Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందలరువదితొమ్మిదవ అధ్యాయము - అక్షయతృతీయమహిమ నాడాయనః : తతస్తు ప్రయ¸° గంగా కుమారో యత్ర పావకిః | మయా త్వం జనితః పుత్ర ! తమువాచ సురేశ్వరమ్ || ఆసహన్త్యా మహాతేజః త్వదీయం పర్వతోత్తమే | మయాస్కంద పరిత్యక్తం తదా గర్భగతం మమ ||
2 స్కందః : తస్యా స్తద్వచనం శ్రుత్వా పాపకి ర్వాక్య మబ్రవీత్ | నా೭హం గృహంతే యాస్యామి శంభుర్మే దైవతం పితా ||
3 అనుగ్రహం కరిష్యామి తవాహం సురనిమ్నగే ! | వైశాఖ మాస శుక్లస్య తృతీయా యాం వరాననే !
4 మానుష్య మవ తీర్ణాసి తదా పూజా మవాప్స్యసి | తస్మి న్న హని య స్స్నానం ఆ చరిష్యతి తే శుభే !
5 రాజ సూయాశ్వమేధాభ్యాం ఫలేన స తు యోక్ష్యతి | తస్మి స్స హని యః పూజాం యత్ర తత్ర వ్యవస్థితః ||
6 గంధ మాల్యోపహారాద్వై ర్ధూప దీపాన్న సంవదా | కర్తా తవ మహాభాగే ! త్వత్తోయస్నానజం ఫలమ్ ||
7 ధ్రువ మాప్స్యతి ధర్మజ్ఞే ! నాత్ర కార్యా విచారణా | తస్మి న్నహని యత్కించిత్ ప్రదద్యాచ్ర్ఛద్ధయాన్వితః ||
8 అక్షయం తత్ఫలం తస్య భవిష్యతి న సంశయః | అక్షయా సా తిథిర్జేయా కృత్తికాభి ర్యుతా యది ||
9 భవిష్యతి మహాభాగే ! విశేషేణ ఫలప్రదా| తస్మిన్ దినే యే తవ చారుగాత్రి! పూజాం కరిష్యన్తి తథేరితాంప్రాక్ | తే నాకలోకే సుచిరం నిరుష్య లోకాన్ గమిష్యన్తి జలాధిపస్య ||
11 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే అక్షయ తృతీయా మాహాత్మ్యం నామ ఏకోన త్రింశదుత్తర ద్విశత తమో೭ధ్యాయః. నాడాయనుండనియె. గంగానది యగ్ని పుత్రుడు కుమారుడున్న తావునకేగి కుమార! నేను నిన్ను గన్నాను. ఓ స్కంద! నీ తేజస్సును సైపలేక నాగర్భమును పర్వతశ్రేష్ఠముపై విడిచితిని అనవిని పావకి (పాపకుని కుమారుడు) నేను నీయింటికిరాను. నాదైవము శంభువు నాతండ్రి. నీకేనొక యనుగ్రహము సేసెదను వైశాఖశుక్ల తృతీయనాడు నీవు మనుష్యలోకమం దవతరించితివి. కావుననాడు నీవుపూజలందెదవు. నాడెవ్వడు నీయందు స్నానముసేయు నాతడోకల్యాణి! రాజసూయాశ్వమేధములు సేసిన పుణ్యముం బొందును. అనాడెక్కడేని నీకు గంధమాల్యోపహారములతో ధూపధీపాన్న సమృద్ధితో బూజసేసినతడు నీలో స్నానముచేసిన ఫలము తప్పక పొందును. ఇటనాలోచన లవదు. శ్రద్ధతో నానాడెకొంచెము దానము సేసిననది యక్షయమగును. సందేహములేదు కృత్తికా నక్షత్రముతో గూడిన యాతిథి ''యక్షయ'' యని పిలువబడును. విశేషఫల ప్రదయగును. ఓసుందరగాత్రి! ఆనాడు చెప్పినట్లు పూజచేసిన వారు వారు నాకమందు చిరకాలముండి జలధి పుడగు వరుణుని లోకమేగుదురు. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అక్షయతృతీయా మాహాత్మ్యమను రెండువందల యిరువది తొమ్మిదవ యధ్యాయము