Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఇరువదిఐదవ యధ్యాయము - దత్తాత్రేయోపాఖ్యానము మార్కండేయ ఉవాచ : బ్రహ్మణో7త్రి స్సుతః శ్రీమా& ప్రభావా ద్బ్రహ్మణానమః | ప్రభాకర స్తస్య సుతః పితామహసమో గుణౖః ||
1 స్వర్భానునా హతే సూర్యేప తమానే దివో మహీమ్ | తమో7భి భూతే తపసా ప్రభాయేన వివరితా || 2 స్వస్త్యస్త్వితి సహోనాచ పతమానం దివాకరమ్ | వచనాత్తస్య బ్రహ్మర్షేః న పపాత దివో మహీమ్ || 3 అత్రి శ్రేష్ఠాని గోత్రాణి యశ్చకార మహాయశాః | యజ్ఞేష్వతి వనం యశ్చ నురైర్యస్య ప్రకీర్తితమ్ || 4 తస్య పుత్రత్వ మాపన్నౌ జనార్దన మహేశ్వరౌ | దత్తాత్రేయో7థ దుర్వాసాః లోకేఖ్యాతి ముపాగతౌ || 5 దత్తా తేయత్వ మాసాద్య భగవా& మధుసూదనః | వేదా నధ్యాపయామాన బ్రాహ్మణా& చరిత వ్రతా& || 6 తేషు నష్టేషు వేదేషు క్రియాసుచ మఖేషు చ | చాతుర్వర్ణ్యే సమాకీర్ణ్యే ధర్మే శిథిలతా గతే || 7 అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే7నృతే స్థితే | ప్రజాసు శీర్యమాణాసు ధర్మే చామలతాం గతే || 8 సయజ్ఞా స్సక్రియావేదాః ప్రత్యానీతా హి తేనవై | చాతుర్వర్ణ్య మసంకీర్ణం కృతంతేన మహాత్మనా || 9 దుర్భిక్ష మరకౌనష్టౌ తస్మి& జాతే మహీతలే | ప్రవవర్షచ దేవేంద్రః సహస్ర నయనః క్షితౌ || 10 భూయ ఏవ జగద్వృత్తం యథాపూర్వంజగత్పతే | ప్రణష్టకలుషే లోకే సన్మార్గస్థేషు రాజసు || 11 యజత్సు విప్రముఖ్యేషు తపస్యా7 భిరతేషు చ | వార్తా సక్తేషు వైశ్యేషు శుశ్రూషు ష్వన్త్యజేషు చ || 12 ముదితేషు చలోకేషు త్రైలోక్యే దేవ సాద్గతే | విష్ణోర్భాగే క్షితిగతే కార్త వీర్యార్జున స్తదా || 13 దశవర్ష సహప్రాణి కృతవా& దుశ్చరం తపః | ప్రయాగవన మాసాద్య దత్తాత్రే యాశ్రమం ప్రతి || 14 ఆరాధయామాస తదా దత్తం శుశ్రూషయా నృప | తేన దత్తవర శ్చక్రే సరాజ్యం హత కంటకం || 15 ఆర్యావర్తేషు నిర్ల్మేచ్ఛా కృతా తేన వసుంధరా | తస్మిన్ రాజని ధర్మజ్ఞేదైత్యై ర్దేవ నిపాతితైః || 16 సంప్రాపై#్తః భూమిపాలత్వం వసుధా భారపీడితా | నాకపృష్ఠం య¸° శీఘ్రం శక్రదర్శన లాలసా || 17 వజ్ర ఉవాచ : ఆసాద్యలోకం త్రిదివేశ్వరస్య భారేణ ఖిన్నా వసుధా నరేంద్రెః | కిం తత్ర చక్రే వద ! తన్మమాద్య దృష్ట్వా క్షితిం యచ్చ చకార శక్రః || 18 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే దత్తాత్రేయోపాఖ్యానం నామ పంచ వింశతి తమో7ధ్యాయః మార్కండేయుడనియె. బ్రహ్మకు బ్రహ్మతో సమానప్రభావముగల కుమారు డత్రిజనించెను. ఆయన కుమారుడు ప్రభాకరుడు (సూర్యుడు) పితామహునితో సమములగు గుణములు గలవాడు. రాహువుచే సూర్యుడు నిహతుడై యంతరిక్షము నుండి భూమిపై బడుచుండ జీకటియలముకొన్నతఱి లోకము తమోమయమైన లోకమునందు తపఃప్రభావముచే నాతడు కాంతిని బ్రసరింపజేసెను. క్రిందబడుచున్న సూర్యునుద్దేశించి యయ్యత్రిమహర్షి స్వస్త్యస్తు=మంగళమగుగాక - అనిదినకరుని దీవించెను. ఆబ్రహ్మర్షి వచనమున సూర్యుడు దివమ్మునుండి క్రిందబడడయ్యె. అతిశ్రేష్ఠములయిన గోత్రములకు వంశములకు నమ్మహర్షి కర్త మూలపురుషుడు. దేవతలాతని గోత్రము వారిని యజ్ఞములందు అత్రివనమని పేర్కొనిరి (ప్రశంసించిరి). ఆయత్రికి హరి హరులు కుమారులైరి. వారు దత్తాత్రేయులు దుర్వాసులను పేరజగత్ప్రఖ్యాతినందినవారు. విష్ణువు దత్తాత్రేయుడై బ్రహ్మచర్య వ్రతనిష్ఠుల వేదాయధ్యయనము సేయించెను. వేదములు వేదోక్తకర్మములు యజ్ఞములు నష్టమైనతఱి చాతుర్వర్ణ్యవ్యవస్థ తారుమారైనయెడ ధర్మము శిధిలమై యధర్మము ప్రకోపించిన సమయమున సత్యముపోయి యనృతము నిలుకడగన్నవేళ ప్రజలు శిథిలప్రాయులుకాగా యజ్ఞములతో కర్మానుష్ఠానములతో వేదముల నాదత్తాత్రేయావతారము పునరుద్ధరించెను. అమ్మహానుభావునిచే చాతుర్వర్ణ్యము పునర్వ్యవస్థనందెను. ఆయన యవతరించినంతట దుర్భిక్షము (కఱవు) మరకము (మహామారి) నశించినవి. సహస్రాక్షుడు దేవేంద్రుడు భూమిపై సువృష్టి గురిపించెను. తిరిగి జగత్తు యథాపూర్వస్థితికి వచ్చెను. ప్రజలు లోకము కలుషము వాయ రాజులు సన్మార్గమున నుండ విప్రవరులు యజ్ఞములు సేయుచుండ తపోభిరతులునుంగాగ వైశ్యులు వార్తయందు (వర్తకమందు) ఆదరముగొన శూద్రులు (అంత్యజులు)ను శుశ్రూషాపరులై యుండ లోకములానంద భరితములుగాగ ముల్లోకము దేవతలవశముగాగ విష్ణువు నంశ##మైన దత్తాత్రేయులవని నున్నయత్తఱి కార్తవీర్యార్జునుండు పదివేలేండ్లు దుష్కరమైన తపమాచరించెను. అతడు దత్తా తేయామ్రమనబడు ప్రయాగవనమున కేగి దత్తుని శుశ్రూషజేసి యారాధించెను. ఆయన వరమీయ నిష్కంటకముగ రాజ్యపాలనముసేసెను. ఆర్యావర్తదేశములందు వ్లుెచ్ఛులులేకుండ జేసినవాడాతడు. ఆధర్మజ్ఞుడు రాజై నతఱి దేవతలచే నోడిన దైత్యులు భూపతులయి నంతట నీవసుంధర భారపీడితయై యింద్రునిదర్శింప స్వర్గమునకుంజనెను. అని మార్కండేయుడు సెప్ప వజ్రభూపాలు డట్లమరలోకమేగిన భూదేవి యటనేమి సేసెను? ఆభూమిని జూచి యింద్రుడేమిసేసెను? ఆనతిమ్మని యడిగెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున దత్తాత్రేయాఖ్యానమను నిరువదియైదవయధ్యాయము