Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఇరువదిఏడవ అధ్యాయము - మాతృబాధాచికిత్స

శైలూషః : మాతృదోష ప్రశమనా న్మహేశ్వర ముఖో దితాన్‌ | ప్రయోగాన్‌ శ్రోతు మిచ్ఛామి వదతస్తే ద్విజోత్తమ ||

నాడాయనః : చోచకం తు వాచకృష్టం బ్రహ్మబూత జటే శుభే | కాలమంజా హరిద్రే ద్వే యవచూర్ణ విమిశ్రితమ్‌ || 2

ఉద్వర్తన మిదం ప్రోక్తం మాతృదోష వినాశనమ్‌ | అరిష్టారిష్ట పత్రాణి తాలజీర కయో స్తథా || 3

శింశిపా మలకీ బిల్వ కపిత్థానాం తథైవ చ | బహుకారత్వం చం పూర్వాం తథైవ చ పునర్నవామ్‌ || 4

భార్గీక్వాథ మిదంస్నానం మాతృదోష వినాశనమ్‌ | అరిష్టకం తథాబిల్వం పద్మాక్షం ఫలినీ ఫలమ్‌ || 5

వచాకుష్టం చ ముస్తంచ వాలకం రజనీ ద్వయమ్‌ | చందనం కుంకుమం చైవ నాగదానం చ రోచనా || 6

ఏతాని సర్వాణ్యాహత్య పూర్ణకుంభే వినిక్షిపేత్‌ | స్నాన మేతత్‌ ప్రయోక్తవ్యం మాతృదోష వినాశనమ్‌ || 7

కుసుమైః పంచవర్ణైస్తు ధూపైః నిర్యాసజై స్తథా | కుంకుమాగురు కర్పూర చందనై శ్చ మనోరమైః || 8

దీపై ర్భక్ష్యైః తథా క్షీరైః కుల్మాషోల్లో పికా గుడైః | పాయసై ర్మధు సం మిశ్రైః వలనే నోదకేన చ || 9

బలిః సువిహితో రాజన్‌ ! మాతృదోష వినాశనమ్‌ | దూర్వా ప్రవాళ మంజిష్ఠా నాగరం నాగకేసరమ్‌ || 10

రోచనా కుంకుమం చైవ చందనం చ తథా వచా | విలేపన మిదం శ్రేష్ఠం మాతృదోష వినాశనమ్‌ || 11

గజాశ్వ కపి వారాహ నఖాని చ ఘృతం తథా | శ్రేష్ఠోయం కథితో ధూపో మాతృదోష వినాశనః || 12

సిద్ధం ఘృతం చాప్యథ పంచగవ్యం పురాణ మశ్నన్తిహి యే నరేంద్ర !

తేషాం భయం నైవ హి మాతృజాతం భావ్యం కదాచి ద్గ్రహ సంభవం వా || 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మాతృబాధాప్రతిషేధోనామ సప్తవింశత్యుత్తర ద్విశతతమోధ్యాయః.

నాడాయను డనియె. మాతృ దోష ప్రశమనములైన యోగములను మహేశ్వరుని ముఖము నుండి వచ్చిన వానిని వినగోరుదునన నాడాయనుడిట్లనియె. చోచకము వచ కుష్ఠము బ్రహ్మభూత జటలు కాలమంజు రెండు హరిద్రలు=మ్రాని పసపు కస్తూరి వసపు నను వానిలో యవచూర్ణము కలిపిన నలుగు బిండితో నలుగు పెట్టుట వలన మాతృ దోషము హరించును. అరిష్టము అరిష్ట పత్రములు తాళము జీరకము=జీలకర్ర శింశిప అమలకిపెద్ద ఉసిరిక బిల్వ=మారేడు వెలగ బహుకారత్వక్కూ పూర్వపునర్నవ =గల్జేరు భార్జీక్వాథ మను నిద్దాన నలుగుపెట్టి స్నానము సేసిన మాతృదోష వినాశమగును. అరిష్టము మారేడు పద్మాక్షము ఫలినీఫలము వచ =వస కుష్ఠ =ముస్తము =తుంగముస్త వాలకమురెండు రజనులు (రజనీద్వయము) చందనము కుంకుమము=కుంకుమపువ్వు నాగదానము =రోచన ఇవియని యు కలిపి పూర్ణకుంభమందు నానవేయవలెను. ఆ జలముతోడి స్నానము మాతృ దోష వారకము పంచవర్ణకుసుమములతో నిర్యాసజములైన ధూపములచే (గుగ్గులు మొదలయినవాని (దశాంగముకూడ చేర్చవచ్చును) కుంకుమపువ్వు అగురు కర్పూర చందనములతో దీపములతో భక్ష్యములతో పాలతో కుల్మాషోల్లోపికలతో బెల్లముతో తేనెకలిపిన పాయసములతో వలలముతో=మాంసముతో ఓదనముతో = అన్నముతోడి చక్కగ గూర్చినబలి మాతృదోషహరము. దూర్వలు = గరిక ప్రవాల = పవడములు మంజిష్ఠి నాగరము=నాగకేసరము రోచన=గోరోచనము? కుంకుమపువ్వు చందనము వస వీనితోడి విలేపనము (గంధపుపూత) మాతృదోసహరము శ్రేష్ఠము. ఏనుగు గుఱ్ఱము కోడి పంది యనివీని గోళ్లు నెయ్యి (ఆవునెయ్యి) ధూపమువేసిన మాతృదోష నాశనము. సిద్ధఘృతమును పంచగవ్యమును నిలువ యున్నవానిని దిన్న వారికి మాతృదోష గ్రహదోషములు నెన్నడును గలుగనేకలుగవు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున మాతృబాధా చికిత్సయను రెండువదల యిరువదియేడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters