Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల యేబదిఎనిమిదవ అధ్యాయము - గంధర్వసైన్యప్రస్థానము మార్కండేయ ఉవాచ : అయోధ్యాత స్తదాభ్యేత్య గంధర్వాః శిబిరా త్తథా |
తథారాజగృహాత్సర్వే
శైలూషాయ న్యవేదయన్ || 1 నవిగ్రహ కథా తత్ర నరక్షా కాచిదీదృశీ | కేవలంతు ప్రభావేణ రామస్య భరతస్యచ ||
2 నాస్మాభిః కిం కృతం రాజన్ ప్రహర్తుం క్వచిదిత్యపి | యత్తత్ర శేషం కర్తవ్యం తత్కరోతు మహీపతిః ||
3 ఏవముక్తః సగంధర్వై ర్యామినీ విగమే తదా | యోగయోగ మతి క్షిప్రమాజ్ఞాపయత సత్వరః ||
4 భేరీసాం నాహికీచైవ తతః శీఘ్రమహన్యత | యస్యాః శ##బ్దేన గంధర్వా రాజద్వార ముపాగతాః ||
5 గజవారేణ మహతా తురగాణాం బలేనచ | రథైశ్చ మేఘసంనాదైః పత్తిభిశ్చమదోత్కటైః ||
6 క్ష్వేడితా స్ఫోటితరవైః శంఖ భేరీ నినాదితైః | హ్రాదేనగజ ఘంటానాం గజానాంచైవ బృంహితైః ||
7 హేషితైస్తురగాణాంతు బభూవతుములం మహత్ | మార్కండేయుడనియె : అప్పుడయోధ్యనుండి శిబరమునుండి రాజగృహమునుండియు గంధర్వులు శైలూషునికి నివేదించిరి. అక్కడయుద్ధముమాటలేదు. ఈలాటి రక్షయ (రక్షణకార్యమమున) లేదు. కేవలము రామునియొక్క భరతుని యొక్క యుంబ్రభావము రాజా! అయోధ్యను ముట్టడింప నెక్కడనేని మాచేత జరుపబడనిదటు మిగిలియున్న పని ప్రభువు గావించు గాక! యని గంధర్వులు పలుక తెలవారినంత భరతుడు యోగయోగునికి మిక్కిలి తొందర యుద్ధసన్నాహభేరి మ్రోయింపుమని యానయిచ్చెను. ఇచ్చినదే తడవది వాయింపబడెను. ఆసడి వినుటే తడవుగ గంధర్వులు పెద్ధ గజవారముతో నశ్వబలముతో మేఘములురిమినట్టి సడిగల రథములతో పదావర్గముతో వీరాలాపములతో అస్ఫోటితరవములతో, (జబ్బలు చఱచినప్పటిధ్వనితో శంఖ భేరీనినాదములతో గజఘంటాధ్వనితో నేనుగు బృంహితములతో గుఱ్ఱముల సకలింపులతో నయ్యెడతుములధ్వని యయ్యెను. శైలూషో೭పి తదా స్నాత్వా హుత్వాగ్ని ద్విజపూజనమ్ ||
8 కృత్వా వినిర్య¸° శ్రీమాన్ వరచందన భూషితః | మౌలీ వపుష్మాన్సం నద్ధః స్రగ్వీరు చిరభూషణః ||
9 ఆమపాత్ర ప్రతీకాశైస్తురగైర్యోజితం రథమ్ | ఆరురోహ మహాతేజా విమానం సుకృతీయథా ||
10 యథోక్తస్య రథస్యాసీత్పురోరణ విశారదః | నరకేతురితిఖ్యాతస్త్రిఘలోకేషువిశ్రుతః ||
11 కేతౌతస్యరథేభాతి వసంతో మూర్తి మాన్కృతః | తతఃససహసైన్యేన నిర్య¸° నగరాద్బహిః
12 వ్యూహంచ సర్వతో భద్రం సమాధాయబలంతథా | కృత్వా ప్రత్యైక్షత తదాభరతాగమనంరుషా ||
13 నైన్యేన మహతా రాజన్ భాస్కరజ్యోదయం ప్రతి |
14 ఆత్తాయుధాఃక్ష్వేడిత శంఖనాదై రానంద యంతః సుహృదాంమనాంసి | గంధర్వ ముఖ్యారణచండవేగాః ప్రతీక్షమానా భరతస్యతస్థుః ||
15 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గంధర్వసైన్య వర్ణనంనామాష్టపంచాశదుత్తరద్విశతతమో೭ధ్యాయః || శైలూషుడును స్నానముసేసి, యగ్నినివేల్చి ద్విజులబూజించి మంచిగంధము పూసికొని కిరీటము పెట్టికొని సన్నద్ధుడై పూలమాలలువైచికొని రుచిర భూషణుడై ఆమపాత్రమట్లు (మట్టికడవబోలిన) నల్లని గుఱ్ఱములు పూన్చిన రథమును పుణ్యవంతుడు విమానమునట్లెక్కి దండయాత్రకు వెడలెను. ఆరథమునకుముందు రణవిశారదుడు నరకేతువనుపేర త్రిలోక ప్రసిద్ధుడుండెను. అతని జెండాపై వసంతుడురూపుగొని దీపించును. అట్లతడు నగరమువెలికి సేనలతోజని సర్వతో భద్రమను వ్యూహముంబన్ని సైన్యము నందు నిలిపి రోషముగొని భరతాగమమునకై ప్రతీక్షించెను (ఎదురుసూచెను) మహాసైన్యముతో సూర్యోదయమగుసరికి ఆయుధములు పూని క్ష్వేడితములతో (అట్టహాసములతో) గర్జనములతో సుహృచ్చిత్తముల మిత్రుల మనస్సులను ఆనందపఱచుచు రణప్రచండ వేగులయిన గంధర్వవీరులు భరతునికై యెదురు సూచుచునిలువబడిరి. ఇది గంధర్వ సైన్యప్రస్థానమను రెండువందలయేబది ఎనిమిదవ అధ్యాయము