Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ముప్పదినాల్గవ అధ్యాయము - శివకృతయజ్ఞ ధ్వంసనము నాడాయనః : తసై#్మవ దేవదేవస్య ప్రభావ మపరం శృణు | యష్టుకామైః సురైః పూర్వం యజ్ఞే భాగో న కల్పితః ||
1 యదా రాజన్ ! త్రినేత్రస్య తదా క్రుద్ధేన శంభునా | యజ్ఞవాటం తతో గత్వా దేవా విత్రాసితా బలాత్ ||
2 పురోడాశం భక్షయిత్వా పూష్టో దంతా నశాతయత్ | భగస్య నయనం వామం బభంజ వరవీరహా ||
3 క్రుద్ధం దృష్ట్వా మహాదేవం మృగరూపధర స్తదా | ప్రాద్రవ త్సహసా యజ్ఞో నర నారాయణాశ్రమమ్ ||
4 తమన్వ¸° మహాతేజా బాణచాపధరో హరః | యజ్ఞానుసారిణం ప్రాప్తం హరం బాణ ధనుర్ధరమ్ ||
5 నారాయణ స్తుతం చక్రే విహ్వలం కంఠపీడనాత్ | విహ్వలే తు మహాదేవే యజ్ఞో దివ మథాశ్రితః ||
6 హరో೭పి లబ్ధసంజ్ఞస్త మన్వ¸° దివి సత్వరః | న శశాక మృగం వేద్ధుం యదా ధర్మశ్చ తేజసా ||
7 తతస్తం బోధయామాస బ్రహ్మా శుభ చతుర్ముఖః | భగస్య పూర్ణం చ తా ప్రసాద మకరోత్ పునః ||
8 యజ్ఞస్య చాభయం దత్వా క్రీడయా೭ న్వేతి తం పునః | తారా మృగశ్చ గగనే మహాదేవానుగః సదా ||
9 దృశ్యతే స మహాభాగ ! రాత్రౌ గగన భూషణః ||
10 క్రుద్ధేన రుద్రేణ సురా నిరస్తాః స్వస్థాః ప్రసన్నేన కృతాశ్చ భూయః | తస్మా త్ర్పసన్నాస్తు భవాయ లోకే క్రుద్ధశ్చ లోకాంతకరః ప్రవిష్టః ||
11 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే యజ్ఞవిధ్వంసనంనామ చతుస్త్రింశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || నాడాయనుడు శివప్రభావమింకొకటి వినుము. దేవతలు యజ్ఞసంకల్పముసేసి మున్ను శివుని యజ్ఞభాగమీయరైరి. దానం గోపించి యజ్ఞవాటమునకేగి దేవతలను హడలగొట్టెను. పురోడాశముం దనకుదాన తినివేసి భగుని పండ్లూడగొట్టెను. మహేశ్వరుడుగ్రుడగుటగని లేడిరూపూని యజ్ఞపురుషుడు నరనారాయణాశ్రమమునకు బారిపోయెను. హరుడమ్ములు విల్లుంగొని వానిని వెనుదరిమెను. యజ్ఞమును వెంబడించి తరుము హరునిగని నారాయణుడు శ్రీకంఠుని కంఠము పిసికి విహ్వలుం జేసెను. అతడు డిల్లవో జూచి యజ్ఞమూర్తి దివంబునకుం జనెను. శంకరుడు తెలివివచ్చి యా యజ్ఞమును స్వర్గమున వెనుదరిమెను కాని యా మృగమును గొట్టజాలడయ్యెను. అప్పుడు బ్రహ్మ శివునికిం దెలియజెప్పి యా చతుర్ముఖుడు భగునియెడ సంపూర్ణానుగ్రహము సూపెను. యజ్ఞమునకు నభయమిచ్చి యా లేడితో నాడుకొనుచు వెంబడించెను. ఆ లేడి నక్షత్రరూపమున నాకాశమందు మహేశ్వరుడు వెంబడించుచున్నట్లు చుక్కల గుంపుగా గానిపించును. రుద్రుడు కోపముతో సురలం గెంటివేసెను. మరల నా శంకరుడే ప్రసన్నుడే వారిని స్వస్థులనుం జేసెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శివకృత యజ్ఞవిధ్వంసమను రెండువందల ముప్పదినాల్గవ యధ్యాయము.