Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల నలబదినాల్గవ అధ్యాయము - శరద్వర్ణనము

రామః - హత్వా ప్రావృషి తం పాపం యమునాతీరగోచరః | నయః త్వం శారదం కాలం యావత్సుప్తో జనార్దనః || 1

రమణీయతరా యత్రనద్యః ప్రకట సైకతాః | సుస్వాదు శీతసలిలా స్సారసై రుపశోభితాః ||2

బాలార్క సదృశైః పద్మైః పద్మిన్యో యత్రభూషితాః | సరసాం విమలం యత్రతోయం మధురశీతలమ్‌ || 3

వరస్త్రీనయనాకార చారుపత్రవిభూషణౖః | పశ్యతీవోత్పలై ర్వ్యోమ ఉత్పలిన్యః సునిర్మలమ్‌ || 4

నభస్సరసి విస్తీర్ణే తారానుగుణ చిత్రితే | శోభ##తేవ నిశీథేషు హంసన ద్విచరన్‌ శశీ || 5

ఆదధానో మహచ్చాపం సందధానశ్చ దృశ్యతే | యావత్సంపూర ఇత్యేవ బాణౖర్భూమి తలం శరత్‌ || 6

జాతీకుసుమ హృద్యాసు బంధుజీవో జ్జ్వలాసుచ | మనః ప్రసాద మాయాతి హృద్యాసు వనరాజిషు || 7

పక్వ సస్యా వసుమతీ పరాం ధారయతి శ్రియమ్‌ | కలవింకాః ప్రహృష్టాశ్చపక్వకేదార పంక్తిషు || 8

నిమ్నగాః కాశవసనాః చక్రవాక యుగస్తనాః | సారసారావ హాసిన్యః సుతరాం రతి వర్ధనాః ||9

హంసై స్సంఘట్టనోపేత కల్హార రజసోత్కరైః | సరాంసి దుర్విభావ్యాని కుశ##లైరపి మానవైః ||10

పాండు రాభ్ర కృతన్యాసాః సర్వేవ శిలోచ్చయాః | శ్రియం విడంబయన్తీవ తుషారాద్రేః సముజ్జ్వలామ్‌ || 11

శరత్‌ ప్రభూతోత్పలచారుపద్మాం విపక్వకేదార విభూషితోర్వీమ్‌ ||

నీత్వాతతః ప్రాప్య హిమస్యకాలం కార్యస్త్వయా పత్తన సన్నివేశః || 12

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే శత్రుఘ్నం ప్రతి రామానుశాసనే శరద్వర్ణనంనామ చతుశ్చత్వారింశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

రాముడనియె, శత్రుఘ్న! వర్షర్తువున నీవా పాపిని లవణాసురుంజంపి, యమునా తీరమునందు హరి నిదిరించు నంతకు శరత్కాలమట గడపుము. ఆ ఋతువునందు నదులిసుకతిన్నెలు బయలుపడి మిక్కిలి రుచిగల నీరముతో, సారసములతో (తామర పూవులతో) శోభగొనును. అందు పద్మినులు (తామరతీగలు-పద్మినీజాతి స్త్రీలనియుశ్లేష) బాలసూర్యుని వంటివై (ఎఱ్ఱనివై) పూవులం సింగారించు కొనును. అపుడు సరస్సులోని నీరు స్వచ్ఛముగ (తేటగ) తియ్యగ చల్లగ నుండును. కలుపూదీగలు సుందరీ మణుల కందొవంబోని రేకుల లలంకారముగ గొన్న కలువపూలచే వినిర్మలాకాశము వంక జూచుచున్న వాయన్నట్లింపు గొల్పు చుండును. తారలచే (చుక్కలచే) చక్కగ (అనుగుణముగ) చిత్రితమై (రంగురంగులీనునదై) విస్తీర్ణమై (విశాలమై) యున్న యాకసమను సరస్సునందు రాయంచవోలె నడిరేల సంచరించుచు శోభించుచుండును. శరత్తు (ఒకయోధుడట్లు) మహాధనుస్సును (ఇంద్రధనుస్సును) చేబట్టుచున్న బూరించుచున్నట్లు (ఎక్కిడుచున్నట్లు) గానవచ్చు బాణములచే (రెల్లుపూలచే) జగమెల్ల నింపు చున్నాడు. జాజిపూవులచే మనోహరములై మంకెనపూలచే (ఇవి ఎఱ్ఱనివి) మెఱయునున్నవినై మనోహరము లగుచున్న వన పంక్తులందు మనస్సు ప్రసన్నతం గాంచుచున్నది. వసుమతి పంటకు వచ్చిన సస్యములతో పరమైశ్వర్యము (శోభను) బూని నది, పంట పొలములందు కలవింక పక్షులు మిక్కిలి హర్షమందుచున్నవి. చక్రవాకముల జంటలను జనుగవం గులుకుచు రెల్లుపూల చీరం దాల్చి నదులు (నాయికలనిధ్వని) సారసారవహాసినులై హంస ధ్వనులతో హంసలట్లచ్చపు తెలినవ్వుతో గూడి వలపూరించుచున్నవి. (హంస పలుకులట్టి పలుకులతో హంసలట్లచ్ఛమైన నవ్వులతో ననిశ్లేష) మిక్కిలి రతివర్ధనులగుచున్నవి. ముచ్చటలు నించుచున్నవి. వలపులూరించు చున్నవని నాయికాపరమైన శ్లేషార్థము. తెల్లని హంసలతో, హంసల రెక్కల సంఘట్టనము నొందిన ఎఱ్ఱదామరపూల పరాగపుంజములతో సరస్సులు నిపుణులైన వారికిగూడ యూహింపరానివిగా నున్నవి. ఇవి తెలుపో ఎఱుపోతెలియరా కున్న వనిభావము. (అదిగాక రజస్వలలో కారో తెలియరాకున్న దనిధ్వని) ఎల్లెడ ప్వతములు తెలిమబ్బులచే నిరవుకొని మంచుగొండ యొక్క సముజ్జ్వలశోభం దులకించుచున్నవి. శరత్కాలమందు చక్కగ నొండుగొన్న కలువలు చక్కని తామరపూలు గలిగి పండిన పంట పొలములతో నలంకృతమైన వసుంధరతో శరద్దృతువు నీవు జరిపి యవ్వల హేమంత కాలము నొంది పట్టణ సన్ని వేశమును గావింపుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమందు శరద్వర్ణనమను రెండు వందలనలుబదనాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters