Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందలముప్పదిఒకటవ అధ్యాయము - గ్రహలక్షణశాంతినిరూపణము శైలూషః : నృణాం గ్రహగృహీ తానాం లక్షణం కథయాశుమే | ప్రతి షేధం చ ధర్మజ్ఞ ! తత్రమే సంశయో మహాన్ || నాడాయనః దేవర్సి పితృ భూతానాం సతతం చావ మాసనాత్ | గురు వృద్ధ ద్విజా చార్య సిద్ధ తాపస మర్జనాత్ ||
2 బలి మంగళ హోమాది నియమా చార వర్జనాత్ | వ్రతాధ్యాయన ధర్మాది ధ్యానయోగ వ్యతి క్రమాత్ ||
3 గుడా మిష తిల క్షౌద్ర మేధ్యైరు చ్ఛేషి తస్య వా | శ్మశానా యతనా೭భ్యాస విణ్మూత్రో త్సర్జనా దపి ||
4 రాత్రౌ చతు ష్ప థారణ్య శూన్య వేశ్య నివేశ నాత్ | భోజనా ద్భిన్న భాండేషు తథా మంత్ర ఛలా దపి ||
5 శ్మశాన చైత్య వృక్షాది మైథునాది నిషేవణాత్ | అవమానా దభీ ఘాతా న్మంగళా నా మదర్శనాత్ || 6 ఈర్ష్యయా బంధు శాపాచ్చ రథ్యా వస్కంద సేవనత్ | ఐశ్వర్య నాశా చ్ఛో కాచ్చ దర్పో త్సేకా తిహర్షణాత్ || 7 నిర్లజ్జ నాస్తి కానాం హి త్రాసి తానాం విశేషతః | గురుభిః సంపది త్యాగాత్ కార్తఘ్న్య త్సాధు నిందనాత్ || 8 దుఃఖా త్ర్ప జననాత్ స్త్రీణాం మిథ్యా చైవ ప్రభాషణాత్ | తుషకేశ కపాలాస్థి కార్పాసాది ష్వది ష్ఠితాత్ || 9 ప్రాణి నాం సుఖ దుంఖేషు తథా మృతక సూతకే | అత్యర్థ నక్త స్నానేషు గ్రహా గ్రహ్ణన్తి మానవాన్ || 10 బలైశ్వర్య విసంయోగా ద్దేహ మావిశతి గ్రహః | జీవః కుక్షిం యథాదృశ్యః ప్రవిశ##న్నేవ దృశ్యతే || 11 వన స్పతీ న్వా ఋతవో విజ్ఞేయా శ్చ తథా గ్రహాః | కారణౖ ర్నవభి ర్దేహం గ్రహో గృహ్ణాతి దేహినామ్ || 12 రౌద్రస్వభావా ద్ధింసార్థీ రత్యర్థీ బలికాముకః | విత్రాసార్థీ బలోద్రేకా ద్రౌద్రా త్ప్రాగ్దైహికా ద్భయాత్ || 13 ప్రయుక్తో೭న్యేస మంత్రైశ్చ గ్రహోగృహ్ణాతి మానవాన్ | కారణాని తవోక్తాని యద్య ప్యేతాని పార్థివ ! || 14 తథాపి త్రయ ఏవాత్ర విజ్ఞేయాని విపశ్చితా | తేషా మన్తర్భవ న్యైతే యస్మాత్పార్థివ సత్తమ ! || 15 బలికామస్తు రత్యర్థీ హింసార్థీ చ తథాగ్రహః | అసాధ్యం బలికామంతు కృచ్ఛ్రసాధ్యం రతిగ్రహమ్ || 16 హంతుకామ మస్యాధ్యం తు వినా మంత్రబలం మహత్ | సాంత్వపూర్వం గ్రహోవిష్టో మధురం యః ప్రజాయతే || 17 తత శ్చాంతర మాసాద్య విచిత్రం యాచతే బలిమ్ | శైలూషుడు గ్రహముపట్టిన మానుష్యుల లక్షణము వానికి ప్రతిక్రియల నానతిమ్మన నాడాయనుండనియె. దేవర్షి పితృదేవతలను నిత్యమవమానించినందువలన గురుపృద్ధులను ద్విజులను ఆచార్యులను సిద్ధులను దుపస్వులను మర్దించుటవలన బలి మంగళ హోమాది నియమాచారములను మానినందునను వ్రతములు అధ్యయనము (వేదములను జదువుట) ధర్మము ధ్యానయోగమును అతిక్రమించుటవలనను బెల్లము మాంసము నువ్వులు తేనె పవిత్రవస్తువుల నెవ్వరికింబెట్టక యెక్కువగ నిలువసేసినందునను శ్మశాన మందు ఇంటిదగ్గరగా మూత్ర పురీషములు సేసినందునను రాత్రి చతుష్పథములందు గ్రామములో పెద్దలు మంచిచెడ్డలు మాట్లాడు కొనుచు నాల్గుదారుల కూడలియందు కూర్చుండు ప్రదేశము చతుష్పథము. దానికే రచ్చచెట్టు రచ్చబల్ల యని వాడుకపేరు అరణ్య ములందు శూన్మగృహమందు నివసించుట పరుండుటవలనను పగిలిన భాండములలో కంచములలో భుజించుటవలన మంత్రములపేర మోసగించుటవలన శ్శశానమందు చైత్యవృక్షములక్రింద మైథునాదులు సేయుటవలన నితరుల నవమానముసేయుటవలన అభీఘాతమువలన (పైబడి చంపుట కొట్టుటవలన) మంగళ పదార్థములం జూడకపోవుటచేతను ఈర్ష్యచే బంధువులను శపించుటవలన (తిట్టుట వలన) రథ్యాపస్కందులను (దారులుకాచి కొట్టు దొంగలను)జేరుటవలనను ఐశ్వర్యమును నాశనము చేయుటవలన శోకమువలన సిగ్గులేనివారియొక్క నాస్తికులయొక్క వెలివేయబడినవారియొక్క దర్పాతిశయముసూచి మిక్కిలి మెచ్చుకొనుటవలన గురువువలన త్మాగమువలన (గురువులు వీడు తుచ్చుడని వెళ్ళగొట్టుటవలన) కార్తఘ్న్యమువలన(కృతఘ్నతవలన)సాధునిందవలన స్త్రీ మిథ్యా భాషణమువలన ఊక వెంటుకలు పుర్రెలు ఎముకలు దూదిమీద గూర్చుండుటవలన గ్రహావేశము గల్గును. ప్రాణుల సుఖ దుఃఖసమయములందు మైలలో రాత్రులందెక్కువగా స్నానాలుచేయుటలో మానవులను గ్రహములావేశించి పీడించును. బలము ఐశ్వర్యము పూర్తిగ క్షణించిపోయినపుడు దేహమును గ్రహమావేశించును. జీవుడు తల్లికడుపులో బ్రవేశింపగానే యెట్లు కనపడునో (వేవి శ్శమూలమున) వనస్పతులను (మహావృక్షములను) ఋతువులు ప్రవేశింపగనే చిగిరించుట మొగ్గతొడగుట కాయుట పండుట రాలి పోవుటమొదలగు ఋతుధర్మములు)తెలియనగునో వానిలక్షణములు సోకగానే తెలియచుండును. గ్రహము దేహుం దేహమును తొమ్మిదికారణములంబట్టి పట్టికొని పీడించును.1 రై దస్వభావమువలన (కోపమువలన) 2 హింసింపగోరి 3 రతికోరి (రమింపకోరి) 4బలినిగోరి (ఆహారాదులగోరి) 5 జడిపింపగోరి 6 బలోద్రేకమువలన 7 రౌద్రవృత్తివలన 8 పూర్వజన్మము కలిగిన భయమువలన 9 ఇతరులు చేసిన మంత్రప్రయోగమువలన (చేతబడివలన) గ్రహముపట్టుట జరుగును. నీకీకారణములు తొమ్మిది చెప్పితినిగాని యిందు తెలిసినవాడు తెలియవలసినవి మూడే. ఈ మూడింటిలో దక్కిన యారును సంతర్భావమందును బలికామన రతి కామన హింసాకామన అనుమూడే మానవుల నావేశించుటకు గారణములు. బలినిగోరు గ్రహమసాధ్యము. రతినిగోరు గ్రహము శ్రమసాధ్యము. హంతుకామగ్రహము (చంపివేయవలెనను కోరునది) మంత్రబలములేక సాధింప శక్యముగాదు. బలికామన గల గ్రహము మొదట తీయగ నయనయించుచు (మధురముగ) ప్రవేశించును. ఆపైనవకాశముగొని విచిత్రమయిన బలినడుగుకొనును. ఆ బలులు పానము మూల్యములు(పూలమాలలు) అనులేపములు (గంధాదులు) మొదలైనవేవేని కోరును. గ్రహవైద్యునిం జూచి మ్రొక్కును. ఇవి బలికామ గ్రహలక్షణములు. పాన మాల్యాను లేపాంశ్చ వైద్యం దృష్ట్యా నమస్యతి || 18 బలికామస్య లింగాని ప్రోక్తా న్యేతాని వై మయా| రమతే నృత్యతి శుచి స్తథా హసతి గాయతి || 19 గంధమాల్యాంబర స్నాన ధూపోద్వర్తన సేవకః కథా విచిత్రాః కురుతే మధురం సంప్రభాషతే || 20 అలంకృతం చావిశతి వర్జయ త్యనలంకృతమ్ | రతికామస్య రూపాణి జ్ఞేయా న్యేతాని బుద్ధినా || 21 య శ్చావిష్టో విద్రవతి సింహ వ్యాఘ్ర తరక్షుపమ్ | యుద్ధ మారభ##తే కుర్తుంగజాదిభి రభీత వత్ || 22 భృశం తాడయతి స్వాంగం పతత్యగ్నౌ పతంగవత్ | రాజద్వేషాణి కురుతే విజనే రమతే೭ధికమ్ || 23 కరోతి మరణోపాయాన్ హంతుం కామార్దితో నరః | లోమహర్షోంగ మాంద్యంచ ఛాయావైకృత్యమేవ చ || 24 అమానుషోత్సాహ బలం విహారాహార చేష్టితమ్ | ద్వౌవా త్రయోవా నేత్రే೭స్య సంపశ్యన్తే కుమారకాః || 25 నిమీలితాక్షితా೭త్యర్థం రక్తాది వమనం తథా | సామాన్య మేత దుద్దిష్టం గృహీతస్య తు లక్షణమ్ || 26 రతి కామగ్రహ లక్షణములు : రమించును నృత్యము సేయును శుచియైయుండును. నవ్వును పాడును గంధము పూమాలలు అంబరములు స్నానములు దూపము ఉద్వర్తనము (తలంటు నలుగు మొదలయినవి) కోరిసేవించును. విచిత్రకథలు సెప్పును తియ్యగ మాటలాడును చక్కగ నలంకరించుకొన్న వానియందావేశించును. అలంకరించుకొననివాని జోలికిపోదు ఇకమారక గ్రహలక్షణములు మారక గ్రహమావేశించి సింహవ్యాఘ్ర తరక్షుపముల యుద్ధమారంభించును. ఏనుగులతో దలపడును. తన యొడలు తాను గట్టిగా బాదుకొనును. పక్షివలె నగ్నిలో నెగిరి పడును రాగద్వేషములూరక చూపును. విజన ప్రదేశమందెక్కువగ నుండ గోరును. కామార్దితుడై మారక గ్రహావిష్టుడైనవాడు మారణోపాయములను జేయును. మేను పులకరింపు లింగమాంద్యము (శరీరము మొద్దువారుట) ఛాయావైకృత్యము (కాంతితఱగుట వెలవెలపోవుట) ఆహార విహార చేష్టలందు అమానుషమైన (మానవసామాన్యముగాని) ఉత్సాహము బలియును. ఈ మారక గ్రహావిష్టుల లక్షణములు మారక గ్రహము పట్టినవాని లక్షణము రెండు మూడు వీని కన్నులం గానిపించును. మిక్కిలి గన్నులు మూసికొనుట రక్తము చొంగశ్లేషము మొదలగు వాని నెక్కువగా గ్రక్కుట ఈలక్షణములు గ్రహ గృహీతులందరికి సమానములే. ముక్తస్యలక్షణం చాతః ప్రవక్ష్యామి నిబోధత ! భూమౌ వినివత త్యాశు తథా సంజ్ఞాం ప్రపద్యతే || 27 పరామృశతి కేశాంశ్చ పాసాంస్యాభరణాని చ | శుభాశుభం చాత్మకార్యం పృచ్ఛతి స్మ సుహుజ్జనమ్ || 28 అతః పరం ప్రవక్ష్యామి దేవాది గ్రహలక్షణమ్ | చికిత్సితేన సంయుక్తం తన్నిబోధ జనాధిప || 29 నదీ మాలా೭ద్రి శిఖర రుచిః ప్రసాదమేవచ | శుచిశీల సమాచారో జ్ఞేయో దేవగ్రహార్దితః || 30 దేవానాం పూజనం తస్య పుష్ప ధూప ఫలాక్షతైః | గంధ దీప ప్రదాన్నై శ్చ వహ్ని సంతర్పణౖ స్తథా || 31 గోరసైశ్చ సశాల్యన్నైః బ్రాహ్మణౖః స్వస్తివాచనైః | కర్తవ్యం విదుషా నిత్యం తతః సంపద్యతే సుఖీ || 32 ఉచ్ఛిష్టాన్ భైరవా న్రావాన్ విరసం కురుతే೭ధికమ్ | తస్మిన్ తథోత్సవాన్ యక్షాన్ వ్రతా నధ్యయనాని చ || 33 బహుశో పటుచాశ్నాతి వస్త్రం పాటయతి స్వకమ్ | అసురగ్రహ దుష్టస్య రూపమేత ద్వినిర్దిశేత్ || 34 దైత్య సంపూజనం తస్య కార్యం మాంససురా೭೭సవైః | రక్తైః పుషై#్ప ర్ధూపదీపై స్తథా బీజసముద్భవైః || 35 గంధర్వ వాద్య నిర్ఘోషం శ్రుత్వా హృష్టః | ప్రసృత్యతి | తీర్థోద్యాన నదీతీర గంధమాల్యాది సేవనాత్ || 36 యథాకామం విచరతి గంధర్వోన్మాదితో నరః | గంధైర్మాల్యైశ్చ వివిధై ర్గీతవాద్యై స్తథైవ చ || 37 గంధర్వపూజనం కార్యం తేన సంపద్యతే సుఖీ | ఇక గ్రహముక్తుడైన వాని లక్షణము దెలిపెద తెలిసికొనుము. నేలపై వేగముగబడిపోవును వెంటనే తెలివినొందును జుట్టు సర్దుకొనును కట్టుబట్టలను అభరణములను సవరించుకొనును. స్నేహితులను తన శుభము అశుభమునైన కార్యముంగూర్చి యడుగును ఇటుపై దేవాది గ్రహముల లక్షణముల వాని చికిత్సతోగూడ తెలిపెదను రాజా! గ్రహింపుము. నదీతీరము పర్వత శిఖరము ప్రాసాదములమీద రాజసౌధ (దేవసౌధములమీద) తిరుగగోరుచుండును. శుచిశీలుడై (ఆచారవంతుడై) చరించును వాని చికిత్స దేవతలను పుష్పములతో ధూప దీపాదులచే గంధముచే నర్చించుట అగ్నిసంతర్పణములు శాల్యన్నము గోరసములతో (ఆవుపాలు) (ఆవుపాలు ఆవు పెరుగు వెన్న నేతులతో) స్వస్తి వాచనము సేయు బ్రాహ్మణులకు సంతర్పణములు సేయుట తెలిసిన వాడివి నిత్యముం గావించిన దేవగ్రహ పీడ వదలి సుఖమందును అసుర గ్రహా విష్టుని చికిత్స;- అసుర గ్రహావిష్టుడు భైరవములు (భయంకరము) పులి త్రేణువులతోడి విరసముగ పెడబొబ్బలు పెట్టును. వానికి ఉత్సవములు వ్రతములు అధ్యయనములు యక్షములను చికిత్సలను జేయవలెను. ఆ రాక్షస గ్రహా విష్టుడు మిక్కిలిగ దినును. తన బట్ట చింపుకొనును. మాంసము కల్లు నివేదించి రక్త పుష్పములతో బీజ సముద్భవములైన ధూపదీపములచే వానిని జికిత్సింప వలెను. గంధర్వ వాద్యఘెషము విని గంతులు వేయును. తీర్థము లందలి తోటలలో సదీతీరములలో గంధమాల్యాది సేవనముసేసి గంధర్వగ్రహావిష్టుడు చరించును. గీతవాద్యముల చేతను గంధమాల్యముల చేతను గంధర్వపూజసేసిన సుఖమందును. నిద్రాళు రలసో దుష్టో దర్వీవత్కురుతే కరౌ || 38 గర్భవాస గుహాసేవీ నరోన్మత్తం విదుర్బుధాః | నాగానాం పూజనంతస్యకార్యం కుల్మాష పర్పటైః || 39 పాయసొల్లోపికాపూపైః పద్మోత్పల బిసై స్తథా | అమత్సరీ మృదుర్వీరః ప్రియ వాగ్బహు భోజనః || 40 పృథు విహ్వల తామ్రాక్షః తథావై గోరసప్రియః | భూతోన్మాద సమావిష్టో లింగైరేతై ర్వినిర్దిశేత్ || 41 కుసుమై ర్బహువర్ణై శ్చ గోరసై ర్వినిధై స్తథా | భూతపూజా తు కర్తవ్యా తేన సంపద్యతే సుఖీ || 42 శూన్యా೭గార శ్మశానాద్రి చతుష్పథ నిషేవకః | రాత్రౌ చరతి చోచ్ఛిష్టః పిశాచో న్మాదితో నరః || 43 పిశాచ యజనం తస్య కర్తవ్యం పలలామిషైః | కంటకీ సంభ##వైః పుషై#్పః కృష్ణపర్ణై స్తథైవచ || 44 అవ్యక్త భాషీ రక్తాక్షో హాస్యే చోచ్చ స్వరస్తథా | రౌద్రం నిరీక్షతే೭త్యర్థం యక్షేనోన్మాదితో నరః || 45 కుల్మాష ఘృత పిణ్యాక పలలోల్లోపికా గుడైః | యక్షాణాం పూజనం తస్య కర్తవ్యం దోషశాన్త యే || 46 ఉద్విగ్న చేతాః శీతశ్చ నాతిశోక పరాయణః | రాక్షసేన గృహీత శ్చ భవత్యోష్ఠ విలేహ కః || 47 పక్వా మిషేణ మాంసేన రుధిరేణ తథైవ చ | రాక్షసా నాం బలిః కార్య స్తస్య దోష ప్రశాన్తయే || 48 నరగ్రహావేశమయినవాడు నిద్రాలసుడు దుష్టుడునగును కుల్మాషపర్పటములతో పాయసములచేత ఉల్లేపికలతొ అపూపములతో తామరతూండ్లు కలువ కాడలతో నాగపూజచేసిన నరగ్రహమువదలును. భూతగ్రహావిష్టుడు మాత్సర్యములేనివాడు ప్రియ వచనుడు బహుభోజి పెద్దవి విహ్వలములును (విడవారినవియు) నగు కన్నులు గలవాడు గోరసప్రియుడు (ఆవుపాలు మొదలయిన వానిని) గోరు వాడునగును పెక్కురంగుల పూవులతో గోరసములతో భూతపూజ సేసిన నతడు సుఖియగును. పిశాచగ్రహము పట్టిన వాడు రాత్రులందు ఉచ్ఛిష్టుడై (ఎంగిలిపడి) పలలామిషములతో (మాంసములతో) ముండ్ల చెట్లకు పూసిన నల్లని పువ్వులతో పిశాచ పూజ సేయవలయును. యక్షగ్రహావిష్టుడు అవ్యక్తభాషణము సేయును (మాటస్ఫుటముగానుండదు. లేదాతప్పుడు పొరబాటు మాటలు పలుకునవచ్చును) ఎఱ్ఱనికండ్లు విఱగబడినవ్వుట రౌద్రముగజూచుట యివి యక్షగ్రహ లక్షణములు. కుల్మాషములు కుల్మాశషు= 1. కారుమినుము 2 అలచందలు 3 గుగ్గిళ్ళు 4 కెంపు నేయి పిండి పలలముతోజేసిన ఉల్లేపికలు బెల్లము నివేదించి యక్షపూజచేసిన యక్షగ్రహశాంతియగును. రాక్షసగ్రహము పట్టినవాడు ఉద్విగ్న మనస్కుడు=ఆందోళనముచెందు మనస్సు మేనుచల్లగా నుండును. ఎక్కువ శోకింపడు పెదవులు గొఱకుచుండును. వండిన అమిషము మాంసము రక్తము రాక్షసగ్రహములకు బలి పెట్టవలెను. భస్మపాంశు రజోధ్వస్తో మలినో మలినాంబరః | ప్రేత గృహీతో భవతి వికృతో ధ్వస్త మస్తకః || 49 ఓదనం మధుపానీయం సర్పిః క్షీరసమన్వితమ్ | 50 ప్రేతానాం తత్ర దా తవ్యం తేన సంపద్యతే సుఖీ | శుచిః శుచి సమాచారః సంధ్యా చారీతిలప్రియః || 51 పితృగ్రహ గ్రహీతస్య రూపమే తద్వినిర్దిశేత్ | తిల గోరస పుష్పాన్న మధుమూల ఫలైః శుభైః|| 52 దీపదానై స్తథా నిత్యం ప్రణిపాతేన చాజ్ఞయా | పితౄనాం పూజనం తస్య కర్తవ్యం దోషశాన్తయే || 53 అధీతే జపతే చైవ శుచి స్తిష్ఠతి చాప్యథ | యోగాసక్త స్తథార్షేణ గృహీతో మానవో భ##వేత్ || 54 హవిర్గోరస పుష్పాద్యై స్తథా ధ్యయన సంసైవైః | ఋషీణాం పూజనం కార్యం తస్యదోష ప్రశాన్తయే || 55 కర్మప్రసక్తో భవతి న నిద్రాం భజతే దివా | పౌరుషేణ గృహీతస్య లక్షణం సముదాహృతమ్ || 56 బ్రాహ్మణాన్ భోజయే త్తత్ర మిష్టమన్నం సుసంస్కృతమ్ | గంధమాల్యో జ్జ్వలాన్ రాజన్ ! తస్యదోష ప్రశాన్తయే || స్కందగ్రహ గృహీతానాం బాలానాం శృణు లక్షణమ్ | రోదితి స్తనతి ధ్యాతి భూమౌ స్వపితి చాసకృత్ || 58 అసంబద్ధ ప్రలాపీవా జ్ఞేయః స్కంద గ్రహార్దితః | రక్తైః పుషై#్పః ఫలైర్మూలైః బాలక్రీడనకై స్తథా || 59 ఘంటాచ కుక్కుటైః పూజా బలినా వివిధేన చ | పతాకాభి శ్చ కర్తవ్యా కుమారస్య మహాత్మనః || 60 అతఃపరం లోకహితం తవాద్య సర్వగ్రహఘ్నా న్నిపుణాన్ ప్రయోగాన్ | వక్ష్యామి యేషాంహి నిషేవణన గ్రహై ర్విముచ్యన్తి నరాః నరేంద్రాన్ || 61 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే గ్రహలింగానినామ ఏకత్రింశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || ప్రేత గ్రహము పట్టినవాడు బూడిద దుమ్ము ధూళిలో బ్రుంగును. మలినుడు మలినవస్త్రధారియు వికృతుడు తల ధ్వంసమైనవాడు నుండును ఓదనము (అన్నము) మధుపానీయము (తేనె) నెయ్యి పాలు నివి ప్రేతములకీయవలెను. దాన నాగ్రహము పితృగ్రహావిష్టుడు : శుచి శుచిసమాచారుడగును. సంధ్యలందు దిరుగును. నువ్వులకు ప్రీతిపడును. వీనికి తిలలు గోరసములు పువ్వులు అన్నము తేనె దుంపలు పండ్లు శుభములైన దీపములు నిత్యము ప్రణిపాతము (వ్రాలినమస్కరించుట) అజ్ఞ మంత్రగా డానవెట్టుట ఇవి పితృపూజా సామగ్రులు. దాన పితృగ్రహశాంతియగును. అర్షగ్రహావిష్టుడు అధ్యయనము సేయును. జపించును. శుచియైయుండును. యోగాసక్తుడగును, హవిస్సు గోరసములు పువ్వులుగూర్చి వేదాధ్యాయనము స్తవములు చేసి ఋషి పూజచేసిన దోషశాంతియగును. పురుషగ్రహము పట్టినవాడు నిరంతరము కర్మప్రసక్తుడగును. పవలు నిద్రవోడు మృష్టాన్నముతో సంస్కృతాన్నముతో బ్రాహ్మణ భోజనమువెట్టుట గంధమాల్యాదులచే బ్రాహ్మణుల నర్చించుట పురుషగ్రహశాంతికరము. స్కంద గ్రహముపట్టిన బాలుర లక్షణము ఏడ్చును మూల్గును ధ్యానించును నేలపై నిదురపోవును అసంబద్ధములు ప్రలపించును ఎఱ్ఱపువ్వులు పండ్లు దుంపలు పిల్లలాడు కొనునాటబొమ్మలతో ఘంటాధ్వనితో కోళ్లచే పూజసేసిన వివిధబలులతో పతాకలు (జెండాలతో) కుమారస్వామి పూజసేయవలెను. దాన స్కంద గ్రహశాంతి యగును. నరేంద్ర! ఇటుమీద లోకహితమయిన సర్వగ్రహములనుజంపు నిపుణములయిన ప్రయోగములను దెల్పెద వానిని సేవించి నరులు గ్రహవిముక్తి పొందగలరు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునగ్రహలింగ (లక్షణ) గ్రహశాంతి నిరూపణమను రెండువందలముప్పది యొకటవ యధ్యాయము.