Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఇరువదిఎనిమిదవ అధ్యాయము - కృత్తికాపూజావిధి

నాడాయనః : తస్య దేవాది దేవస్య ప్రభావ మపరంశృణు ! | కథ్యమానం మయా రాజన్‌ ! సర్వకల్మష నాశనమ్‌ ||

శంకరః పార్వతీ చైవ స్పర్ధమానౌ పరస్పరమ్‌ | చక్రతు ర్మైథునం రాజన్‌ ! సాగ్రం వర్షశతం కిల || 2

తయో రన్యతరస్యాసీ ద్యదా నైవ పరాజయః | తతస్తు దేవతా భిన్నాః పరస్పర మథాబ్రువన్‌ || 3

అత్రోత్పత్స్యతి యో గర్భ సై#్త్రలోక్యం సచరాచరమ్‌ | తేజసా మోహితం తస్య భవిష్యతి న సంశయః || 4

తస్మా త్త్వ మత్ర ప్రవిశ ! దేవ దేవ ! హుతాశన ! | ఏవముక్త స్తదా వహ్నిః ప్రవివేశ సురోత్తమమ్‌ || 5

తం దృష్ట్వా సంభ్రమా దేవ సముత్త స్థౌత్రిలోచనః | తేజోభిః క్షుభితం తత్ర వహ్నేరాస్య మథావిశత్‌ || 6

శశాప పార్వతీదేవీ భార్యాసు స్వాసు దేవతాః | నైవా వాప్స్యథ పుత్రన్వై మాత్ర్కోధ కలుషీ కృతాః || 7

హుతాశనోపి శర్వస్య దహ్యమానో హి తేజసా | తత్యాజ గర్భం గంగాయాం సాపికాలేన కేనచిత్‌ || 8

తత్యాజ పర్వతే శ్వేతే గర్భం వహ్ని సమప్రభమ్‌ | తేన జాతేన సంవృత్తం సౌవర్ణం శ్వేత పర్వతమ్‌ || 9

సువర్ణ రేతస స్తస్య జశంకరస్య చ తేసా | దదృశుః కృత్తికా బాలం సంత్యక్తం తత్ర గంగయా || 10

స్తనాని ప్రదదుస్తస్య కృపయా రాజ సత్తమ ! షడాసన స్తదా భూత్వా షణ్ణమేవ స్తనం పపౌ || 11

తాసాం క్షీరేణ ధర్మాత్మా వివృద్ధ శ్చారు తేజసా | కృత్తికానాం వరం ప్రాదా ద్యత్త ద్వక్ష్యామి తే నృప ! || 12

నాడాయనః : యదా చంద్ర సమాయోగం గమిష్యథ శుభాననాః | తదా పూజాం కరిష్యంతి భవతీనాం తు యే నరాః ||

వహ్నే శ్చంద్ర మస శ్చైవ వరుణస్య తథా మమ | గంధమాల్యై స్తథా పుషై#్పః ధూపై ర్దీపై స్తథైవచ || 14

గంధోదకేన పుణ్యన లాజాభి ర్మధునా సహ | అపూపైః పరమాన్నేన దధ్నా గవ్యేన చాప్యథ || 15

అదేవాదిదేవు ప్రభావమింకొకటి వినుము. ఇది సర్వకల్మషహరము. పార్వతీశంకరులు పరస్పరస్పర్ధతో నూరేండ్లు మిథున కర్మ మాచరించిరి. అందే యొకరికిని యోటమి గల్గలేదు. అందుచే దేవతలు ఖిన్నులై యొండొరులతో నీ సనాతనదంపతుల సమావేశమందు గలుగుగర్భము తేజస్సుచే చరాచర జగమ్ములనెల్ల మోహితమగును (మూర్చనందును) కావున నోహుతాశన! (అగ్నీ) దేవోత్తమ నీవేలోనం బ్రవేశింపుమన నాతడట ప్రవేశించెను. అనలుంజూచి త్రిలోచనుడు తొట్రుపడిలేచెను. అప్పుడు శివ వీర్యము (శివతేజస్సు) సంక్షోభించి వహ్ని మోమునంబడెను. పార్వతీదేవి కోపముగొని నాకినుకచే గలుషితలై ఇటుపై దేవతలు తను భార్యలందు పుత్రసంతానము గననే కనరుగాక యని శాపమిచ్చెను హుతాశనుండును శర్వుని (శివుని) తేజమునం దహింపబడి గంగయందు గర్భమును విడిచెను. అగంగాదేవియు నదిసైపలేక అగ్నిసమ ప్రభ##మైన యాగర్భమును శ్వేత పర్వతమందు విడిచెను. సువర్ణరేతస్కుడైన యా శంకరుని తేజస్సుచే (వీర్యముచే) నట గంగాదేవిచే పరత్యక్తుడైన యొక శిశువును గృత్తికలు చూచిరి. అపాపనికి వారందరు జాలిగొని పాల్గుడిపిరి. ఆబాలుడారు ముఖములందాల్చి యా యారుగురిచను గుడిచెను. వారి స్తన్యముచే నా ధర్మమూర్తి చక్కని తేజమ్మునం బెంపొంది యాస్వామి కృత్తికలకు వరము ప్రసాదించెను. అది సెప్పెద వినుడు.

కుల్మాషైః సఫలై ర్భక్ష్యైః మోదకైః పానకై స్తథా | ప్రాప్స్యన్త్యభిమతాన్‌ కామా నిహలోకే పరత్ర చ || 16

నక్తశన స్తథా భూత్వా యుష్మత్పూజా పరాయణః | క్రీడిత్వా సుచిరం నాకే మానుష్యే తు భవిష్యతి || 17

రూపాన్వితః సత్యపరో దయావాన్‌ ధర్మే స్థితః సన్‌ బహుభృత్య యుక్తః |

కులేన శీలేన సమన్విత శ్చ నారీ విశేషాత్‌ సుభగా భవిత్రీ || 18

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే కృత్తికా పూజావిధిర్నామ అష్టావింశత్యుత్తర ద్విశతతమోధ్యాయః ||

ఓశుభవదనలార ! మీరు చంద్రునితోడి యోగము (కలయిక) పొందినతఱి (కార్తికమాసమందు) మీకు వీరేకాదు అగ్నికి చంద్రునికి వరుణునికిని గంధపుష్ప మాల్యాదులు ధూప దీపనైవేద్యాదులతో గంధోదకముతో పేలాలతో తేనెతో అపూపములతో (అప్పములతో) పరమాన్నము ఆవు పెరుగు కుల్మాషములతో పండ్లు భక్ష్యములు మోదకమలు (బూరెలు ఉండ్రాళ్ళు) పానకములతో బూజగావింతు పుణాత్ములు మానవు లిహమందు వరమందును నభీష్టకామములం బొందుదురు. కుల్మాషము =పులికడుగు బొబ్బర్లు గుగ్గిళ్ళు జావ గంజి పులగము ఆపూజ నక్తముండి (పగలుపవసించి రాత్రి భోజనముసేయుట నక్తము, మీ పూజయందు శ్రద్ధగొనిన పురుషుడు స్వర్గమందు క్రీడించి మనుష్యలోకమునం జనించిచక్కని వారై నా భక్తులై దయాధర్మ నిష్ఠులై భృత వర్గము సేవింప రాణించును. కులము శీలముంగలదై స్త్రీ పరమసుందరి సౌభాగ్యపతియుం గాలగదు.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కృత్తికా పూజావిధియను రెండువందల యిరువది యోనిమిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters