Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల నలుబదిమూడవ అధ్యాయము - వర్షర్తువర్ణనము

రామః - సంప్రాప్య ప్రావృషం వత్స! భీమతోయదనిస్స్వనామ్‌ | నిషిద్ధపాంథ సంచారాం విద్యుత్‌క్షుభితతోయదామ్‌ ||

మేఘైస్తోయ భరానమ్రైఃస్థగితార్కనిశాకరామ్‌ | ప్రవర్షణ జలాఘాత వికాసిత సరోరుహామ్‌ ||2

యస్యాం ఘనవరత్రాసా త్పీనోత్కంపి పయోధరాః | కుర్వన్త్యా లింగనం కాంతాః కాన్తానాం మనసః ప్రియమ్‌ || 3

భూమిర్నవతృణచ్ఛన్నా శక్రగోపాద్య భూషితా | భీమౌఘ నాదవిస్తీర్ణా ఫేనవత్యశ్చ నిమ్నగాః || 4

సతోయ తోయదా క్రాన్తం స్నిగ్ధ నీలం నభస్తలమ్‌ | బలాకాః శోభయన్తి స్మ శారదం తారకా ఇవ || 5

ఘనా ఘనాగమారూఢా ధృతవాసవ కార్ముకాః | తో¸°ఘ బాణ ధారాభిః ప్రవవర్షుః మహీతలమ్‌ || 6

ధారా కదంబవకుళ కుటజార్జున శోభితాః | పక్వజంబ్వామ్రశాలిన్యో వనరాజ్యో మనోహరాః || 7

నిదాఘతాపసంతప్తా నవతోయ సముక్షితా | మహీ విసృజతే యస్యాం గంధమాల్యగుణం స్వకమ్‌ || 8

గర్జమానేషు మేఘేషు మృదంగధ్వని సన్నిభమ్‌ | అస్యాం మయూరా నృత్యన్తి వికస త్సత్కరలాపినః || 9

సమీరణన మృదునా నున్నాః ఖేచ పయోధరాః | మహిష్యశ్చ విసర్పన్తి పయఃపూర్ణ పయోధరాః || 10

ప్రత్యూషే సంచరన్తీనాం మహిషీణాం తదా సమమ్‌ | ఘంటానినాదో మధురః శ్రూయతే తృణగహ్వరే 11

స్థలయః కృష్ణసారంగనేత్రై రనిమిషైరివ | యస్యాం పశ్యన్తి శత్రుఘ్నః జలపూర్ణమహీతలమ్‌ || 12

మేఘపాతేన హృద్యేన పృషతోత్కరశాలినా | కామిన్యః కామినాం సార్ధం త్యాజితా రఘునందన! || 13

అపారగమ్యాః సరితో రాజానో గతవిగ్రహాః | బలాహకగణ ఛత్రా ద్యౌస్తథైవ సవిగ్రహా || 14

ననిర్వృత సుఖోద్వాహ కామ్యా కామ్యక్రియా మహీ | ప్రహృష్ట పౌరానుగతైః సంవత్సరపురోహితైః || 15

వ్యగ్రాభవన్తి రాజానః శక్రయష్టి ప్రవేశ##నే | శైలైర్నవ తృణచ్ఛన్నైః తథా నీలాభ్రశేఖరైః ||16

కాంతి మద్భిర్విశేషేణ విరాజతి వసుంధరా |

తాం ప్రావృషం ప్రాప్యనదత్‌ పయోద ప్రనర్తితాశేష శిఖండి బృందామ్‌ | 17

ద్వారం సమాశ్రిత్య మధోస్తనూజం ధనుర్ధరస్త్వం జహి రాజపుత్త్ర || 18

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే ప్రావృడ్‌ వర్ణనం నామ త్రిచత్వారింశ దుత్తర ద్విశత తమోధ్యాయః||

