Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండు వందల పదునెనిమిదవ అధ్యాయము - రాక్షసపాతాళ ప్రవేశము అగస్త్యః : హతే మాలిని దేవేన సాన్త్వితః పక్షిరా డసౌ : జహార పక్షవాతేన నివృత్తో రక్షసాంబలమ్ ||
1 తే తార్ష్య పక్ష వాతేన శుష్కపర్ణ చయో యథా | ద్రుతా రాక్షస శార్దూలా స్తదా రామ దిశో దశ ||
2 అవింద మానా స్తే శర్మ వాసుదేవ భయార్దితాః | పాతాల తల మాసేదుః సర్వ ఏవ || పృథక్ పృథక్ ||
3 త్రిదశాన్ సాంత్వయి త్వా చ విష్ణు స్త్రీ దశ పూజితః | అస్తర్ధానం య¸° తత్ర సర్వేషా మేవ పశ్యతామ్ ||
4 లంకా೭పి శూన్యా రాజేంద్ర! దత్తా వైశ్రవణాయసా| స్వయం విశ్రవస స్తస్య రావణన హృతా బలాత్ ||
5 విభీషణా య సా దాత్తా త్వయా హత్వా చ రావణమ్ | రామ విష్ణుః సముత్పన్న స్త్వం వధాయేహ రక్షసామ్ || 6 త్వయైన యుద్దే నిహతా యే తు మాతుల సంకటాః | పౌలస్త్య రాక్షసా యేతు తేహతాః సాంప్రతంత్వయా || 7 హన్తా న విద్యతే రామ ! రక్షసాం కేళవం వినా | దృష్ట్రో೭స్మి భాషిత శ్చేతి ప్రయ¸° స యథాగతమ్ || 8 ఆగస్త్యులనిరి. మాలి కూలినతరువాత హరి కుశల ప్రశమువేసి యాదరించిన తర్వాత మరలివెళ్ళి గరుత్మంతుడు తన రెక్కలగాలిచే రాక్షస సైన్యమును బారగొట్టెను. వారు రెక్కలగాలికి ఎండుటాకుంట్లెగిరిపోయిరి. పరిదిశలకుంబారి విష్ణువువలని జడుపున సుఖముగానక వేర్వేర నందరును బాతాళమును జేరిరి. దేవపూజగొని విష్ణువు దేవతలను స్వస్థులంజేసి యందరుచూచుచుండ నక్కడ నంతర్ధానమందెను. శూన్యమైపోయినలంక కుబేరునకీయబడినది. అది రావణునిచే బలాత్కారముగా లాగికొనబడినది. నీవు రావణునింజంపి దానిని విభీషణునకిచ్చితివి. నీవు రాక్షసవధకై యవని నవతరించితివి. నీచే మున్ను గూలిన మాతలసంకటులు పౌలస్త్యులు రాక్షసులు వారేయిపుడు నీచేగూలిరి. రాక్షసులంజంపువాడు హరికంటే మరిలేడు, నిన్ను జూచితిని. నీతో మాట్లడితిని. అని వచ్చిన దారి నగస్త్యులు చనిరి. నాడాయనః : ఏవ ముక్త్వా తతో೭గస్త్యో యథాగిత మరిందమ! | తస్మా ద్యుద్ధం నమే రాజన్ ః అద్యవై తవ రోచతే || ఉత్సాహ శక్త్యా సంపన్నో మంత్ర శక్త్యాచ రాఘవ | ప్రభు శక్త్యా తథా యుక్తో దేవ శక్త్యా తథై వచ || 10 సాధు సాధ్యేషు కార్యేషు కః కుర్యా ద్విగ్రహం బుధః | కేవలం కోవ మాస్థాయ విగ్రహం నృప దోషదమ్ || 11 కామ క్రోధౌ జితౌ యేన తేనాత్మా విజిత స్తథా ః : యేనాత్మా విజిత స్తేన విజేతేయం వసుంధరా || 12 రాజ్ఞో೭ విజిత చిత్తస్య పరచక్ర జయః కుతః | న చక్రస్య జయం కర్తుం శక్నోత్య విజితేంద్రియః || 13 నా ೭వజ్ఞా కస్య చిత్కార్యా బలోవా బహుమన్యతే | నిత్యం లోకే హి దృశ్యన్తే శ##క్తేభ్యః శక్తి మత్తరాః || 14 యథా శక్తి చికీర్షన్తి యథా శక్తి చ కుర్వతే | న కంచి దవ మన్యన్తే నరాః పండిత బుద్ధయః || 15 ద్వా విమౌ కంటకౌ తీక్‌ష్ణౌ శరీర పరి శోషణౌ | యశ్చా ೭ధనః కామయతే యశ్చ కుప్యత్య నీశ్వరః || 16 ద్వావిమౌ పురుషౌ లోకే స్వర్గ స్యోపరి తిష్టతః | పభుశ్చ క్షమయా యుక్తో దరిద్రశ్చ ప్రదాన వాన్ || 17 కః కుర్యా ద్దుర్బలే క్రోధం స్వభావా దేవ నిర్జితే | బల వత్యపి కః క్రోధం కుర్యా త్ర్పాణ హరం నరః || 18 అపహార ప్రవృత్తస్య కోపస్తే జస్వితోచ్యతే | యస్మాత్తస్మాద్భుధైః కోపం కోపం కృత్వా వినిర్జితః || 19 త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః | కామః క్రోధ స్తథా లోభ స్తస్మా దేత త్త్రయం త్యజేత్ || 20 అనుబంధం చ సంప్రేక్ష్య విపాకం చైవ కర్మణామ్ | ఉత్ఠాన మాత్మన శ్చైవ తతః కర్మ సమాచరేత్ || 21 నరాజ్యం లబ్ధమి త్యేవం వర్తితవ్యం చ సాంప్రతమ్ | శ్రియం హ్యవినయో హన్తి జరా రూప మి వోత్తమమ్ || 22 త్వక్త్వా జనపదే వాసం యాహి రాజన్: హిమాచలమ్ | అవిషహ్య తమం హత్వా రావణం లోకరావణమ్ || లంకాం త్వక్త్వా ధనాధ్యక్షం పశ్యకైలాస మాశ్రితమ్ || 23 సరావణో రాఘవ సాయకార్తః త్యక్త్యా శ్రియం భూమిపతే విపన్నః | ధనాధిపో೭ద్యాపి విశాల కీర్తిః కరోతి రాజ్యం క్షణదా చరాణామ్ || 24 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రాక్షస పాతాళ ప్రవేశ వర్ణనం నామ అష్ఠాదశోత్తర ద్విశత తమో೭ధ్యాయః. నారాయణుడనియె.రాజా! అగస్త్యుడిట్లు సెప్పివెళ్ళెను. కావున నీవు యుద్దము సేయుట నాయభిమతముగాదు. రాఘవుడుత్సాహ శక్తి మంత్రశక్తియుం ప్రభుశక్తియుంగల్గియున్నాడు. ఆపైని దేవశక్తియుంగలవాడు. తెలిసినవాడు సులభసాధ్యములయిన పనులందు విగ్రహము (పేచీ) నెవ్వడు కొనితెచ్చుకొనును. కేవల కోపముచే తగవులాట రాజదోషప్రదము. కామ క్రోధములంగెలిచినవా డాత్మను (మనస్సును)గెలిచినవాడే. ఆత్మ విజయము చేసినవాడే యెల్లవసుమతిం నెల్లజయించును. చిత్తముం గెలువనివానికి శత్రుచక్ర జయ మెక్కడిది? విజితేంద్రియుడుగాని వాడు చక్రజయము (రాజ్యచక్రముం) సేయలేడు. బలవంతుడైన నెవ్వని బరాభవింపరాదు. అందువలన నందరిచేత దాను బహుమానితుడగును (గౌరవింపబడును) లోకమందు శక్తిమంతులను మించిన శక్తి మంతులు గనబడుదురుగదా! తమ శక్తికి దిగినట్లు చేయనెంతురు. శక్తికి దగినట్లు సేయుదురు. జ్ఞానము తెలిసిన వాండ్రెవ్వరి నవమానము చేయనెంచరు. తమ శక్తికి దగినట్లు చేయనెంతురు. శక్తికి దగినట్లు సేయుదురు. జ్ఞానము తెలిసిన వాండ్రెవ్వరి నవమానము చేయనెంచరు. శరీరము శోషింపజేయు కరకుముండ్లివిరెండు. నిర్ధనుడై కోరికలు గోరువాడు అసమర్థుడై క్రోధమూనువాను (అ ప్రయోజకునికి ఆహాంకారమెక్కువయని లోకములో వాడుక) స్వర్గముపై నుండువారీ యిద్దరు. ప్రభువై క్షమ (ఓరిమి) గలవాడు దరిద్రుడై దానగుణముగలవాడు. వాడు నిజముగనే యోడిపోయియున్న దర్భలునిపై నెవ్వడు కినుకసూపును? అట్లే తనకు ప్రాణాంతకుడుగా నున్న ప్రబలుపై నెవ్వడు కోపముంజూపును? ఎదుటివాని క్రోధము పోగొట్టువానికోపము తేజస్విత్వము ( ప్రతాపము) అనిపించు కొనును. కావున బధులు (తెలిసినవారు పండితులు) కోపించి కోపమును గెలిచిరి. నరక ద్వారము ఆత్మనాశనము. అది మూడు విధములు. కామము, క్రోధము, లోభము ననునీమూడును. కావున దీనిందప్పి కొని తిరుగవలయును. కర్మానుబంధమును కర్మ విపాకమును జక్కగ గనిపెట్టి తన ఉత్థానమును (ఉన్నత దశను)గూడ నెరిగి యాపైని పని నారంభింపవలెను. ఇప్పుడు రాజ్యము చేజిక్కినది మనకేమని ప్రవర్తింపరాదు. ఎగిరిపడరాదు. అట్టి యెగిరిపాటు ముదిమి ముచ్చటయైన రూపును జెరచినట్లు శ్రీని(సంపదను) జెరచును. రాజా! పల్లెపట్టు విడచి లేదా జనప్రదేశమువిడిచి హిమాచలమునకుం జనుము. ఓర్వరాని రావణుని లోకములకు రావణుని(ఏడ్పించువానిని)చంపి లంకను విడిచి కైలాసముంజేరిన ధనాధ్యక్షని కుబేరునింజూడుము. ఆ రావణుడో రాఘవభాణములగూలి సంపదను బాసి విపన్నుడైనాడు. నేటికిని కుబేరుడు విశాలకీర్తియై నిశాచరుల (రాక్షసుల) రాజ్యమునేలుచున్నాడు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున రాక్షసపాతాళవర్ణనమను రెండువందల పదునెన్మిదవ అధ్యాయము. రెండువందల పంతొమ్మిదవ అధ్యాయము - కుబేరాఖ్యానము శైలూషః : కథనం వైక్రవణ దత్తా పురాలంకా ద్విజోత్తమ ! | కథం చాప హాతా తస్య రావణన మహాత్మనాః || 1 చరితం రావణస్యాహం శ్రోతు మిచ్చమి తత్వతః | త్రైలోక్యం విజితం యే తనసా పౌరుషేణ చ|| 2 నాడాయనః : బ్రహ్మణో మాససః పుత్రః పులస్త్యో విదిత స్తథా | తస్యాసీ ద్విశ్రవానామ పుత్ర సై#్త్రలోక్య విశ్రుతః || పౌత్రీ బృహస్పతేః పత్నీ భరద్వాజసుతా శుభా | బభూవ తస్య రాజేంద్రః నామ్నా వై దేవ వర్ణినీ || 4 తస్యాం స జనయా మాస పుత్రం వై శ్రవణం ప్రభుమ్ | ఆరాధిత స్సుతపసా ప్రాదా త్తస్య పితామహః || 5 యక్షేశత్వం ధనేశ్వతం లోక పాలత్వ యేవచ ః పుష్కం చ తథా యానం కామగం కామరూపిణమ్ || 6 పుత్రం లబ్దవరం రాజన్ : విశ్రవా అభ్యభాషత | త్రికూటే పర్వత శ్రేష్టే నిర్మితా విశ్వ కర్మణా|| 7 లంకా నామ పురి రమ్యా దేవరాజ కృతే పురా | హృత్వాతాం దేవరాజస్య సుకేశ తనయైః పురాః || 8 ఆయాసితా మహారాజ: తేషాం జేష్టం తు మాలినమ్ | నిపాత్య వాసుదేవేన తేతు విద్రావితా స్తతః || 9 పాతాల తల మాశ్రిత్య తే వస న్తీహా నిర్భయాః || 10 తాం త్యం లంకాం సమాసాద్య వసయక్ష సమన్విత ః | ధర్మేణ పాలయన్ రాజ్యం సతతం రాక్షసేశ్వరః 11 ధర్మే తే దీ యతాం బుద్ధిః సర్వావస్థస్య సర్వదా | ధర్మా ధర్థశ్చ కామశ్చ ధర్మమూల మిదం జాగత్ || 12 శ్రుత్యవా పితు ర్వాక్య మదీన సత్వో లంకాం సమాసాద్య ధనాధి నాధః | ధర్మేణ లోకం సతు రంజయాన చకార రాజ్యం క్షణదా చరాణామ్ || 13 ఇతి శ్రీ విష్ణధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయనాను శాసనే లంకా కథాయాం వై శ్రవణాఖ్యాస వర్ణనం నామ ఏకోన వింశ త్యుత్తర ద్విశత తమో ೭ధ్యాయః. శైలూషుడు ఓ విప్రోత్తమ ! కుబేరుని మున్నులకంటీ%్‌లయబడెను. అది రావణునిచే నెట్ల నపహరింపబడెను? రావణుని కథ యాథార్థము నేను వినవలయును. అతడు తపస్సు చేస పౌరుషము చే ముల్లోకములు గెలిచినవాడుగదా! యన నాడా యనుడిట్లు సెప్పదొడంగెను. బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడన బ్రసిద్దుడు. వానికొడుకు. త్రిజగత్ర్పసిద్దుడు. ఆని పౌత్రి (కొడుకు కుమారులు కూతురు) భరద్వాజనికూతురు దేవనర్ణినియను పేరిది యావిశ్రయసుని భార్య, ఆమె యందాతడు వైశ్రవణుడను పభువుం గనెను. అతుడు తపసు చేనారాధింప పితామహుడు బ్రహ్మ యక్షాదిపత్యము ధనాధిపత్యము లోకపాలకత్వమును నొసంగెను. కామరూపము కామగమునైన పుష్పకమును యానముంగూడయిచ్చెను. ఇట్లు వరలాభమొందిన కొడుకుంగని విశ్రవసుడు త్రికూట పర్వతరాజ మందు విశ్వ కర్మ యింద్రునికై నిర్మించిన రమ్యమైన లంకాపురికాలదు. ఇంద్రుని యాపురము దానిని సుకేశ తనయుతో గూడనరిగి హరింపబడి కష్టాలపాలు సేయబడినది. వారిలో జేష్ట్యడగు మాలిని విష్ణువేచే గూలనేయించెను. అవ్వల దరుమలబడిన యా రాక్షసుల పాతాళమందు నిర్భయులైయునా%్‌నరు. నీ వాలంకకేగి యక్షుతోయటవసింపుము.రాజ్యమును సధర్మముగ బాలింపుము. ఏ యవస్థలో నున్నను నీయొక్క బుద్దినెవేళ నైన ధర్మమునందుంపుము. ధర్మమువలన అర్థమ కామముగల్గును. ఈ జగము ధర్మూలము, తండ్రిమాటవిని ధనాధినాథుడు లంకంజేరి ధర్మము లోకమును రంజింపజేయుచు రాక్షసులరాజ్యమును బాలించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున లంక కథయందు కుబేరాఖ్యానమను రెండువందల పందొమ్మిదవ యధ్యాయము.