Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఇరువదినాల్గవ యధ్యాయము - వృత్రాసురవధ వజ్ర ఉవాచ : దేవకార్యం వినా విష్ణుర్నోత్పత్స్యతి మహీతలే | కస్మి& కార్యే బభూవా7సౌదత్తాత్రేయ ఇతిశ్రుతః ||
1 మార్కండేయ ఉవాచ : శ##క్రేణచ యదా వృత్రో హతో వీర్యోప బృంహితః ||
2 తస్మి& హతే7సురే త్వష్టా విశ్వరూప మవాసృజత్ | తపస్యన్తం చ తం గత్వా జఘానచ శచీపతిః ||
3 తస్మి& హతే బ్రహ్మహత్యా జగామ బల సూదనమ్ | బ్రహ్మ హత్యా7భిభూతస్తు రాజ్యంత్యక్త్వా త్రివిష్టపే ||
4 మానసే బిసతంతుస్థో బభూవ స పురందరః | రాజాకృతః శక్రహీనెః దేవైస్తు నహుషస్తదా ||
5 సో7కామయత పౌలోమీం శక్రస్య మహిషీం ప్రియామ్ | కాలా లాభపరాప్రాహ శక్రం దేవీ తథా శచీ || 6 అపూర్వేణ విధానేన సమీపం మే సురేశ్వర! | ఋషిభి శ్శిబికాం యుక్త్వా స జగామ తదన్తికమ్ || 7 శిబికాం వహమానం తు మందం మందం ద్విజోత్తమమ్ | పాదేన తాడయామాస సో7గస్త్యం పాపనిశ్చయః || 8 అగస్త్యేన తథా శప్తోభవ సర్పో మహీపతే ! | యుధిష్ఠిరేణ సంగమ్య శాపమోక్ష మవాప్స్యసి || 9 ఏవ ముక్తేతు మునినా సర్పత్వం స జగామవై | నష్టే శ##క్రేచ పతితే నహుషే పాపనిశ్చయే || 10 రజస్తమోభ్యా మాక్రాన్తా బభూవుస్త్రిదశాలయాః | తతః ప్రవృత్తా లోకే7స్మి& ననావృష్టి స్సుదారుణా || 11 దుర్భిక్ష మరకౌ చోభౌ విషణ్ణా స్త్రిదశాలయాః | నష్టోత్సవ మహాయజ్ఞం నిర్వషట్కార మంగళమ్ || 12 అనావృష్టి హతం సర్వం బభూవ వసుధాతలమ్ | క్షుత్క్షామ మానుషప్రాయం వినష్ట పశు సంచయమ్ || 13 కపాలాస్థి సమాకీర్ణం కేశ##శైవాల సంకులం | స్నాయుభగ్న ద్విజగణౖః క్రవ్యాదై రతి సంకులమ్ || 14 నిర్గంధి కుణపాకీర్ణం శూన్యప్రాయం విభీషణమ్ | క్షుత్క్షామ భూత సంఘాభ్యాం వినివృత్త వణిక్ పథమ్ || 15 ప్రనష్టకృషి వార్తంచ దాతృభి శ్చ వివర్జితమ్ | నరకే7పి మహాఘోరే నిరాక్రన్దైః జనై ర్యుతైః || 16 దుర్లభాన్నం నిరానందం స్కంధా సక్త కుమారకైః | ఇత శ్చేతశ్చ యాస్యద్భిర్దానవై రతిసంకులమ్ || 17 శుష్కతోయాశయం భీమం నామశేష మహాపగమ్ | తస్మి9కాలే మహాఘోరే చోత్సృష్ట నియమాద్విజాః || 18 ఆర్యావర్తం పరిత్యజ్య వ్లుెచ్ఛదేశ ముపాశ్రితాః | భక్ష్యా భక్ష్యం పరిత్యజ్య కుర్వాణాః ప్రాణధారణమ్ || 19 ప్రాణధారణ సక్తానాం క్షుథా వ్యాకుల చేతసామ్ | తేషాం బ్రహ్మ తదా నష్టం ధావతాం చ ఇత స్తతః || 20 తదానష్టేషు దేవేషు వ్లుెచ్ఛీభూత మిదం జగత్ | వ్లుెచ్ఛీభూతే జగత్య స్మి& స్వధా స్వాహా వివర్జితాః || 21 యథా మర్త్యా స్తథా జాతాః సర్వేతే దేవతాగణాః | క్షుత్ క్షామ కంఠై స్త్రిదశైః ప్రార్థితశ్చ జనార్దనః || 22 శక్రార్థం త్రిదశాః గత్వా త్రైలోక్య హిత కామ్యయా || 23 తానువాచ హరిర్దేవ స్సర్వే గచ్ఛన్తు మానసమ్ | బిస తంతుగతం శక్రం తస్మాల్ల ప్స్యథ మా చిరమ్ || 24 యజతాం సో7శ్వమేధేన మామేవ సురసత్తమాః | ఆహ మేవ కరిష్యామి విపాప్మానం బిడౌజసమ్ || 25 తత్కృతాం బ్రహ్మ హత్యాంతు చతుర్ధా స కరిష్యతి || 26 అమేధ్య క్షేపకే వహ్నౌ పాదేనై కేన యాస్యతి | తథా చైకేన పాదేన హ్యశుచిక్షేపకే జలే || 27 పాదేనై కేన చ తథా సర్వకాలే ద్రుమచ్ఛిదమ్ | రజస్వలాంగం పాదేన తథా చై కేన యాస్యతి || 28 అహ మంశేన యాస్యామి భూతలం సురకారణాత్ | నష్టేచ భూతలే ధర్మం స్థాపయిష్యామ్యహం పునః || 29 ఏతత్సర్వం యథోద్దిష్టం దేవదేవేన శార్జిణా | చక్రు స్సురగణా స్సర్వే రాజ్యం చావాప వృత్రహా || 30 శ##క్రేణ నిత్యం బిసతంతుగేనధ్యాతో మహాత్మా హరిరప్రమేయః | హత్వా7పి కామేన సవిప్రముఖ్యం లేఖే త్రిలోకం పునరేవ తస్మాత్ || 31 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వృత్ర వధోపాఖ్యానం నామ చతుర్వింశతి తమో7ధ్యాయః వజ్రుడు, శ్రీమహావిష్ణువు దేవకార్యముకొఱకు గాని యవని నవతరింపడుగదా ! అట్టి తఱిం దత్తాత్రేయరూపమున నతడేమిపనిపై నవతరించెనో తెల్పుమన మార్కండేయుడిట్లనియె. ఇంద్రుడు మహాపరాక్రముని వృత్రునివధించిన తరువాత త్వష్టృప్రజాపతి విశ్వరూపుని సృజించెను. శక్రుడేగి తపస్సులోనున్న యాతనింజంపెను. దాన నాతని బ్రహ్మహత్యాపాపము వెంటాడెను. దాననతడు స్వర్గరాజ్యమును విడిచి మానససరోవరమందొక తామరతూడులో దాగియుండెను. ఇంద్రుడులేని స్వర్గరాజ్యమునకు దేవతలు నహుషునిం బ్రభువుంగావించిరి. అతడు శక్రుని పట్టమహిషియగు శచీదేవింగామించెను. ఆమెకాలము కలసిరాని స్థితిలో నుండి నహుషునింగని అపూర్వమైన వాహనముపై నాదగ్గర కీవు రావలయుననియె. అతడు ఋషులుమోయు శిబిక (పాలకి) నెక్కి యామె సన్నిధికేగుచు ఆపాలకిని సహించి మెలమెల్లన నడుచు బ్రాహ్మణోత్తము నగస్త్యు నాపాపి కాలితో దన్నెను. సర్పసర్ప=నడునడువుమని యమ్మునిం దొందరపెట్టెను. దాన మహర్షి కినిసి సర్పసర్పయని ప్రేలినావుగావ నీవు సర్పమగుమని శపించె. యుధిష్ఠిరునితో నీవు సమావేశమందినపుడే శాపమునుండి ముక్తుడగుదువనియు ననుగ్రహించెను. నహుషుడాక్షణమేపామయ్యెను. ఇంద్రుడు వోవ నహుషుడు పతనమందె. స్వర్గవాసులు రజోగుణతమోగుణవశులైరి. దాన నీ భూలోకమందు దారునమైన యనావృష్టి యేర్పడెను. వేల్పులు కఱవునకు మరకము మహామారికి)గురియై దుఃఖవశులైరి. సర్వవసుధాతలము యజ్ఞోత్సవశూన్యమై వషట్కార మంగళ రహితమైయాకలింబక్క చిక్కిన మనుష్యులతో పశువుమందలు నశించిపుర్రెలు నెముకలు నెడనెడ వెంట్రుకలనాచునెడనెడజిమ్మి కొనప్రేవులు తెగినవిప్రులతో రక్కసులతో మిగులసంకులమై కుణపములతో (పీనుగులతో) ఆకలిచే కృశించినభూతములతో వాణిజ్యము చెడి, కృషి (వ్యవహారము) చెడిదాతలు లేకఆకలిచే కఱవుచే బాధపడుచు శూన్యప్రాయమై మహాఘోరనరకమందు గూడ అన్నముదొరకక యానందములేక బుజములపై బిడ్డలనెక్కించుకొని యిట్టటు దిరుగు మానవులతో సంకులమై చెఱువులెండి నామమాత్రావశిష్టములైన మహానదులతో భయంకరమై భూమండలమున్న తఱి బ్రాహ్మణులు నియమములను విడచి యార్యావర్తమును విడిచి వ్లుెచ్ఛదేశము నాశ్రయించిరి. అక్కడ భక్ష్యాభక్ష్య విమర్శలేక యెట్లోప్రాణధారణ మొనరించుకొను చిట్టటు పరువులెత్తు వారిబ్రహ్మ (వేదము) నష్టమైపోయెను. దానితోబాటు దేవతలును నష్టపడగ జగత్తు వ్లుెచ్ఛమయమయ్యెను. అందుచే స్వాహాస్వధాకారములు వినిపింపక మానవులు కర్మభ్రష్టులైనంత దేవతాగణ మాకలికలమటించుచుజనార్ధనునితో మొఱపెట్టుకొనిరి. అప్పుడు హరి మీరందఱు మానస సరస్సునకుంజనుడు. అందొక తామరతూడునందున్న యింద్రునిం బొందుడు నన్నుద్దేశించి యతడశ్వమేధయాగముం జేయుంగాక ! దాన నేనే యారనింబాపరహితునిం గావించెద. అతడొనరించిన బ్రహ్మహత్యను నాల్గు భాగములుగ నతడు గావించును. అమేధ్యద్రవ్యమును (హవిస్సును) హోమముంజేసిన యగ్ని యందొకవంతు అశుచిపదార్థములం బడ వేసిన నీట నొకవంతు చెట్లు నఱకువానియందొక భాగము నాల్గవభాగము ముట్టిన దాని శరీరమందు నాబ్రహ్మహత్య నిలుపొందును. అటుపై నేను సురలకొఱకంశావతార మెత్తి ధర్మస్థాపనము మరలయొనర్తును. దేవదేవుడుద్దేశించిన యీకార్యక్రమమెల్ల వేల్పులు నిర్వహించిరి. వృత్రారియు (ఇంద్రుడు) రాజ్యముం బడసెను. తామరతూడునందున్నంత కాలము నమ్మహాత్ము డింద్రుండ ప్రమేయుడగు హరిని ధ్యానించుచుండెను. కోరి విప్రముఖ్యుని వృత్రుని వధించియు నాతడు హరివలననే తిరిగి త్రిలోకసామ్రాజ్య లక్ష్మిని బొందెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున వృత్రాసురవధయను యిరువది నాల్గవయధ్యాయము