Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల నలుబదియారవ అధ్యాయము - శత్రుఘ్న ప్రస్థానము రామ ఉవాచ : తతస్తు శైశిరే ప్రాప్తే కాలేతపన వల్లభే | హిమాలీ పటలచ్ఛన్న దుర్విభావ్య దిశాముఖే ||
1 సుపక్వమాతులుంగాఢ్య వనరాజి సుగంధి ని | ప్రపుల్ల వృత్త కుసుమ చారురాగొజ్జ్వల త్విషి ||
2 హిమప్రయాత సంజాత సర్వరత్న తృణోల్బణ | అత్యర్థ శీత కుసుమే కుంకుమాగురు వల్లభే ||
3 కామిన్యః కుంకుమార్ద్రాంగ్యః పీనోన్నత పయోధరాః | ఆలింగనేన కాంతానాం యత్ర శీత భయాపహాః ||
4 పుష్పితైరతసీ వాటైర్నీల నీరజ నిర్మలైః | పూర్ణతోయాశయాశంకా జాయతే సుధియామపి ||
5 మాఘ్యకుందక పుష్పాఢ్యా వనరాజ్యో మనోహరాః | సుశీర్ణ పర్ణసరలా నమేరుక విభూషణాః ||
6 సంత్యక్త్వా దక్షిణామాశాం వ్రజమానే తథోత్తరామ్ | సూర్యే ముమోచ పవనం నిఃశ్వాసమివ దక్షిణా ||
7 రమ్యాశ్చ గంధమంజర్యః శోభయన్తి వనస్థలీః | మన్మథస్య శరాః కాంతా కామి మన్మథ వర్ధనాః ||
8 హయానాం మధురః శబ్దః శ్రూయతే దశనోద్భవః | శబ్దోయవభుజాంయత్ర స్వామినాం రతివర్ధనః ||
9 నిర్మలానాంతు సరసాం వినివిష్టా జలేదరాః | బ్రువంతో మధురం పాంథా జనయంతి పరాం ముదమ్ ||
10 జనయంతి పరాంప్రీతిం కామినీనాంతు కాముకాః | యత్రమేధ్యైర్నవైర్వత్స మాతులుంగాధి వాసితైః ||
11 వాపీకూప తడాగేషు హ్రదప్రస్రవణచషు | యత్రకాలే రటంత్యాపః కంపయంత్యః పురీంమహత్ || 12 రాముడనియె శిశిరఋతువు వెచ్చదనమునకు బ్రియమై మంచు దట్టముగ గురిసి కప్పువడి దిక్కులు దోచకున్న తఱి నిండ బండిన మాతులుంగ ఫలములచే సమృద్ధములై వనపంక్తులు సువాసనలు నించుచుండ బాగుగవికసించిన పూగుత్తులచే యొఱుపు దీపించు వెలుగుగొని చలివోయి చక్కగ మొలచిన చెంగలి పచ్చికలచే సమృద్ధమై మిక్కిలి చలువనించు పువ్వులతో కుంకుమ పువ్వు అగురు మొదలైన వేడినిచ్చు ద్రవ్యములపై ప్రీతిగలుగుచుండ కుంకుమపూవు కలపమలందుకొని సీనోన్నత పయోధరలైన కామినులు కాంతలం గౌకలించుకొని, చలిబాధవారించుచుండపూసిన చీకటినీలనీరజ కుసుమ నిర్మలములయినయతసీ వనములచే స్వచ్ఛములయిన పూచిన యిఱుగుడుచేవమ్రాని కాబోలునను సంశయముగల్గించుచుండ మాఘమాసమందు నిండుపూయు మొల్ల పువ్వులతో నిండుకొని వనపం క్తులగును. మనోహరములగును. ఆకులుబొత్తిగారాలిన సరలద్రుమములతో నమేరుపృక్షభూషణములై సొంపుగొననా శిశిరఋతువందు సూర్యడు దక్షిణదిశనువదలి యుత్తరదిశ కేగుచుండ (నాయకుడన్యాంగనాసంగుడౌట దెలిసి యీర్ష్యాకషాయితయగు నాయకవలె) దక్షిణ దిశ నిట్టూర్పు పుచ్చెనన్నట్లు దక్షిణ వాయువులు (మలయవాయువులు) వీచుటారంభమగును. సుగంధకుసుమ మంజరులతిరమ్యములై వనస్థ లులను శోభిల్లంజేయును. కాములై పుష్పబాణుని బానములు పువ్వులతి సుందరములగును. గుఱ్ఱముల పలువరస వెడలు సకిలింపుల సడి లెస్సగ వినబడును. (శిశిరము అశ్వములకు ఋతుకాలమన్న మాట.) అది యవభోజనము సేయు (సన్న వరి ధాన్య విశేషములలో యవ లొకటి) ప్రభువులకురతి (కామ) వర్ధన మగుచుండును. అచ్చము తేరిన సరస్సులందు జొచ్చి యట్టిట్టు షికారు సేయుచుఒండొరులు మధురమగు ముచ్చట లాడుకొనుచు పాంథులు కామినీ కామకులకు పరమహర్షముం గూర్చుచుందురు. రుచికరమైన క్రొత్త మాతులుంగ ఫలముల అధివాసనముచేత (పండ్లురాలి యారసము జలములలో కలియుటచేత) వాపేకూపటాక ములు మడువులు బుగ్గలలోని పొంగిన నీరు దరినున్న పురమున కంపింప జేయునంతగా ధ్వని సేయు చుండును. తస్మిం స్త్వం శిశిరేకాలే కృత్వా గృహవరే స్వకే | ప్రావేశయతు విధినా శిల్పి భిర్యంత్ర నిర్మితైః || 13 ధర్మేణ పాలయన్ క్షోణీం వస రాజీవలోచన | హృదికార్య స్త్వయా ధర్మో నిత్యమేవ నరోత్తమ || 14 ఉత్తిష్ఠ శీఘ్రం విజయాయ గచ్ఛ దీప్తాం శ్రియం ప్రాప్నుహి రాజపుత్త్ర | రక్షంతు దేవాస్తవ సర్వకాం పదం విధత్స్వారి గణస్య మూర్ధ్ని || 15 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషంప్రతి నాడాయనవాక్యేషు శత్రుఘ్నంప్రతి రామానుశాసనేలవణం ప్రతి శత్రుఘ్న ప్రస్థానంనామ షట్చత్వారింశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || అట్టిశిశిరఋతు సమయమందు నీవు యంత్ర నిర్మాణ దక్షులైన శిల్పులచే వారు నిర్మించని గృహమందు యథా విధిగ గృహప్రవేశోత్సవము గావింప బడుదువు గాక. ధర్మముచే నీక్షోణిం చాలించుచునట వసింపుము. ఎల్ల తఱి నీ హృదయమందు ధర్మమును నిలుపు కొనవలయును. లే లెమ్ము శీఘ్రముగ విజయమునకు జనుము. మిగుల దీపించు సిరులందుము. రాజకుమారా? శత్రుఘ్ను! దేవతలు నిన్నే వేళ రక్షింతురు గాక. అరిగణము నడినెత్తి నీ పాదముంపుము. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శత్రుఘ్నునింగూర్చిన రామానుశాసనమను రెండువందలనలుబదియాఱవ అధ్యాయము.