Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఇరువదిఆరవ అధ్యాయము - అంధకాసురనిగ్రహము నాడాయనః- తసై#్యవ దేవదేవస్య శృణు కర్మేద ముత్తమమ్ | అసీ ద్దైంత్యోంధకో నామ భిన్నాంజన చయోపమః ||
1 తపసా మహతా యుక్త స్త్వవధ్యశ్చ దివౌకసామ్ | స కదాచి న్మహా దేవం పార్వత్యా సహితం ప్రభుమ్ ||
2 క్రీడమానం తదా దృష్ట్వా హర్తుం దేవీం ప్రచక్రమే | తస్య యుద్ధం తదా ఘోర మభవ త్సహ శంభునా ||
3 రుద్ర వర్ణ వినిర్భేదే రుధిరా దంధకస్య తు | అంధకాశ్చ సముత్పన్నాః శతశో೭థ సహస్రశః || 4 తేషాంచ దార్యమాణానాం రుధిరా దపరే పునః | బభూవురంధకా ఘోరా యై ర్వ్యాప్త మఖిలం జగత్ || 5 ఏవం మాయావినం దృష్ట్వా దేవదేవ స్తథా೭ంధకమ్ | 6 పానార్థ మంధకాస్రస్య ససృజే మాతర స్తథా | మాహేశ్వరీం తథాబ్రాహ్మీం కౌబేరీం చానలీం తథా || 7 సౌవర్ణీ మథ వాయవ్యాం శాక్రీం వై నైరృతీం తథా | సౌరీం సౌమ్యాం శివాం దూతీం చాముండా మథ వారుణీమ్ || 8 వారాహీం నారసింహీం చ వైష్ణ వీంచ లలత్థికామ్ | వతానందాం భగానందాం పిచ్ఛిలాం భగ మాలినీమ్ || 9 బలామతి బలాం రక్తాం సురభీం ముఖ ముండికామ్ | మాతృ నందాం సునందాంచ బిడాలీం శాకునీం తథా || 10 రేవతీంచ మహారక్తాం తథైవ పిలిపిచ్ఛికామ్ | జయాంచ విజయాం చైవ జయన్తీం చాపరాజితామ్ || 11 కాశీం చైవ మహాకాశీం కాలదూతీం తథైవ చ | సుభగాం దుర్భగాం చైవ కరాశీం దేహనీం తథా || 12 అదితించ దితిం చైవ మాలినీం మృత్యు మేవ చ | కర్ణమోటీం తథా యామ్యాం ఉలూకీం చ ఘటోదరీమ్ || 13 కపాలీం వజ్ర హస్తాం చ పిశాచీం రాక్షసీం తథా | భు రుండీం హుంకురీం చండాం శైవాంచ కటకాం తథా || 14 ఘంటాం సులోచనాం ధూమ్రామేక వాలీం కపాలినీమ్ | విశాలాం దష్టికాం శ్యామాం త్రిజటీం కుకుహూం తథా || 15 వినాయకీం చ వైతాశీ మున్మత్తాం శుభనాం తథా | సిద్ధించ లేలిహానాంచ కేకరాం గర్దభీం తథా || 16 తర్కటీం బహుపుత్రాంచ ప్రేతయానాం విటం పురామ్ | క్రౌంచీం సూకరముఖీంచ వితతాం సరమాం దనుమ్ || 17 ఉపారంభాం పినాకాంచ లలితాం చిత్రరూపిణీం | స్కంధాకారాం వషట్ స్వాహాం ధృతిం జ్యేష్ఠాంకవర్దనీమ్ || 18 మాయా విచిత్ర రూపాంచ కామ రూపాం వశంగమామ్ | స్వకంబలాం సింజికాం చ మహానాసాం మహాముఖీమ్ || 19 కౌమారీం రోచనాం భీమాం సదా హాసాం మదోద్ధతామ్ | అరక్తాక్షీం కాల కర్ణీం భర్తృకర్ణీం మహాన్వనీమ్ || 20 కేశినీం శిఖినీం లంబాం పింగాక్షీం లోహితా ముఖీమ్ | ఘంటారవాం చ దంష్ట్రాలాం లోచనాం కాచజంఘికామ్ || 21 గోకర్ణికాం గోముఖికాం మహీగ్రీవాం మహా ముఖీమ్ | ఉల్కాముఖీం ధూమ్ర శిఖాం కవనాం పరికంపితామ్ || 22 మోహినీం కుండనీల త్వేడాం నిర్భయాం బాహుశాలినీమ్ | శూర్ప కర్ణీం తథైకాక్షీం విశోకాం నందినీం రుచిమ్ || 23 జ్యోత్స్నా ముఖీం వరపురాం నికుంభాం రక్తకంపనామ్ | అవికారాం మహాచిత్రాం చిత్రసేనాం మనోరమామ్ || 24 సుదర్శనాం హరత్పాపాం మాతంగీం లంబమేఖలాం | సుబాలాం బాల తర్కారీం ప్రేమోదాం లాంగలావతీమ్ || 25 చిత్తాం విత్తాం జడాం కోణాం శాంతికాం భసితాశనీమ్ | లంబస్తనీం లంబ ఘంటాం వినతాం వామచూడనీమ్ || 26 స్వలతిం దీర్ఘకేశీంచ సులతా సుందరీ సమా | అధోముఖీ కటుముఖీ క్రోధనీ వసు వాశినీ || 27 విరావిణీ వత్సరుతా మాషా భాజన శాలినీ | కుటుంబికా శుక్తికా చ చండికా బలమోహినీ || 28 మాంసాన్య హాసినీ లంబా గోవిధారీ సమాగధీ | ఏతా శ్చాన్యాః స దేవేంద్ర ! ససృజే మాతర స్తదా || 29 నాడాయనుడు అమహాదేవుని యుత్తమచరితమిదె వినుము మున్నుంధకుడను రాక్షసుడుండెను. నూరిన కాటుకవలె కాఱునలుపు మేనివాడు. తపఃప్రభావముచే దేవతల కవధ్యుడై యుండెను. ఒకపుడు పార్వతితో వినోదించుచున్న యీశ్వరుంగని పార్వతిని హరింప నుద్యమించెను. అపుడు వానికి శంభువుతో ఘోరరణమయ్యెను. అంధకునిరక్తమువలన రుద్రునిమేనిరంగు మార్పుసెందింనంత వందలువేలంధకులు పుట్టిరి. వారిహరుడు చీల్ప మరియునట్లె యా రక్తమునుండి పెక్కు మంది యంధకులు పుట్టిరి. వారిచే జగమెల్లనిండెను. ఇట్లు మాయావి నారక్కసుంగని వాని రక్తము ద్రావుటకు మాతృదేవతల సృష్టించెను. వారు మహేశ్వరి బ్రహ్మ మొదలయినవారు. వారిపేర్లు 7 వశ్లోక మునుంచి 29శ్లో మూలములో సులభముగా తెలియుచున్నవి. అందుచే ననువాదమందు చేర్పబడలేదు. అంధకానాం మహాఘోరం వపు స్త ద్రుధిరం తదా | తతోంధకా సృజా సర్వాః పరాం తృప్తి ముపాగతాః || 30 తాస్తు తృప్తాః సు సంభూతాః భూయ ఏవాంధకా సృజా | అర్దితో యై ర్మహాదేవః శూల ముద్గర పట్టిశైః || 31 తత స్స శంకరో దేవ స్త్వంధకైః వ్యాకులీ వృతః | జగామ శరణం దేవం వాసుదేవ మజం విభుమ్ || 32 తతస్తు భగవాన్ విష్ణుః సృష్టవాన్ శుష్కరేవతీమ్ | సా వపౌ సత్వరం తేషా మంధకానా మసృక్ క్షణాత్ || 33 యథా యథా చ రుధిరం పిబత్యంధక సంభవమ్ | తథా తథా ೭ధికం దేవీ సం శుష్యతి జనాధిప ! 34 పీయ మానే తదా తేషాం అంధకానాం తథా ೭సృజి | అంధకాస్తు క్షయంనీతాః సర్వేతే త్రిపురా೭రిణా || 35 మూలాంధకం తు విక్రమ్య తదా సర్వత్ర లోక కృత్ | చకార వేగాన్ శూలాగ్రే తదా తుష్టాన శంకరమ్ || 36 అంధకః సు మహావీర్యః తస్య తుష్టో೭ భవ ద్భవః | సామీప్యం ప్రదదౌ నిత్యం గణశత్వం తథై వచ || 37 ఆమాతృదేవత లంధకుల రక్తమును ద్రావిరి. దానివలనవారు పరమతృప్తినందిరి. అయినను నంధకుని రక్తమునుండి యంధకోత్పత్తియాగలేదు. అవ్వలగూడ యంధకులచే వ్యాకులపెట్టబడి శంకరుడు అజుని ప్రభువును వాసుదేవుని శరణందెను. విష్ణువపుడు శుష్క రేవతియను శక్తిం బుట్టించెను. ఆమె క్షణములో నాయంధకుల రుధిరమును ద్రావివైచెను. అమెయా రక్తముం ద్రావిన కొలది చిక్కిపోదొడగెను. అంధకులుమాత్రము శుష్కరేవతి త్రావిన తర్వాత సులభముగా వారిని త్రిపురారి నాశమందిరిచెను. మూలాంధకునిపై లోకకర్త రుద్రుడు విజృంభించి వానిందన శూలమునం గ్రుచ్చిపట్టెను మహావీర్యుడంధకాసురుడప్పుడు శంకరునిస్తుతించెను. దాన శంకరుడు సంతుష్టుడై వాని తన సాన్నిధ్యమును గణాధి పత్యమును నొసంగెను. తతో మాతృగణాః సర్వే శంకరం వాక్య మబ్రువన్ | భగవన్ ! భక్షయిష్యామః సదేవా೭సుర మానుషమ్ || 38 త్వ త్ర్పసాదా జ్జగత్సర్వం తదనుజ్ఞాతు మర్హసి | శంకరః- భవతీభిః ప్రజా స్సర్వాః రక్షణీయాః న సంశయః || 39 తస్మా ద్ఘోరా దభిప్రాయా న్మనః శీఘ్రం నివర్త్యతామ్ | నాడాయనః-ఇత్యేవం శంకరేణోక్తం త్వనాదృత్య వచస్తుతాః || క్షోభయా మాసు రవ్యగ్రా సై#్తలోక్యం స చరా చరమ్ | త్త్రైలోక్యే భక్ష్యమాణ తు తదా మాతృగణౖ ర్నవైః || 41 నృసింహమూర్తిం దేవం చ ప్రదధ్యౌ భగవాన్ శివః | అనాది నిధనం దేవం సర్వలోక భవో ద్భవమ్ || 42 దైత్యేంద్ర వక్షో రుధిర ప్రోక్షితోరు మహాననం | విద్యు జ్జిహ్వం మహాదంష్ట్రం స్ఫుట కేసర సంకటమ్ || 43 కల్పాంత మారుత క్షుబ్ధ సప్తార్ణవ మహాస్వనమ్ | వజ్రాగ్ర తీక్ష్న నఖర మాకర్ణా ద్దారితా సనమ్ || 44 మేరు శైల ప్రతీకాశ ముదయార్క సమేక్షణమ్ | హిమాద్రి శిఖరాకారం చారు దంష్ట్రో జ్జ్వలాననమ్ || 45 ఖ వినిసృత రోమాగ్నిం జ్వాలా కేసర మాలినమ్ | బద్ధాం గదం సుముకుటం చారుకేయూర భూషణమ్ || 46 శ్రోణి సూత్రేణ మహతా కాంచనేన విరాజితమ్ | నీలోత్పల దశ శ్యామం వాసోయుగ విభూషితమ్ || 47 తేజసా క్రాంత సకల బ్రహ్మాండాంతర మండపమ్ | సాదర భ్రామ్య మాణానాం హుత హవ్య ఘనార్చిషామ్ || 48 ఆవర్తై సృదృశా కారైః సంయుక్తం దేవలోమజైః | సర్వ పుష్ప విచిత్రాంచ ధారయానం మహాస్రజమ్ || 49 స ధ్యాత మాత్రో భగవాన్ ప్రదదౌ తస్య దర్శనమ్ | యాదృశేనైన రూపేణ ధ్యాతో రుద్రేణ భక్తితః || 50 తాదృశే నైవ రూపేణ దుర్ని రీక్ష్యేణ దైవతైః | ప్రణిపత్యతు దేవేశం తదా తుష్టావ శంకరః || 51 అవ్వల మాతృగణములంబికావల్లభునితో భగవంతుడా! నీయను గ్రహముచే సదేవాసుర మానుషమైన యెల్లజగముం భక్షింపగలము. అది నీవనుమతింప నగునననియె శంకరుడు మీచే సర్వప్రజలు రక్షణీయులు అందువలన నీ ఘోరమైన నీతలంపు నుండి శీఘ్రమ నీవుమఱులుమన వారాపరమేశ్వరుడన్నది ద్రోసిపుచ్చి వెనుదివక చరాచర జగత్త్రయమెల్ల సంక్షోభింప జేసిరి. త్రిభువనము లీక్రొత్త మాతృగణములచే భక్షింపబడుచుండ శివుడనాధి నిధను సర్వలోకకారణుని నృసింహమూర్తియైన విష్ణువుం ధ్యానించెను. నరసింహమూర్తి వర్ణనము దైత్యేంద్రుడగు హిరణ్యకశిపు యురముంజీల్ప జిమ్ముకొన్న రక్తముగారు మహానఖములు మెఱుపుంబోలిన నాలుక పెద్ద కోరలు నిక్కిన జూలుచే వరమసంకటరూపము కల్పాంత తీవ్రవాయు సంక్షుబ్ధ సప్తసముద్రధ్వనిం బోలినగర్జనము వజ్రమునంచు వలె పదునైనగోళ్లు చెవులదాక విస్తరించిన ముఖము మేరుపర్వతమట్టి మూర్తిఉదయ భానుడట్టెఱ్ఱని కళ్లు హిమాద్రిశిఖరమంతెత్తయిన యాకారము మెఱుగారుపెను కోరలు నింగినలముకొన్న రోమాగ్ని మంటలు చెరగు జూలుంబూని అంగదములుపూని చక్కనికేయూరములలంకరించుకొని బంగారపు మొలత్రాడు గైసేసి నల్లగలువంబోని శ్యామల వర్ణముగొని కట్టుపుట్టముత్తరమందాల్చి సకల బ్రహ్మాండాంతరమండలమున నిండుకొన్న తేజస్సుదొయం హవిర్భాగములందుకొను నాదరముతో సూరక భ్రమించు హోమాగ్ని జ్వాలావర్తములతో సమానాకారములైన శరీర రోమకళతో గూడికొని అన్ని రకాల పూవులచే రంగురంగులు గొన్న పెద్ద, పూల మాలను ధరించి యా ఉగ్రనరసింహమూర్తి యీశ్వరుడు ధ్యానించిన మాత్రాన భక్తితో రుద్రుడేలాటి రూపమున ధ్యానించెనో సరిగా వేల్పులకు జూడవశముగాని యదేరూపముతో దర్శనమొసంగెను. శంకరుడును నాదేవేశుని మ్రొక్కి యిట్లు స్తుతించెను. శంకరః- నమస్తే೭స్తు జగన్నాథ! నరసింహ వపుర్ధర ! దైత్య నాథా೭స్థి సంపూర్ణ! నఖ శుక్తి విరాజిత! 52 తదస్రకణ సంలగ్న హేమ పింగళ విగ్రహ | మేరోః స పద్మరాగస్య శోభాం ధత్సే జగద్గురో || 53 కల్పాంతాం భోద నిర్ఘోష ! సూర్యకోటి సమప్రభ ! సహస్ర యమ సంక్రోధ సహస్రేంద్ర పరాక్రమ ! 54 సహస్రధనద స్ఫీత ! సహస్ర వరుణాత్మక : సహస్ర కాల చరిత సహస్ర నియతేంద్రియ ! 55 సహస్రభూమి సద్ధైర్య ! సహస్రా సన్త మూర్తిమత్ ! సమస్ర చంద్ర ప్రతిమ ! సహస్ర హరి విక్రమ ! 56 సహస్ర రుద్ర తేజస్క ! సహస్ర బ్రహ్మ సంస్తుత ! సమస్ర వాయువేగోగ్ర ! సహస్ర జ్యోతి రీక్షణ ! 57 సహస్ర యంత్ర మథన ! సహస్రా೭೭బాధ మోచన | అంధకస్య వినాశాయ సృష్టా యా మాతరో మయా || 58 అనాదృత్య తు మద్వాక్యం భక్షయం త్యశ్చ తాః ప్రజాః | కృత్వా తా శ్చ నశక్తో ೭హం సంహస్తు మపరాజిత ! 59 స్వయం కృత్వా కథం తా సాం వినాశమపి రోచయే | నాడాయనః : ఏవముక్తస్సరుద్రేణ నారసింహ వపుర్ధరః || 60 ససర్జ దేవీం జిహ్వాతః తదా వాగీశ్వరీం హరిః | హృదయా చ్చ తథా మాయాం గుహ్యాచ్చ భగమాలినీమ్ || 61 అస్థిభ్యశ్చ తథా కాలీ సృష్టా పూర్వం మహాత్మనా | యయా తద్రుధితం పీత మంధకానాం మహాత్మనామ్ || 62 యా తస్మిన్ కథితా లోకే నామతః శుష్క రేవతీ | ద్వా త్రింశ న్మాతరః సృష్టాగా త్రేభ్య శ్చక్రిణా తతః || 63 తాసాం నామాని వక్ష్యామి తానిమే గదతః శృణు! | సర్వక్లిష్టా మహా భాగా కంఠ కర్ణీ తథైవ చ || 64 త్రైలోక్య మోహినీ పుణ్యా సర్వ సత్త్వ వశం కరీ | తథా చ చక్రహృదయా పంచమా వ్యోమ చారిణీ || 65 శంఖినీ లేఖినీ చైవ కాల సంకర్షిణీ తథా | ఇతి దేవ్యష్టకం రాజన్! వాగీశ్యను చరం స్మృతమ్ || 66 అజితా సూక్ష్మ హృదయా వృక్షా వేశా೭ శ్మదర్శనా | నృసింహ భైరవా చిల్లా గురు త్పక్ష హృదనయా || 67 భగమాలి న్యను చరా ఇత్యష్టౌ నృపమాతరః | ఆకర్షణీ చ భారూటీ తథై వోత్తర మాలికా || 68 జ్వాలా ముఖీ భీషణికా కామధేనుశ్చ బాలికా | తథా పద్మకరా రాజన్ ! రేవత్యను చరాః స్మృతాః || 69 అష్టౌ మహాబలాః సర్వాః దేవగాత్ర సముద్భవాః | త్రైలోక్య సృష్టి సంహార సమర్థాః సర్వదేవతాః || 70 నమస్కారము జగన్నాథ! నరసింహావతారధర! దైత్యనాథుడగు హిరణ్యకశిపు నెముకలు ప్రేవులు నిండ దాల్చినప్రభూ! ముత్తెపు చిప్పలంబోలు నఖములందీపించు దొర! వానిరర్తకణములంటిన మేలిమి బంగారు నెఱుపురంగునం జెలంగుమేనివాడ! పద్మ రాగమణులతోడి మేరుపుయొక్క (బంగారుకొండయొక్క) శోభందాల్చి యున్నావు జగద్గురూ! కల్పాంతమేఘ నిర్ఘోష! కోటి సూర్యప్రభ! వేయి మంది యములకోప మొక్కడవ దాల్చితివి. వేయిమంది కుబేరు సంపద నీయంద రూపొందినది. సహస్రవరుణ స్వరూప! సహస్రకాల చరిత్ర వేయిమంది జితేంద్రియులయేకైకస్వరూప మీవయైయున్నావు. క్షమాసహస్ర క్షమాశాలి! (వేయి భూదేవతల యోరిమిగలవాడా!) సహస్రానంతమూర్తి (వేయిమంది ఆదిశేషుల స్వరూపమయినవాడన్నమాట) వేయిమంది చంద్రులట్లు దీపించు వాడ! వేయిమంది హరులయొక్క విక్రమము వేయిమంది రుద్రులతేజస్సుగలవాడ! సహస్రబ్రహ్మరూప సహస్ర వాయువేగ మహోగ్ర సహస్రజ్యోతిరీక్షణ సహస్రయంత్రమథన ! సహస్రాబాధమోచన! నీకు వందనము. అంధకుం జంపనేను మాతృశక్తుల సృజించితిని. వారునామాటకాదని ప్రజలం దినివేయుచున్నారు. సృజించినది నేనైనను వారిని సంహరింపలేకున్నాను ఓ అపరాజిత! నేనుచేసివారి నేనే చంప నెట్లిష్టపడుదును? అనవిని నరసింహమూర్తి విష్ణువపుడు తన నాలుకనుండి వాగీశ్వరిం బుట్టించెను. హృదయమునుండి మాయను గుహ్యమునుండి భగమాలిని యెముకలనుండి కాశినింతమున్న సృజించెను. ఆమెయే అంధకుల రక్తముంద్రావినది. శుష్కరేవతి యామెయే. అవ్వల చక్రితన గాత్రములనుండి (శరీరములనుండి) ముప్పదిరెండు మాతృశక్తులను సృజించెను వారి వేర్వేరు బోర్కొందు నిదె వినుము. వారి పేర్లు సర్వక్లిష్టమొదలు కాలసంకర్షిణిదాక యెనమండుగురు వాగీశ ననుచరించువారు. అజితమొదలెనమండుగురు భగమాలినీశక్తియనాచారిణులు. అకర్షిణి మొదలెమండుగురు రేవతీశక్తియను చారిణులు. నాలుగష్టగణములివి మొత్తము ముప్పదియిదరు నృసింహశరీరమునుండి పుట్టినవారు. వీరందరు త్రైలోక్య సృష్టి సంహారములు సేయగలవారు. తాః సృష్ట మాత్రా దేవేన క్రుద్ధా మాతృ గణ స్యతు | వ్రధావితా మహారాజ ! క్రోధ విస్ఫూర్జి తే క్షణాః || 71 అవిషహ్యతమం తాసాం దృష్ట్వా తేజః సుదారుణమ్ | భ##యేన శరణం ప్రాప్తాః దేవేశం పూర్వమాతరః || 72 శరణార్థ మను ప్రాప్తాః నృసింహో వాక్య మబ్రవీత్ | నరసింహః- యథా మనుష్యాః పశవః పాలయన్తి వరాననాః || 73 యజన్తి తై శ్చ పశుభిః తథా వై దేవతా గణాన్ | భవత్య శ్చ తథా లోకాన్ పాలయన్తు మయేరితాః || 74 మనుజై శ్చ తథా దేవం యజధ్వం త్రిపురాన్తకమ్ | యే చ మాం సంస్మరన్తీ హ తేచ రక్ష్యాః సదా నరాః || 75 బలికర్మ కిరిష్యన్తి యుష్మాకం యే సదానరాః | సర్వకామ ప్రదాస్తేషాం భవిష్యధ్వం తథై వచ || 76 తత్సాద నాదికం యేచ కరిష్యంతి హరే రితమ్ | తేచ రక్ష్యా సదాలోకే రక్షితవ్యం చ శాసనమ్ || 77 రౌద్రాం చైవ పరాం మూర్తిం మహాదేవః ప్రదాస్యతి | యుష్మ భ్యం సమయాసార్ధం తేనసార్ధం వరస్యధ ! 78 మయా మాతృ గణః సృష్టః యోయం విగత సాధ్వసః | ఏష నిత్యం విశాలాక్ష్యో మయైవ సహ రంస్యతి || 79 మయా సార్ధం తథా పూజాం వీరేభ్యశ్చైవలప్స్ససి | పృథక్ చ పూజితో లోకే సర్వాన్ కామాన్ ప్రదాస్యతి || 80 శుష్కాం సంపూజయి ష్యన్తి యేతు పుత్రార్థినో జనాః | తేషాం పుత్ర ప్రదా దేవీ భవిష్యతి న సంశయః || 81 నాడాయనః- ఏతావ దుక్త్వా భగవాన్ సహ మాతృ గణనచ | జ్వాలా మాలా కులవపుః తత్రై వాంత రధీయత || 82 సమాతృ వర్గో೭పి హరస్య మూర్తిం సదాయజన్ తిష్ఠతి తత్సమీపే | దేవేశ్వర స్యాపి నృసింహ మూర్తేః పూజాం విధత్తే త్రిపురాంతకారీ || 83 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే అంధకజయ వర్ణనం నామ షడ్వింశ త్యుత్తర తమో೭ధ్యాయః. దేవునిచే సృష్టింపబడిన మాత్రన గుపితలై కన్నుల నిప్పులురాలం బరువులెత్త నారంఖించిరి. వారిమిగుల యవిషహ్యమైన దారుణమైన తేజస్సుగని యంతమున్ను సృష్టింపబడిన మాతృశక్తులు భయమంది నృషింహస్వామిని శరణందిరి. స్వామి వారింగని యిట్లనియె. మనుష్యులు పశువులను గాచికొని వానిచే దేవతాగణమును యజించుతరి (యజ్ఞములు సేయునప్పుడన్నమాట) నామాట ననుసరించి మీరులోకములను బాలింపుడు. మనుజులతో మీరును త్రిపురాంతకుని శంకరుని యజింపుడు. నన్ను స్మరించు వారిని గూడ మీరు రక్షింపవలయును. మీకై బలికర్మమొనరించు నరులకు మీరు సర్వాభీష్టముల నిండు విష్ణువు సెప్పిన యా సాధనము సేసిన వారిని రక్షింపవలెను. వారి శాసనమునుగూడ మీరు పాటింపుడు. మహేశ్వరుడు మీకు రౌద్రమైన యాకారము నిచ్చెను. ఆయననునాతో ఆయనతోనన్ను సేవింపుడు. (హరిహరులను మమ్మభేదదృష్టితో నారాధింపుడన్న మాట) నేనుసృజించిన యా మాతృగణము భయమనునదిలేక నాతోడనే క్రీడింపగలదు. ఓవిశాలాక్షి! ఇది నాతోబాటు వీరులవలన (శాక్తోపాసకులకు వీరులను పేరు ప్రసిద్ధము) పూజనందును. వేరుగా పూజింపబడియు సర్వాభీష్టములీగలదు. పుత్రార్థులై శుష్కరేవతిం బూజించినవారికామె పుత్రుల నీయగలదు. సంశయములేదు. అనియిట్లు నృసింహస్వామి పలికి మాతృగణముతోగూడ జ్వాలామాలాకుల విగ్రహుడై యటనే యంతర్ధానమందెను. ఆమాతృగణము గూడ హరమూర్తిని యజించుచు తత్సమీపమందే యుండును. దేవేశ్వరుడగు నరసింహ మూర్తిని త్రిపురాంతకుడారాధించును. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అంధకాసుర నిగ్రహమను రెండువందల యిరువది యారవ యధ్యాయము.