Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలిరువదిరెండవ అధ్యాయము - స్వర్గవిజయము

శైలూషః : వహ్నిప్రవిష్టాం సంప్రేక్ష్య తదా వేదవతీం ద్విజ ! కిం చకార మహాతేజాః దశగ్రీవః ప్రతాపవాన్‌ || 1

నాడాయనః : జగామ స తదా లంకాం పూజ్యమానో నిశాచరైః |

తత్రస్థం ప్రేరయామాస దూతం ధనపతిః స్వయమ్‌ || 2

అకార్యా ద్విని వర్తస్వ సురైస్తే చింత్యతే వధః | దూతస్య వచనం శ్రుత్వా దూతం హత్వా నిశాచరః || 3

గత్వా విజిగ్యే ధనదం విజహారాస్య పుష్పకమ్‌ | పుష్పకేన విమానేన కైలాసంస తదా య¸° || 4

పుష్పకస్య గతిం రుద్ధాం తత్ర వీక్ష్య నిశాచరః | దదర్శ శైల శృంగస్థం నందినం వానరాకృతిమ్‌ || 5

తం దృష్ట్వా ముముచే హాసం నందీ తం శప్తవాం స్తతః | గిరా వశ్మిన్‌ దశగ్రీవ స్స్వయం కీడతి శంకరః || 6

విమానేన యదా తస్య సమీప ముపయాస్యసి | కరోషి చా వహాస్యం మాం తస్మా చ్ఛప్స్యామ్యహం తవ || 7

మద్వక్త్ర సదృశా ఘోరాః పులహస్య ప్రజాపతేః | ఉత్పత్స్యన్తి కులే భీమాః క్షయార్థం వానరా స్తవ || 8

శ్రుత్వైనం నందినో వాక్యం సకైలాసం త్రిలోచనమ్‌ | నేతు కామ స్తదా లంకాం భుజాన్‌ చిక్షేప పర్వతే || 9

పౌలస్త్య భుజ సంక్షుబ్ద కైలాస చలితాసనా | జగ్రాహ నిర్భరం కంఠే తదోమా త్రిపురాన్తకమ్‌ || 10

తతో గర్జన్‌ మహాదేవో దేవానాం ప్రవరో హరః | పాదాంగుష్ఠేన తం శైలం పీడయామాస లీలయా || 11

రక్షసా తేన రోషాచ్చ భుజానాం రుజయా తథా | ముక్తో విరావః సుమహాన్‌ త్రైలోక్యం యేన రావితమ్‌ || 12

మేనిరే వక్త్ర నిష్పేషం తస్యా మాత్యా యుగక్షయమ్‌ | ఆసనేభ్యః ప్రచలితా దేవాః శక్రపురోగమాః || 13

తేన శ##బ్దేన విత్రస్తా సుతరాం పర్వతాత్మజా | హరస్యాలింగనం చక్రే భయ లోలేక్షణా భృశమ్‌ || 14

అకృత్రిమా లింగన జాం ప్రీతిం ప్రాప్య తదా హరః | ముక్త్వా చాస్య భుజాన్‌ రాజన్‌ ! ప్రాహ వాక్యం దశాననమ్‌ ||

శైలూషుడు అగ్నిప్రవేశముసేసిన వేదవతింజూచి రావణుడేమిసేసె నానతిమ్మన నాడాయనుడిట్లనియె. రాక్షసులు పూజింప నారావణుడు లంకకేగెను. వానింగూర్చి కుబేరుడు బంపెను. నీవుతప్పుపని మానుము దేవతలు నిన్ను జంపు నాలోచనలో నున్నారని తెల్పుమని దూతను బంపెను. ఆ నిశాచరుడు వానిమాటవిని వానింజంపి వెళ్లి కుబేరునిగెల్చి వాని పుష్పకమును లాగికొనెను. అప్పుడా విమానమెక్కి కైలాసమునకుంజెనెను. అక్కడ పుష్పకవిమానము నడక కుంటుపడుట గని కైలాస శిఖరముపై వామనాకారముననున్న నందినిజూచెను. రావణుండు నందిని పెద్దగానవ్వి పరిహాసముసేసెను. అంతటనంది ఈ కైలాసగిరిపై శంకరుడు విహరించుచున్నాడు. ఈ విమానముపై నాయనదరికేగెదవేని నీవునన్ను బరిహాస పాత్రునిం జేసెదవు. అందుచే నిన్ను శపించు చున్నాను నామొగమువంటి మొగముగలవారు ఘోరులు పులహ ప్రజాపతి కులమందు బుట్టనున్నారు భయంకరమూర్తులువారు నీనాశమునకు గారణమగుదురు అన విని దశాననుడు కైలాసముతోగూడ త్రినేత్రుని లంకకుం గొనిపోవ నాగిరిపై బాహువుల విసరెను. రావణ భుజములంగదలి యూగిని కైలాసమందునా గూర్చున్న పీఠము గదలిపోయి యుమాదేవి త్రిపురాంతకముం గట్టిగ బట్టుకొనెను. అంతనమ్మహా దేవుడు దేవ ప్రవరుడు గర్జించుచు విలాసముగ దన పాదము బొటనవ్రేల నాకొండనదిమెను. రావణుడు రోషముచే భుజములకు గలిగినబాధచే ముల్లోకములు ప్రతిధ్శనింపం బెల్లుగ నార్చెను. వానిమంత్రులు రావణుని పదిమొగములు పిండియైనవని యుగప్రళయము గాబోలుననుకొనిరి. ఇంద్రాది దేవతలాసనములందుండి కదలి పోయిరి. అసడిచే పార్వతి మిక్కిలి జడిసిపోయి బెదరుచూపులం బరమశివుని గౌగలించుకొనెను. అంతట హరుండామెయకృత్రిమ స్వయం గ్రహాశ్లేషమున మిక్కిలి మురిసి యామె భుజముల విడిచి దశముఖునితో నిట్లనియె.

ప్రీతోస్మి తవ వీర్యైశ్చ శౌండీర్యైశ్చ దశానన | యస్మాద రాక్షసో రావ స్త్వయా ముక్తో భయంకరః || 16

తస్మాత్తం రావణో నామ భవిష్యసి జగత్త్రయే | తతః ప్రభృతి రాజేంద్ర రావణో లోకరావణః || 17

శాత కుంభ మయం లొంగం దేవదేవస్య శూలినః | సంపూజయతి రాజేంద్ర ! నిత్యం శ్రద్ధాసమన్వితః || 18

యత్ర యత్ర యథా యాతి తత్ర తత్రాస్య పార్థివ | సౌవర్ణం తస్య దేవస్య లింగం తదను నీయతే || 19

తతస్తు రావణో రాజా య¸° సంయమనీం పురీమ్‌ | యుయుధే కాలపాశేభ్యో యాగైశ్చ సహ మృత్యునా || 20

జిత్వా పితృగణాం శ్చైవ మోక్షయిత్వాచ నా రకాన్‌ | యమేన యుయుధే సార్ధం క్రోధా ద్వైవస్వత స్తతః || 21

హన్తు మిచ్ఛన్‌ మహీపాల ! దండాస్త్రేణ నిశాచరమ్‌ | వారయామాస తం బ్రహ్మా వాక్యం చేద మువాచహ || 22

అమోఘ స్తవ దండోయ మవధ్య శ్చైవ రావణః | వికస్మి న్నపి నిష్క్రాన్తే భూయా మనృత వాగహమ్‌ || 23

పితామహ వచః శ్రుత్వా దేవ స్సోన్తర్దధే తతః | రావణ స్సహసైన్యేన య¸° కైలాస పర్వతమ్‌ || 24

ఉవాస శర్వరీం తత్ర యోద్ధుకామో దివాలయైః | సతు చంద్రోదయే రాత్రౌ భ్రాతృ పుత్రాభిసారికామ్‌ || 25

దదర్శ రంభాం రాజంతీం మేఘస్యేప శాతహ్రదామ్‌ | అకామాం కామ సంతప్తో విధ్వంస్య సురయోషితమ్‌ || 26

అద్యప్రభృతి ముర్ధతే శతధా తు గమిష్యతి | ప్రభాత సమయే గత్వా సురసద్మ స రాక్షసః || 27

మేఘనాదేన సహితః కుంభకర్ణేన సంయుతః | దేవానాం కదనం చక్రే తథాన్యే రాక్షసోత్తమైః || 28

తస్మిన్‌ రణముఖే ఘోరే సావిత్రేణ తదా నఘ | సుమాలీ నిహతః సంఖ్యే రావణస్యార్భకో బలాత్‌ || 29

అజేయాన్‌ రాక్షసాన్‌ జ్ఞాత్వా పులోమా నామ దానవః | జయన్తమింద్రతనయం దౌహిత్రం స్వం రణాజిరాత్‌ || 30

రక్షార్థ మనయ చ్ఛ్రీమాన్‌ స్వగృహం వసుధాతలే | అపశ్యమానం పుత్రం స్వం శక్రం త్రిభువనేశ్వరమ్‌ || 31

బబంధ మేఘనాదస్తు బ్రహ్‌ లబ్ధరః శ##నైః | అనయచ్చ తథా లంకాం తతో దేవః పితామహః || 32

గత్వా తం మోచయామాస శక్రం త్రిభువనేశ్వరమ్‌ | మేఘనాదస్య చాస్త్రాణి మాయాశ్చ వివిధా స్తథా || 33

అమరత్వం తదా ప్రాదాత్‌ వహ్ని కర్మాతరం వినా | నామ చక్రే తదా చాస్య శకజిత్త్వం భవిష్యసి || 34

మేఘనాదం సాన్త్వయిత్వా మోచయిత్వా శతక్రతుమ్‌ | ఉవాచ భగవాన్‌ బ్రహ్మా దేవం దశశ##తేక్షణమ్‌ || 35

గౌతమస్య ప్రియా భార్యా మనసా నిర్మితా మయా | రూపేణా ప్రతిమా శక్ర ! త్వయా విధ్వంసితా యదా || 36

తదా గౌతమ శాపేన విఫలత్వం గతః స్వయమ్‌ | దేవైః కృత స్త్వం సంభూయ శేషస్తంభః పురందర ! 37

అహల్యాచ తదా శప్తా గౌతమేన మహాత్మనా | అదృశ్యా సర్వభూతానాం విచరిష్యసి దుఃఖితా || 38

పరదార రత శ్చాసౌ ద్వే పాపే సమవాప్స్యతి | తేన శాపేన సంయోగా పరదారైశ్చ వాసవ ! 39

బంధనం తత్త్వయా ప్రాప్తం తస్య పాపస్య కర్మణః | ఫలా త్రిభువన శ్రేష్ఠ ! సమరేషు పరాజయమ్‌ || 40

తస్మాద్ధర్మేణ ధర్మజ్ఞ ! పాలయస్వ జతత్త్రయమ్‌ | ధర్మో ధారయతే లోకాన్‌ యతో ధర్మ స్తతో జయః || 41

గతే స్వలోకం భువన ప్రధానే | పద్మోద్భవే దానవ పూగ హర్తా |

త్రివిష్టవం ప్రాప్య శశాస రాజ్యం మహానుభావ స్త్రిదశాధినాధః || 42

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమ ఖండే స్వర్గవిజయోనామ ద్వివింశత్యుత్తర ద్విశతతమోధ్యాయః.

దశానన! నీ వీర్యమునకు శౌండీర్యమునకు బ్రీతుడైతిని నీవు పెద్దగనారిత్రివి (పెద్ద రావము నొనర్చితివి) కావున ముల్లోక ముల నీవు రావణుండన బేరొందెదవనెను. అదియొదలు రావణుడు లోక రావణుడై (లోకముల గోలపెట్టించువాడై) దేవ దేవుని స్వర్ణలింగమును నిత్యము శ్రద్ధతో జక్కగ బూజించు చుండెను. అతడెట కెటకు బోవు నటకటకా సువర్ణలింగమును గొని పొవుచుండెను. అవ్వల రావణ ప్రభువు సంయమనీపురికి (యమపురికి) జని కాలపాశముల వలని బంధనములతో మృత్యువుతో బోరాడెను. అందు పితృగణములంగెలిచి నరకవాసులను ముక్తులంజేయించి యమునితోగూడ పోరెను. అంతవైవస్వతుండు (యముడు రవికుమారుడు) దండాస్త్రముచే నానిశాచరుం గూల్పనెంచెను. ఆయనను బ్రహ్మ వారించి నీదండమిదియమోఘము ఆవధ్యము. రావణుం డొక్కడు గడతేరినయెడలనే ననృతవచనుడ నగుదుననియె. పితామహుని మాటవిని యముడంతర్ధానమయ్యెను. రావణుడు సేనతో కైలాసమునకేగి యొకరేయి యక్కడ దేవతలతో దలపడంగోరినిలిచెను. చంద్రోదయమై యారాత్రి తన అన్నదమ్ములకొడుకులతో (దేవతలతో) నభిసరించి (అభిసారికానియికయై) చను రంభను మేఘమందలి మెఱుపునట్లున్న దానిని జూచెను. ఆమెతనను వలవకున్నం బలిమియై చెఱచి ఆమె నేటినుండి నీతల నూరుప్రక్కలగునని శపింపబడి ప్రభాతమందు సురసదనమున కేగి యారక్కసుడు ఇంద్రజిత్తుతో కుంభకర్ణునితోగలిసి దేవతలతో యుద్ధముసేసెను. అరణమందు ఘెరుడైన రావణుని బిడ్డ సుమాలి (సావిత్రునిచే) యమునిచే గూలెను. రాక్షసులజేయులని తెలిసి పులోముడను దానవుడు డింద్రతనముని జయంతుని తన దౌహిత్రుని (కూతురుకొడుకును) కాపాడుకొన రణభూమినుండి యవనినున్న స్వగృహమునకుం గొనిపోయెను. తన కొడుకు గానరాక బెంబేలుపడు నింద్రుని మేఘనాదుడు (ఇంద్రజిత్తు) బ్రహ్మపరము లందినవాడు బంధించెను. లంకకుంగొనిపోయెను గూడి. అప్పుడు బ్రహ్మయేగి త్రిభువనేశ్వరు నాయింద్రుని విడిపించెను. అప్పుడు బ్రహ్మ యా యింద్రుజిత్తున కస్త్రములను పెక్కువిధములగు మాయలను అమరత్వమును నొసంగెను. కాని యమరత్వము (చావులేకపోవుట) అగ్నికర్మాంతరమునందప్ప యితర సమయములందే యనుగ్రహించెను. (అందుచేతనే నికుంభిలా హోమముననే యితడు మరణించెను) మరియు వీనికి ఇంద్రజిత్తు అనుపేరుపెట్టెను. మేఘనాదుని నెమ్మదిపరచి శతక్రతుని విడిపించి బ్రహ్మ వేయి కన్నులవానిని (ఇంద్రుని) గని గౌతముని ప్రియభార్య నేను మనసుచే సృజించినది ఆప్రతిమాన రూపవతిని నీవెప్పుడు చెఱతువో అప్పుడు గౌతముడిచ్చిన శాపముచే నీయంత విఫలుడవై (వృషణములు పోయినవాడవై) దేవతలందరుగూడి చేసిన చేతచేనీవు స్తంభావశిష్టుడవుగగావింప బడుదువు (పురుషలింగమాత్రావశిష్టుడ వగుదువన్నమాట అయ్యెడ గౌతమునిచే శపింపబడి యహల్య దుఃఖితయై సర్వభూతములకు నదృశ్యయగును. (కానరాకుండును) పరదారరతుడైనందున రెండు పాతకముల నందితివి. ఒకటి ఇంద్రజిద్బాణ బంధము. రెండవది యుద్ధములందు జరాజయము. అందుచే ధర్మ మెరిగిన నీవు భువన త్రయమును ధర్మముచే బాలింపుము ధర్మము లోకములంధరించును రక్షించును (ధర్మము విశ్వజగత్ర్పతి ష్టాకారణము) ఎట ధర్మమో అట జయము. అని బ్రహ్మపలికెను పద్మభువువన ప్రధానుడుసన దానవ సంఘ సంహారకుడింద్రుడు త్రివిష్టపరాజ్య మునుబొంది త్రిదశులకు (ముక్కోటి దేవతలకు) ప్రభువై రాజ్యమును శాసించెను.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తరే మహాపురాణమున ప్రథమఖండమున రావణస్వర్గ విజయమను రెండువందల ఇరువదిరెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters