Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఇరుదియైదవ అధ్యాయము - త్రిపురదహనము వినాయకం తు తుష్టాన తతః శంభు స్త్రిలోక ధృక్ | పురాణాం సంగమార్థాయ అవిద్యే నేతి మానద !
1 శంకరః : నమస్యామి మహాబాహుం దేవదేవం గణశ్వరమ్ | హస్తి వక్త్రం మహాకాయం వ్యాఘ్ర చర్మాంబర ఛదమ్ 2 చంద్ర రశ్మి ప్రతీకాశం చారుదంష్ట్రో జ్జ్వలాసనమ్ | భక్తానాం విఘ్న శమనం సురాద్యం పార్వతీసుతమ్ ||
3 పరశ్వథధరం వీర మక్షమాలా విభూహితమ్ | బ్రహ్మణ్యం వరదం సౌమ్యం విఘ్నానాం పతి మూర్జితమ్ ||
4 పీనాస్యం లంబజఠరం హార భారార్పితో దరమ్ | అష్టమీ చ చతుర్థీచ వృతా యేన చతుర్దశీ ||
5 కుల్మాషోత్ల్కోపికా పూపై ర్మోదకైరోదనేన చ | పూజయన్తి జనా లోకే ధూప మాల్యాను లేపనైః || 6 స్వస్తి వాచనకై శ్చైవ తేషాం నాస్తీహ దుర్లభమ్ | పుత్రార్థీ లభ##తే పుత్రాన్ ధనార్థీ ధనముత్తమమ్ || 7 వ్యాధిత శ్చ తథా రోగ్యం బద్ధో ముచ్యేత బంధనాత్ | త్వాంతు సంపూజయిత్వా వై వరదం కామ రూపిణమ్ || 8 ఇష్టాన్ కామా నవాప్నోతి నాత్ర కార్యా విచారణా | య శ్చధీతే స్తవ మిమం తవ నిత్యం గణశ్వర! 9 తస్యా೭పి సర్వకామానాం సదా దాతా భవిష్యసి | నాడాయనః- ఇత్యేవ సం స్తుతః శ్రీమాన్ శంకరేణ వినాయకః || 10 ఏకస్థాన గతం చక్రే వినావిఘ్నం పురత్రయమ్ | ఏకస్థం త్రిపురం విష్ణుః శరాగ్రస్థో ధను శ్చ్యుతః || శంకర ప్రేరితః శీఘ్రం తదా చక్రే స భస్మసాత్ || 11 పురత్రయే దేవ వరేణ తేన వినిర్మితే೭ భూజ్జగతాం ప్రహర్షః | జగ్ము స్తదా దేవగణాః ప్రహృష్టాః స్థానాని రాజేంద్ర ! తథా స్వకాని || 12 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయన వాక్యే త్రిపురదాహ వర్ణనం నామ పంచ వింశత్యుత్తర ద్విశత తమో೭ధ్యాయః త్రిలోకధారి శంభుడు పురముల కలయికకు వినాయకునిస్తుతించెను. మహాబాహుడు దేవదేవుడునగు వానియకుని మ్రొక్కెదను. గజముఖుని మహాకాయుని వ్యాఘ్రచర్మము పై గప్పుకొనువానిని చంద్రకాంతియట్లచ్చము తెల్లనైన వానిని చక్కని దంతములతో రాజిల్లు మొగముగలవానిని భక్తుల విఘ్నముల హరించు వానిని దేవతలకు జ్యేష్ఠుని (తొలివేల్పును) పార్వతీసుతుని పరశ్వథధారిని వీరుని అక్షమాల నలంకరించుకొను వానిని బ్రహ్మణ్యుని వరదుని సౌమ్యుని విఘ్నపతిని ఊర్జితుని నిండుగ పుష్టిగనున్న మోము వానిని వ్రేలాడు బొజ్జవానిని హారముల బరువునదూగు నుదరముగలవానిని అష్టమి చవితి చతుర్దశియునను తిథులను దనవిగా నెంచికొన్న యాస్వామిని అనాడు కుల్మా షోత్కోపికలతో నప్పములతో మోదకములతో (ఉండ్రాళ్లతో నివేదించుటచే ధూపదీపాద్యుప చారములచే స్వస్తివాచనములతో బూజించు జనులకు లభింపని దేదియులేదు. పుత్రార్థులు పుత్రులను ధనార్థులు ధనమును బొందుదురు. వ్యాధిగ్రస్తు డారోగ్యవంతుడగును. బంధమందున్నవాడు బంధముక్తుడగును. నిన్ను వరదుని కామరూపుని బూజించిన వారభీష్టములంబడయుదురు. ఇక్కడ విమర్శింప నక్కరలేదు. ఈస్తవముం జదివినాతనికి సర్వకామ ప్రదాత అని యిట్లు శంకరునిచే వినాయకుడు సంస్తుతుండై గణశుండు విఘ్నములేకుండ మూడుపురములనొకచో గుమికూడినవిగావించెను. విష్ణువు ధనుస్సునందెక్కిడి విడువబడిన శివబాణము చివరనుండెను. ఆబాణము శంకర ప్రేరితమై శీఘ్రముగ పురత్రయముం భస్మము సేసెను దేవవందు వినాయకుడు మూడు పురముల నొక్కచో జేర్చినంత జగమ్ములానంద భరితములైనవి. అప్పుడు దేవగణములు హర్షముతో దమ స్థానములకుం జనిరి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున త్రిపురదహన వర్ణనమను రెండువదల యిరువదియైదవ అధ్యాయము.