Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల పండ్రెండవ అధ్యాయము - నాడాయనానుశాసనము

నాడాయనః : ఏకయాద్వే వినిశ్చిత్య త్రీన్‌ చతుర్భి ర్వశీకురు | పంచజిత్వా విజిత్వా షట్‌ సప్తహిత్వా సుఖీభవ ! ||1

ఏకయా ప్రజ్ఞయా రాజన్‌ ! కార్యాకార్యద్వయం నరః | వినిశ్చిత్య తు యఃకుర్యాత్‌ కార్యంతత్ర స పండితః || 2

మధ్యస్థం యదివామిత్రం శత్రుంవా కార్యగౌరవాత్‌ | జ్ఞాత్వా దేశంచ కాలంచ హ్యుపాయై రభ్యుపక్రమేత్‌ || 3

సామభేద ప్రదానాశ్చ ఉపాయాః పరికీర్తితాః | ఉపాయశ్చ చతుర్థోత్ర దండస్త్వగతికా గతిః || 4

పంచేంద్రియ జయోయేన కృతఆజౌ జిగీషుణా | త్రిలోక విజయం తస్య న దూరే ప్రతిభాతిమే || 5

పంచేంద్రియ జయంకృత్వా గుణషట్క ముపాశ్రయేత్‌ | బుద్ధ్వా బలాబలం సమ్యగాత్మన శ్చాపరస్య చ || 6

రాజదోషా! పరిత్యక్తా యేనసప్త నరాధిప | సిద్ధిం తస్య సమాయాన్తి యథాకాలం గుణాః నృప ! || 7

మృగయాయాస ముఖ్యాశ్చ స్త్రియశ్చ పురుషాః గిరః | అర్థసం దూషణం చైవదండపారుష్య మేవచ|| 8

రాజదోషైః పరిత్యక్తాః రాఘువాస్తత్ర పార్థివ ! | గుణాశ్రయ విభాగజ్ఞా విగ్రహసై#్తర్న రోచతే || 9

భరతేన వయం సామ్నా బలేమహతి తిష్ఠతా | ప్రథమం సముపాక్రాన్తం తదేవ తవ రోచతామ్‌ || 10

భరతస్య వయంసామ్నా యదిగచ్ఛేమ పర్వతమ్‌ | హితం తస్మా న్మహాభాగ ! సకులస్య తవానఘ ! || 11

త్వయా కృత్వా సముచ్ఛేదం రాజ్ఞాం జననివాసినామ్‌ | అకారణా న్మహద్వైరం కృతం భూపతిభి స్సహ || 12

జనే నివాసా దస్మాకం కేవలం లఘుతాభ##వేత్‌ | మానుషై#్య స్సంగమశ్చైవ విగహశ్చ పునః పునః || 13

న కృషి ర్నచవాణిజ్యం జనోస్మాకం ప్రయోజనమ్‌ | తేవయం సజనాం భూమిం త్యక్త్వా యామ శిలోచ్చయమ్‌ ||

అపేక్ష్య దేశకాలౌచ సంధిం విగ్రహ మేవచ | ఫలంచ బుద్ధ్వా యఃకుర్యాత్‌ సరాజన్‌ ! పండితో నరః || 15

ఒక దానిచే (ప్రజ్ఞ-తెలివిచే) రెంటిని కార్యము చేయదగినది అకార్యము = చేయగూడనిది యగుపనులను నిశ్చయించి (అద్భుత పుట్టుము) మూడింటిని =ముల్లోకములను నాల్గింట =సామ దాన భేద దండములను నాల్గుపాయములచే వశము చేసికొనుము. ఐదింటని ఇంద్రియము లైదింటిని జయించి. ఆరింటిని (గుణషట్కమును) సంధి విగ్రహ యాన ఆనన ద్వైధీభావ సమాశ్రయము లను రాజ గుణముల నారింటిని విజయముసేసి యేడింటిని సప్తరాజ దోషములను అనగా వేట పానము స్త్రీలు పురుషులు మాటలు అర్థదూషణము దండపారుష్యము నను రాజదోషముల నేడింటిని విడిచి సుఖివగుము. రఘువంశ రాజులందరు నిట్లు వర్తించిరి. వారు గుణములకు సంబంధించిన విచక్షణ తెలిసినవారు. వారితో బోరు రుచింపదు. మహాబలిష్ఠుడైయున్న భరతునితో మనము సామముతో ప్రవర్తించుటమేలు. నీవును దొలుతనట్లే ప్రారంభమును సేసితివి. అదేయిప్పుడును నీకభిమతమగుగాక! అదినీకు నీ కాలమునకును హితమైన పనియగును. జనులతోగూడి వసించు రాజులను నీపుచ్ఛేదముసేసి వారితో అకారణమైన మహా వైరము తెచ్చికొంటివి. నిరంతరము జనముతోగూడి వసించుటవలన మనము తేలికయై పోవుదుము. మనుష్యులతో గలిసియుండుట మరి మరి వారితో తగవుపడుట రాజునకుచితముగాదు. వ్యవసాయముగాదు వ్యాపారముగాదు మనకు జనమేప్రయోజనము. వారేమనకు బాగుగ నుపకరించువారన్నమాట అట్టి మనము జనులతోడి భూమిని విడిచి పర్వతములకు బోదము. దేశకాలముల నేపేక్షించి కోరి గమనించి సంధినిని విగ్రహమును (యుద్ధమును) ఫలమును దెలిసి వర్తించు నరుడు పండితుడు.

భూమిర్హి రణ్యం మిత్రంచ త్రివిధం విగ్రహాస్పదమ్‌ | స్వయంగేహో యదుస్మాకం మేరుః కనక పర్వతః || 16

హిరణ్యన తదాకార్యం న నోస్తి రిపుసూదన ! | కృషిర్నాస్తి యతోస్మాకం తతోభూర్నిష్ర్పయోజనా || 17

తస్మాద్భరత మన్విచ్ఛ మిత్రంనామ్నా నరాధిప ! | మిత్రం రఘుకులం కృత్వా నివాసస్తు హిమాచలే || 18

అదృశ్యం దేవసైన్యానాం సుఖం చిర మావాప్నుహి | స మానుషోయ మిత్యేవం భరతం మస్తు మర్హసి || 19

దుష్టానాం నిగ్రహార్థాయ చతుర్మూర్తి ర్జనార్దనః | జాతో రఘుకులే రాజన్‌ ! పుత్రో దశరథస్య తు || 20

అంశేన వాసుదేవస్య జాతో రామో మహాయశాః | సంకర్షణస్య చాంశేన లక్ష్మణః వరవీరహా || 21

ప్రద్యుమ్నస్య తథాంశేన భరతో ధర్మవత్సలః | అనిరుద్ధస్య చాంశేన శత్రుఘ్నుః సు మహాబలః || 22

తత్ర రాఘవ సింహేన రామేణా క్లిష్ట కర్మణా | రావణోభి హతః సంఖ్యే సర్వసత్వ భయంకరః || 23

మేఘనాదో నిరస్తశ్చ సంగ్రామే లక్ష్మణన చ | శత్రుఘ్నేన నిరస్తశ్చ లవణో దుష్టరాక్షసః || 24

మన్యే విశిష్టభావత్వం భరతస్య మహాత్మనః | యేన మాలీ హతః పూర్వం లంకావాసీ స రాక్షసః || 25

స ఏష భరతో విష్ణురస్తి తేతు రణంగమః | హితేస్థితో యస్సతతం సురాణాం దైత్యేన్ద్ర నాశాయ నివిష్టబుద్ధిః |

తేనా ప్రమేయేణ జనార్దనేన సమం ప్రజస్వాశు మహానుభావ ! ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే నాడాయనవాక్యే శైలూషం ప్రతినాడాయనామశాసన వర్ణనంనామ ద్వాదశోత్తర ద్విశతతమోధ్యాయః ||

భూమి బంగారము మిత్రము నను మూడు పదార్థములు తగవునకు స్థానములు. మనకు కనక పర్వతము (మేరువు) తనంత మనలను దనవారిగా గ్రహించినది అందుచే మనకు బంగారముతో బనిలేదు. మనకు కృషి (వ్యవసాయము) లేదు గాన మనకు భూమియుపయోగములేదు. అందుచే మనకు కావలసినది మిత్రమేకావున నీవు భరతుని సామముచే నీమిత్రుని నొనరించు కొనుము. రఘుకులము నీ మిత్రముంగావించుకొని హిమాలయమందు నివాసము నేర్పరచుకొనుము. దేవసైన్యములకు అదృశ్యమై చిరకాలము సుఖమందుము. ఈ భరతుడు మనుష్యడని యనుకొనదగదు. దుష్ట శిక్షణమునకు జనార్దనుడు. (విష్ణువు) నలురూపులై రఘుకులమందు దశరథునికిం బుట్టినాడు. మహాయశస్వి రాముడు వాసుదేవాంశమున జనించినాడు. సంకర్షణాంశమున లక్ష్మణుడు బుట్టినాడు. ధర్మవత్సలుడు భరతుడు ప్రద్యుహ్నంశమున మిక్కిలి బలశాలి శత్రుఘ్నుడు అనిరుద్ధు నంశమున జనించినారు. అందు రఘుసింహుడు రామునిచే సర్వసత్త్వ భయంకరుడగు రావణుడనిం గూల్పబడెను. లక్ష్మణునిచే మేఘనాదుడు హతుడైనాడు. శత్రఘ్నునిచే లవణకుమారుడు కూలినాడు. మహాత్ముడగు భరతుని వైశిష్ట్యమును లంకావాసియైన మాలి మున్ను హతుడగుటంబట్టి నేనూహించుచున్నాను. ఆ యీ భరతుడు నీకు యుద్ధాగతుడై యున్నాడు. సురలకు హితము సేయంబూని దైత్యనాశనముచేయు తలంపుగొని యితడీరంగమున బ్రవేశించినాడు. ఓమహానుభావ! గంధర్వప్రభూ! నీవా భరతునితో సాక్షాజ్జనార్దనునితో సామము సంధిని చేసికొనుము.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురణమందు ప్రథమఖండమున నాడాయనానుశాసనమను రెండువందల పండ్రెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters