Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలముప్పదితొమ్మిదవ అధ్యాయము - రావణునికి మహాపురుషదర్శనము

నాడాయనః : స కదాచి న్మహీం సర్వాం విచరన్‌ ధనదానుజః | పశ్చిమే సాగరద్విపే దదర్శ పురుషం శుభమ్‌ || 1

జాంబూనద సమప్రఖ్యం జ్వలితానల సుప్రభమ్‌ | విశ్వరూప ధరం దేవం వరదం కామ రూపిణమ్‌ || 2

ధర్మస్తస్య తపశ్చైవ జగతః సిద్ది హేతుకే | ఊరూ చాశ్రిత్య తస్థాతే మన్మథః శిశ్న మాశ్రితః || 3

విశ్వేదేవాః కటీభాగే మరుతో బస్తిశీర్షకే | పాదయోశ్చ ధరాదేవీ పిశాచాశ్చ నఖాశ్రితాః || 4

మధ్యేష్టౌ పసవ స్తస్య సముద్రాః కుక్షిమాశ్రితాః | పార్శ్వేషు చ దిశ స్సర్వాః పర్వ సంధిషు మారుతః || 5

పితర శ్చాశ్రితాః వృష్టే హృదయే చ పితామహః | గోదానాని పవిత్రాణి భూమిదానాని యాని చ || 6

సు వర్ణస్య చ దానాని యకృ ల్లోమాన్త రాణి చ | అస్థిభాగేషు శైలాశ్చ శిరాసు సరిత స్తథా || 7

మణి పక్షోభవత్తస్య శరీరే ద్యౌ రవస్థితా | కృకాటికాయాం సంధ్యా శ్చ తలవాహాశ్చ యే ఘనాః || 8

బాహూ ధాతా విధాతా చ భగః పూషా తథా కరౌ | నాగా ఘోరవిషాః సర్వే కరజేషు వ్యవస్థితాః || 9

అగ్ని రాస్య మభూత్తస్య స్కంధౌ రుద్రై రధిష్ఠితౌ | దన్తా మాసర్తవ శ్చైవ దంష్ట్రా స్తస్య తు వత్సరః || 10

నాసాయాం చా వ్యమావాస్యా తచ్ఛిద్రేషు చ వాసరాః | గ్రీవా తస్యాభవ ద్వేది వాణీ చాథ సరస్వతీ || 11

నా సత్యౌ శ్రవణౌ చోభౌ నేత్రే శశి దివాకరౌ | వేదాంగాని చ యజ్ఞాశ్చ తారా రూపాణి యాని చ || 12

ఏతాని నరరూపస్య తస్య దేహాశ్రితాని వై | తేనాతి కాయాని తదా రాక్షసః పాణి పీడితః || 13

ముమూర్చ సచివా శ్చాస్యా పలాయన్త దిశోదశ | ఋగ్వేద ప్రతిమః శ్రేష్ఠః పద్మమాలా విభూషితః || 14

క్రమేణ చ వివేశాథ పాతాలం గిరి సన్నిభః |

నాడాయనుడనియె. కుబేరుని తమ్ముడారావణుడు సర్వభూమిం జరించుచు బంగారపురంగు మేనిచాయ జ్వలించు నగ్నిం బోలిన ప్రభయు గల్గి కామరూపియై విశ్వరూపధరుడైన స్వామిని వరదునిగాంచెను. ఆ మహాపురుషుని ధర్మము తపస్సు జగత్ర్పతిష్ఠకు కారణములైనవి యాయన యూరువుల నాశ్రయించి యుండెను. మన్మథుడు లింగమందుండెను. విశ్వేదేవులు నడుమున మరుత్తులు పొత్తికడుపున భూదేవి పాదములందు పిశాచులు గోళ్ళయందు నడుమునందష్టవసువులు సముద్రములు కడుపున ప్రక్కలందెల్లదిశలు సర్వసంధులందు వాయువు పృష్ఠమందు పితరులు హృదయమందు బ్రహ్మ గో భూహిరణ్య దానములు యకృల్లోమాంతరములందు అస్థిబాగములందు పర్వతులు (శిరలు) నాడులందు నదులు రొమ్మున మణులు శరీరమందు అంతరిక్షము కృకాటికయందు సంధ్యలు తలవాహములందు మేఘములు ధాత విధాత బాహువులు దంతములు సంవత్సరము దంష్ట్ర (కోర) నాసికయందమావాస్య ముకురంధ్రములందు దినములు మెడ వేదిక వాణి సరస్వతి చెవులశ్వినీదేవతలు కన్నులు చంద్ర సూర్యులు వేదాంగములు యజ్ఞములు కంటిగ్రుడ్లుగను నుండెను. అట్టి మహాకాయునిచేత చేయిపట్టుకొని మెలిపెట్టబడి రావణుడు మూర్ఛపడెను. వాని మంత్రులు పారిపోయిరి. ఋగ్వేదసమానుడాతడు పెద్ద కొండవలెనున్నవాడు పద్మమాలాభూషితుడు క్రమముగ నేగి పాతాళముం బ్రవేశించెను.

ఉత్థయచ దశగ్రీవ శ్చా హూయ సచివ త్రయమ్‌ || 15

క్వగతః సహసా బ్రూత ప్రహస్త శుక సారణాః | ఏవముక్తే రాక్షసేంద్రే రాక్షసా స్త మథాబ్రువన్‌ || 16

ప్రవిష్టః స సరోత్రైవ దేవ దానవ దర్పహా | తలేన తేనైవ తతః ప్రవివేశ నిశాచరః || 17

ఏక ఏవ మహాతేజాః వరదానాత్‌ స్వయం భువః | ప్రవిశ్య దదృశే తత్ర సర్వాభరణ భూషితాన్‌ || 18

దశకంఠుడు మూర్ఛనుండి తెలివిగొని లేచి ప్రహస్త శుక సారణుల ముగ్గుర నాతడెటువోయెనని యడిగెను. దేవదానవ దర్పహరుదానరు డిక్కడనే భూతలముం బ్రవేశించెనన నిశాచరుడు దానునట ప్రవేశించెను. బ్రహ్మ వరబలమున నొక్కడే యటుచని సర్వాభరణ భూషితు నా పురుషుని జూచెను.

నిత్యోత్సవాన్‌ శాంత భయాన్‌ నిష్కలాన్‌ పాపక ప్రభాన్‌ | చతుర్భుజాన్‌ మహారూపాన్‌ శ్రీవత్స కృత లాంఛనాన్‌ ||

ఏకరూప ధరాన్‌ సర్వాన్‌ రక్తమాల్యాను లేపనాన్‌ | రాగద్వేష వినిర్ముక్తాన్‌ సర్వశక్తీన్‌ జగత్ర్పభూన్‌ || 20

నృత్యేన గీతవాద్యేన సేవమానాన్‌ జనార్దనమ్‌ | మానుష్యం పూజనం కృత్వా దేవదేవస్య చక్రిణః || 21

సమీపం స మనుప్రాప్తా స్తసై#్యవ పరమేష్ఠినః | దృష్టాః కోట్యః సహస్రాణాం దృష్ట్వా చ రజనీ చరః || 22

ఊర్ధ్వ రోమా తతస్తస్మా ద్దేశా మసాసరత్‌ | జగామ దదృశేవ్యత్రా వ్యనౌపమ్య గుణం గృహమ్‌ || 23

అక్కడ నిత్యోత్సపులై నిర్భయులై నిష్కాములై యావక కాంతిగల్గి నాల్గుభుజములు శ్రీవత్స చిహ్నము మహారూపము గల్గి యందరు నొకేరూపువారై రక్త మాల్యానులేపనులై రాగద్వేషములులేక సర్వశక్తులు గలవారై జగములకు బ్రభువలై యున్న వారిం గనెను. వారు నృత్యముచేయుచు గీతవాద్యములు మేళవించుచు జనార్దనుని సేవించుచుండిరి. చక్రాయుధుని మానసమూర్తిగా బూజించుచు నాయన సామీప్యమునయ్యందరు పొందిరి వారు వేలువేలు కోట్లమంది యటగనబడిరి. వారింజూచి రాక్షసుడ మేని రోమములు నిగుడ నటనుండి తొలగిపోయెను. ఆ సమీపమున ననుపమానమైన యొక గృహముం జూచెను.

దదర్శ చ తదా తత్ర పురుషం శయనే స్థితమ్‌ | పాండురేణ మహార్ఘేణ శయనా సన వాససా || 24

శేతే న పురుష వ్యాఘ్రః పావకేనా వ గుంఠితః | దివ్యగంధాను లిప్తాంగో దివ్యాభరణ భూషితః || 25

దివ్యాంబరధరా సాధ్వీ త్రైలోక్య సై#్యక భూషణమ్‌ | వాలవ్యజన హస్తావై రూపేణా ప్రతిమాభువి || 26

పాదా వుత్సంగ ఆరోప్య తస్యదేవస్య చక్రిణః | జి ఘృక్షుః సహసా సాధ్వీం రాక్షసేభ్యో పతద్బలాత్‌ ||1 27

అవ గుంఠన మాత్రం వై దృష్టం తేన మహాత్మనః | జహాసోచ్చై స్తదా దేవో దృష్ట్వాతం రాక్షసేశ్వరమ్‌ || 28

తేజసా సతు దేవస్య రావణో లేక రావణః | కృన్త మూలో యథాశాభీ నిపపాత మహీతలే || 29

పతితం రాక్షసేంద్రం తం దేవో వచన మబ్రవీత్‌ | ఉత్తిష్ఠ మరణం నాస్తి సాంప్రతం తే నిశాచర ! || 30

ప్రజాపతి వరో రక్షో యేన జీవసి సాంప్రతమ్‌ | త మబ్రవీ త్తదా రాజా రాక్షసానాం తు విహ్వలః || 31

కో భవాన్‌ శయనే శేతే యుగాన్తా నల సన్నిభః | ఏవముక్తః స తేనాథ ప్రత్యువాచ నిశాచరమ్‌ || 32

కింతే మయా దశగ్రీవ ! వధ్యోసి నచిరా న్మమ | ఏవ మేవ చ మ్యత్యుస్తే భవిష్యతి దశానన ! || 33

యాం జిఘృక్షసి మోహాత్త్వం భూయశ్చైనాం హరిష్యసి | మానుష్య మహ మాసాద్య త్వాం వధిష్యామి రావణ : || 34

అస్యాః కృతే విశాలాక్ష్యాః సాంప్రతం గచ్ఛ రాక్షస | శ్రుత్వైత ద్వచనం దేవా ద్రావణో వాక్య మబ్రవీత్‌ || 35

నాస్తి ధన్యతరో లోకే మయా లోకత్రయే వినా | త్వద్ధస్తా న్మరణం యస్యభవిష్యతి జగత్ర్పభోః || 36

యశస్యం శ్లాఘనీయంచ త్వద్ధస్తా న్మరణం మమ | అథాస్య గాత్రే సంపశ్య ద్రావణో భీమ విక్రమః || 37

త్రైలోక్యం సకలం రాజన్‌ ! విశ్వరూప ధరస్య తు | దృష్ట్వైత ద్రావణో రాజన్‌ ! విస్మయో త్ఫుల్ల లోచనః || 38

బహు మేనే తథాత్మానం నిర్జగామ తథైవ చ | దేవ దేవాభ్యను జ్ఞాతః స జగామ తదా గృహమ్‌ || 39

తస్య దేవో వధార్థాయ చతుర్మూర్తి ర్జనార్దనః | మానుష్య మాగతం రాజన్‌ ! తేన మా విగ్రహం కృథాః || 40

రామో .జనార్దనః సాక్షాత్‌ సీతా లక్ష్మీ స్తథైవ చ | తథా భరత శత్రుఫ°్న లక్ష్మణోపి మహాయశాః || 41

విష్ణోర్భాగా స్తథా జ్ఞేయాః విష్ణుతుల్య పరాక్రమాః || శత్రుఘ్నేన మహత్‌ కర్మ లవణస్య వధేకృతమ్‌

తస్మా ద భ్యధికం మన్యే భరతం ధర్మవత్సలమ్‌ ||

న దేవ సంఘైర్మనుజై ర్నయక్షైః | న రాక్షసైః నాగవరై ర్నదైత్యైః |

రణ విజేతుం రఘవస్తు శక్యాః యేషాం స నాధో హరి ర ప్రమేయః || 43

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రావణస్య మహాపురుషదర్శనంనామ

ఏకోన చత్వారింశత్తమోధ్యాయః ||

అప్పుడక్కడను తల్పమందున్న యా పురుషుంజూచెను. అందు పరువబడిన దుప్పటి చాల విలువైనది అచ్చము తెల్లనిది. ఆ పురుషశ్రేష్ఠుడు నిప్పుంగప్పుకొని యట శయనించును ఆతడు దివ్యగంధములు పూసికొన్నాడు. దివ్య భూషణములు దొడిగికొన్నాడు. త్రిభువన భూషణమైన యొక సాధ్వి దివ్యమైన చీరదాల్చి వింజామర చేబూని యట రూపమందామెకు మరి సాటిలేదు. ఆయన పాదములు నొడిలో నుంచుకొని యున్నది.

ఆ సాధ్విం జంపనెంచి ఆరక్షసుడు తటాలున దూకెను. అప్పుడా మహాత్మునిపై యగ్నిరూపమయిన కప్పువస్త్రము మాత్రమారాక్షసునికి గనబడెను. ఆరాక్షసేశ్వరునిగని స్వామి బిగ్గరగా నవ్వెను. ఆ స్వామి తేజస్సుచే రావణు మొదలునరకిన వృక్షమట్లు నేలంగూలెను. వానింజూచి హరి నిశాచర ! లెమ్ము నీకిప్పుడు చావులేదు. బ్రహ్మ వరమున నీవిప్పుడు బ్రతికిపోయితి వనెను. రాక్షసరాజు బెంబేలుపడి పాన్పున బరున్న నీవెవ్వడవు? ప్రళయాగ్ని నున్నావని యడిగెను. శ్రీహరి వానికిట్లు బదులు పలికెను. దశగ్రీవ! నీకు నాతో నేమిపని? అచిరకాలములో నాచే వధింపబడనున్నావు. మృత్యువీతీరుననే నీకుగానున్నది. నీవిప్పుడు చంపనెంచిన యీమెనే నీవప్పుడు హరింతువు. నే మానుష్యమొంది నిన్ను బరిమార్పగలను. ఈ విశాలలోచన నిమిత్తము నీవిపుడు మరలిపొమ్ము, రావణుడు స్వామి యీ పలుకువిని ముల్లోకములందు నా కంటె ధన్యుడులేడు. ప్రభూ! నీచేత నాకు చావుమూడుటనాభాగ్యము. అదినాకు గీర్తినిచ్చును. కొనియాడదగినదనెను. అవ్వల నీవిశ్వరూపధరునిశరీరమందు త్రైలోక్యమునయ్యెడ రావణుడు సూచెను. చూచి యాశ్చర్యమున కనులు విప్పార దనను దా మెచ్చుకొని వెడలి దేవదేవునివలన నభ్యనుజ్ఞగొని యప్పుడింటికిం జనెను. ఆ రావణుని జంపుకొరకు విష్ణువు నలురూపుల మనుజులోకమునకు వచ్చుట జరిగినది. ఆయనతో నీవు పోరుసేయకుము. రాముడుసాక్షాద్విష్ణువుఅట్లే సీతయును లక్ష్మి అట్లే లక్ష్మణుడును భరతశత్రుఘ్నులు విష్ణువునంశములని తెలియనగుదురు. వారు విష్ణుతుల్య పరాక్రములు. శత్రుఘ్నుడు లవణవధ చాలపెద్దపని సేసినాడు. అతనికంటె ఘనుడు ధర్మవత్సలుడు భరతుడని తలంతును. దేవసంఘములచే మనుజులచే యక్షులచే రాక్షసులచే నాగులచే దైత్యులచే రాఘవులు రణమున గెలువవలనుబడరు. వారికి నాధుడు అప్రమేయుడగు హరి వారిదిక్కు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున రావణునికి మహాపురుషదర్శనమను రెండువందలముప్పదితొమ్మిదవ అద్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters