Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల నలుబదియవ అధ్యాయము - అయోధ్యావసంతవర్ణనము శేలూషః : లవణస్య వధం బ్రహ్మన్ | శ్రోతు మిచ్ఛామి తత్త్వతః | శత్రుఘ్నేన కథం యుద్ధే లవణో వినిపాతితః || నాడాయనః : అయోధ్యాయా మయోధ్యాయాం రాజన్ ! దాశరథౌ స్థితౌ | అనతీతే కదాచిత్తు వసన్తే రతివర్ధనే ||
2 నాత్యుష్ణ శీతే ససుఖే సర్వప్రాణి మనోహరే | ఉత్ఫుల్ల శాఖి సంలీన చారుస్వన శిలీముఖే ||
3 కోకిలారావ బహులే సప్రవాళ వనస్పతౌ | సుఖార్క కిరణ కాలే విభూషిత ధరాతలే ||
4 పత్ర చూతాగ్ర శాఖాస్థ పరపుష్ట నినాదితే | గన్తుకామాః ప్రవసితాః పన్థాః భూయో నివర్తితాః ||
5 మంజర్యః సహకారాణాం యత్రలగ్నాః శిలీముఖాః | కామ నామాంకితా బాణాః కామస్యేవ శరీరిణామ్ || 6 కామిన్యః కామినాం కామం యత్ర త్యజయతో దృఢమ్ | సమీరణన దాక్షిణ్యం సర్వత్ర ప్రకటీ కృతమ్ || 7 మృదు ప్రవాత సంనున్న ప్రసూన యవ శాలినీ | క్ష్వేడ పంక్తిః సు రురుచే వహమా నేవ నిమ్నగాః || 8 ఆ లింగితాస్తు మధునా సమంతా ద్వన రాజయః | పుల్లైః పలాశైః ప్రకటం రాగం బభ్రు స్తదా స్వయమ్ || 9 సమీరణన మృదునా పుష్ప పత్రార్చితా మహీ | రాత్రౌ వ్యభ్రస్య నభసః శ్రియ మూహే సశాద్వలా || 10 వంచితై ర్నవ జాతానాం వత్సానాం మృదు భాషిణామ్ | గోష్ఠేషు శోభామహతీయస్మిన్ గంధర్వ సత్తమః || 11 హంభారవ విరా విణ్యః త్వర మాణ పదక్రమాః | యస్మిన్ వత్సోత్సుకా గావః ప్రవిశన్తి దినక్షయే || 12 స్తనం పిబద్భిః మాతౄణాం వత్సై రుక్షిప్త పుచ్ఛకైః | ముహుర్ముదం పరాంయత్ర మాతృలీఢైసన్తు గోపినః || 13 యత్ర పుష్పోచ్చయం చక్షుః కామినీ పాణి పల్లవాః | పల్లవానాం తు సాదృశ్యాత్ విజ్ఞాతా నైవ కామిభిః || 14 ఋతు కోకిల సంగీతౌ ద్విరేఫ ధ్వని వల్లకీమ్ | శ్రుత్వైవ ననృతుర్యత్ర మృదువాత హతా లతాః || 15 తస్మిన్ వ్యతీతే తు మధౌ నరేంద్ర సంతాపయామాస జగత్ సమద్రము | నిదాఘ కాలో లవణోపమస్తు సంరుద్ధ మార్గో೭తి బృహత్ పలాశః || 16 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే అయోధ్యావసన్తవర్ణనంనామ చత్వారింశదుత్తర ద్విశతతమోధ్యాయః || శైలూషుడు శత్రుఘ్నుడు సేసిన లవణవధనుగూర్చి వినగోరెదనన నాడాయనుడు పలికెను. రాజా! దాశరథి శ్రీరాముడు అయోధ్యయైన=యుద్ధముచేసి స్వాధీనము సేసికొనశక్యముగాని అయోధ్యయందున్న కొలదికాలమునకు వేడుకనించు వసంతమున ఎక్కువవేడి చలి లేనందున సర్వప్రాణులకును నింపుగూర్చుతఱి చక్కగపూచిన తరువులందు మూగి ఝంకారములు సేయు తుమ్మెదలతో కోకిల కూతలతో చెట్లుచక్కగ చిగిరించినవేళ సూర్యకిరణములు సుఖస్పర్శములయినప్పుడు ధరాతలమెల్లజక్కగ సింగారించు కొన్నప్పుడు తీయమామిడి చెట్లకొమ్మలపైనున్న కోకిలలు కూయుచున్న సమయమందు ప్రవాసమేగిన జనులు దారి మరలి గృహోన్ముఖులయిరి. మన్మథవర్ధనమైన కాలముగనుక వియోగముసైపలేక శోభించి కామినీకాముకులకు రతివర్ధనములయ్యెను. వాయు వెల్లెడల దాక్షిణ్యమును వెల్లడించుచుండెను. అనగా నీగాలి దక్షిణదిశనుండి వచ్చుమలయమారుతమని గుర్తింపవీలుగా మందముగా సువాసనల జిమ్ముచు చల్లనై వీచుచుండెనన్నమాట. అదిగాక వాయువు దక్షిణ నాయకత్వమును వెల్లడించుకొనుచుండెనని రెండవఅర్థము ఆయర్థములో పెక్కుమంది నాయికలందు హెచ్చుతగ్గులు లేకుండ యందరియందు సమానానురాగ హావభావాదులను బ్రదర్శించు నాయకుడు దక్షిణనాయకుడు గావున నీవసంత ఋతువులో లేచు మలయామారుత మందరికిని సమముగ నానందకరమైయుండెననిభావము. మంద మారుతముచే రాల్పబడిన పువ్వులతో యవాంకురములతో నింపుగుల్కుచు ప్రవహించు నదివలె క్ష్వేడపంక్తి (జిల్లేడుచెట్లగుంపు మిగుల సొంపుగలిగెను వనరాజులు పంక్తులు) (వనముల వరుసలు) నలుగడల మధునిచే వసంతునిచే గౌగలింపబడి వికసించి పలాశములతో మోదుగపూలతో దమంతదాము ప్రకటమైన (స్పష్టమైన) రాగమును ఎరుపును రక్తిమను బూనినవి. ఇక్కడ రెండవయర్థములు వనపంక్తియను నాయికలు వసంతుడను నాయకునిచే గౌగలింపబడి తమంతతాము ప్రౌఢనాయికలట్లు యనురక్తిని (అనురాగమును) ప్రణయమును బ్రదర్శించెను. మందవాయు (విసరి) పూలతో నాకులతో (పత్రితో) పూజింపబడి మహీ (భూ) దేవత పచ్చికలతోగూడి రాత్రియందు మబ్బులేని యాకాశముయొక్క సొంపును ధరించెను. పచ్చికబయళ్ళు నీలాకాశమట్లున్నవి. రాత్రులందు మలయమందపవనము విసరి రాలినపువ్వులు భూదేవి పూజాకుసుమములట్లున్నవి. అక్కడ పూజచేయువాడు వాయు వయ్యెననియట చమత్కారము. ఓగంధర్వోత్తమ! అప్పుడే యీనిమృదువుగ నంభారవములుసేయు లేగదూడలయొక్క మందలచే గోశాలలందలి శోభ మిక్కిలిగ నుండెను. అంభారవములు సేయుచు తురతుర నడుగులువేయుచు లేగలపై నుత్సుకములై (ముచ్చట గొన్నవై) సంజవేళ నావులాగోష్ఠములం బ్రవేశించుచుండెను. తోకలెత్తి తల్లులచనుగుడుచు నాగోవులు వానిమేనులు నాకుంచుండ గోపకుల కదిజూడముచ్చట యగుచుండెను. కామినులయొక్క (స్త్రీలయొక్క) కరపల్లవములు పుష్పోచ్చయము సేయుచుండ (పూలు గోయుచుండ) నక్కడివుళ్ళతో నవి పోలియుండుటచే కాముకులంగనల యరచేతులం గుర్తింపలేకుండిరి. వారి మృదువైన యెఱ్ఱనైన చేతులు తరువుల తీగల చిరురుటాకులు నొకే పోలికనున్నవని చమత్కారము. చిరుగాలికి కదలుతీగలు వసంతఋతు కోకిల సంగీతమును తుమ్మెదలరొదయను వీణను నాలించి (మే) నట్లువలె నృత్యములగావించినవి. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున అయోధ్యావసంత వర్ణనమను రెండువందలనలుబదియవ యధ్యాయము.