Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఏబదియారవ అధ్యాయము - విరహివర్ణనము మార్కండేయ ఉవాచ :- గంధర్వాః కటకంకే చిద్వి విశుర్భ రతస్యతు |
పురస్కృత్య నృప స్యాజ్ఞాంసై నికానాం వధేపునః ||
1 మాయాచ్ఛన్న శరీరాస్తే దదృశుర్ని శిచే ష్టితమ్ | ప్రాతః సమరకా మానాం కాంతో త్కంఠితచే తసామ్ ||
2 మనోరథమ థారూఢః కశ్చి త్ర్పాణశ్వరీం వ్రజన్ | నళేభే శయనే నిద్రాం కల్యే రణస ముత్సుకః ||
3 కశ్చిచ్చంద్ర కరస్పర్శాత్ విశేషపరి పీడితః | దదర్శ చంద్రం దివ్యాక్షి ప్రియా వదననిర్జి తమ్ || 4 కశ్చిచ్చ చింత యన్నేవం ప్రియాం ప్రాణధనేశ్వరమ్ | ఉత్తాన శయనం చక్రే తారకాగణ కందివి || 5 పశ్యన్నా నిష్కృతం దిశ్యం పత్రచ్ఛేదం విసర్జితమ్ | ప్రియయా స్వకృతం కశ్చిన్ముదా న యతి శర్వరీమ్ || 6 నిర్వే దేనాతి రమ్యేణ దహ్యతే చంద్రరశ్మభిః | కశ్చిద్వి హీనస్తన్వంగ్యా శయనీయే೭పి ఖిద్యతే || 7 స్వప్నోపలబ్ధ తన్వంగీ సమాగమ మనోరథః | సుప్తో೭ను మితో గంధర్వైః కశ్చిద్రో మాంచ సంభవాత్ || 8 ప్రియాం సంప్రేషితాం ప్రేష్య సమాలా పపరాయణః | నవేద కశ్చిద్రా జేంద్ర గతామపి విభా వరీమ్ || 9 జ్వలం తమ నిశం కశ్చిచ్ఛరీరే విరహా నలమ్ | సహసాశ మయా మాస ధ్యాయంశ్చ ద్రముఖీం ప్రియామ్ || 10 శ్యామాం వికంచు కాంతన్వీం యూనాం ప్రాణా పహారిణీమ్ | ప్రియాంచ ఖడ్గ యష్టిం చ కశ్చిత్స్మ రతి సూత్సుకః || 11 సగుణాంతను మధ్యాంచ నవకాంచన భూషణామ్ | సస్మార దయితాం కశ్చిచ్చాప యష్టిం తథై వచ || 12 విచింతా నపి గంధర్వా భరతస్య చసైని కాన్ | నశేకు రాధర్ష యితుం భరతస్య సమాశ్రయాత్ || 13 అన్యే೭పి యేదేవ వరస్య విష్ణోః స్మరంతి నిత్యం యదునాధ పాదౌ | గంధర్వ యక్షాసుర రాక్షసే భ్యో భయం నతేషాం భవతీ హ కించిత్ || 14 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే విరహివర్ణనం నామ షట్పంచా శదుత్తర ద్విశతతమోధ్యాయః. మార్కండేయుడనియె. తమరాజు నాజ్ఞనుబట్టి కొందరు గంధర్వులు సైనికుల జంపగోరి భరతుని కటకముం బ్రవేశించిరి మాయచే నేరికిం గనపడకుండ మరునాడుదయమే సమరము సేయగోరి రాత్రివేళ దమ ప్రియురాండ్రపై దవిలిన మనస్సుతో నాసైనికులు చేయు చేష్టలంజూచిరి. ఒక సైనికుడు మనోరథములను రథమెక్కి ప్రాణశ్వరి వంక నేగుచు వేకువనే రణముసేయ నుత్సుకుడై యారేయి నిదురవోడయ్యె. ఒక యోధుడు చంద్రకిరణములు సోకి యెక్కువ బాధగొని తన విశాలనయన వదన సౌందర్యమువ కోడిపోవు చంద్రుని జూచుచుండెను. ఇంకొకడు తన ప్రాణధనేశ్వరిం దలచికొనుచునే నింగింజుక్కల లెక్కించుచు వెల్లగిల పరుండెను. మరొకడు ప్రియురాలి కెడబడి (యొకవిధముగా) మిగుల ముచ్చటైన నిర్వేదముతో (బాధతో) చంద్రకిరణములచే దహింపబడుచున్నాడు. మెత్తని పాన్నునంగూడ ఖేదబడుచున్నాడు. కలలో లభించిన రమణీమణితోడి సమాగమము ముచ్చటవడి యొకడుపరుండి మేనుగగుర్పొడువనదిచూచి గంధర్వులచే నితడు ప్రియోత్కంఠితుడైనాడని ననుమానింప బడుచుండెను. తనకడకు బంపబడగా వచ్చిన ప్రియురాలింగని ముచ్చటలాడు వేడుకందవిలిరేయి గడచినదనియే (తెల్లవారినదని) యెఱుగడయ్యె. ఒకడు తన మేనిపై ననిశము జ్వలించుచున్న విరహాగ్ని నాచంద్రాననం దనప్రాణశ్వరింధ్యానించుచుం దటాలునశమింపజేసి కొనెను. శ్యామను=నిండుజవ్వనిని వికంచుకాం=ఱౖకవిప్పుకొన్న దానిని యువకులప్రాణములం గొల్లగొనునది తన్విని (సుకుమారమృదుశరీరము) తన ప్రాణప్రియ కత్తినింగూడ యొకసారి యుత్సుకుడై ఒక వీరుడు జ్ఞప్తి సేసికొనుచుండెను (అనగా ఆలాటి సుందరి జవ్వ నిందలచియా పొందులేకపోయెనను నిర్వేదముతో తన బ్రతుకెందుకని యదేసమయములో ప్రాణములకు దెగించి కత్తిని జ్ఞప్తిచేసి కొన్నాడని యర్థము. ఇది మన్మథదశలో పదియవ మరణదశను సూచించుచున్నది) ఇంతేకాక; శ్యామాం=శ్యామలవర్ణనము గలది వికంచుకాం=యొఱనుండితీసినది; తన్వీం=పలుచనిది (చుఱకత్తియన్నమాట) యోధయువకుల ప్రాణములందీయునది. అని ఖడ్గ పరమైనశ్లేష-దీనిద్వారా విరహమందు తన ప్రియరాలు తనకు చురకత్తివోలె బాధాకరమైనదని యుపమాలంకారధ్వని తన మేనిపై నంటిన ప్రియురాలి పత్రచ్ఛేదమును పచ్చబొట్టు మొదలగు శృంగారరేఖలను రతివేళతనమేనిపై నంటుకొని ముద్రపడిన దానిని పొరపాటున దాను తుడుచుకొనిన దానిని జూచికొనుట నారేయి యానందుమతో గడపెను. ఇంకొకయోధుడు సగుణాం=గుణ వంతురాలు తనుమధ్యాం=సన్ననినడుముగలది నవకాంచన భూషణాం=వినూతన సువర్ణాభరణను తనప్రాణసుందరిని, అదేవిధముగ (శ్లేష) సగుణాం=నారితోగూడినది తనుమధ్యాం=నడుమసన్నముగనున్నది. కాంచనభూషణాం-బంగారు తొడుగుగల చాపయష్టిని ధనుర్దండమును వింటిని ఏకరూపమున స్మరించెను. శ్లేషాలంకారము ఇట్లు పరధ్యానములోనున్న వారింగూడ భరతసైనికులను భరతుని సమాశ్రయము వలన (రఘువీరుని యండనున్నారుగావున) గంధర్వులు బెదరింపజాలకపోయిరి. ఓరాక్షస ప్రభూ! మఱియు నెవ్వరేని దేవ దేవుడు విష్ణువుయొక్క పాదములను నిరంతరము స్మరింతురు వారికి గంధర్వ యక్షాసుర రాక్షసుల వలన నిక్కడ భయము గల్గదు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున విరహిర్ణనమను రెండువందల యేబదియారవ అధ్యాయము.