Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలపదమూడవఅధ్యాయము - అగస్త్వమహిమానువర్ణనము

శైలూష ఉవాచ :- సుమాలీ విష్ణునా పూర్వం కథం యుద్ధే నిపాతితః | ఏతన్మే సంశయం ఛింధి! శ్రూయతే స మహాబలః ||

నాడాయనః :- కథేయం రాజశార్దూల : పురాగస్త్యేన ధీమతా | రామాయ కథితా వీర ! తాం మే నిగదతః శృణు ! || 2

పురా వినిహతే వృత్రే దైత్యా విగతనాయకాః | అబ్దుర్గం సాగరంకృత్వా రాత్రౌ నిఘ్నన్తి వై ప్రజాః || 3

సురైస్సర్వై స్సమాగమ్య తథాయం న పరైర్వధమ్‌ | సముద్రోదక పానాయ అగస్త్యశ్చో దితస్తథా || 4

దేవకర్మ ప్రముదిత స్తదాగస్త్య మునిర్నృప ! | పీత్వా చకార రాజేంద్ర ! నిప్తోయం సలిలాశయమ్‌ || 5

దేవైశ్చ నిహతాదైత్యా నిస్తోయే సలిలాశ##యే | తతః కదాచి ద్వింధ్యస్తు జగాదార్కనిశాకరౌ || 6

మేరుం త్యక్త్వా మహాభాగౌ మమ యాత ప్రదక్షిణామ్‌ | ఊచతు స్తౌ తదావింధ్య మావయోస్తు వశంగిరే ! || 7

తేన పంథాః కృతోస్మాకం యేనేదం నిర్మితం జగత్‌ | ఏతచ్ఛ్రుత్వా తు వింధ్యస్తు తప స్తప్త్వా పితామహాత్‌ || 8

ఇషుపాత మథోఛ్ఛ్రాయం ప్రత్యహం సమవాప్తవాన్‌ | తతః కతివయాహేన దిశమావృత్య దక్షిణామ్‌|| 9

ఆవృత్య తస్థౌపన్థానం దివాకర నిశాభృతోః | తతోన్ధ మభవత్‌ సర్వో భూలోకః పార్థివోత్తమ ! || 10

శైలూషుడనియె : మున్ను విష్ణువుచే సుమాలి యెట్లుగూలెనో యీ నా సంశయము వారింపు మా సుమాలి మహాబలశాలి యని విన్నానన నాడాయనుం డిట్లనియె : ఓరాజశార్దూల ! మున్నీ కథ నగస్త్యమహర్షి రామునికిం జెప్పె నది నే జెప్పెద వినుము. మున్ను వృత్రాసురు డల్గిన తరువాత దైత్యులు నాయకుడు లేనివారై సముద్రమును జలదుర్గముంగావించికొని యటనుండి రాత్రులందు బ్రజలను సంహరించుచుండిరి. సురలందరతో నాలోచించి వీడెవ్వరికిం జాపడని సముద్రమంద్రాపుట కగస్త్యుం బ్రేరేపించిరి. దేవకార్యమని సంతోషించి యగస్త్యమహర్షి యుదకమెల్ల నాపోశనముపట్టి సముద్రమును నిర్జలముం గావించెను. ఆ నీరు లేని కడలిలో దేవతలు రాక్షసులం జంపిరి. అవ్వల వింధ్యుడు సూర్యచంద్రులతో నొకతరి మీరు మేరువును విడిచి నాకు బ్రదక్షిణము సేయుడన వారప్పుడు వింధ్యునితో నిది మా వశములో లేదు. ఈ జగన్నిర్మాణము సేసినవానిచేతనే మాకీ దారి యేర్పరుప బడినదనిరి. అది విని వింధ్యుడు తపస్సుచేసి బ్రహ్మ వలన ప్రతిదినము బాణము విసరినం జను నెత్తున కెదుగు వరమందెను. అంత కొన్నిరోజులలో దక్షిణదిశ నావరించి సూర్య చంద్రుల మార్గము నడ్డగించి నిలుపబడెను. దాన భూలోక మంధకార బంధురమయ్యెను.

ప్రేరితో దేవవాక్యేన తతోగస్త్యో మహాతపాః | గత్వోవాచ తదా వింధ్యం తీర్థయాత్రాం కరోమ్యహమ్‌ || 11

మత్కృతే హ్రస్వతాం గచ్ఛయేన యాస్యామ్యహం సుభీ | జ్ఞాత్వా తపఃప్రభావం తు సోగస్త్యస్య మహాగిరిః || 12

జగామ హ్రస్వతాం శీఘ్రమగస్త్యోపి తదా య¸° | దక్షిణాశాం పరిత్యజ్య న యావ దహ మాగతః || 13

సపుత్ర దార స్తావత్త్వం హ్రస్వఏవ భవాచల ! ఏవముక్త్వా స వింధ్యంతు సదారాపత్య బాంధవమ్‌ || 14

జగామ దక్షిణా మాశాం త మావాచ పితామహః | దేవకార్యం మహద్ర్బహ్మన్‌ ! త్వయాకృత మిదం శుభమ్‌ || 15

తస్మాత్‌ స్థానం చతే దద్మి వైశ్వానర పథాద్బహిః | దివ్యదేహో భవాంస్తత్ర విమాన పరమాస్థితః || 16

దక్షిణాం భూషయ దిశమస్తోదయ సమన్వితః | ప్రసాదమంభసాం శైత్యం నిర్విషత్వం తవోదయే || 17

భవిష్యత్యమల ప్రజ్ఞ ! మత్ర్పసాదా త్త వైవతు | శరత్సముదితో భూత్వా పసన్తేస్తమయం ప్రజ ! || 18

ప్రాకామ్యయుక్తాశ్చ తథా సమగ్రాం వసుధాం చర | ప్రధానమూర్తి ర్యావత్త్వం సదారాపత్య బాంధవః || 19

నాక్రమిష్యతి వైవింధ్యం తావద్వింధ్యాచలః స్థితః | ప్రాకామ్యమూర్తి యుక్తేతు యత్రక్వచన సంస్థితే || 20

త్వయి వింధ్యో మహాశైలో వృద్ధింనగ గమిష్యతి | ఇల్వలశ్చాపి దుర్మేధాః భ్రాత్రావై మేషరూపిణా || 21

యదాభోజ యతే విప్రాన్‌ భుక్తవత్సు ద్విజాతిషు | కుక్షిభేదంతు వాతాపీ కృత్త్వా నిర్గచ్ఛతే పునః || 22

ఏవం నివిఘ్నత స్తస్య బ్రాహ్మణాన్యత్త్వయా కృతమ్‌ | శరణంతేన తుష్టోస్మి వింధ్య సంస్తంభ##నేనచ || 23

శరత్సమయ మాసాద్య యస్మాద్నిప్ర నవోదయే | పూజాం త్వ మాప్స్యసేలోకే మత్ర్పసాదా ద్ద్విజోత్తమ ! || 24

యేచ త్వాం పూజయిష్యన్తి గంధమాల్య ఫలాక్షతైః | దధికాంచన రత్నైశ్చ పరమాన్నేన భూరిణా || 25

పూర్ణకుంభైః సకూష్మాండైః ఛత్రోపానహ యష్టిభిః : ధేన్వా వృషేణ భ##క్ష్యైశ్చ వాసోభిః కనకేనచ || 26

సంవత్సరంచ త్యాగేన ఫలసై#్యకస్య చాప్యథ | పూజనైః బ్రాహ్మణంద్రాణాం త్వత్కర్మ సంకీర్తనైః || 27

తే ప్రాప్స్యన్తి సదా పుత్రాన్‌ ధన మారోగ్యమేవచ | ఆయురగ్ర్యం తథాలోకే శత్రుభి శ్చాపరాజయమ్‌ || 28

సౌభాగ్యంవిపులాన్‌ కామాన్‌ ధర్మవృద్ధిం తథైవచ | ఏవముక్త్వా స భగవాన్‌ తత్రైవాంత రధీయత || 29

మహాతపస్వి దేవవాక్యముచే ప్రేరితుడై వింధ్యగిరికేగి నేను దీర్థయాత్రలు సేయుచున్నాను. నాకొరకు నీవు పొట్టివాడవు గమ్ము. దాన నేను సుఖముగ నేగెదననెను. అమ్మహాముని ప్రభావమెరిగి వింధ్యగిరి వంగెను. ఆయన సుఖముగా నవ్వలి కేగెను. మరియు నా గిరితో నేను దక్షిణ దిశను వీడివచ్చుదాక భార్యాపుత్రులతో నీవిట్లే పొట్టివాడవై యుండుమన నతడట్లే యుండెను. అవ్వల బ్రహ్మ దక్షిణదిశ##కేగి యమ్మహామునితో బ్రహ్మణ్య! నీవు దేవతలపనియిది చాలపెద్దదినిర్వహించితివి. అందుచే నీకు వైశ్వానర మార్గముకంటెను మీదిస్థానమిచ్చెదను. దివ్యశరీరివై నీవు విమానమందు గూర్చుండి ఉదయాస్తమయములతో గూడి దక్షిణ దిక్కు నలంకరింపుము. నీయుదయమునందు జలములు ప్రసన్నత్వము విషరాహిత్యమును కలుగును. పరిశుద్ధజ్ఞానసంపన్న నాయొక్కయు ననుగ్రహమువలన నీజలశుద్ధిగల్గును. శరద్దృతువున నుదయించి వసంతృతువున నీవస్తమింపుము. అప్పుడష్టసిద్ధులలో నొకటైన ప్రాకామ్య సిద్ధితోగూడి సర్వవసుధం జరింపుము. నీవు దార పుత్ర బంధువులతో గూడి ప్రధానమూర్తివై యుండుము. నీవున్నంత కాలము వింధ్యపర్వతము పెరుగదు. ఇల్వలుడు దుర్బుద్ధి మేకరూపుగొని తమ్మునితో విప్రులకు భోజనము పెట్టినప్పుడు మాంసము రూపముననున్న వాతాపి నీవురమ్మనగానే వారి కడుపులం జీల్చుకొని వచ్చును. ఇట్లనేకులు విప్రులు చనిపోయినంత వారికి నీవు శరణమిచ్చి యావాతాపిం జీర్ణము చేసికొందువు. అందుచే నేను సంతుష్టుడ నయ్యెదను. ఇపుడు నీచేసిన వింధ్యపర్వత స్థంభనముచే గూడ నేను ప్రీతి చెందితిని. శరద్ధృతువురాగానే నీ నూతనోదయ మగును గావున అప్పుడు నీవు నా ప్రసాదముచే లోకమందందరి పూజలందుకొందువు. ఎవ్వరు నిన్ను గంధమాల్యాక్షతలచే పండ్లచే పెరుగు బంగారము రత్నములచే సమృద్ధమైన పరమాన్న ముచే గుమ్మడికాయలతోడి పూర్ణకుంభములచే ఛత్రపాదుకాదులచే ధేనువు వృషభముచే భక్ష్యములచే వస్త్రములచే సువర్ణముచే నిన్ను బూజింతురో, ఒక్క సంవత్సర మొకానొక పండు తినమని త్యజించి అర్చింతురో నీ యద్భుతచరిత్రను కీర్తించి బ్రాహ్మణుల బూజింతురో వారు నిత్యము పుత్రపౌత్ర ధనధాన్యాయురారోగ్యముల దులతూగుదురు. శత్రువులవలన బరాజయమెరుగరు. సౌభాగ్య మును విపుల కామములను ధర్మవృద్ధిని బొందుదురు. ఇట్లు పలికి భగవంతుడు బ్రహ్మ యటనే యంతర్ధానమందెను.

ఆససాద తథాస్థానం అగస్త్యోపి మహాతపాః | యేనక్రతు శ##తైరిస్టం తపస్తప్తం తథాత్మనః || 30

తేన స్వతపసా సృష్టా లోపాముద్రా ప్రియంవదా | విదర్భరాజ తనయా ధర్మపత్నీ తథాత్మనః || 31

దృఢస్యు స్తనయ స్తస్య తపస్వీచ మహాతపాః | ప్రముచు ర్ముముచు శ్చైవ తస్ముచుశ్చ మహాతపాః || 32

స్వస్త్యాత్రేయ స్తథా విద్వాన్‌ తస్యశిష్యో మహాత్మనః | ఆభేద్యం కవచం దత్తం తథాక్షయ్యే మహేషుధీ || 33

రామ లక్ష్మణయో స్తేన ధనుషీ చ మహాబలే | ఘోరేణావ్యథ సంయుక్తః సచ వైష్ణవ తేజసా || 34

కర్మణాం కీర్తనం యస్య నరో వర్ష శ##తై రపి | కర్తుం శక్తో న సహితే ప్రాకామ్యేచైవ రావణ || 35

అయోధ్యాం రాఘవం ద్రష్టుం జగామ త్వరితో మునిః | త మాగత మభిప్రేక్ష్య పూజయా మాస రాఘవః || 36

పాద్యార్ఘ్యా చమనీ యాద్యైః సర్వైః రాజ్య నివేదనైః | సంపూజిత స్తదా తేన తత్ర చక్రే కథాః శుభాః || 37

తతః కథాస్తే కస్మింశ్చిత్‌ తమపృచ్ఛత్తు రాఘవః | విష్ణునా మాలినిధనం తేనోక్తం తస్య తచ్ఛృణు || 38

యదుక్త వాన్‌ రాఘవ నన్దనస్య చంద్రార్క వహ్ని ప్రతిమ ప్రభావః |

రక్షోగణశస్య పధం సుఘోరం మునిర్మహాత్మా తదిదం నిబోధ || 39

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే నాడాయన వాక్యే శైలూషం ప్రతి నాడాయనోక్తా గస్త్య మాహాత్మ్య వర్ణనో నామత్రయోదశోత్తరద్విశతతమోధ్యా యః.

అట్లగస్త్యుండు స్థానముం బడసి నూరు క్రతువులు సేసెను. మహాతపస్సు గావించెను. ఆ స్వీయ తపస్సు చేతనే లోపాముద్ర ప్రియభాషిణి సృష్టింపబడెను. ఆమె విదర్భరాజు కూతురయి జన్మించెను. అగస్త్యునికి ధర్మపత్ని యయ్యెను. ఆ యగస్త్యమమర్షికి తపస్సియయిన దృఢస్యుడు తనయుడుదయించెను. ప్రముచుడు ముముచుడు తన్ముచుడు నను కొడుకులుదయించిరి. ఆ మహాత్మునికి శిష్యుడు విద్వాంసుడు (జ్ఞాని) స్వస్త్యాత్రేయుడు. అమహానుభావు డగస్త్యుడు రామలక్ష్మణుల కభేద్య కవచమును అక్షయ్య తూణీరములను (తరుగని అమ్ములపొదుల) మహాబలముగల ధనుస్సుల నొసంగెను. అతగు ఘోరమైన విష్ణుతేజస్సుతో గూడియుండెను. ఆయన చేసిన పనులను నూరేండ్లైనను నరుడు కీర్తింపజాలడు. ఆయన ప్రాకామ్యసిద్ధిలో రావణుని సైరింపక త్వరితుడై యమ్ముని రామచంద్రప్రభువుంజూడ నటయోధ్యకుం జనెను. అటు ననుదెంచిన యమ్మహర్షిని రాముడు పాద్యార్ఘ్యాచమ నీయాద్యుపచారములచే రాజ్యనివేదనములచేతను బూజించెను. అట్లు పూజితుడై యాయన శుభకథా ప్రస్తాపనము సేసెను. ఒక కథ చివర రాముడా మహర్షిని విష్ణువుచే మాలి వధ వృత్తాంతము తెలుపుమన నాతడు తెల్పెను. అగస్త్యులు చంద్రార్క వహ్ని సమాస ప్రభావుడు రాఘువనందనునికి రక్షోగణాధీశుడగు మాలి వధ నతిఘోరమైనదాని నెట్లెరింగించెనో అయ్యది యిదెతెలిసికొనుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండము నాడాయన ప్రసంగమందు అగస్త్యమహిమవర్ణనమను రెండువందల పదమూడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters