దరకు సమావేశముచేయు సఖియగును. కలిప్రియుడు ఎవనికీర్తి శత్రువుల రక్తముంద్రావునదై శత్రుభార్యలకన్నీళ్ళచే దడుపబడినదికాదో అట్టిజీవితమునుగూర్చిన స్పృహ =అపేక్ష యెందులకనెను. భీమనాదుడు తేజస్సుచేతనే సమస్తభువనములను ఆక్రమించినవాడుగావుననే సూర్యుడందరి నడినెత్తినిమీద బడినదై దివమ్మునకరుగుగాక ! యనియె. వాసుకి నీచే గూల్చబడిన ఏనుగులనెడి మధ్య ద్వీపముచేత జీల్చబడిన భూమిని బేధించు కొని కీర్తికన్య వసుధాతలమునందు ప్రవేశించుననియె. వనసుడు నీచే నిహతులైన శత్రువులయొక్క రాజ్యలక్షీ సమావేశము పొందుటచే వికాసమందిన నీ ముఖముం జూచి నీ రాజ్యలక్ష్మికి సపత్నియట్లున్న నీ కీర్తి తొందరగ కలహాంతరిత నాకికవోలె పదిదెసలు జనుంగాక యనియె. భర్త యస్య కాంతా సంగముసేసి తనయెడ వికృతుడైనతరి నీర్ష్యాకషాయితయైన స్త్రీని ఖండిత నాయిక యందురు. అట్టి యనుభవము రాజ్యలక్ష్మికి కీర్తికాంతకు నీయెడ గల్గుచున్నదని చమత్కారము. విజయలక్ష్మియు దిగంత విశ్రాంత కీర్తియు నేకకాలమున నీకు లభించునని యిట తాత్పర్యము. గదుడు ; నీటితో గూడిన మేఘములం బోలిన యేనుగులు మదము వర్షించుచు నలుదిక్కుల నాక్రమించు నీయుద్ధమందు నాచేతికత్తి మెరపుదీగ యగుగాక ! యనియె. మహానాదుడు నా సింహగర్జనముచే బెదరి పారు నేన్గులచే వ్యాకులమయిన శత్రుసేనను చక్కగవంగు కణువులుగల (చెప్పినట్లువిను) నీబాణములచే గూల్పుమనియె. వసువనువాడు చతురంగసేనల పాదములచే రేగిన ధూళి నల్గడల శాత్రవుల రక్తధారలచే నణగింపబడుటను నీవు చూడనున్నావనియె. బృందారకుడు నీ ఖడ్గములు గజ కుంభస్థలములను సముద్రమందున్న ముత్యాలయందుద్దీపించుచుండు నీ వైభవము సూచి యాపరాభవము నెవ్వడు నహింపగలడనియె. జ్యోతిషికురు కపిళ వర్ణముగల రెండు భ్రూలతలట్లిరువైపుల నగ్రములు (వింటికొనలు కుటిలములగుచుండ (వంపుదిరుగ) నీ ధనుస్సు వైభవము సూచి యా యవమానము శత్రు వెవ్వడు సైరించు ననియె. దృధస్యుడు ఎవ్వనికి మిక్కిలి పదునెక్కిన పంచబాణములున్నవి అట్టి నీకు పక్షపాతులైన (రెక్కలతోగూడి పైబడునట్టి యని శ్లేష) యితర బాణములతో బనియేమి ఝ యనె. చంద్రాపీడుడు చక్కని బాహుదండములుగల బలశాలుర కప్పటికప్పుడు పుట్టిన కోపముగలవారికి యుద్ధరంగమందదాయిదాయను విక్షేపము (చికాకు) గల్పించు నితరాయుధములతో బనియేమి? యనియె. శత్రు నిగ్రహమందు నీ బాహుబలమే చాలును. నీకాయుధములతో నవసరమేలేదన్నమాట. గద్యుడు ఓటమి ననుభవించి యట్టహాసము సేయు నాపనికిమాలిన ఖడ్గము లవియన్నియు నట్లుండనీ, అవి యెందులకు నా యేకైక భుజదండ మదిశేషించినను జాలు. అది గనియే శత్రువు పరాభవము సహించుననియె. అనగా నీ అశ్వమందు భటులలో నొక్కడనైన నేను బాణములతో గాక బాహువులతో ప్రచండయుద్ధముసేయ నీ భటుని నన్ను జూచి శత్రువెవ్వడా యవమానము నోర్వలేడని భావము. కలవింకుడు : నాబాహువను మందర పర్వతముచే గలుపబడిన శత్రుసేనా మహార్ణవమునుండి యుదయించిన లక్ష్మినో జగత్పతీ! నీవను భవింపుమనియె. గజుడు, సత్వశాలుర కాయుధముతో బనేమి (చేతగాని వాండ్రకు) నాయుధములతోనేమిపని, ఇందొకటికి శత్రువులశస్త్రములే శస్త్రములు రెండవవారికి (చేతగాని వారికికు పురుషులకు) అవి నిష్ఫలములనియె. బలకుడు నేను వీర సైన్యముచే పెరికివేయబడిన దేవేంద్రగజముయొక్క (ఐరావతమను నింద్రుని వాహనముయొక్క) దంతముచే నాచే శత్రువుగూల్ప బడు నప్పుడు నీవు గంధర్వరాజా! నీవు ఓ ప్రభూత్తమ త్రైలోక్యము దేవతా పూజలు పోయి దేవతలకిచ్చు బలులు శూన్యమై మిక్కిలి దుర్దశకు పాత్రముల జేసెదనుగాక యనియె భరతునికి యుద్ధమున త్రిభువనములు క్షోభించునట్లు సేసెదనని భావము. హరీకుడు యముని వాహనమయిన దున్నపోతుతో హరివాహనమైన వృషభముతో శేషుని లాంగలముతో (హలాయుధముతో) అయోధ్యను శత్రురాజధానిని ఇక్కడకు మోయించి తెచ్చెదననియె మహోదరుడు మయుడను సూర్యుడు. నిరసింపబడ (అస్తంగతుడు గావింప) యముని వాహనమైన దున్నపోతుతో హరివాహనమైన వృషభముతో శేషుని లాంగలముతో (హలాయుధముతో) అయోధ్యను శత్రురాజధానిని ఇక్కడకు మోయించి తెచ్చెదననియె మహోదరుడు మయుడను సూర్యుడు. నిరిసింపబడ (అస్తంగతుడు గావింప) యముని వాహనమైన దున్నపోతు సూర్యుని గుఱ్ఱములందు తానుగలిసి నడచు నిదె చూడుమనియె. నేనుముల్లోకములకు దేవతా సంఘము మిగులకుండ దుర్గమొక్క సింహమిదిగోచూడు ఇంద్రుని యేనుగును (ఐరావతమును) జీల్చుననియె. ప్రభసుడు మంచినీళ్ళైన ద్రావకుండ కుబేరునీడ్చికొనిరాగా దేవతా సంఘము శత్రువుల నీవు గూల్చిన కతన నీకు ప్రణతులగుదురుగాక యనియె. భద్రకుడనియె ఈ త్రిలోకమును నేనుస్కందుడు శంకరుడు లేకుండ చేయగా నెమలి శివునియాభరణమైన సర్పమును దినుగాక! క్రోధాంధకా రముచే మలినములు గావింపబడిన చక్కని ముఖములు గల కొందరు రాజతనయులవంక జక్కగజూచుచు ప్రచండ సత్త్వుడగు నాడాయనుడను పురోహితుడు ప్రభువు నకిట్లనియె. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున గంధర్వ గర్జనమను రెండువందల పదకొండవ అధ్యాయము.