రాముడనియె. భయంకరమైన మేఘముల యురుములతో మెరపులతో నదరిపారు మేఘములతో జలభరితములైనజలధరములచే సూర్యచంద్రులు గప్పువడ కుంభవృష్టి వలని జలఘాతమువల ఱకుఱకు విడిపోయిన తామరపూలతో బాటసారుల స్వేచ్చాసంచార ముల కభ్యంతరమై వర్షర్తువు వచ్చినది. మేఘములు నురుములకుజడిసి పీనోన్నత కుచభరలైన బింబాధరలు మనః ప్రియమముగ బ్రియులం దమంతగౌగలించుకొను చున్నారు. భూమి లేబచ్చికలం గ్రమ్ముకొన ఆర్ద్రపురుగులు మున్నుగువానిచే సొగసు కొన్నది. నదులు చటుల ప్రవాహ నిర్ఘోషభీషణములై పరుగులిడుచు నుఱుగులం గ్రక్కు చున్నవి. జలముతోడి జలదములలముకొన జిగినించునీలిమం గగనతలమును బలాకములు (బెగ్గులు పక్షులు) శరద్దృతువందలి యాక సమును తారకలట్లు శోభింపజేయుచున్నవి. జలప్రవాహధారల నవనిపై గురియుచున్నవి. ధారాపాతముగ గురియు కడిమిపూలు పొగడలు కుటజములు మోదుగపూలతో సొంపుగొని పండిననేరేడు పండ్లతో వన పంక్తిపూలు మనోహరములగుచున్నవి. గ్రీష్మ తాపముననుడికి నవాంబువులందడిసి పుడమితనకు సహజమైన గంధమాల్యగుణముంబొడ సూపుచున్నది. మేఘములు మృదంగనాదానువాదముగ నురుముచుండ నీమేదిని పైనెమిళులు పురివిచ్చివిచ్చలవిడి నృత్యములారంభించినవి. నింగినల్లనవీచుగాలిచే త్రోయబడి పయోధరములు (మబ్బులు) పాలచే బొదుగులునిండిన గేదెలు నల్గడల సంచరించుచున్నవి. వేకువందిరుగు గేదెల మెడగంటల పెనుసడి గడ్డివాములందు మధురముగ వినబడుచున్నవి. స్థలులు (ఎత్తైనచోట్లు) ఱప్పవాలని నల్లజింకల కన్నులతో (అనిమిషులతో=దేవతలతోడంబోలెయని శ్లేష) జలపూర్ణమైన ధరణీతలముం జూచుచున్నవి. మింటనుండు దేవతలు మేదినింగల శోభను ముచ్చటగొని దిలకించునట్లు ఉన్న తస్థలులు ఎత్తైన ప్రదేశములు అనగా అక్కడనున్న జలముక్రింది జలపూర్ణమైన యవనీతలమును ముచ్చటగొని ఱప్పవాల్పక దిలకించుచున్నా రనిభావము. తుంపరలురలగురియు మనోహరమైన వానగురియమబ్బుల గ్రమ్ముదలచే కామినులు కాముకులగుంపునుండి యెడముసేయబడిరి. నదులవ్వలిదరికం జన వీలుగామి (దాటరాకుండుటంజేసి) రాజులు పోరుమానిరి. బలాకాపక్షులు బెగ్గురుపక్షుల గుంపనెడి గొడుగువేసికొని దివి రూపుగొని ఒకనాయికవోలె జూడముచ్చటైనది. ఆనందభరి తులై నపౌరులు వెంబడింప సంవత్సరమను పురోహితులతో భూమి (నాయిక) పరిపూర్ణ తృప్తి సుఖమునిచ్చిన ఉద్వాహముచేత (ఉద్గత నదీప్రవాహ వైభవముచేననిశ్లేష) కోరవలసిన కోరరాని క్రియగలదై మైమరచినది. అనగా పురోహితులు వివాహవిధిబ్రవరింప పౌరులు వెంబడింప క్రొత్తగ నుద్వాహమైన పెండ్లియైన పెండ్లికూతురూరేగుచు నిదికావ లెను, ఇదివలదను విచక్షణమరచి మైమరచి యెనలేని సుఖమందునట్లు భూమి నదీప్రవాహ ములతో నెనలేని తృప్తినందినదని భావము. రాజులు ఇంద్రయష్టి ప్రకాశమునందు కొందరున్నారు. ఇది రాజులు వర్షాకాలములోజేయు మత్సవముకాబోలు! లేబచ్చికల నల్లనిమబ్బులు గ్రమ్ముకొని శిరస్త్రాణములట్లు గొడుగులట్లు పైనలుముకొని కాంతిమంత ములైన శైలములతో వసుంధరమిక్కిలిరాణించుచు మేఘములురుమ నెమిళులగుంపులెల్ల మిగులనర్తింప నింపగు నావర్షర్తుంబొంది శత్రుఘ్న! నీవుధనువూని వానిగడప మెట్టి (ద్వారమాక్రమించి) మధునికొడుకగు లవణాసురు నీవు సంహరింపుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున వర్షర్తువర్ణనమను రెండువందలనలుబదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters