Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల పందొమ్మిదవ అధ్యాయము - కుబేరాఖ్యానము శైలూషః : కథం వైశ్రవణ దత్తా పురాలంకా ద్విజోత్తమ ! | కథం చాప హాతా తస్య రావణన మహాత్మనాః ||
1 చరితం రావణస్యాహం శ్రోతు మిచ్చమి తత్వతః | త్రైలోక్యం విజితం యేన తపసా పౌరుషేణ చ||
2 నాడాయనః : బ్రహ్మణో మానసః పుత్రః పులస్త్యో విదిత స్తథా | తస్యాసీ ద్విశ్రవానామ పుత్ర సై#్త్రలోక్య విశ్రుతః || పౌత్రీ బృహస్పతేః పత్నీ భరద్వాజసుతా శుభా | బభూవ తస్య రాజేంద్రః నామ్నా వై దేవ వర్ణినీ ||
4 తస్యాం స జనయా మాస పుత్రం వై శ్రవణం ప్రభుమ్ | ఆరాధిత స్సుతపసా ప్రాదా త్తస్య పితామహః ||
5 యక్షేశత్వం ధనేశ్వతం లోక పాలత్వ యేవచ ః పుష్కం చ తథా యానం కామగం కామరూపిణమ్ || 6 పుత్రం లబ్దవరం రాజన్ : విశ్రవా అభ్యభాషత | త్రికూటే పర్వత శ్రేష్టే నిర్మితా విశ్వ కర్మణా|| 7 లంకా నామ పురీ రమ్యా దేవరాజ కృతే పురా | హృత్వాతాం దేవరాజస్య సుకేశ తనయైః పురాః || 8 ఆయాసితా మహారాజ: తేషాం జేష్టం తు మాలినమ్ | నిపాత్య వాసుదేవేన తేతు విద్రావితా స్తతః || 9 పాతాల తల మాశ్రిత్య తే వస న్తీహా నిర్భయాః || 10 తాం త్యం లంకాం సమాసాద్య వసయక్ష సమన్విత ః | ధర్మేణ పాలయన్ రాజ్యం సతతం రాక్షసేశ్వరః 11 ధర్మే తే దీయతాం బుద్ధిః సర్వావస్థస్య సర్వదా | ధర్మా ధర్థశ్చ కామశ్చ ధర్మమూల మిదం జాగత్ || 12 శ్రుత్యవా పితు ర్వాక్య మదీన సత్వో లంకాం సమాసాద్య ధనాధి నాధః | ధర్మేణ లోకం సతు రంజయానః చకార రాజ్యం క్షణదా చరాణామ్ || 13 ఇతి శ్రీ విష్ణధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయనాను శాసనే లంకా కథాయాం వై శ్రవణాఖ్యాస వర్ణనం నామ ఏకోన వింశ త్యుత్తర ద్విశత తమో ೭ధ్యాయః. శైలూషుడు ఓ విప్రోత్తమ ! కుబేరుని మున్నులంకకెట్లీయబడెను. అది రావణునిచే నెట్ల పహరింపబడెను? రావణుని కథ యాథార్థము నేను వినవలయును. అతడు తపస్సుచే పౌరుషముచే ముల్లోకములు గెలిచినవాడుగదా! యన నాడా యనుడిట్లు సెప్పదొడంగెను. బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడన బ్రసిద్దుడు. వానికొడుకు విశ్రవసుడు. త్రిజగత్ర్పసిద్దుడు. ఆని పౌత్రి (కొడుకు కుమారులు కూతురు) భరద్వాజనికూతురు దేవవర్ణినియను పేరిది యావిశ్రవసుని భార్య, ఆమె యందాతడు వైశ్రవణుడను ప్రభువుం గనెను. అతుడు తపసుచేనారాధింప పితామహుడు బ్రహ్మ యక్షాదిపత్యము ధనాధిపత్యము లోకపాలకత్వమును నొసంగెను. కామరూపము కామగమునైన పుష్పకమును యానముంగూడయిచ్చెను. ఇట్లు వరలాభమొందిన కొడుకుంగని విశ్రవసుడు త్రికూట పర్వతరాజమందు విశ్వకర్మ యింద్రునికై నిర్మించిన రమ్యమైన లంకాపురికాలదు. ఇంద్రుని యాపురము దానిని సుకేశ తనయుతో గూడనరిగి హరింపబడి కష్టాలపాలు సేయబడినది. వారిలో జేష్ట్యడగు మాలిని విష్ణువుచే గూలనేయించెను. అవ్వల దరుమబడిన యా రాక్షసులు పాతాళమందు నిర్భయులైయున్నారు. నీ వాలంకకేగి యక్షులితోయటవసింపుము.రాజ్యమును సధర్మముగ బాలింపుము. ఏయవస్థలో నున్నను నీయొక్క బుద్దినేవేళ నైన ధర్మమునందుంపుము. ధర్మమువలన అర్థమ కామముగల్గును. ఈ జగము ధర్మూలము, తండ్రిమాటవిని ధనాధినాథుడు లంకంజేరి ధర్మముచే లోకమును రంజింపజేయుచు రాక్షసులరాజ్యమును బాలించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున లంక కథయందు కుబేరాఖ్యానమను రెండువందల పందొమ్మిదవ యధ్యాయము.