Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల యేబదితొమ్మిదవ అధ్యాయము - భరతసైన్యప్రస్థానము మార్కండేయ ఉవాచ : విబుద్ధా యామినీ శేషే సర్వ ఏవ మహీక్షితః | నిర్యయుర్నగ రాకారై రథైః సంగ్రామలాలసాః || బలేన చ తురంగేణ నానా వాదిత్ర వాదినా | వందిభిః స్తూయమానా శ్చ వంద్య మానాశ్చ సైనికైః ||
2 పృథ క్పృథక్స మున్నద్ధానగర ద్వార మాగతాః | కృత్వా చావశ్య కం సర్వం భరతో೭పి మహాయశాః ||
3 రథేన కాంచనాంగేన నిర్య¸° నగరాద్బహిః | యంతా రథస్య తస్యాసీత్ యుథాజిన్మాతులః స్వయమ్ ||
4 విరరాజ ధ్వజం తస్యకో విదార మహాద్రుమమ్ ! సతేన రథముఖ్యేన బహిర్నిర్గత్య పార్థివః ||
5 సమేత్య పార్థినైః సర్వైః పూజ యిత్వా చతాన్నృపాన్ | వజ్రం కృత్వా మహావ్యూహం ప్రయ ¸°లఘు విక్రమః || ప్రయాణ తస్య సైన్య స్య కంపం తీవ వసుంధరా | శ##బ్దేన మహతా తస్య దీర్య తే చ న భస్తలమ్ ||
7 బభూవర జసై వాన్యః నిశాకాలః సుదారుణః | నృపాభరణ మాణిక్య తేజ సాభు విరాజితా ||
8 రజో೭ంధ కారే೭పి చమూః సాప్రయాతియథా సుఖం | సగత్వా దూర మధ్వానం సూర్యస్యోదయనం ప్రతి ||
9 ఆ ససాద మహాసైన్యం గంధర్వాణాం దురత్యయమ్ |
10 తౌసైన్య తో¸°ఘ మహాదురంతౌ సంహారనాగా వివతుల్య రూపౌ | బలార్ణ వౌగాఢ మథ ప్రహారం ప్రచక్ర తుర్మన్యు వశాను యాతౌ || 11 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వ జసంవాదే భరతసైన్య నిర్యాణంనామై కోన షష్ట్యుత్తర ద్వి శతతమో೭ధ్యాయః. మార్కండేయుడనియె :- రేయి తుదిజామున నెల్ల మహీపతులు మేల్కని సంగ్రామ లాలసులై నగరములంతలై యున్న రథములెక్కి చతురంగ బలముతో నానావాద్య ఘోషములతో వందిమాగధులు వొగడ సైనికులు మ్రొక్క వేర్వేర బాగ సన్నద్ధులై నగర ద్వారమును వచ్చిరి. భరతుండును ప్రస్థానావశ్యకమైన మంగళాచారాది సర్వమునొనరించి కాంచనమయ రథమెక్కి నగరము వెలికి వెడలెను. భరత మాతులుడు యుధాజిత్తు స్వయముగ సారథ్యము చేసెను. ఆతనికోవిదారధ్వజము సొంపుగ విలసిల్లెను. అతడా రథముపై వెలికి బయలువెడలి రాజులందరినిం గలిసికొని అందరినిం దానుబూజించి వజ్రవ్యూహముం బన్నికొని యేగెను. అతని ప్రయాణమందు భూకంప మయినట్లుతోచెను. ఆతని యాత్రాసన్నాహధ్వని కాకసము బ్రద్దలగునట్లుండెను. ధూళిచేతనే సుదారుణమైన యింకొక నిశాకాల మేర్పడెను. రాజాభరణ మాణిక్య కాంతులచే భూమి వెలుగొంది ఆ రజోంధరకార మందుగూడ సేన హాయిగ ముందునకు సాగెను. అతడు కడుదూరము దారిగడచి సూర్యోదయమగునంతకు దుస్తరమైన గంధర్వుల మహాసైన్యమును దరిసెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున భరతసైన్య ప్రస్థానమను రెండువందలయేబదితొమ్మిదవ అధ్యాయము.