Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల యేబదియొకటవ అధ్యాయము - గజలక్షణములు వజ్రఉవాచ : పులహస్య ప్రజాసర్గంశ్రు త్వాగంధర్వరాట్ తదా | పప్రచ్ఛకింతదా భూయస్తత్ర నాడాయనం ద్విజమ్ || శ్రోత్రామృతం కథయతోనందస్యా పితవానఘ | త్వంహిజ్ఞాన నిధిర్విపై#్రః ప్రోచ్యసే వేదపారగైః ||
2 మార్కండేయ ఉవాచ : పులహాస్య ప్రజాసర్గం శ్రుత్వాగంధర్వ సత్తమః | భూయః పప్రచ్ఛతం విప్రం గజోత్పత్తిం సవిస్తరమ్ ||
3 శైలూష ఉవాచ : కుంజరాణాం సముత్పత్తిం శ్రోతుమిచ్ఛామి విస్తరాత్ | కుంజరాహి మహాభాగభృశంచ దయితా మమ ||
4 నాడాయన ఉవాచ : యదాప్రసూతామార్తండ మదితిర్భాస్కరా ೭రణిః || 5 తదా తదండ ముత్పాద్య దృష్టవాన్కశ్యపః స్వయమ్ | తేజో೭ధికత్వాదండస్థం నాపశ్యత యదాశిశుమ్ ||
6 ఉవాచదేవ్యా అండే೭స్మిన్కిమసౌ బాలకోమృతః | తతః సభాసః సకలం తేజసాభాసయ జ్జ ||
7 తేనమార్తాండ తా೭థాస్య కధితాద్విజ సత్తమైః | తతస్త్వండ కపాలే ద్వేగృహీత్వాతుప్రజాపతిః ||
8 పృథక్పృథగవస్షాప్య రథంతర మగాయత | మందః ప్రవేశయామాస ఇరామాస్తౌ ప్రజేప్సయా ||
9 ఉదరే పులహాంతేన జనయామాస సా గజాన్ | ఆష్టౌ మహాబలాన్నాగాం స్తేషాన్నామానిమే శృణు ||
10 ఐరావణ స్తథా పద్మః పుష్పదంతశ్చనామనః | సప్రతీకోంజనో నీలః కుముదశ్చ మతంగజాః ||
11 శక్రాద్యానాం దిగీశానాం యథా సంఖ్యేన వాహనాః | చత్వారోజాతయస్తేషా మేకైక స్యాస్వయే స్మృతాః ||
12 భద్రామందామృగాచైవ సంకీర్నాచజనాధిప! | భద్రాశ్రేష్ఠాభ వేత్తాసాం మందా మధ్యా కనీయసీ || 13 మృగాజ్ఞేయాచ బాముల్యాత్సంకీర్ణా పార్థివోత్తమ ! | వజ్రుడు పలికెను - పులహస్త్యుని ప్రజాసృష్టివిని గంధర్వరాజగు శైలూషుండు నాడాయనుని మరి యేమడిగెను. శ్రవణా మృతముగా నీవు పలుకుచున్నావు. జ్ఞాననిధివని వేదపారగులు విప్రులు నిన్ను గొనియాడుదురు. మార్కండేయుడు అనెను. పులముని ప్రజాసృష్టివిని శూలూషుడు గజములన నాకిష్టము గజములయుత్పత్తింగూర్చి తెలుపుమన నాడాయనుడిట్లనియె. భాస్కరునిగన్న యదితి సూర్యునిగన్నప్పుడు ఆ యండమును (గ్రుడ్డును) కశ్యపుడు జూచి తేజస్సు మిక్కిలిగానున్నందున యందలి శిశువును గానలేడయ్యె. ఇందున్న శిశువు మరణించెనాయని సంశయించెను అవ్వల నాశిశువు సకలలోకమును దనతేజస్సుచే వెలుగొందజేసెను. అందువలన ద్విజోత్తము లీశిశువునకుమార్తాండుడను పేరుపెట్టిరి. (మృతమయినదా యని యనుకొన్న అండమునుండి పుట్టినవాడు మార్తాండుడను నిర్వచనముచెప్పబడినది. అవ్వల బ్రహ్మ యాయండముయొక్క రెండుకపాలములను వేర్వేరుగానుంచి రథంతర సామగానముచేసెను. శని ఆ ఎండుకాపాలములను ఇరాదేవికి సంతానము కలుగవలెనని యామెలో బ్రవేశింపజేసెను. పులహుడప్పుడామె యుదరమునుండి యెనిమిది మహాబలముగల యేనుగులం బుట్టించెను. వానిపేరు ఐరావతము పద్మము పుష్పదంతము వామనము సుప్రతీకము ఆంజనము నీలము కుముదము. అవి దిక్పాలురకు వరుసగా వాహనములయ్యెను. ఒక్కొక్క కుటుంబములో భద్ర-మంద-మృగ-సంకీర్ణ అనెడి నాల్గేసిజాతులు పుట్టినవి. అందులో భద్ర అత్యుత్తమజాతి. మంద మధ్యాజతి. అధమజాతి మృగ. అనేకజాతుల కలయిక నాల్గవది. భద్రమంద్రమృగాణాంచ తథావక్ష్యామి లక్షణమ్ || 14 సంకీర్ణానాంచ సంకీర్ణం లక్షణం భవితాతథా | గూఢోష్ఠమస్తకః స్వక్షః పృథ్వాయత ముఖాంగుళిః || 15 ఉదగ్రశ్చోగ్ర సత్త్వశ్చసమసాధ్యో మహాకరీ | తామ్రతాల్వీక్షణః స్నిగ్ధః సహిష్ణుః స్వాసనస్తథా || 16 ఆన్వర్థవేదీ బలవాన్భ ద్రోజ్ఞేయోమతంగజః | గంభీరవేదీనిః శంకస్త్రీక్షణ సాధ్యోమహోదరః || 17 దీర్ఘమేఢ్రాంగుళిశ్చైవ సువిభక్త శిరోదరః | స్థిరః కచబలస్థలో దీర్ఘబాలధి పుష్కరః || 18 హర్యక్షః సూక్ష్మనాభిశ్చ మందోజ్ఞేయో మతంగజః | హ్రస్వః శుష్కావటు హనుర్భీరుర్భహ్వాశనస్తథా || 19 హ్రస్వోప్తనఖీ దుర్మేదా యూథస్యామచరస్తథా | దీర్ఘజిహ్వ విషాణశ్చ దీర్ఘకక్షాసనస్తథా || 20 క్లేశాక్షమశ్చ దీర్ఘాశీమృగో జ్ఞేయోమతంగజః | సంకీర్ణలక్షణోనాగః సంకీర్ణశ్చ నిగద్యతే || 21 భద్రాది గజముల లక్షణములు : భద్రగజము పుష్టిగా పెదవులు మస్తకము (కుంభస్థలము) చక్కని కన్నులు లావు పొడవుగల తొండము గలిగి ఎత్తె ఎక్కువ సత్తువగలదై సమసాధ్యమై ఎఱ్ఱని తాలుపులు గన్నులు నిగనిగలాడ మేను సమానముగల్గి సుఖముగ కూర్చుండుటకనువైన వీపుగల్గి శుభ##వేదియై (అంకుశముతో గట్టిగా పొడవనవసరములేకుండగనే మావటివాని భావము ప్రకారమున్నది) బలశాలియై యుండును. మందజాతి యేనుగు : గంభీరవేది (అంకుశముతో గట్టిగా గొట్టినంగాని పోనిది) సందేహపడనిది. తీక్షణసాధ్యము. పెద్ద కడుపుగలది దీర్ఘమేఢ్రము తొండముగలది బాగుగ విప్పారినమెడ గలది స్థిరమైనది కచబలస్థూలము పొడవైన తోక తొండము గలది. సింహము కండ్లు సూక్ష్మనాభి గలది. మృగజాతి యేనుగు పొట్టిది. అవటువు=పెడతల హనువులు=దవడలు శుష్కములయి యుండు బెదరుగొడ్డు. తిండిపోతు పొట్టెలు దించుకొనిపోయిన గోళ్లుగలది. దుప్పద్ధి గజయూథముతోగాని (ఏనుగుల మందతోగాని) విడిగా దిరుగదు. పొడవైన నాలుక దంతములు గలది. పొడవైన కక్షము - ఆసనముగలది. క్లేశమునకోర్చుకొననిది దీర్ఘకాలము దినునదియును ఇక పైలక్షణములు కలగాపులగములైయున్న యేనుగు సంకీర్ణజాతికి చెందును. అతః పరం ప్రవక్ష్యామి జగానాంతే వనాష్టకమ్ | హిమవత్ర్పయాగతౌహిత్య గంగామధ్యేమహద్వనమ్ || 22 ప్రాచ్యా మైరావణస్యోక్తం వనం యత్ర మతంగజాః | కించిత్కమలవర్ణాభా శ్చపలాః పృథు మన్తకాః || 23 కునఖా రూపవంతశ్చ తథా మంద మదా గజాః | ఉన్మత్త గంగాస్త్రిపురీదశార్ణం మేకలా స్తథా || 24 తేషాం మధ్యే కరూషాఖ్యం వనం పద్మస్య కీర్తితమ్ | హ్రస్వాశ్చండాస్తథా శ్యామాః శీఘ్రోదగ్ర మహాస్వనాః || 25 సూక్ష్మబిందు చితాస్తత్ర భవంత్య త్యర్థ వేదినః | బిల్వశైలం వేత్రవతీ దశార్ణం చ మహాగిరిమ్ || 26 తేషాం దశార్ణకం మధ్యే పుష్పదంతస్య కాననమ్ | సకృత్త జఘనశ్యామా. సూక్ష్మబిందు విచిత్రతాః || 27 స్థూలహస్త శిరోగ్రీవా స్తత్రజాతా మతంగజాః | పారియాత్రక వైదేశ్య నర్మదా బ్రహ్మ వర్థనం || 28 వామనస్య వనంమధ్యే తేషాంవై మార్గరేయకమ్ | సుప్రమాణాశ్చ మధ్యాక్షాః శీఘ్రగాశ్చ సువిగ్రహాః || 29 కరేణు నామధేయాశ్చ తత్రోక్తాశ్చ సుగంధినః | వింధ్య సహ్యాత్కలానాంచ దక్షిణస్యార్ణవస్యచ || 30 వసంచమధ్యే కాలేశం సుప్రతీకస్యకీర్తితమ్ | చాపవంశా నృతనభాః పీనహ్రస్వశిరోధరాః || 31 తనుత్వగు త్తరాదీర్ఘా పద్మాభాస్తత్ర దంతినః | సేవాదేశః సముద్రస్య ప్రేమహారంచ నర్మదా || 32 తేషాం మధ్యేంజ నాఖ్యస్య వనంఖల్వ పరాంతకమ్ | పీనాయత విషాణాస్యా మహాకాయాబలాధికాః || 33 రక్తతాల్వోష్ఠ జిహ్వాశ్ఛ జాయంతేతత్ర దంతినః | కుశస్థలీ మహీపాల! ఆనంత్యర్బుద నర్మదాః || 34 తేషాంమధ్యేతు సౌరాష్ట్రం వనంనీలస్య కీర్తితం | తస్యవంశేతు జాయంతే చండాశ్చైవాల్ప దేహకాః || 35 సూక్ష్మరూక్షత్వచో వ్యాలాస్తథా శిక్షాత్యజాగజాః | హిమవత్కా లికాసింధకురు జాంగలమేవచ || 36 తేషాం పంచనదం మధ్యేకుముదస్య మహద్వనమ్ | స్ఫుటితాగ్రద్విజాస్తత్రజాయంతే మలవిద్విషః || 37 దానశీలాశ్చ భూతాశ్య దుర్విధేయాశ్చ వారణాః || 38 ఏతత్తవోక్తంతు మతం గజానాం కులాష్టకంచైన వనాష్టకంచ | అతః పరం కింకథయామి తుభ్యం తన్మేవద స్వాయత లోహీతాక్ష ! |7 37 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషం ప్రతినాడాయన వాక్యేషు గజోత్పత్తిర్నామైకపంచా శదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || ఏనుగులుండు వనములెనిమిది తెలిపెద. హిసవంతము ప్రయాగ లేహిత్య (లేహిత్యనది యనగా శోణానది) గొంగానదీ మధ్యప్రదేశమందు తూర్పు పెద్ద యడవియున్నది. అది ఐరావతవనమనబడును. అక్కడి యేనుగుల కొలది తామరపూవు రంగు గలవి. చపలములు పెద్ద మస్తకములు కునఖములు (పుప్పిగోళ్ళు) గలవి అందముగా నుండును. మదము తక్కువ. ఉన్మతగంగ మును త్రిపురి దశార్ణము మేకలము నను దేశములనడుమ కరూషమను పేరి వనమున్నది. అది పద్మజాతి యేనుగులుండునది పొట్టివి కోపస్వభావము శ్యామవర్ణము గలవి, దీర్ఘముగ గట్టిగ ఘీంకరించునవి సూక్ష్మ బిందువులు (పుట్టుమచ్చలు) గలవి అర్ధవేదులునైనవి పద్మజాతిగజములు. పుష్పదంతజాతి యేనుగులు బిల్వశైలములు నేత్రవతి దశార్ణము మహాగిరియను చోట్ల నుండును. అందులో దశార్ణకము పుష్పదంతజాతి యేనుగుల వనము. పుష్పదంతజాతి యేనుగులు : జఘనములు (పిరుదులు) మిక్కిలి గుండ్రములుగ నుండును. చిన్న బిందువులు గలవి. లావైన తొండము శిరస్సు మెడయు గలవి. వామనజాతి యేనుగులుండు ప్రదేశములు పారియాత్రకము వైదేశ్యము నర్మదాతీరము బ్రహ్మవర్థనమును, వానినడుమనున్న మార్గరేణుకమను వనము వామనజాతి యేనుగులవి. ఇక సుప్రతీకజాతి యేనుగులు మిక్కిలి పెద్దవి నడిమికంటివి శీఘ్రగమనముగలవి. చక్కని ఆకారముగలవి. కరేణువులను పేరివి. సుగంధముగలవి. వింద్య సహ్య ఉత్కల దోక్షిణసముద్రతీరములు వాని నివాసములు. అందులో నడుమది ''కాలేశ'' మనునది వానివనము. అంజనజాతి యేనుగులు : చాపవంశావృత నఖములు : బొద్దుగా హ్రస్వముగానున్న మెడలు పలుచని చర్మముగలవి పొడవైనవి తామరపూవు రంగుగలవి. సముద్రప్రాంతము ప్రేమహారము నర్మదాతీరము అంజనజాతి గజముల స్థానములు. వానివనము అపరాంతకయ. లావుగ పొడవుగల దంతములుగల్గి మహాకాయములయి బలాధికములయి ఎఱ్ఱని లోదవడలు పెదవులు గలవి నీల జాతి యేనుగులు, కుశస్థలి అవంతి (ఉజ్జయిని) అర్బుదము నర్మద వాని సంచరించు ప్రదేశములు వాని వనము సౌరాష్ట్రము. ఆ నీలముయొక్క వంగడమునకు చెరినవి. చండములు (కోపావేశముగలవి) చిన్న దేహములుగలవి. పలుచని కరకైన శరీరములు తోకలు గలవి. శిక్షకులొంగనివి. కుముదజాతి యేనుగులు : హిమవంతము కాలికా సింధు కురుజాంగలములవి సంచరించు తావులు. వానిలో దున్న పంచనదము వానివనము. అక్కడ పగిలిన దంతాగ్రములు గలవి మలమొప్పనివి. మదభరితములు అవి శిక్షణకు లొంగవు. మొత్తమీ యెనిమిది కులములు యెనిమిదివనములను నీకు దెల్పితిని. ఈ మీద నీకేమి వచింతుందెలుపుమనియె. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గజోత్పత్తి - గజలక్షణనిరూపణమను రెండువందల యేబదియొకటవ యధ్యాయము.