Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల నలుబది ఒకటవ అధ్యాయము - గ్రీష్మవర్ణనము నాడాయనః : వర్తమానే తదా గ్రీష్మే వికస న్మల్లికా కులే | నివృత్త పాంథ సంచారే సంతప్త సికతోత్కరే ||
1 ప్రపుల్ల దాడిమాక్రాన్తే జ్వలితాభవనాన్తరే | చారు చంపక పుష్పాఢ్య వనరాజి విరాజితే ||
2 పాటలా పుష్ప సంలీన ద్విరేఫ గణమండితే | సంతప్త మహిషీ కోడ లుఠ త్పంకజ భూషణ ||
3 పార్వతోత్తుంగ మాతంగ విలోడిత జలాశ##యే | స్వాదు గావచ సలిలే నీహారావృత పర్వతే | 4 కర్పూర చందనా ర్ద్రాంగ్యో మృణాల వలయాః ప్రియాః | రమయన్తి ప్రియాన్ యత్ర వనమాలా కృతస్రజః || 5 సేవ్యా శ్చద్రాంశవో యత్ర కామినాం కామవర్ధనాః | రమణీయ ప్రదోషాశ్చ సుతరాం యత్ర రాత్రయః || 6 రాత్ర్యన్తే శీతలాన్ వాతాన్ కుసుమాశయ గంధినః | సమాఘ్రాయాభిజాయన్తే కామినస్తు రిరంసవః || 7 రాత్రయః శీఘ్రగామిన్యోదివసా మందగామినః | మిథునో పగమాద్భనోః సంప్రతప్తాః భృశంకరాః || 8 విలీన హిమ తోయేషు ఫేనపుంజ సమాకులాః | అత్యర్థ శీతా స్సరిత స్తథా హైమేన పర్వతాః || 9 తథా బహుల నిర్యాస సురభీ కృత చందనైః | వర్ధయన్తి తథా కామం కామినీనాంతు కాముకాః || 10 రత్యంతర సముత్పన్న మాయాసశ్రమజం జలం | కర్పూర రజసా యత్ర నాశయన్తి స్మ కామినః || 11 యస్మి న్నిధాఘే సలిలామ్రవృక్షే విభూషణాఢ్యే నృప | వత్సరస్య | దిదృక్షవస్తం రఘ బృందముఖ్యం తదా ప్రయాతా మునయ స్త్వయోధ్యామ్ || 12 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే అయోధ్యాదర్శనే గ్రీష్మవర్ణనంనామ ఏకచత్వారింశ దధిక ద్విశతతమో೭ధ్యాయః అ విధముగ గ్రీష్మర్తువు ప్రవర్తింప మల్లికలు చక్క వికసింప బాటసారులు సంచారములు మాని మఱల ఇసుకమేటలు గనగన గాలుచుండ దానిమ్మపూలు చక్కగ వికసింప లోగిళ్లు వేడిమి చేనముకొన చక్కని సంపెంగపూలం బూదోటలు విరాజిల్లు చుండ పాటల కుసుమములపై వ్రాలిన తుమ్మెదల గుంపుతో నింపోదన ఎండకు క్రాగిన గేదెల మూపులందు తామర పూల సింగారము గొని పర్వతములట్లైత్తైన యేనుగులచే మడుగులు కలచబడ నీరుతేరి తియ్యదనమొంద మంచుగవిసిన గిరిపై కర్పూరము చందనములు నలదినమేనులతో చలువకై తామరతూండ్లు బాహువులకు జుట్టుకొని వనమాలలతో (పద్మమాలలతో) నలంకరించుకొన్న పూల మాలలతో ముత్యాల రత్నాల పేరులలో బ్రియురాండ్రు ప్రియుల రమింప (ఆనందింప) జేయుచుండిరి. అక్కడ అట కాముకులకు కారవర్ధనములైన చంద్రకిరణములు సేవ్యములగుచుండెను. అక్కడి ప్రదోషములు రాత్రులను మిక్కిలి రమణీయములై యుండెను. కాముకులు రాత్రి తుదిజామున పూల నెత్తాపులం మిగుల పరిమళించుచు చల్లని వాయువులం బీల్చి పునారతి కుత్సుకులౌచుందురు. అపుడు శీఘ్రగమనమును రేపవళ్ళు మందగమనము సేయుచుండెను.(వసంతర్తువులో వేసవి రాత్రి ప్రోద్దు తక్కువ పగటి ప్రొద్దెక్కువ యన్నమాట.) భానుడు మిథునోపగముడగుటచే నాయన కరములు- కిరణములు మిక్కిలి వేడెక్కును. వసంతము గాన మిథునరాశిలో సూర్యుడున్నాడన్నమాట. నదులు మంచు గఱగి జాలెత్తిన నీటి పఱుగల నుఱుగల గమి మిగుల వ్యాకులములై నదులు పర్వతములు మిగుల జలువలం గ్రమ్ముకొని యుండెను. యెండ వేడిమికి నిండ బూసికొన్న పెక్కు పరిమళ వస్తువులచే (కలపముచే) మిక్కిలి పరమళింపు గంధపు పూతలచే కాముకుల కామినులు మోహమును బెంపొందించుచుండిరి. రతిలో బుట్టిన యాయాసముచే నింగ గ్రమ్మిన కామినీజనము శ్రమజలమును(చెమటను) కాముకులు పచ్చకప్పురపు పొడులుపైజల్లి యుశపమింప జేయుచుండిరి. నిండ సఫలములయిన మామిడిచెట్లు కను పండువు సేయుచుండ సంవత్సరమునకు అభరణ ప్రాయమైన యవ్వనంత మందు రఘునందన బృందముఖ్యుని సందర్వనమునకు మునులయ్యోధ్యకుం జనిరి. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున గ్రీష్మవర్ణనమను రెండువందలనలుబదియొకటవ అధ్యాయము.