Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఇరువదిమూడవ అధ్యాయము - రావణవిజయ ప్రసంగము శైలూషః : పాతాళ విజయం తస్య రావణస్య మహాత్మనః | శ్రోతు మిచ్ఛామి తత్త్వేన తత్ర కౌతూహలం హిమే ||
1 నాడాయనః : తతస్సగత్వా పాతాళం యుయుధే దైత్యసత్తమైః | కాలఖంజై ర్మహాభాగైః కాలకేయైశ్చ దారుణౖః ||
2 నివాత కవచైశ్చైవ సంవత్సర మతంద్రితః | పతిం శూర్పణఖాయాస్తు విద్యుజ్జిహ్వంతు దానవమ్ ||
3 అజా వక్త్రవత స్తత్ర జఘాన రణగర్వితమ్ | తత్రాగమ్య తదా బ్రహ్మా నివాత కవచైస్సహ ||
4 చకార సఖ్యం సర్వాత్మా దశగ్రీవస్య రక్షసః | తతస్తు యుయుధే నాగై ర్ఘోర రూపైర్విషోల్బణౖః || 5 వశీకృత్వా తతోనాగాన్ వరుణస్య పురం య¸° | బ్రహ్మలోకగతే రాజన్ ! వరుణ సుమహాత్మని || 6 పుష్కరః ప్రదదౌ యుద్ధం రావణస్య దురాత్మనః | వరుణస్య సుతః శ్రీమాన్ జామాతా బలిన స్తథా || 7 సోమపుత్ర్యా మహారాజ! జ్యోత్స్న యా యః స్వయం వృతః | అర్థశాస్త్రం వాజానాతి యస్సమగ్రం మహాయశాః || 8 అస్త్రగ్రామం సమగ్రంచ తథా శస్త్రాణ్య నేకశః | రూపదాక్షిణ్య లావణ్య ధర్మచర్యైస్సమన్వితే || 9 బలేశౌర్యే తథా దానే తుల్యోయస్య నవిద్యతే | భ్రాతృభి ర్ర్భతృ పుత్రైశ్చ సైన్యేన మహతా యథా || 10 దత్వా యుద్ధం మహా ఘోరం సాంత్వయామాస రాక్షసమ్ | తత స్స నగరం జిత్వా వరుణం స మహాబలమ్ || 11 సైన్యైః విశ్రవసః పుత్రో మానుష్యం పునరాగతః | కిష్కంథాం స తతో గత్వా పురీం వానరపాలితామ్ || 12 పప్రచ్చ వానరాంశ్చైవ క్వాసౌ వాలీ మహాబలః | తం జగాద మహా తేజా తారోగహన గోచరః || 13 కిం స్యాత్తే వాలినా కార్యం తన్మమాచక్ష్వ పృచ్ఛతః | రావణః : యుద్ధాతిథ్య మహం తస్మాత్ ప్రార్థయామి వలీముఖాత్ || 14 బలవాన్ శ్రూయతే రాజా జిజ్ఞాసా తస్యమే బలే | తారః : జిజ్ఞాసితో యదా వాలీ త్వత్తో೭న్యై ర్బలవత్తరైః || 15 నిహతాః శతశ##స్తేన త్వత్తో వీర్య బలాధికాః | ఇదానీ మేవ నిహతో దుందుభి స్తేన రాక్షసః || 16 ప్రవిశ్య వివరం ఘోరం మాయావీ తేన ఘాతితః | బిలే ప్రవిష్టస్య తదా రాజన్ ! సంవత్సరం గతమ్ || 17 సుగ్రీవేణ తదా తస్య ద్వారం పిహితమాత్మనా | స తు సంవత్సరస్యాన్తే హత్వా మాయావినం రణ || 18 దదర్శ రాజన్ ! సుగ్రీవం కిష్కింథాయాం తదా೭నుజమ్ | స్వపన్త్యా రుమయా సార్ధం వాలి పత్న్యాచ తారయా || క్రీడమానం యథా శక్రం క్రోధస్య వశ మన్వగాత్ | రుమాం తారాం తథా హత్వా తేన నిర్వాసిత స్త్వసౌ || 20 నిర్వాసితేతు సుగ్రీవే పశ్చాత్తాప సమన్వితః | హన్తు కామస్తు సుగ్రీవం వాలీ పర్యచర న్మహీమ్ || 21 తదా వాలి భయ త్రస్తః సుగ్రీవో೭పి పలాయితః | న స లేభే సదా త్రాణాం తదా సస్మార రక్షసమ్ || 22 --జ్గ శాపం రాజేంద్ర ! వాలినం స తథా స్మయమ్ | హత్వాతు దుందుభిం వాలీ పాదాంగుష్ఠేన యోజయత్ || 23 చిక్షేప రాక్షస శ్రేష్ఠం మతంగస్యా శ్రమం ప్రతి | మతంగస్యాశ్రమం దృష్ట్వా రుధిరేణ సమన్వితమ్ || 24 శశాప వాలినం రోషాత్ తస్యా೭స్మిన్ మే తపోవనే | సద్యః ప్రవిష్ట మాత్రస్య జీవితం న భవిష్యతి || 25 అగమ్యం వాలినో జ్ఞాత్వా మతంగస్య మహద్వనమ్ | చతుర్భిః సచివైః సార్ధం సుగ్రీవ స్తముపాశ్రితః || 26 నలేన రాజన్ ! నీలేన తారేణ చ హనూమతా | హనుమాన్ సచివ స్తస్య దేవానా మపి నిర్భయః || 27 జాతమాత్రస్తుయో బాల్యే వీక్ష్య సూర్యం క మాప్లుతః | భక్ష్యార్థీ తస్య పార్శ్వస్థం రాహుం దృష్ట్వా నిశాచరమ్ || 28 సూర్య ముత్సృజ్య భక్ష్యార్థీ తదా రాహుం ప్రదుద్రువే | రాహు ర్జగామ శరణం భయా ద్భీతం చ వాసవమ్ || 29 తస్యాను ప్రయయా వేవ సతు బాలో మహాబలః | స దదర్శ మహాకాయం తదా శక్రస్య దన్తినమ్ || 30 తం ప్రదుద్రావ భక్ష్యార్థీ సశక్రం కుంజరోత్తమమ్ | ప్రాహరత్త్వరయా వజ్రం తతస్తస్య సురాధిపః || 31 తస్య వజ్ర ప్రహారేణ వామో హను రభజ్యత | హనుమా నితి తేనాస్య నామ చక్రే పితామహః || 32 క్రుద్ధం చ జగతాం వాయుం సాంత్వయిత్వా పితామహః | వరేణ ఛందయామాస హనూమన్తం మహాబలమ్ || 33 సర్వైః దేవ గణౖస్సార్ధం లోకానాం హిత కామ్యయా | అజరా೭మరతాం తస్య అజేయత్వం తథా రణ || 34 ప్రదదుః దేవతా స్సర్వే బలం చా ప్రతిమం తథా | స్వయం భగవతా తస్య సూర్యేణ సుమహాత్మనా || 35 శైలూషుడు రావణుని పాతాళ విజయవృత్తాంతమును వినగోరెదనన నాడాయనుడనియె. అటుపై నతడు పాతాళ##మేగి దైత్యవరులతో బోరెను. కాలఖంజులు కాలకేయులు నివాతకవచులునను దారుణులయిని దైత్యులతో యుద్ధమొనరించెను. తన శూర్పణఖ మగని విద్యుజ్జిహ్యుని మేకమొగముగలవాని నక్కడచంపెను. అప్పుడటకు బ్రమ్మవచ్చి నివాతకవచులకు రావణునికిని స్నేహమునేర్పరచెను. అవ్వల దశకంఠుడు విషపూర్ణులగు నాగులతో రణముగావించెను. నాగులను వశమొనరించుకొని వరుణ పురమేగెను. అత్తరి వరుణుడు బ్రహ్మలోకమునకుజన నక్కడ పుష్కరుడు రావణునితో దలపడెను. అతడు వరుణునికొడుకు. బలశాలి. బలికల్లుడు. సోమనికూతురు జ్యోత్స్నచే నాతడు స్వయంవరింపబడెను. ఆ పుష్కరుడు పూర్తిగ అర్థశాస్త్రమెరుంగును. సమగ్రముగ నస్త్రగ్రామముం దెలిసినవాడు. రూపము దాక్షిణ్యము లావణ్యము ధర్మాచరణమునందు బలమున శౌర్యమున దానమునందు నాతని నముడులేడు. సోదరులతో వారికొడుకులతో మహాసేనతోగూడి రాక్షసరాజునకు పోరొసంగి వానిని మంచి చేసికొనెను. నగరము వరుణుని జయించినతరువాత సైన్యములతో మనుజలోకమునకు దిరిగివచ్చెను. అటుపై నతడు కిష్కింధకేగి వాలి యెక్కడనని వానరులనడిగెను. కిష్కింధ ప్రాంతారణ్యములందుండు తారుడను వానరుడు వాలితో నీకేమిపని యదినాకు దెలుపుమనియె. వానికి రావణుడు యుద్ధాతిథ్యమా వానరుని ప్రార్థించుచున్నాను. మంచి బలశాలి విన్నాను. ఆజలమేపాటిదో తెలియగోరెదను అనవిని తారుడు నీకంటె బలవత్తరు లెందరిచేతనో తెలియగోరి వందలకొలది నీకంటె వీర్యవంతులు మోనగాండ్రు వానిచే గూలినారు. ఇపుడే వానిచే దుందుభి హతుడైనాడు. ఘోరమైన భువిపరముంజొచ్చి మయావి వాడు రావణునిచే మడిసెను. ఆ బలమునందు బ్రవేశించిన తరువాత నొక్కసంవత్సరము గడచెను. సుగ్రీవుడికనన్నరాడని యా బిలద్వారమును గప్పివేసెను. వాలి సంవత్సరముతుది యా మాయావిం దుందుభింగూల్చి యాబిలమువెడలివచ్చి కిష్కింధయందు దమ్మునిపరున్న రుమతో వాలి భార్య తారతో గ్రీడించుచుండ నింద్రునింబోలినవానిం జూచెను. అప్పుడు రుమను తారను దానుహరించి సుగ్రీవుని వెడలనడచెను. సుగ్రీవుడు వెడలిపోవ బశ్చాత్తాపముగొని వానింజంపనెంచి మహీమండలమెల్ల దిరిగెను. వానికి జడిసి సుగ్రీవుడు పారిపోయి రక్షణ లభింపక యప్పుడు రాక్షసుని దుందుభిని వాలికి మతంగశాపము విషయము జ్ఞప్తిసేసికొనిదుందుభినిగూల్చి వాలి వానిని కాలిబొటన వ్రేల మతంగాశ్రమమువైపు విసరెను. అయ్యాశ్రమము వానిరక్తముచే దడియుటగని యమ్ముని రోషముగొని యీ మహారణ్యమం దిక్కడ యడుగిడిన యాక్షణము ప్రాణముండదని శాపమిచ్చెను. వాలికది యగమ్యమనితెలిసి తననల్గురు మంత్రులతో సుగ్రీవుడా మతంగాశ్రమము నాశ్రయించెను. ఆ సచివులు నలుడు నీలుడు తారుడు హనుమంతుడును. ఆయన మంత్రి హనుమంతుడు దేవతల కేని భయపడడు. పుట్టగనే యతడు భక్షించుటకేదేని వస్తువుంగోరి సూర్యునింగని నింగికెగరెను. ఆ సూర్యుని పార్శ్వమందున్న నిశాచరుని రాహుపుంజూచి సూర్యునివిడిచి యారాహువుపైకి బరువిడెను. రాహువు జడిసిపోయి యింద్రుని శరణందెను. మహాబలుడు వాయుజుడు వానిని వెంబడించెను. అటనతడు దేవేంద్రుని వాహనము నైరావత గజముంగని దానిందినగోరి దానిపైకి బరువెత్త నా బాలునింద్రుడు వజ్రమునం గొట్టెను. ఆ వజ్రముదెబ్బకాపిల్లవాని దవడ (హనువు) పగిలెను అందుచే నతనికి బ్రహ్మ హనుమంతుడను పేరుపెట్టెను. (వజ్రాయుధము దెబ్బకుగూడ నాగిన ప్రశన్తమైన హనువు గలవాడుగావున హనుమంతుడను పేరు నిర్వచింపబడినది) అప్పుడు తన కుమారు నింద్రుడు గొట్టెనని వాయువు కోపింప నావాయుదేవుని పితామహుండు బ్రతిమాలి హనుమంతు నభీష్టవరము కోరు కొమ్మనియె. అతడు సర్వదేవతలతో బ్రహ్మలోక హితము కొఱకా హనుమంతునికి అజరామరత్వమును అజేయత్వమును వరమొసంగెను. దేవతలెల్లరు సూర్యభగవానుడును నతనిక ప్రతిమానబల మనుగ్రహించిరి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున రావణ విజయప్రసంగమున వాలి సుగ్రీవ చరిత్రమను రెండువందల యిరువది మూడవ యధ్యాయము.