Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఏబదియవ అధ్యాయము - దేవేంద్ర పట్టాభిషేకము మార్కండేయఉవాచ : సుమేరౌ పర్వతశ్రేష్ఠే నానారత్నోజ్జ్వలత్విషి | ప్రజాపతి రథాదాయ రాజసంఘాన్ ప్రకీర్తితాన్ || అభ్యషించత దేవానాం రాజ్యే కశ్యపనందనమ్ | తేజస్వినమథా దిత్యం జజ్ఞే నిర్ధూతకల్మషమ్ ||
2 తస్యాభిషేకే ప్రదదౌ విశ్వకర్మా మనోహరమ్ | రత్నోజ్జ్వలం భద్రపీఠం కామరూపధరం శుభమ్ ||
3 అత్రైవ ముపదిశ్యాథ స్వయం బ్రహ్మా జగద్గురుః | ఆభ్యషించత దేవానామాధిపత్యే జగద్గురుమ్ ||
4 బ్రహ్మావిష్ణుశ్చ శంభుశ్చ సాధ్యాశ్చ సమరుద్గణాః | ఆదిత్యావసవోరుద్రా విశ్వేదేవామరుద్గణాః ||
5 భృగవో೭ంగిరసః సాధ్యా అశ్వినౌచభిషగ్వరౌ | ఋషయశ్చ మహాభాగా సై#్రకాల్యామలదర్శినః ||
6 యాని తోయాన్యుపాదాయ సముద్రాః సరిత స్తథా | సరాంసిచ సతీర్థాని గంధర్వాప్సరసస్తథా ||
7 తస్యేందు మండలాకారం ఛత్త్రం జగ్రాహ కేశవః | శ్వేతౌచ వాలవ్యజనౌ తథాచంద్రదివాకరౌ ||
8 భృంగారం యాదసాంభర్తా దండధరం ప్రభుః | మేనకాచైవరంభాచ తాలవృంతౌ మనోహరౌ ||
9 విధివచ్చజుహావాగ్నౌ దేవాచాశోబృహస్పతిః | మార్కండేయుడనియె : పర్వత రాజమగు సుమేరువు నానా రత్నకాంతి భరితము ప్రజాపతి యింతమున్ను పేర్కొన్న రాజ సమూహమును వెంటగొని దేవతల రాజ్యమందుండి కాశ్యపనందనుని తేజశ్శాలిని ఆదిత్యు నభిషేకించెను. అప్పుడు విశ్వ కర్మచక్కని రత్నమయ సింహాసనమును కామరూపధరమైన. దాని నొసంగెను. ఇచట నిట్లు దెలియజెప్పి జగద్గురువు బ్రహ్మ స్వయముగ దేవాధి వత్యమందు శతక్రతునభిషేకించెను. త్రిమూర్తులు సాధ్యులుమరుత్తులు వసురుద్రాదిత్య మరుద్గణములు విశ్వే దేవులు భృగువులు అంగిరసులు అశ్వినీ దేవతలు వైద్యశ్రేష్ఠులు త్రికాలదర్శనులు ఋషులు పవిత్రాభిషేక జలములంగొని పుణ్య నదులు సముద్రములు సర్వ తీర్థములతో సరస్సులు గంధర్వాప్సరసలు నటకువచ్చిరి విష్ణుమూర్తి చంద్ర మండలాకారమైన శ్వేతచ్ఛత్రము పట్టెను. సూర్య చంద్రులు తెల్లని వాలవ్యజనములు గొని వీచిరి. యాదః పతి (జలాధీశుడు) వరుణుడు భృంగారము (ఒకానొక పాత్ర విశేషమును) పట్లుకొనెను. మేనక రంభ తాళవృంతములు (తాటాకు విసనకర్రలు) గైకొని విసరిరి. దేవ గురువు (బృహస్పతి) యథావిధిగ నగ్నిని వేల్చెను. తత స్తస్యదదౌ ప్రీత్యావాహనార్థే మదోత్కటమ్ ||
10 ఐరావణం చతుర్దంతం నాగంచ పులహః స్వయమ్ | పులహః స్వసుతం ప్రాదాచ్ఛ్వేతం తురగమేవచ ||
11 తురగాణాంసహస్రంచ హరీణాం వాతరం హసామ్ | శ్రియాదత్తం తతః ప్రీత్యా రథవాహనముత్తమమ్ ||
12 తమగ్ని ర్యోజయామాసకాంచనేన రథేనచ | ఇంద్రాయుధ సవర్ణాభిః పతాకాభిరనంతరమ్ ||
13 వాయుస్తంయోజయామాస ధ్వజంనాగేనశంకరః | బబంధముకుటం తస్య స్వయంబ్రహ్మాజగద్గురుః ||
14 ఉపానహౌదదౌతస్య విరూపాక్ష స్తథానఘ | ఖడ్గశ్చ విమోలదత్తస్తస్య శుక్రేణయాదవ ||
15 చందనానిచ ముఖ్యాని గంధాని విలిధానిచ | హిమాలయః స్వయంతస్య ప్రాదాల్లోక గురుర్గురుం || 16 రత్నాని సువిచిత్రాణి సముద్రః స్వయమేవహి | దదుశ్చృతవస్తస్య పుష్పాణిచ ఫలానిచ || 17 ననృతు ర్దేవగంధర్వా జగుశ్చాప్సరసాంగణాః | హృష్టం ప్రముదితంచాసీ త్త్రైలోక్యం సచరాచరమ్ || 18 సర్వగంధాను పాదాయ సురభిర్మారుతోవవౌ | అటుపై నతరికి వామనముగా మదించిన ఐరావతమును నాల్గు దంతములగలదాని పులహుడు స్వయముగా నొసగెను. ఆయన తన బిడ్డయైన తెల్లని గుఱ్ఱములను ఉచ్చైశ్రవమును బహుమాన మిచ్చెను. వాయువేగములయిన వేయి జాతి గుఱ్ఱములనుగూడ యిచ్చెను. శ్రీమహాలక్ష్మి ప్రీతితో నుత్తమ రథవాహనము నొసంగెను. అగ్ని యా రథమును బంగారు రథముతో జోడించెను. ఇంద్రాయుధముతో సమములయిన పకాకలతో వాయువలంకరించెను. శంకరుడు జెండాపై నాగు సర్వము నలంకరించెను. బ్రహ్మ స్వయముగ కిరీటము పెట్టెను విరూపాక్షుడు పాదరక్షల నిచ్చెను. శుక్రుడు మెఱుగైన కత్తినిచ్చెను. చందనాది సుగంధద్రవ్యములన హిమగిరి స్వయముగ నొసంగెను. సముద్రుడు విచిత్రరత్న బహూకరణముసేసెను. ఋతువు పూవులుం బండ్లును గానుక వెట్టెను. దేవగంధర్వులు పాడిరి. అప్సరస లాడిరి. చరాచర జగమెల్లహర్షభరిత మయ్యెను. వాయువుసర్వసువాసనలం గొని వీచెను. మహతా చవరౌఘేనతర్పయిత్వా బృహస్పతిమ్ || 19 వరౌఘైస్తర్పయామాస సర్వానేవద్విజోత్తమాన్ | సప్తాహం మానసీం సిద్ధెం ప్రాదాత్సర్వేఘ జంతుఘి || 20 వ్యాధిమృత్యు జరాళోక వినివృత్తయీ | సప్తాహం నరకస్థానాం నైవసర్వాశ్చయాతనాః || 21 సర్వముదిమేతవాసీ త్త్రైలోక్యంస చరాచరమ్ | కిరిటీశ్వను విప్తాంగః కుండలోత్తమ భూషితః || 22 కాశేయవసనస్తత్ర శ్వేతమాల్యవిభూషణః | శ్రియందధార సోమస్య శ్వేతస్థస్యశతక్రతుః || 23 భద్రాసనగతంశక్రం ప్రణముః సర్వదేవతాః | భ్యాప్య మానోమహారాజ తదౌ దేవేనదండినా || 24 ఋషయస్తు పుష్పవున్తంచ గంధర్వాప్సరసస్తథా | మంగళాలంభనంచక్రే తతఃశక్రః సురారిహా || 25 పూర్ణకుంభంసు మనసోరత్నాన్యాజ్యం తథాదధి | ఫరాని శ్రీఫలంచైవ ఉద్భూతానివ సుంధరా || 26 స్వస్తికామ్ర చిరాంశ్చైవ నంద్యావర్తాంశ్చకాంచనమ్ | కాంచనోల్లిఖితాశ్చైవ యాశ్చ ముభ్యాః సరిద్వరాః || 27 ఉదగ్దానంతథా దూర్వాందర్పణంచాజ్యమేవచ | ధర్మః సత్యంచశూలంచ బలంచ యదునందన ! || 28 ఉపాసంత మహాభాగం సశరీరాః శతక్రతుమ్ | కాంతిర్లక్ష్మీర్ధృతిఃశ్రద్ధా పుష్టిర్మేధాక్రియామతిః || 29 బుద్ధిర్లజ్జావపుః శాంతిరనసూయా తధైవచ | ఉపాసంతథదా దేవంసర్వ రాజేశ్వరం విభుమ్ || 30 తతోవవందే పితరం మాతరం శంకరం హరిమ్ | బ్రహ్మాణం వరదం సౌమ్యమృషీంశ్చ యదునందన || 31 గొప్ప వరములనేకములచే నాచార్యుని బృహస్పతిని సర్వ ద్విజవరులను నింద్రుడు సత్కరించెను. (బహూమానములను వీరములని యిక్కడ పేర్కొనినట్లున్నది.) సర్వ జంకువులకు నేడు రోజులు మానసీ సిద్ధి నిచ్చెను. వ్యాధి మృత్యు జరా శోకములు లేక జగత్రయమునాపట్టాభిషేక సమయమందేడురోజులు సుఖభరితములైనవి. నరకవాసులకాయేడురోజులు నేయాతనలు లేకుండెను. సర్వ భువనములానందపడినవి. కిరీటము పెట్టికొని సుగంధములు బూసికొని అమూల్యరత్నకుండలములుదాల్చి పట్టువలువలంగట్టుకొని తెల్లని పూవులం గైసేసి శ్వేతపర్వత మందుండు చంద్రుని శోభనువహించి యింద్రుడు భద్రాసనమధిష్ఠించెను. సింహాసగతుడగు నింద్రుని సర్వ దేవతలు మ్రొక్కిరి. ఆయాదేవతలను వేర్వేర బేర్కొని ప్రభువునకు దంధధారియైన యొకవేల్పును నివేదించెను. ఋషులు గంధర్వాప్సరసలు నా వేల్పుదొరను స్తుతించిరి. అప్పుడు శక్రుడు పూర్ణకుంభము సుమదసములు=పువ్వులు రత్నములు గోఘృతమును ఆలపెఱుగు పండ్లు శ్రీ ఫలములు=మారేడు పండ్లు మొదలయిన మంగళ వస్తువులను దర్శించడానికి మరి పెక్కు రీతుల మంగళాలంబవము సేసెను. బంగారపు రేకులందు వ్రాసినస్యస్తిక నంద్యావర్తాది శుభముద్రలను ముఖ్య పుణ్యనదులను గరిక అద్దము ఆజ్యము మొదలయిన మంగళ పదార్థములను సేవించెను. ధర్మము సత్యము శూలము బలము శుభలక్షణములు రూపుదాల్చి (శశీరములై) సర్వరాజేశ్వరునుపాసించెను. అటుపై తండ్రిని, తల్లివి శంకరుని హరిని వరదుడు సౌమ్యుడయిన బ్రహ్మను ఋషులను దేవేంద్రుడు మ్రొక్కెను. తతోహరిశ్చశ##క్రేణ సతుమాతలి యంత్రిణా | వినాశయామాసరణ దేవతానామరాతయః || 32 పాలయామాస సకలం తథైవచజగత్త్రయమ్ | కశ్రాభిషేక చరితంకథతం యదునందన || 33 శ్రోతవ్యమభిషేకంతు యాత్రాకాలేషుచాప్యథ | గృహప్రవేశేవైవాహ్యే పుణ్యాహేషు పరేషుచ || 34 ఏతత్పవిత్రం మంగల్యం ధన్యం శ్రుతిసుభావహమ్ | పాప్మాలక్ష్మీ ప్రశమనం దుఃస్వప్న కిల్బిషాపహమ్ || 35 పుణ్యాహకాలేషు నరేంద్రచంద్ర శ్రుత్వాభిషేకం బలసూదనస్య | ధర్మార్ధకామాన్పురుపాలభంతే వ్యాధిప్రణా శంచయశ స్తథాగ్ర్యమ్ || 36 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్రాభిషేకోనామ పంచాశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || ఇంద్రుడవ్వల మాతలి సారధిగా శుక్రుని రథముగాగొని దేవశత్రువులను రణమునంగూల్చెను. భువనత్రయముంగావించెను యదుకుమార! ఇది ఇంద్రాభిషేక కథ చెప్పితిని. యాత్రాసమయములందు గృహప్రవేశమందు వివాహములందు పుణ్యాహమ లందు నిది పారాయణము సేయవలసినది. ఇది పవిత్రము మంగళ్యము (మంగళ కరము) ధన్యము వీనులకు విందైనది పాపమును అలక్ష్మిని దొలగించునది. దుప్స్వప్న దోషహరము. పుణ్యదినములందును ఇంద్రాభిషేక మిది. ధర్మార్థ కామ పురుషార్థములను పురుషులు (జనులు) పొందుదురు. దీన వ్యాథులు నశించును. సర్వాధికయశస్సు గల్గును. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున దేవేంద్ర పట్టాభిషేకమను రెండువందలయేబదియవ యధ్యాయము.