Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల అరువదిరెండవ అధ్యాయము - తృతీయదివసయుద్ధము తతోరజన్యాంవ్యుష్టాయాం మరణ కృతనిశ్చయః | సన్నహ్యత వినా వ్యూహం భరతం ప్రత్యదైక్షత ||
1 భరతో೭పి మహాతేజాః కృతపూర్వాహ్నికక్రియః | నిర్గమ్యనగరాత్సర్వాన్పార్థివా నిదమబ్రవీత్ ||
2 గంధర్వైర్భవతాం యుద్ధం మమ బుద్ధ్యా నరోచతే | ఏక ఏవ సమర్థో೭హం యుష్మాకం తేజసా నృపాః ||
3 హంతుం గంధర్వ సైన్యం తద్భవద్భిః పరిపీడితమ్ | యుధ్యమానా భవంతశ్చ రక్షితవ్యా మయా రణ ||
4 సకళత్రాం స్తతో భూపానేతాఞ్ఛక్నో మిఘాతితుమ్ | భవతామార్జవం యుద్ధే గంధర్వాః కూటయోధినః ||
5 అద్యతాన్సాయకై స్సర్వాన్దివ్యాస్త్ర ప్రతిమంత్రితైః | ఘాతయిష్యామి భూపాలాం స్తదనుజ్ఞాతు మర్హథ ||
6 భరతేనై వముక్తాస్తు రాజానోవాక్య మబ్రువన్ | త్వయా కళత్ర మస్మాకం రక్ష్యం స్వామి న్ర్పయత్నతః ||
7 భవతో రక్షణం కార్యం సమసై#్తర్వసుధాధిపైః | పత్రచ్ఛేదం ఫలచ్ఛేదే వృక్షః శాఖావకర్తనే ||
8 భూయో వృద్ధి మవాప్నోతి మూలచ్ఛేదే వినశ్యతి | తేవయం భవతాం వీర్యం జానంతో೭పి రఘూద్వహ ||
9 నైకం సంత్యక్తు మిచ్ఛామో భవంతం రణ మూర్ధని | ఏకైకస్య తథాస్మాకం గంధర్వాణాం మహద్బలమ్ ||
10 వయం రణహి పర్యాప్తాః కిం పునస్తవ పార్థివ | కింతు భృత్యేషు తిష్ఠత్సుస్వామినో గర్హితం రణమ్ ||
11 తేవయం ఘాతయిష్యామో గంధర్వానద్య సత్వరమ్ | ఏవముక్తో మహాతేజాః భరతో నృపసత్తమైః ||
12 వారయామాస సాంత్వేన తతస్తు వసుధాధిపాన్ | శాపితాఃస్థ మమప్రాణౖః రాజ్ఞో రామస్య చాప్యథ ||
13 అద్యైవ వినివర్తధ్వం సంగ్రామాత్ పృథివీక్షితః | సంయతైశ్చ మహద్యుద్ధం పశ్యద్భి ర్మమ పార్థివైః ||
14 ఇత్యేవముక్తాః కృచ్ర్ఛేణ రణం ముక్త్వా నరాధిపాః | ఏకా న్తస్థాః సుసన్నద్ధాః దదృశు స్తన్మహద్రణమ్ ||
15 ఏకస్యచ బహూనాంచ యమరాష్ట్రవివర్ధనమ్ | మార్కండేయు డనియె : శైలూషుండవల మరణము నిశ్చయముగొని రాత్రిగడచి వ్యూహము లేకుండ యుద్ధసన్నద్ధుడయ్యెను. మహాప్రతాపశాలి భరతుడును పూర్వాహ్నిక క్రియలు సలిపి నగరము వెలువడి రాజులతో నిట్లనియె. మీరులేకుండ గంధర్వులతో బోరు నా బుద్ధి కిష్టముగాదు. మీ తేజస్సుచే (ప్రతాపమూత గొని) మీరంత వరకు వేధించిన గంధర్వ సైన్యమును నేనొక్కడనే పరిమార్పసమర్థుడనను. యుద్ధమునందు మిమ్ములనుగూడ నేను రక్షింప వలసి యున్నది. అందువలన కలత్రముతోగూడ రాజులను హతమార్పగలను. యుద్ధములో మీరార్జవము సూపువారు. ముక్కకుసూటిగా ధర్మయుద్ధము సేయు వారు మీరు. గంధర్వులు కూటయోధుల మాయా యుద్ధము సేయువాండ్రు. ఇక్కడే నేను వారందరిని మంత్ర సంధానము సేయబడిన దివ్యాస్త్రములచే గూల్తును. అనవిని రాజులు స్వామి నీవుమాకలత్రమును రక్షింప వలసిన వాడవు ఎల్లరాజులము మేము నిన్ను రక్షించుకొనవలసిన వారము. ఆకులు కోసినను పండ్లుగొసినను గొమ్మలు నరికినరు వృక్షమింకను బెంపొందును. గాని మూలచ్ఛేదము సేసినచో నశించును. రఘునాథ! నీ వీర్య మేమెఱిగిన వారమే యైనను సమరతలమున నొన్నొంటరిగ వదలుటకిచ్ఛగింపము. మాలో నొక్కక్కరికి గంధర్వ బలము చాలును. మాలోనే యొక్క డేని గంధర్వ సైన్యముం బరిమార్ప గలడని భావము. మేమనిలో జాలుదుము నీకేమి పని ! అదిగాక భృతులుండగా ప్రభువు యుద్ధము సేయుట గర్హితము మేమిప్పుడు గంధర్వుల గూల్తుమన విని భరతుడు భూపతులను నయంబున నట్లుగాదని వారించెను. రామచంద్రుని నా ప్రాణములు తొడుగా బలుకు చున్నాను. ఇప్పుడు మీరు రణము నుండి మఱలుడు. గంధర్వల తోడి నా యుద్ధమును జూచి చుండుడన కడుకష్టము మీద రణము విడిచి రాజులు సన్నద్ధులగుచునే యేకాంత మందుండి యొక్కడు పెక్కు మందితో దలపడి చేయు మహా యుద్ధమును యమరాష్ట్ర వివర్దనమైన దానిం దిలకించిరి. రథేన కాంచనాంగేన కింకినీ జాల మాలినా|| 16 యుధాజితా గృహీతేన సతోయాంబుదచారిణా | చంచ ద్బహు పతాకేన కోవిదార ధ్వజేన చ || 17 ఆససాద రణ యక్షాన్ గంధర్వాన్ రణ కర్కశాన్ | శ##రైః సంఛాదయామాస గభస్తిభి రివాంశుమాన్ || 18 ఏతస్మి న్నేవ కాలేచ సహసా గగనచ్యుతా | ఉల్కా పపాత మధ్యేన భిత్వా సూర్యస్య మండలమ్ || 19 ఆసీద్ఘోరో మహీ కంపః శైలూషాంగ విదారణః | ఆదిత్యమండలే రాజన్! కబంధ శ్చాప్యదృశ్యత || 20 వవర్ష న తదా దేవో గంధర్వాన్ రక్తవృష్టిభిః | గంధర్వాణాంచ దీప్తాయాం ది శ్యవాశన్త పక్షిణః|| 21 మృగాశ్చ ఘోరా రాజేంద్ర ! శివాశ్చాశివనిస్వనాః | ప్రతిలోమ స్తథైవాసీ ద్వాయుస్తేషాం సు శంకకృత్ || 22 న్యలీయత తథా గృధ్రః శైలూషస్యధ్వజాగ్రతః | సమే పథి నిరాబాధే ప్రస్థలన్త స్తురంగమాః || 23 కాంచనాంగము కింకణీజాల మాలాలంకృతము యుధాజిత్తు చేబట్టినదానిని క్రొక్కారు మేఘమట్లు చరించుదానిని పెక్కు పతాకలెగురుచుండ కోవిదారధృజాలంకృతమై యున్న యరదయొక్క రణకర్కశులైన యక్షగంధర్వులు కెదురు నడచెను. కిరణములచే భానుడట్లు వారిం భరతుడు శరములచే గప్పసివైచెను. ఇదే సమయమున గగనము నుండి సూర్యమండలము భేదించుకొని తటాలున నుల్క = కొఱవి వడెను. ఘోరమైన భూకంపమయ్యెను. ఆది శైలూషుని శరీర విదారణమైతోచెను. సూర్యమండల మందు తలలేని మొండెముగానబడెను. గంధర్వులపై దేవుడు రక్తవర్షము గోరెను. గంధర్వులున్న వైపు (ఆదిక్కుల) మండుచున్నట్లయ్యె. పక్షులు వికృతముగ నార్చినవి. ఘోర మృగములు నక్కలును నఱచినవి. వాండ్రకు ప్రతిలోమముగ ఎదురుగాలి హోరుమని వీచెను. శైలూషునిటెక్కె గ్రధ్దవాలెను. ఏయెగుడుదిగుడులేని సమతలమున యేబాధలేనిచోట వాని గుఱ్ఱములు తడబడినవి. శతపత్రాశ్చ చపాశ్చ హంసాశ్చైవ ప్రదక్షిణమ్ | భరతస్య తదా చక్రుః సవ్యో బాహు రథా೭స్ఫురత్ || 24 దృష్ట్వా నిమిత్తాంస్తు శుభాన్ యుధాజిత్సమహాయశాః | చోదయామాస తురగాన్ గంధర్వాణాం చమూంవ్రతి || 25 భరతో೭పి శరవ్రాతైః ఘాతయామాస వాహినీమ్ | గంధర్వాణా ముదీర్ణానాం ఘోరైః శతసహస్రశః || 26 వధ్యమానాస్తు గంధర్వ భరతేన మహాత్మనా | తమేవాభిముభా జుగ్ముః శలభాః పావకం యథా || 27 తేషా మాపతతామేవ శ##రై స్సన్నత పర్వభిః | పాతయామాస శీర్షాణి భరతో వాహినీపతిః || 28 భరతం కోష్ఠకీ కృత్వా గంధర్వాస్సు మహారథాః వవర్షు రాయుధై స్తీక్‌ష్ణైర్మేఘావృష్ట్యేవ పర్వతమ్ || 29 తాన్యాయుధాని ముఖ్యాని గంధర్వై ర్భరత స్తదా | చిచ్ఛేద రాజ న్నారాచై ర్గంధర్వాంశ్చావధీదభలీ || 30 మస్తకాన్ సశిరస్త్రాణాన్ బాహూనపిచ సాంగదాన్ | హస్తి హస్తోపమా నోరూం శ్చిచ్ఛేద భరతో రణ || 31 నా೭ వధానం న సంధానం న ముంచంతం చ సాయకాన్ |దదర్శ భరతం కుశ్చి ల్లాఘవా ద్రణమూర్ధని || 32 కేవలం దృశ్యతే యుద్దే గంధర్వాణాం మహాచమూః | దహ్యమానా శరవ్రాతైః యుగాంతాగ్నిరివ జ్వలన్ || 33 బాణగోచర మాయాతాన్ భరతస్య వినిఘ్నతః | శాత్రవాన్ సాయకైస్తీక్‌ష్ణైః జగామాస్తం దివాకరః || 34 రణ జయం ప్రాప్య తతో నివృత్తః సమాగత శ్చాపి నరేంద్రముఖ్యైః | ప్రాయాన్ మహాత్మా శిబిరాయ రాజన్ | సంస్తూయమాన స్త్రిదశ ద్విజేంద్రైః || 35 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే తృతీయ దివస యుద్ధ వర్ణనం నామ ద్విషష్ట్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః భరతుని శతపత్రములు = చాషములు= హంపలు ప్రదక్షిణ మొనరించెను. కుడిబాహువదిరెను. అశుభనిమిత్తములను జూచి యుధాజిత్తు గంధర్వసైన్యము పైకి గుఱ్ఱములను తోలెను. భరతుడు శరపరంపరచే నెదిరిసేనం జెండాడెను. అయ్యెడ వందలు వేలుగ గంధర్వులార్చిరి. భరతుచే హతులగుచుంగూడ గంధర్వులు మిడుతలగ్నిపైనట్లాతని కెదురుసనిరి. వారటుసని పైపడుచుండగనే భరతుండు శరములచే వారితలలం బడనేసెను. మహారథులు గందర్వులు భరతునొక (యిరుకున) మూలం జిక్కువడజేసి యతని తీక్‌ష్ణాయుధముల జడివానచే మేఘము పర్వతమునట్లు ముంచెత్తిరి. ఆయలుగుల నఱికి భరతుడు గంధర్వులం గూడ నరకెను. వారిమస్తకములను బొమిడికములతో బాహుపురులతోడి బాహువులను ఏనుగుతొండములట్టి వారితొడలను నరికివైచెను. లాఘవము మెఱసి భరతుడు బాణముల ననుసంధించుటను వదులుటను నేనియేయొక్కడుం జు%ూచినవా లెడు. అయ్యుద్ధమందు గేవలము గంధర్వమహాసేన బాణముచే ప్రళయకాలాగ్ని యట్లు ప్రజ్వలించు బాణాగ్నికి దహింపబడుచు మాత్రమే కనిపించెను. బాణము గురింబడిన వారిం బడినట్లురుల భరతుడు గూల్చుచుండ దినకరుడస్తమించెను. అపోరిలో గెలుపుకొని యట మరలి నరేంద్రవరులతో గలిసికొని భరతుడు దేవతలు ద్విజేంద్రులు స్తుతింప శిబిరమునకేగెను. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున తృతీయ దివసయుద్ధ వర్ణనము రెండువందల యరువది రెండవ అధ్యాయము. రెండువందల ఆరువదిమూడవ అధ్యాయము - చతుర్థ దివసయుద్ధవర్ణనము మార్కండేయః - చతుర్థే೭హని సంప్రాప్తే కృత పూర్వాహ్ని కక్రియః శైలూషస్తు వినిష్క్రమ్య గంధర్వా నిదమబ్రవీత్ |1 యోధయధ్వం రణ సర్వే భరతం రిపు మాగతమ్ | అహం మధ్యే ప్రవేక్ష్యామి భరతస్య బలార్ణవమ్ || 2 తత్ర తాన్ ఘాతయిష్యామి భరతస్యాను యాయినః | ఏతదుక్తే తథే త్యుక్త్వా సంప్రతీక్షనక్త రాఘవమ్ || 3 భరతో೭పి మహాతేజాః రథేనై కేన దృశ్యతే | భరత స్యాను సై#్యన్యంచ భూభుజాం సమపద్యత || 4 త త్సైన్యం ప్రావిశ ద్ఘోరం శైలూషో రణ దర్పితం | చకార కదనం తత్ర నరవారణ వాజినామ్ || 5 గంధర్వ సైన్యే చ తథా భరతో೭పి శరోత్కరైః | చకార కదనం ఘోరం వైశ్వానర సమప్రభైః || 6 రాజానం కోష్ఠకే కృత్వా శైలూషం వివిధైశ్శరైః ఛాదయామాసు రవ్యగ్రా మేఘా ఇవ మహీధరమ్ || 7 గోవాసనస్తు సప్తత్యా చిచ్ఛేద సమరే శ##రైః ద్విజిహ్వశ్చ త్రిసప్తత్యా రాజా దాశేరక్తస్తు యః || 8 సుబాహుస్తం చతుష్షష్ట్వా దశభి స్తం సుయోధనః | కుమార స్సప్త సప్తత్యా శ్రేణిమాన్ దశభి స్త్రిభిః || 9 శూరః షష్ట్వా చ నిర్భిద్య బలబంధుః శ తేన చ | ద్వావిం శత్యా తతస్త క్షః పుష్కరో నవభి శ్శరైః 10 శ##తేన విజయ శ్చైనం జయో జిత్వా త్రిభి శ్చరైః | ప్రత్య విధ్యత తాన్ సర్వాన్ శైలూషో దశభి శ్శరైః || 11 నృత్యన్నివ రథో పస్థే మహాబల పరాక్రమః | ధను శ్చిచ్ఛేద భ##ల్లేన సుబాహోః సుమహాత్మనః || 12 హయాం శ్చ కార నిర్జీవాం స్తథై వాంశు మతోనృప | పద్మంరథస్థం చిచ్ఛేద చిహ్నం గోవాస నస్యతు || 13 సుయోధన రథాత్ క్షప్రం పాతయా మాస సారథిమ్ | బలబంధో స్తథా ఛత్రం పాతయా మాస యాదవః 14 తథా೭న్యాన్ వి సు భాం శ్చ క్రే శ##రైః స్సన్నత పర్వభిః | తతస్త స్య క్షురప్రేణ ధను శ్చి చ్ఛేద పుష్కరః || 15 అథా೭న్యం చాప మాదాయ పుష్కరస్య రణ రుషా | చకార తురగాన్ సర్వాన్ నిర్జీవాన్ సమరప్రియః || 16 పుష్కర శ్చ సమారుహ్య తక్షస్య రథ ముత్తమమ్ | వవర్ష శర వర్షేణ శర వర్షేణ శౌలూషం రణ మూర్ధని || 17 శైలూషేణ జఘానా శ్వాన్ రథా త్తక్షస్య యాదవ | విరథౌ తౌ గదాపాణీ భ్రాతరౌ యుద్ధ దుర్మదౌ || 18 శైలూషేణ సమారూఢౌ గదా హస్తౌ తరస్వినౌ | అభ్యాశే భ్రాతరౌ దృష్ట్వా జగామా೭ దర్శనం తతః || 19 మాయవీ స తు గంధర్వో రథముత్సృజ్య యాదవ | శూన్యం దృష్ట్వా రథోపస్థం విలక్షౌ భాతరౌ తదా || 20 ఆదిత్యే೭ స్త మను ప్రాప్తే విని వృత్తౌ రణా జిరాత్ | భరతో೭పి తథా కృత్వా గంధర్వాణాం మహాహనమ్ | న్యవర్తత మహారాజ | సంధ్యా కాలే రణాజిరాత్ || 21 గత్వైవ రాజన్ | సచ రాజువేశ్మ తత్రోష్య రాత్రిం రఘువంశనాథః | నిశావసానే పునరేవబుద్‌ధ శ్చ కార యుద్ధం సహితోనృ వీరైః || ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే చతుర్థ దివస యుద్ధ వర్ణనం నామ త్రిషష్ట్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః మార్కడేయుడనియె. నాల్గవరోజున శైలూషుడు పూర్వాహ్ణము నందలి క్రియలు జరిపికొని వెలికివచ్చి గంధర్వులంగని యిట్లనియె. మీరు భరతునితో నందరుం గలిసికొని పోరుడు. నేను సేనా సముద్రము రణమద్యమందు బ్రవేశించి భరతుని యనుయాయులను గూల్చెదననియె. వారు భరతుని నెదురుకొన నెదురు చూచిరి. భరతు డొక్క రథమునెక్కి యెదుట గనబడెను. ఆయన వెంటరాజసైన్యములు నడచెను. శైలూషుడు ఘోరమైన సేనను జూచి చతురంగ బలములతో దలపడెను. మేఘములు పర్వతముల నట్లు గ్రమ్మి భరత బలములు శైలూషునొక మూలకుదరిమి శర వర్షము గురిపించిరి. గోవాసనుడు డెబ్బది ద్విజిహ్వుడు (దాశేరకుడు) సుబాహువఱువదినాల్గు సయోధనుడు పది కూమారుడు డెబ్బదియేడు శ్రేణిమంతుడు ముప్పది శూరుడరునది బలబంధువు నూరు తక్షుడిరువదిరెండు పుష్కరుడు తొమ్మిది విజయుడు నూరు జయుడ మూ శైలూషుడు పదియును బాణముల భరత సైన్యముం గొట్టిరి. తేఱు మొగసాల (ముందు) నృత్యము సేయుచున్నట్లుండి భల్లముచే (ఈటె) సుబాహువు ధనువుం ద్రెంచెను. అంశమంతుని గుఱ్ఱములం గూల్చెను. గోవాసనుని రథమందున్న పద్మము గుర్తును గొట్టివేసెను. సుయోధన సారథింబడ ద్రోసెను. బలబంధుని గొడుగు పడ వేసెను. మరియుంగల యోధలను బెడమొగము పెట్టించెను. పుష్కరుడా మీద వాని ధనుస్సు ఛేదించెను. బలబంధు డింకొక విల్లు గొని పుష్కరుని గుఱ్ఱములం గూల్చెను. ఇద్దరును విరథులై గదలుగొనిన తక్షుని గదలుగొనిన తక్ష పుష్కరులను నయ్యన్నదమ్ములపై శైలూషు డెక్కెను. ఎక్కినంతలోనే మాయమయ్యెను. మాయావి వాడదృశ్యు డగుట చూచి వారిద్దరు వెఱగుపడి సూర్యాస్తమయ మయినంతట రణరంగము నుండి మఱలి పోయిరి. భరతుడును నవ్విధమున గంధర్వులతో మహారణముసేసి సంధ్యా సమయమైనదని యట నుండి వెనుదిరగెను. రాజ శిబిరమున కేగి యతడారేయి నటనుండి వేకువ లేచి నర వీరులతో గూడ యుద్ధము సేసెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున చతుర్తదిపసయుద్ధవర్ణనమను రెండువందల యరువదిమూడవ అధ్యాయము. రెండువందల ఆరువదినాల్గవ అధ్యాయము - పంచమదివసయుధ్ధవర్ణనము మార్కండేయః - తతో೭హ్ని పంచమే ప్రాప్తే భరతో యుద్ధ దుర్మదః | కల్యముత్థాయ రాజేంద్ర | కృత పూర్వాహ్ణిక క్రియః || 1 జగామ హన్తుం గంధర్వాన్ బలముత్సృజ్య పృష్ఠతః | శైలూషో೭పి రణం త్యక్త్వా నరేంద్ర నిధనేచ్ఛయా || 2 జగామైక రథైనైవ రణకర్మ విశారదః | తయోరాసీ న్మహాఘోరః సంప్రహార స్సుదారుణః || 3 దేవాసుర రణ ప్ర్‌యః సూర్య స్యోదయనం ప్రతి | తయోస్తు యుధ్యతో రాజన్ గంధర్వాణాం బలార్ణవమ్ || 4 చాదయా మాస భరతః శ##రై స్సన్నత పర్వభిః | తచ్చ రాజ్ఞా ముదీర్ణానాం బలం సాగర సన్నిభమ్ || 5 చాదయా మాస గంధర్వః శ##రై రాశీ విషక్ష పమైః బలమేఘే వినిర్యాతే శర వృష్ఠి సుదారుణ || 6 ధారయేతాం మమారాజ! శైలూష భరతా వుభౌ | అన్తరిక్షే శరవ్రాతాం శ్చిచ్ఛిదతు రరిం దమౌ || 7 సైన్యయో శ్చ తథా చక్రుః కదనం ఘోర దర్శనమ్ | తయోశ్చా పచ్యుతై ర్బాణౖః నిపాతి త హయద్విపైః || 8 రణ విసస్రు ర్బూపాల ! స్రవంత్యోరక్త నమ్నగాః | వహన్త్యో నరదేహని యక్షరాక్షస సేవితాః || 9 తాభ్యాం ముక్తైః శరవ్రాతై ర్గగనే సూర్యరశ్మయః | న ప్రాకాశంత రాజేంద్ర | ఏకచ్ఛాయే నభఃస్థలే | సైనికాన్ ఘాత యన్తౌ తౌ రక్షమాణౌ చ సారథీ | 10 ఛిందమానౌ రణ వీరౌ పరముక్తాం స్తథా యుధాన్ | జనయా మా సతుర్వీరౌ సురాణా మపి విస్మయమ్ || 11 తద్యుద్ధం పూజయా మాస పుష్క వర్షేణ వాసవః | తౌ ప్రబుద్దౌ దినం సర్వం వరివాణ ధనుర్ధరౌ || 12 నాసీ దేకతర స్యాపి రణ తస్మిన్ పరాజయః | తతో೭స్తం భగవ త్యర్కే ప్రయాతే పృథివీ పతే: పరస్పర స్యాను మతే శిబిరాయైవ జగ్మతుః || 13 అథోష్య రాత్రిం గృమ యోః ప్రవిష్టౌ రాత్ర్యన్త మాసాద్య తదా రణాయ | భూయో మహేంద్రోపమ: సంప్రయాతౌ ప్రహర్ష యన్తౌ స్వబలాని వీరౌ || 14 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే భరత శైలూషయుద్ధే పంచమ దివస యుద్ధ వర్ణనం నామ చతుష్షష్ట్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె. అయిదవరోజున భరతుడు వేకువనేలేచి ప్రాతనుష్ఠానము గావిఇంచి గంధర్వులపైకి చనెను. అయ్యిర్వురకు దారనసమరమయ్యెను. భరతుడు తీవ్రబాణములగురియ గంధర్వుడును సర్పములట్టి యలుగులను విసరెను. నింగినే యా బాణములను ద్రెంచిరి ఘోర సమరమున రక్తపుటేరు ప్రవహించెను. అందనేకనరశరీరములు దేలిపోయెను. ఆవిసిరిన బాణములచే సూర్యరశ్మి గప్పుపడిపోయెను. సైనికులనొకవంక గూల్చుచు సారథుల నొకవంక గాపాడుకొనుచు నరివిముక్త శరవ్రాతమును శత్రుకవచములంచెండాడుచు నిద్దరు నొకరి కొకరు దీసిపోని మహారణమునొనరించిరి. ఆదిచూచి వేల్పులుంగూడ యచ్చెరువు వడిరి. వాసవుడా సంగరమును బూలవానం బూజించెను. అంతట రవిగుంక య్రెండొరుల యనుమతితో శిబిరములకుం జనిరి. రేయితుద మరల తమతమ బలములం బ్రహర్షింపజేయుచు ననికి నడచిరి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పంచమదివ సయుద్దవర్ణనమను రెండువందలయరువది నాల్గవ యధ్యాయము. రెండువందల అరువదిఐదవ అధ్యాయము- షష్ఠదివసయుద్ధము మార్కండేయః - తతస్తు షష్ఠే సంప్రాప్తే ది వసేభూరి దక్షిణ | చక్రతు స్సమరం వీరౌ శైలూష భరతా వుభౌ || 1 ససైన్యౌ పృథివీ పాల! శ##రై రాశీ విషోవమైః | శైలూషేణ సమాసక్తో భరతో వాహినీ వతిః ||2 సూర్యరశ్మేశ్శరేణా జౌ శిరశ్చిచ్ఛేద శత్రుహా | సూర్య రశ్మిం రణ హత్వా ఏకలవ్యం మహారథమ్ || 3 శ##రేణ పాతయా మాస రథోపస్థా దరిందమమ్ | గంధర్వ నృపతి ర్దృష్ట్వా ప్రధానౌ తౌసుతౌహతౌ || 4 శక్త్యా బిభేద విజయం తథా చక్రేణ పుష్కరమ్ | తోమరేణ తథా తక్షం గదయా చ సుయోధనమ్ || 5 వివశుస్తే రథో పస్థం విసంజ్‌ఒఆః%్%్ పర్వ ఏవతు | నియంతృ భి శ్చ సమరా త్సర్వ వినా ೭ పవాహితాః || 6 తతస్తు భరతః క్రుద్ద శ్చతుర్భి స్తస్య సాయకైః | చకార యుధి నిర్జీవాం స్తు ర గాశ్చైవ యాదవ ః 7 చకార చ శరవ్రాతై ర్విముఖీ కృత విక్రమమ్ | తతోధైర్యేణ సందార్య శరవేగం మహాత్మనః || 8 ఆరురోహ రథం శీఘ్రం సుసన్నధ్ధో మహాబలః | రథ మారుహ్య వివ్యాథ శ##రేణానత పర్వణా || 9 భరతో హృదయే గాఢం ముమోహ స చ తాడితః | ఏతస్మి న్నంతరే ముక్తో హాహాకార స్సురాసురైః || 10 అప్రహృష్టైః ప్రహృష్టై శ్చ విమూఢే రఘునందనే | హాహాకారేణ మమతా లబ్ధ సంజ్ఞః స రాఘవః || 11 ఆకృష్య బలవచ్చాపం శైలూషస్య మహద్ధనుః | ద్విధా చకార రాజేంద్ర! శైలూషం చాహనద్ భృశమ్ || 12 స చ్ఛిన్న ధన్వా వేగేన గదా మాదాయ సత్వరః | ప్రేషయా మాస ధర్మజ్ఞ! భరతస్య మహాత్మనః || 13 ఆపతం తీం గదాం దృష్ట్వా భరతో రణమూర్ధని | ద్విదా చకార చక్రేణ సర్వ సైన్యస్య పశ్యతః || 14 తత స్స పరిఘం శీఘ్రం చిక్షేప భరతం ప్రతి | తమా పతస్తం చిచ్ఛేద చతుర్భి స్సాయకైర్దృఢమ్ || 15 తతో೭న్యధ్ధను రాదాయ సాయకా నేనక వింశతిం | చిక్షేప స మహారాజ! భరతస్య రథం ప్రతి || 16 ఛిత్వా తాన్ భరతః సర్వాన వధీ త్తస్య సారథిమ్ | తథా చ చతురో వాహాన నయద్యమ సాదనమ్ || 17 శైలూషం విరథం దృష్ట్వా గంధర్వాణాం మహాచమూః | వవర్షాయుధ వర్షేణ మేగో వృష్ట్యేవ పర్వతమ్ || 18 సమోహ యిత్వా భరతం మోక్షయా మాస పార్థివ! | మోక్షయిత్వాచ రాజానం గతే స్తం రవి మండలే|| 19 కృత్వా వహారం తుగతః శిబిరాయ నరాధిపః || 20 హత్వా రథే నాగరథా೭ శ్వ యోధాన్ సంప్రాప్య మద్యే నిశితైః పృషత్కైః | రఘుప్రవీరో೭పి గృహాయ యాతః | సంపూజ్య మానో భువి మాన వేంద్రైః || 21 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ శైలూష భరతయుద్ధే షష్ఠయుద్ధ దివసోనామ పంచషష్ట్యుత్తర ద్విశతతమో೭ ధ్యాయః మార్కండేయుడనియె. ఆఱవరోజు రాగానే భరత శైలూషులు తీవ్రరణముగావించిరి. శైలూషునితోడి పోరులో భరతుడు సూర్యరశ్మియను గంధర్వు శిరము నరికెను. అటుపై నేకలవ్యుం గూల్చెను. గంధర్వుల రాజట్లు తనయిర్వురు కొడుకులు మడియుటగని విజయుని శక్తిచే చక్రముచే ఋష్కరునిం తోమరముతో తక్షుని గదచే సుయోధనునింగూల్చెను. వారందఱు తిలివిదప్పి రథము ముందఱనొఱగిరి. రథసారథులు వారిని రణభూమినుండి తలగించిరి. బరతుడపుడుగ్రుడై శైలూషుని నాల్గుగుఱ్ఱములంజంపెను. శరజాలమున శత్రువును జచ్చువడంజేసెను. అప్పుడు ధైర్యము గొని భరతుని బాణవేగము నోర్చుకొని గంధర్వపతి రథమెక్కి బాణము విసరెను. హృదయమున తగిలి భరతుడు మూర్ఛవోయెను. ఈ యెడ సురాసురులు హాహాకారములు సేసిరి. భరతుడు మూర్చనొందగ దిగులు పడిన సంతోషపడిన యిరువంకల హాహాకారములచే భరతుడు తిలివికొని రాఘవుడు ధనువు బలము కొలది నాకర్షించి శైలూషుని విల్లుని దునిమి వానిం గట్టిగ గొట్టెను. ధనువు తెగి వాడు గదంగొని భరతునిపైకి విసరెను. పైబడు నా గదంగొని భరతుడు చక్రముచే దానిని రెండుగ ద్రుంచెను. ఆపై నతడు పరిఘయను నాయుదము విసర రగునందనుడు నాల్గమ్ములదాని వమ్మెనరించెను. ఆపై వేఱువింటి నందుకొని యిరువది యొక్క బాణములను భరత రథముపైకి విసరెను. వానింద్రెంచి వాని సారథిని భరతుడు గూల్చెను. వాని రథాశ్వములను యమనిలయమున కంపెను. శైలూషుని విరథుంగాగనుగొని గంధర్వేన పర్వతముపై మేఘమట్లు శరవర్షము గురిసెను. భరతుడయ్యెడ మూర్చవోవ నతని వదలించికొని గంధర్వుడు మరలెను. సూర్యుడస్తమించెను. గంధర్వడు తన శిబిరమునకుంజనెను. రఘు ప్రవీరుడును మానవేంద్రుల మన్ననలందుకొనుచు తననివాసమునకుం జనియె. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున షష్ఠదివస యుద్ధవర్ణనమను లెండువందల ఆరువదిఐదవ అధ్యాయము రెండువందల ఆరువదిఆరవ అధ్యాయము - శైలూషవధ తతస్తు సప్తమే ప్రాప్తే దివసే యుద్ధ దుర్మదౌ | సమీయతు ర్మహాత్మానౌ శైలూష భరత వుభౌ || 1 తతస్తు భరతః ప్రాహ శైలూషం యుద్ద దుర్మదమ్ | ఆవయోః ప్రస్తుతం సైన్యం కిమేతైసై#్సనికైర్మృతైః || 2 నివారయస్వ సైన్యంస్వం వారయిష్యా మ్యహం స్వకమ్ | ఆవయో ర్ద్వైరథం యుద్ధం పవ్యన్తు వసుధాధిపాః || 3 త్వదీయాః సైనికా యే చ సురనాధాః | హతే మయి మదీయంతు సైన్యం కామం ప్రయుధ్యతామ్ || 4 సంగ్రామం వా కరోత్వాజౌ త్వదీయంతు హతేతవ్యి | ఏవముక్త స్తథే త్యుక్త్వావారయా మాస సైనికాన్ || 5 గంధర్వరాట్ సశైలూషో భరతో೭పి తథా స్వకాన్ | తతః ప్రవవృతే యుద్ధం తయోర్దేవా సురోపమమ్ || 6 పశ్యతాం సర్వ సైన్యోన్యం దేవానామపి పశ్యతామ్ | వరజాలేన మహతా ఛాదితార్క కరే రణస్త్ర || 7 తతక్షతుస్తా వన్యోన్యం శ##రైః సన్నత పర్వభిః | పరస్పర శరాఘాత విసరచ్ఛోణితోక్షితౌ || 8 విరేజతు స్తౌ రాజేంద్ర! పుష్పితా వివ కింశుకౌ | ఉభౌ మహాదథా వీరౌ చోభౌ విశ్రుత పౌరుషౌ || 9 తతోభౌ వరధానుష్కౌ చోభౌ సమర దుర్మదౌ | కాంచనాంగ రథస్థౌతౌ చోభౌ సద్ధ్వజ శోభితౌ || 10 వీజ్యమానౌ తథైవోభౌ యోధాభ్యాం వరచామరైః | ఛత్రయోస్తౌ తదా ధస్తాచ్ఛు శుభాతే మహారథౌ || 11 ఉభా వస్త్ర ప్రతాపేన చక్రతు స్తుములం రణమ్ | అస్త్రయుద్ధం చిరంకృత్వా శరయుద్ధం ప్రచక్రతుః | 12 శరయుద్ధే వ్యతిక్రాన్తే అస్త్రయుద్ధం పునః | ఏవంతౌ దివసం కృత్వా యుద్ధం సంశ్రాన్తవవాహనౌ|| 13 రోపయన్తౌ శ్రమంరాజన్ : సమరేషు జిత శ్రమో | తతో గంధర్వరాజస్తు లంబమానే దివాకరే || 14 చకార తామసీం మాయాం యయాంధ మభవజ్జగత్ | అంధకారే తతో జాతే వాచో೭శ్రూయాన్త దారుణాః || 15 భరతో హన్యతాం శీఘ్రం భక్ష్యతాం పాత్యతాం తథా | అభ్యవర్తన్త భరతం సర్పవృశ్చిక కర్కటాః || 16 మర్కటా వానరా ఘోరాః సృగాలాః ద్వీపిన స్తథా | సింహవ్యాఘ్ర వరాహాశ్చ క్రవ్యాదా యేచ జాతయః ||17 అర్ద్యమాన స్స ధర్మాత్మ భరతసై#్త స్సుదుర్ముభైః | సౌరేణాస్త్రేణ తాం మాయాం బభంజ పరవీరహా || 18 తతస్తు మహతీం మాయాం స చకార మహాబుజః | ఉత్తస్థౌ సుమహాన్ మేఘ శ్ఛాదయిత్వా నభస్తలమ్ || 19 ప్రవవర్షచ ఘోరాణి శస్త్రజాలా న్యనే కశః నారాచా నర్ధనారాచాం స్తథైవ చషకాననాన్ || 20 వత్పదంతాం స్తథా వల్లాన్ కర్ణినాలీక గోముకాన్ | క్షురప్రా నర్ధచంద్రాంశ్చ వరాహ వదనాం స్తథా || 21 గదాభుశుండీః ప్రాసాంశ్చ భిండిపాలాన్ పరశ్వథాన్ | హుడాన్ గుడాన్సలగుడాన్ చక్రఖడ్గాం స్తథా పరాన్ || 22 ఏతా నన్యాంశ్చ వివిధాన్ వవర్ష పరమాయుదాన్ | పతద్భి రాయుధై ర్ఘోరైర్బాధ్యమాన స్సరాఘవః || 23 వాయవ్యాస్త్రేణ తాం మాయాం నాశయామాస శత్రుహా | తతో బభూవ రాజేంద్ర! గంధర్వః పర్వతో మహాన్ || 24 క్షరత్ ప్రస్రవణో ఘోరః శిఖరైశ్చ సముచ్ఛ్రితైః | మాయాం తాం పార్వతీం శ్రీమాన్ వజ్రాస్త్రేణ రగూద్వహః || 25 నాశయామాస రాజేంద్ర! సర్వసైన్యస్య పశ్యతః | హన్యమానాసు మాయాసు రూపాంశ్చక్రే సుదారుణాన్ || 26 యక్షాణాం రాక్షసానాంచ పిశాచానాం పతత్రిణామ్ | సింహవ్యాఘ్ర తరక్షూణాం కుంజరాణాం తథైవచ || 27 బభజ తస్యమాయాస్తాః దివ్యాసై#్రర్భరతో రుషా | హన్యమానాసు మాయాసు లాఘవాద్భరతం రణ || 28 మోహయామాస రాజేంద్ర! శైలూషో రణదర్పితః | భరతో೭పి ధనుష్కోట్యాం శరాగ్రేచ నిలీయతే || 29 ధ్వజాగ్రేచ రథాగ్రేచ తురగాగ్నే పునః పునః సాయకాన్ భారతాన్ శైఘ్ర్యాద్ధ్వంసయామాస యాదవ : 30 రాఘవా స్తుతుషు స్తస్య దేవ దైత్యాశ్చ సంఘశః | అసురా ముముచు ర్ఘోర మట్టహాసం సుదారుణమ్ || 31 దైత్యానా మట్టహాసేన భరతః కుపితో భృశమ్ | నారాయణాస్త్రం సంయోజ్య శ##రేణానతపర్వణా|| 32 ఇయేష హస్తుం తం క్రోధా ద్గంధర్వం రణగర్వితమ్ | అస్త్రం తత్సంహృతం జ్ఞాత్వా జగామ స్వం రథం త్వరన్ || 33 ఇయేష హస్తుం తం చాస్త్రం రుద్రాస్త్రేణతు దారుణమ్ | ఏతస్మిన్నేవకాలే తు ముమోచ భరత శ్శరమ్ || 34 కాలానల సమ ప్రఖ్యం సుపుంఖంసఫలం తథా | రాజితం వైనతేయస్య పక్షైః శత్రు వినాశనమ్ || 35 హత్వా రుద్రాస్త్ర వేగంతు రథస్థస్య మహీపతేః | బిభేద హృదయం రాజన్: వర్మ భిత్వాథ ೭ కాంచనమ్ || 36 రాజ్ఞశ్చ హృదయం భిత్వా భిత్త్వాచ వసుదాతలమ్ | స్నాత్వా రసాతలాంభస్సుతూర్ణం పున రపాగమత్ || 37 గంధర్వరాజో ೭భి హతః వరేనా న త పర్వణా | రథనీడే ధనుస్త్యక్త్వా మమార పరవీరహా || 38 మార్కండేయుడనియె. సప్తమదివస యుద్ధమందు భరతుడును శైలూషండును గదిసిరి. భరతుడు శైలూషునితో మనకు సేన లెందలకు? నాసైన్యమును నేను వారింతును. నీ సైన్యమును నీవు నాపుము. మనమిద్దరమే రతములనుండిదిగి పోరుదము. మన రణవినోదమును రాజులెల్లరును మన సైన్యములను మీద దేవతలును వినోదము దర్శింతురుగాక ! నేను హతుడైన తర్వాత నా సైన్యము నీ సైన్యముగాని పోరుగాక! అనినంత శైలూషుడు తనసేనను నిలిపివేసెను. భరుతడునట్లసేసి యిర్వురుందలపడిరి. బాణములను విసరికొనిరి. రక్తములందడిసి పూసిన కింశుకములట్లుండిరి. శస్త్రములు (మంత్రానుసంధితము) అస్త్రములు (అమంత్రకము) నెడనెడ మార్చుచు ననిసేసిరి. గంధర్వుడు సూర్యాస్తమయమైనంత చీకటిలో మాయాయుద్ధమారంభించెను. దానిచే లోకము నందంధ కారము గ్రమ్మెను. అపుడు భరతుని జంపుము. భక్షింపుము గూల్చుమను దారుణములైన కేకలు వినవచ్చెను. తేళ్ళు సీతలును కోతులు కొండముచ్చులు నక్కలు పులులు సింహవ్యాఘ్ర వరాహములు ఘాతుకమృగమలు భరతునిపై గురిసినవి. సౌరాస్త్రము చేవానినిగూల్చి యాతామసమాయాంధకారమును బటాపంచలు సేసెను. అంతపెద్దమబ్బుపట్టెను. అటుపైగంధర్వరాజు ఘోరములయిన శస్త్రములను నారాచములు అర్ధ నారాచములు చషకముఖమలుఉ వత్సదంతములు బల్లములు కఱ్ని నాలీక గోముఖములను ఓఉరప్రములు అర్ధచంద్రములు వరాహవదనములు గదలు భుశుండి ప్రాసము భిండిపాలము పరశ్వథము హుడము గుడములగుడము చక్రమలు మఱిపెక్కింటి నుపయోగించి భరతువి వేధించెను. భరతుడు వాని మాయను వాయవ్యాస్త్రముచే నశింపజేసెను. అమీద శైలూషుడొక పర్వతమయి మీదినుండి కొండవాగులను గురిసెను. ఆపార్వతీమాయను శ్రీమంతుడు భరతుడు వజ్రాయుధముచే హరించెను. మాయాను హరింపవాడు దారుణ రూపప్రదర్శనము సేసెను. యక్షరాక్షసపిశాచ పక్షి సింహవ్యాఘ్రగజాది రూపములగు నామాయా రూపములను భరతుడు దివ్యాస్త్రములచే హతమొనర్చెను. ఆపై గంధర్వ మాయచే నతడు వింటికొప్పున శరాగ్రమున ధ్వజముపై రథముమీద గుఱ్ఱముపై మరిమరి యెట జూచిన నట లీనుడై చేసినయుద్ధముం దిలకించి భరతసైన్యములు సురాసురులును ఆశ్చర్య చకితులై యతనిని గొనియాడిరి. అసురులట్టహాసములుసేసిరి. దానమరియు మిక్కిలి కుపితుడై రాఘవుడు నారాయణాస్త్రము ననుసంధించి ప్రయోగించెను. అది సంహృతమగుటెరిగి రథమెక్కి రుద్రాస్త్రమును ప్రయోగించెను. అది కాలాగ్నియట్లు జ్వలించెను. సుపుంఖము సఫలమునై గరుడుని ఱక్కలతో గూడియుండెను. అది రథమెక్కిన శైలూషుని బంగారపు కవచముం బ్రద్దలుసేసి వాని గుండెలు పగిల్చి భూమిలో జొచ్చి పాతాశోదకములందు స్నానముసేసి తిరిగియమ్ములపొదిలోనికి వచ్చెను. గందర్వపతి యిట్లు హతుడై ప్రాణములు వాసి విల్లు జారవిడిచి రథముమోసలం ప్రాణములు విడిచెను. పితరం నిహతం దృష్ట్వా శైలూష తనయా రణ | క్రోధ దుఃఖ పరీతాస్తే భరతం రణ కర్కశమ్ || 39 వివ్యధు ర్భూపతిశ్రేష్ఠ! బాణౖ రాశీ విషోవమైః | ఆయుధై ర్వివిధాకారై స్తదా తేవై రణాజిదు 40 మాయాశ్చ వివిధా శ్చక్రు ర్బరతస్య విపత్తయే | అంతరిక్షంచ తై ర్వ్యాప్తం నానాహేతి ప్రవర్షిభిః | 41 అసై#్త్రవ్చ కేచి ద్భరతం ప్రవవర్షుః మహారథాః | భూరి భావాత్స యోధానాం మహస్త్రాణాం మహాబలాత్ || 42 ప్రతాపా దస్త్రజాలానాం సంశయం పరమంగతాః| కాలాస్త్ర మథ సాంవర్తం ముమోచ భరత స్తదా || 43 తస్మా దస్త్రా త్సహస్రాణి శస్త్రాణాం నిర్యయుస్తదా | గంధర్వ సైన్యం సకల మసై#్త్రసై#్తః ప్రత్యహన్యత || 44 శ##సై#్త్రః కేచిత్ విశిరసః కృత్వా గంధర్వ సత్తమాః వివాహాశ్చ కృతాః కేచిత్ కేచిద్రాజన్ ద్విధా కృతాః || 45 కేచిద్విబాహవశ్చైవ కేచి ద్వ్యంగాశ్చ యాదవ! గంధర్వాణాంచ తాః కోట్య స్తిస్రః సంగ్రామ శాలినామ్ || 46 క్షణ నాస్త్ర ప్రపాతేన భరతేన నిపాతితాః | గంధర్వసైన్యే నిహతే ప్రవవు ర్మారుతాః శివాః || 47 పుష్పవర్షం పపాతా೭థ భరతస్యతు మూర్ధని | దిశశ్చ నిర్మలీ భూతా దేవానాం విగతం భయమ్ ||48 తతో దేవ స్సహస్రాక్షః సర్వై స్సురగణౖ స్సమమ్ | విమానస్థో బభాషేదం భరతం దర్మవత్సలమ్ || 49 ఇంద్రః : పితామహ వరో ద్రేకా దవధ్యం దేవతా గణౖః | హతవానసి శైలూషం దేవబ్రాహ్మణ కంటకమ్ || 50 మస్మా త్తస్మా ద్వరం మత్తో గృహాణ రఘునందన| మార్కండేయః శతక్రతో ర్నిశ##మ్యైత ద్భరతో వాక్య మబ్రవీత్ || 51 భరతః త్వమీశః సర్వ దేవానాం తవేదం సకలం జగత్ | అచిరేణౖవ మరణం త్వదాజ్ఞా భంగకారిణామ్ || 52 భవతీహ సదాలోకే నిమిత్తం మద్విధో జనః | ప్రజాపతి కృతం భేదం కో మోక్తుం జగతి క్షమః || 53 వరశ్చయదిమే దేయః త్వయాదేవ ప్రదీయతామ్ | సింధోరుభయ కూలేషు కరిష్యామి పురద్వయమ్ || 54 గంధర్వ రక్షితే దేశే పుత్రయోరుభయోః కృతే | నివేశం తద వాప్నోతః ప్రసాదేన శతక్రతో || 55 మార్కండేయః : ఏవమస్త్వి త్యథోక్త్వైవ స్వర్లోకం వాసవో య¸° | వాసవేతు గతేనాకం రాజా చిత్రరథసతః || 56 గంధర్వాణాం మహాతేజాః భరతం వాక్యమబ్రవీత్ | చిత్రరథః : గంధర్వా నిహతా వీరా మదాజ్ఞా భంగకారిణః || 57 త్ర్వయాతే ధర్మనిత్యేన దేవ బ్రాహ్మణ కంటకాః | తన్మే సముద్ధృతం శల్యం దేవానంచ ప్రియంకృతమ్ || 58 తస్మా త్సభాజయిత్వా త్వాం యాస్యామిత్రిదివం పునః | మార్కండేయః : భరత స్తమువాచాథ గంధర్వా నిహతా మయా || 59 తత ఏనంజనం తేషాం స్త్రియశ్చ పరిపాలయ | గంధర్వాః పరిపాల్యాస్తే తేషాం త్వం పరిపాలకః || 60 మదీయేనానురోధేన విశేషా త్కర్తు మర్హసి | సర్వేషాం చ తథా స్థానం పర్వతే గంధమాదనే || 61 పయాతా స్తవ తత్రస్థాః పాలయిష్యన్తి శాసనమ్ | ఏవం కరిష్య ఇత్యుక్త్వా పరిష్వజ్యచ పీడితమ్ || 62 సర్వజ్ఞం భరతం శ్రీమాన్ గంధర్వస్త్రిదివం య¸° || 63 రఘు ప్రవీరో೭పి రణ మఘోనం శత్రు నిహత్వా వరదాన యుక్తమ్ | విరాజమానో యశసా పరేణ జగామ రాజన్ ః ప్రహృష్టః 64 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషవధో నామ షట్‌ష్ట్యుత్తర ద్విశత తమో೭ధ్యాయః తండ్రి హతుడగుట జూచి వానికొడుకు భరతునిపై బాణములు కురిపించెను. వాని ప్రచండరణ కౌశలముంగని రఘూద్వహుడు కాలాస్త్రమును ప్రయోగించెను. అందుండి వేలకొలది యస్త్ర శస్త్రములు వెలువడి ముప్పదికోట్ల గంధర్వసైన్యమును హతమార్చెను. అది హతమైన శుభవాయువులువీచెను. భరతునిపై పూలవాన గురిసెను. దిక్కులు తెలివొందెను. బయమువాసెను. అంతట సహస్రాక్షుండు దేవతలతో విమానముపై వచ్చి ధర్మరతుడైన భరతునితో పితామహు వరబలముచే జావని వాని నీ దేవబ్రాహ్మణ కంటకునిజంపితివి. వరమిచ్చెదనడుగుమన నీవు సర్వదేవతాప్రభువవు.న ఈజగత్తునీది. నాయజ్ఞను భంగపరచువారలకు మరణము తప్పదు. నావంటివాడు నిమిత్తమాత్రుడు. బ్రహ్మవ్రాసిన విఘాతమునెవ్వడు తప్పించగలడు? నాపై ప్రసన్నుడవేని సముద్రమిరువైపుల రెండుపురములను నిర్మింతును. ఆ ప్రదేశమీవరకు గంధర్వులపాలన నున్నది. నాకుమారుల కాపురమును రాజదానులగును. ఇట్లేయగునని వరమిచ్చయింద్రుడు స్వర్గమునకేగెను. అప్పుడు చిత్రరథుడను గంధర్వముఖ్యుడు నాయాజ్ఞ గంధర్వలుగూలిరి. దేవబ్రాహ్మణ కంటకుడు గూలినంత నా హృదయశల్యమువాసినది. నిన్నుగారవించి నేను స్వర్గమునకేగెదనన బరతుడిక నీ మిగిలిన యీజనమును స్త్రీజనమును పాలింపుము. విశేషించి నిర్ణయముగాన దీనింగావింపుము. అందరకును గంధమాదనమందు స్థానమున్నది. నీవాండ్రటకు జని నీయా న బాలింతురు. అననవిని యిట్లసేయుదుని చిత్రరథుడు బరతుం గట్టిగ గౌగలించికొని త్రిదివంబునకేగెను. భరతుడింద్ర శత్రువులనిట్లు పరిమార్చి వరమునడసి కీర్తిశాలియై స్వపురమున కానంద భరితుడై యేగెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శైలూషవధయను రెండువందల యరువది యారవ అధ్యాయము. రెండువందల అరువది ఏడవ అద్యాయము - రణభూమివర్ణనము మార్కండేయః : ఆదిత్యే ೭స్త మనుప్రాప్తే సంధ్యాకాలే సుదారుణ | నివర్తయామాస రథం యుధాజిద్భరతస్య చ || 1 నివర్తయానశ్చ రథం భరతం వాక్య మబ్రవీత్ | సంగ్రామ వేదినీం పశ్య: స్వకృతాం రఘునందన!|| 2 గంధర్వాంగ సమాకీర్ణాం హతకుంజర భూషనామ్ | తురంగమ గణా కీర్ణాం వరాయుధ ధరాం ధరామ్ || 3 సంపూర్ణ చంద్ర ప్రతిమై ర్దష్టోష్ఠైః చారుకుండలైః | భ్రుకుటీ తట దుష్ప్రేక్ష్యైర్మస్తకైర్భాతి మేదినీ || 4 పంచ శీర్షోరగా కారైః వరాంగద విభూషణౖః బాహుభి ర్భాతి శూరాణాం వసుధా వసుధా೭ధిపః 5 పద్మపత్ర దళాకారైః గంధర్వాణాం తథా వరైః | భాతి సాయక విచ్ఛిన్నైః స పద్మేవ వసుంధరా || 6 హస్తి హస్త సమాకారైః గంధర్వానాం తథా కరైః విభాతి వసుధాకీర్నా వర చందన భూషితైః || 7 త్వ దేవ శర నిర్భిన్నై ః గండశైలోపమై ర్గజైః ఉద్భాస్త జీవితై ః పశ్య ! వినికీర్ణం ధరాతలమ్ || 8 ఆవిష్కృత రదైశ్చాశ్వై ర్వివృతాక్షై స్తథైవచ | పతితై రావృతాం పశ్య: తురంగై ర్మేదినీం రణ || 9 ఆతపత్రై శ్శశాంకాభై శ్చామరై శ్చ విరాజితామ్ | యోక్రైః ఖలీనైః పల్యానైః కుథాభిః కంబుభిస్తదా || 10 కేశైర్దండై స్తథా చాపైః ప్రాసైః ఖడ్గైః పరశ్వథైః శ##రై ర్నానా ప్రకారైశ్చ నానా నామాంకితైః శుభైః || 11 ముకుటై రంగదైర్హారైః కుండలై రపిశోభితా | రఘునాధ భువం పశ్య: కారుణ్యపి మనోహరామ్ || 12 గంధర్వాన్ భక్ష్యమాణాంశ్చ క్రవ్యాద్భిర్మృగ పక్షిభిః | పశ్య! త్వం చారుసర్వాంగం సర్వాభరణ భూషితమ్ || 13 ఆకృష్యమాణం నిమ్నేఘ క్రవ్యాద్భిః కుణవద్రణ | గాత్రైశ్చలద్భి ర్ధృశ్యన్తే జీవంతైరివ పార్థివశః 14 మార్కండేయుడనియె. అదిత్యుడస్తమింప సుదారుణమై సంధ్యవేళకాగా యుధాజిత్తు భరతుని రథమును మరలించెను. మరలించుచు భరతుంగని మేనమామ యిట్లనియె. రఘునందన నీవు సేసిన యీ యుద్ధభూమింగనుము. ఎట జూచిన గంధర్వుల శరీరములే కూలిన యేనుగులే గుఱ్ఱములే చెల్లచెదరైన యాయుధములు పెదవులు గఱచుకొని కుండలములతో కనుబొమలట్లేముడిపడియున్న తలలతో పాములట్లున్నది యీ వసుంధర. నీ యొక్కని బాణములనేయిన్ని యేనుగులుకూలి పెనుగొండలట్లిక్కడ పడియున్నవి. పళ్లువెలివెట్టి కనుగ్రుడ్లు తిరుగుడుపడి కూలిన గుఱ్ఱములు చంద్రునట్టి గొడుగులు చామరములు తెగి పడియున్నవి. కళ్లెములు ఖలీనములు పల్యాణములు కుథలు శంఖములు జూలు తెగిన గుఱ్ఱములతో - దండములు విండ్లు ప్రాసములు కత్తులు కటార్లుమున్నగు నాయుధములతో నీభూమి చిమ్ముకొని యున్నది. ఈరణరంగము సర్వాంగ సుందరము సర్వాభరణ భూషితమునై యున్నది చూడుము. సన్నిధానంతు యోదానం వివృతం కరపంకజమ్ | ధనుర్గ్రాహా జ్ఞాత కిణం భక్షితేన పతత్త్రిభిః || 15 అర్ధసంభక్షితై ర్వక్త్రైస్తథా సంపూర్ణ భక్షితైః దుర్వృత్తాన్ పశ్య గంధర్వాన్‌శాపాదివ! మహీక్షితామ్ || 16 అనాగసాం నరేంద్రాణాంమ గంధర్వైర్యత్సరా కృతమ్ | భూయస్తదేవ సమరే గంధర్వాణాం త్వయా కృతమ్ || రణాజిరే పిశాచానాం గంధర్వాన్ పశ్య! రాఘవ! 17 యక్షాణాం రాక్షసానాంచ శతశో೭థ సహస్రశః | గంధర్వ మాంస లుబ్భానాం సతతం క్షతజాశినామ్ || 18 సముద్రదారా స్సంప్రాప్తాః క్రవ్యాదాఃక్షుధితా భృశం | త్వయైతేషాం పరా తృప్తిః వృతాద్య రణమూర్దని || 19 నానా విధాని రూపాణి పశ్య ! క్రవ్య భూజాం రణ | కేచిత్ స్థూలాః కృశాః కేచిత్ ప్రాంశవో లఘవో೭పరే || 20 లంబ భ్రూజఠరాః కేచిత్ తథా చిపిటనాసికాః వృత్తాక్షః కేకరాక్షాశ్చ దంతురాః సువిభీషణాః || 21 తథా చైవోర్ధ్వరోమాణో మహాదంష్ట్రా మహాముఖాః | పురస్తాత్ పార్శ్వయో ర్ఘోరాః పశ్చా దంగదయోః పరే || 22 నానా విధానాం సత్వానం సదృశైశ్చ తథా ననైః | నానావేషధరా రౌద్రా నానా వికృత దర్శనాః || 23 సింహ చర్మాం బర ధరాః వ్యాఘ్ర చర్మాం బరా స్తథా | ఆహూయన్తే దశ న్త్యన్యే హరన్త్యన్యే ೭ సృగుత్తమమ్ || 24 అన్యే స్కంధం సమారోప్య మాంసం రక్తం తదాగమన్ | రక్తా పగాసు క్రీడన్తి త్వత్కృతాసు యథా సుఖమ్ || 25 స్నపయన్తి రుధిరై శ్చా೭న్యే పాయయన్తి పరే೭ సృజమ్ | రక్తం కృత్వా కపోలేషు కృత్వోత్సంగే పునః పునః || 26 భార్యాభిశ్చ సహై వాన్యే పిబన్తి రుధిరం రణ| పాయ యన్తి తథైవా೭న్యే రామా రామానుజా స్వయమ్ || 27 భార్యా కరధృతే ష్వన్యే కపాలేషుపి బన్త్య సృక్ | కౌంజరేషు కపాలేషు పిజన్త్యన్యే ೭ సృగుల్బణాః || 28 శిశూన్ స్కంధగతాన్ కృత్వా తృప్తా నృత్యన్తి చాపరే | హస్త మాదాయ పత్నీనాం నృత్యన్త్యన్యే తథైవచ || 29 నృత్యన్త్యన్యే హసన్త్యన్యే వికృత్తైశ్చ తథా కరైః గాయన్త్యన్యే స్వపన్త్యన్యే కలహాయన్తి చాపరే || 30 కుణ పాంశ్చ తథైవా೭ న్యే త్యజన్త్యన్యే మహీతలే | అన్యాం శ్చా దాతు మిచ్ఛన్తి గృహ్ణన్తి చ తథా ೭ పరాన్ || 31 కుర్వన్తి కలహాం శ్చాన్యే కుణపార్థాయ కుత్సితాః | ఉత్కృత్య మాంసా న్యశ్నన్తి కేచిద్గా త్రైర్విభూషితాః || 32 భుక్త్వా చాస్థీని మజ్జాశ్చకేచి దశ్నన్తి రాఘవ | భరతస్య ప్రసాదేన తృప్తాఃస్మ ఇతి చాపరే || 33 పరస్పరం చ భాషన్తే పరం హర్షము పాగతాః | నిత్యం భవతు రాజ్ఞాంచ యుద్ధం వైరం నృశంసతా || 34 బలం సహాయాః పుష్టిశ్చ యేన తృప్యామహే వయం | ఏవ మేతే వాదన్తశ్చ ప్వరై శ్చ వివిధైర్జగుః || 35 రథం తథా೭న్యే వీక్షన్తే సస్నేహా భృశ దుర్‌దృశాః | ఏవం స భరతః శ్రీమాన్ మాతులేన ప్రదర్శితమ్ || 36 పశ్యన్ రణాజిరం ప్రాయా ద్యేన రాజగృహం పునః | సో೭ పశ్యన్నగదా భ్యాశే వాయవ్యాస్త్ర విహిమోతమ్ || 37 మాంసముదిను రాబందులు మొదలైనవి పీకికొని పల్లములకు లాగికొని పోగదలుచున్న నీ శరీరములతో నీనేల నీజనము బ్రతికియున్నారా? యనిపించుచున్నది బాణములు పెక్కు పేర్లు చెక్క్బడినవి యెటజూచినం దెగిపడియున్నవి. నరుకువడిన యోధుల చేతులంభీకికొని తినుచున్నవి చూడు మీపులుగులను. నీరపరాధుల నెందరనో రాజుల మట్టువెట్టిన యీ గంధర్వులు తొల్లి సేసిన పాపము యొక్క ఫలానుభవమునకు నీవు కారణమైనాడవు. మాంసలుబ్ధులై యక్ష రాక్షస పిశాచములు పీకికొని సగము కొన్ని స్థూలురు. కొందరు బక్కచిక్కినారు ఉన్నతులు పొట్టివాండ్రు కనుబొమలు కడుపులు వ్రేలాడవేసినారు. ఇరువైపుల తెగి బాజుబందులు భుజకీర్తులు పడియున్నవి. నానాజంతువులంబోలియున్నవి లొండొరులం బిల్చికొనుచున్నవి. కొరకుచున్నవి నవ్వుచున్నవి మంచి వెచ్చని రక్తమును ద్రాగుచున్నవి త్రాగించుచున్నవి స్త్రీ పిశాచములు యక్షరాక్షస్వవర్గము పుర్రెలలో రక్తమునింపి పురుష పిశాచములచే త్రాగించుచున్నవి. ఏనుగుకపాలములనిండ నింపి రక్తముందెగ త్రాగుచున్నవి. వికారముగ నవ్వుచున్నవి కుణపములకై కుమ్ములాడుచున్నవి. పీకిపీకినంజుడు ఆ స్థిమజ్జారసధాతువులందెగదిని యిది భరతస్వామి ప్రసాదమని తృప్తికొని గంతులు వేయుచున్నవి. ఒండొరులకుం జెప్పుచున్నవి. నిత్యమును రాజులకు యుద్ధములగుగాక! మనకడుపులునిండుగాక యనుచున్నవి. వివిధములగు అరుపులు కూతలు పెట్టుచున్నవి. కూలిన రథములోనికి పైకినెగిరి చూచుచున్నవి. సైన్యంతత్పార్థి వేంద్రాణాం వ్రజన్తం సమరా దిమమ్ | దృష్ట్వా తే భరతం సర్వే రణ రేణు సముక్షితమ్ || 38 సంగ్రామే జయినం వీర మభ్యనందన్త పార్థివాః | స సమేత్య మహాభాగైః పరిష్వజ్య చ పార్థివాన్ || సాంత్వయిత్వాచ దర్మాత్మా శిబిరాణఙ వ్యసర్జయత్ || 39 తత స్స తాం మాతుల రాజధానీం ప్రహృష్ట యోధార్యజనాభిరామామ్ | వివేశ రాత్రౌ రఘువంశనాధః సంస్తూయమానః స్తుతిభిర్నృసింహైః || 40 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రణభూమి వర్ణనం నామ నప్త షష్ట్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః. ఇట్లు మాతులుడు చూపిన రణరంగణముం గనుచు రాజగృహమునకు జనెను. ఆ నగర ప్రాంతమున వాయవ్యాస్త్రమున నెగిరిపడి మూర్చపడి తెలివివచ్చిన గంధర్వ సైనికులను రాజులను భరతుడు సూచెను. వారును రణధూళిగ్రమ్మిన భరతునిం జయమంది మరలిన వీరునిగని అభినందంచిరి. వారితో నతండును గూడికొని వారింగౌగలించుకొని యాధర్మ ప్రభువువారి ననునయించి కారివారి శిబిరములకంపెను. అవ్వల నత్యానంద భరితులైన యోధులతో ఆర్యులతో (పూజ్యులు పెద్దలునైన వారితో) నతిరమ్యమయిన మేనమామాగారి రాజధాని నారాత్రి మహానుభావులచే గొనియాడబడుచు రఘువంశనాథు డతడు ప్రవేశించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున రణభూమివర్ణనమను రెండువందల యదువది యేడవ యధ్యాయము రెండువందల ఆరువదిఎనిమిదవ అధ్యాయము - గంధర్వస్త్రీవిలాపము తస్యాం రాత్ర్యాం వ్యతీ తాయాం గంధర్వ నగరాజ్జనాః | గంధర్వ పుత్ర దారా శ్చ రాజపత్న్యస్తథైవచ || 1 రణాజిరంతు సంప్రాప్య రురుదుర్భృశదుఃఖితాః | అహో కృతాన్తో బలవాన్ యేన నోబలదర్పితాః || 2 అజేయాః సురసంఘానాం సంగ్రామే వినిపాతితాః | నా తి భారో೭స్తి దైవస్య నా ೭ శక్యం తస్య విద్యతే || 3 యేన నాగాయుత ప్రాణా గందర్వ తనయా హతాః | తేపురా శయనీయేఘ పరార్ద్యేషు మదోత్కటాః || 4 న నిద్రా మభిగచ్ఛన్తి శేరతే తే೭ద్య భూతలే | తాళవృంతాని లైర్యేతు వరస్త్రీభిశ్చ వీజితాః || 5 వీజ్యన్తే పతితా స్తే೭ద్య గృధ్ర వత్సై ర్మహీతలే | వరార్ధ్య చందనాక్తాంగా యే విరేజు స్సమాగతాః || 6 నరాజన్తే೭ద్య తే సర్వే శోణితాక్తా మహీతలే | ఆ లింగ్య సుషుపుః పూర్వం వరోరు జఘనాః స్త్రియః || 7 యే తే ೭ద్య భూమి మాలింగ్య దుఃఖశయ్యాసు శేరతే | హా రాజన్ ! దేవ దర్పఘ్న ! హా రాజన్ ! భృత్య వత్సల! హా రాజన్ ! చారు సర్వాంగ ! హా రాజన్ ! సుత వత్సల ! | బాహు చ్ఛాయాముపాశ్రిత్య వయం తస్య జనేశ్వర ః నిర్భయాః దేవ దైత్యా నాం నివత్స్యామో యథా సుఖమ్ | సంపూర్ణ చంద్ర వదనం పుత్ర కోటిభి రావృతమ్ || 10 విషమస్థమితో దృష్ట్వా యాస్యామో యమ సాదనమ్ | సభాస్థం త్వా మపశ్యన్తో యాస్యామో యమసాదనమ్ || 11 ఏవం జనేతు శోకార్తే కరుణం విలప త్యథ ! | గంధర్వ రాజ పుత్రాణౄం పత్న్యస్తాః సుమనోహరాః || 12 తతస్తా దుఃఖ శోకర్తాః కారుణ్య మహతి స్థితాః | మార్కండేయుడనియె. ఆ రాత్రి గడచి గంధర్వనగరమునుండి జనులు గంధర్వుల భార్యలు కొడుకులును రాజభార్యలును రణాంగణమునకు వచ్చి మిగులు దుఃఖించి యేడ్చిరి. ఆహా! కృతాంతుడెంత బలవంతుడు బలగర్వితులు సురలకేని అజేయులైన మావారందరు గూల్పబడినారు దైవమునకు మిక్కిలి బరువులేదు చేతగాని పనిలేదు. వేలకొలది యేనుగుల ప్రాణములు గంధర్వ కుమారులను గూల్చినాడు ఇంతమున్ను హంసతూలికాతల్పములందేని నిదురపట్టక కొట్టుకొనుమతోద్ధతు లీకటికనేల నద్రివోయినారు. ఎవ్వరు సుందరస్త్రీలు తాళవృంతములూని వీనబడినవారిప్పుడు గూలిగ్రద్దలరెక్కలచే వీవబడుచున్నారు. మంచి గంధములు మేనులబూసికొని యింతమున్ను సొంపుగుల్కిరి వారిపుడు రక్తముపూసికొని నేలంబడినారు చక్కని యూరువులు విశాల జఘనములునుంగల యంగనలం గౌగిలించికొని నిదురించిన వారిపుడు భూమిం గౌగిలించుకొని దుఃఖశయ్యలం బడుకొన్నారు. అయ్యె అయ్యె పలు రాజల దేవతల దర్పమణచినవాడ! భృత్యులయెడ వాత్సల్యములగలవాడ! సూతవత్సల ఎవ్వని బాహువులనీడు నేమింక దేవదైత్యులకు జడియక హాయిగ బ్రతుకుదుము. అయ్యయ్యె! సర్వాంగసుందర! ప్రభూ! సూతవత్సల నిండుచందురునిబోలలు నెమ్మొగము గ్రద్ధరెక్కల యీకలంగప్పువడినది. ఈ విమస్థితిచూచి మేమింక యమమందిరమునకు బోవుచున్నాము. కొలువుదీరి కూర్చుండు నిన్ను జూడక యమునింటికేగవలసినవారమైనాము. ఇట్లు జనులెల్ల శోకార్తులై యేడ్చిరి. గంధర్వ కుమారుల భార్యలు మిక్కిలి యందగత్తెలు శోకార్తలై యేడ్చి పరమదయనీయస్థితికివచ్చిరి. భర్తారం శిరసా హీనం కాచిద్బాహువినాకృతమ్ || 13 ద్విధా కృతం తథైవాన్యా కాచి త్ర్కవ్యాద భక్షితమ్ | దృష్ట్వా రురోచ దుఃఖార్తా కాచిన్నాసాదయత్యపి || 14 కుణపేషు స్థలంత్యస్తాః బభ్రము స్తత్ర దుఃఖితాః | ఉరాంసి పాణి భిర్ఘ్నంత్యో లూనయంత్య శ్శిరో రుహాన్ || 15 నావాప యాసాం భవనే వురా సూర్యో೭పి దర్శనమ్ | దుఃఖితా ముక్తకేశాస్తాళః జనస్సర్వో೭పి పశ్యతి || 16 పతన్త్యు పరి భర్తౄ ణాం సమాలింగంతి చాపరాః | రుదన్త్యన్యా స్తథా రాజన్ ! ఉత్కృత్య మధురస్వరాః || 17 రుదన్తీనాం తథా తాసాం రాజపత్న్యస్సు దుఃఖితాః |రురుదుః కరుణం రాజన్! విప్రకీర్ణ శిరోరుహాః ||18 హా కాన్త ! హా మహారాజ : హా మహాజన వల్లభ ! హా సురేశ్వర దర్పఘ్న ః హా శశాంక నిభానన || 19 హే భర్తః ! కేన తే బుద్ధిః మరణంప్రతి గాహితా! హా రాజన్! త్వ మిమాం భూమిం సమాలింగ్య ప్రయావివ || 20 వసుధాం ప్రియ బాహుభ్యాం సమాజే కింస లజ్జసే | కిం శేషే పురతో೭ స్మాకం విశేషణ రజస్వలామ్ || 21 ఖే చర స్థో ೭ శి తే రాజన్‌ః సతతం వసుధా ప్రియా | నాడాయన వచ స్తద్ధి త్వయా ೭నర్థాయ న శ్రుతమ్ || 22 ప్రియా తే యద్య పి మహీ తథా೭ ప్యస్మాసు పార్థివ ! యుక్తం హి కర్తుం దాక్షిణ్యం యతస్త్వం సత్కులోద్భవః || 23 అతర్కిత ప్రయాణన త్వయాస్మ పరి పీడితాః | వాజ్హాత్రేణ కురుష్వా೭ స్మాన్ సాంత్వనం రిపు సూదన! 24 రాజ్ఞోన యుక్తం శయనం వివృతే వసుధాతలే | తస్మా దుత్తిష్ఠ ! రాజేన్ద్ర! శయనం భజ! మాచిరమ్ | 25 నున్నా వయం మహారాజ ! మదనేన మదేన చ | కంఠే ను కం గ్రహీ ష్యామ స్త్వయా హీనా జనేశ్వర: 26 కృతాన్తో బలవాన్ రాజన్ ! యేనా కృష్యాద్య నీయసే! నాడాయనస్య వచనం త్వయా యది కృతం భ##వేత్ || 27 నా೭ భవిష్య ద్వియోగస్తు త్వయా ೭స్మాకం జనాధిప ! నిశ్చేష్టాంగః కథం ! త్వద్య రాజన్! స్వపిషి భూతలే|| 28 ఉత్తాయ వీర ! చాస్మాకం పరిష్వజ్య న చుంబసేః విజిత్య సమరే వీరాన్ హత్వా చ వసుధా ೭ ధి పాన్ || 29 కథ మేకేన యుద్దేత్వం మానుషేణ నిపాతితః | క్వతేవ పుః క్వతే తేజః క్వతేలక్ష్మీః క్వతే బలమ్ || 30 క్వతే ద్విమలం ఛత్రం క్వచతే వరచామరమ్ | క్వ తత్పీఠం చ శృఒంగారం క్వచతే తనయా విభో || 31 క్వసా వీతా క్వసాలక్ష్మీః క్వచతే వరవందినః | వర చామర ధారిణ్యః క్వచతాః పరమాంగానాః || 32 అద్యైవ స్మ స్త్వయా హీనాః అద్యేవ స్పృహయా మహే | అద్యైవ స్మరణీయ స్త్వం గతో೭సి జనవల్లభః 33 నూనం కాన్తతరః స్వర్గే రాజేర్ద్ర ప్రమదాజనః | యత్త్యక్త్యా స్వజనం తస్య రతి ర్బద్ధాత్రయా ೭నఘ|| 35 స్వచ్ఛంద చారిణా కేనమతిః శూర నిషేవితా | త్వయా ప్రార్థయతా లోకే యుద్దశ్రధ్ధా వివర్థితా || 34 వల్లభస్య జనస్యా೭స్యలాలితస్య త్వయా తథా | దీర్ఘ ప్రయాణ కర్తవ్యో వాజ్ఞాత్రేణా೭ ప్యను గ్రహః || 36 విసర్జయః జనం రాజన్‌ః క్రీడామ స్సహితాస్త్వయా | ఉద్యానేషు విచిత్రుషు వనే షూప వనే షు చ || 37 వయ మీర్ష్యాం నకురుమః సర్వలోకస్య పశ్యతః వజ్రసార మిదం నూనం హృదయం సుదృఢం కృతమ్ || 38 గతాసు మపి దృష్ట్వా త్వాం శతధా యన్న దీర్యతే | కర్పూర చందనా ర్ద్రాంగః మహార్హ శయనో చితః 39 విరాజసే న రాజేన్ద్రః రుధిరాక్తో మహీతలే | క్వతే భిన్న ఘటా నాగా స్తురాంగాః క్వచతే గజాః || 40 క్వతే యోధా గతా రాజన్ ః శక్ర విస్పర్దినో రణ సైన్యే మహతి తిష్ఠంతం సమదృష్ట్యైవ వేపథుస్తే దనుర్ధరమ్ || 41 కథం త్వామనయ ద్రాజన్‌ః పరలోకాయ రాఘవః | కృతాంత సమదృష్ఠ్యైవ వేపథుస్తే జనే శ్వరః 42 స కథం మానుషేణాతద్య సంగ్రామే వినిపాతితః | తద్వయం కిం కరిష్యామో నిరాశాస్తవ జీవితే || 43 నమే೭ స్తి కల్పో దృష్టిర్వామే నసో ర్దృష్టి సంగతిః | ఏవం విలపమానా స్తాఃశైలూష స్యతు యోషి తః || 44 ఆలింగ్యా లింగ్య తం రాజన్ ! నిపతన్తి మహీతతే | శిరాంసి చ వినిఘ్న న్తితాడయన్తి భుజాం స్తథా ||
45 పశ్యన్తి భూయ స్తం వీరం భూమావు త్క్రాన్తజీవితమ్ | దృష్ట్వా భూయ శ్చ నిః సంజ్ఞా నిపతన్తి మహీతలే ||
46 తాసాం రోదన శ##బ్దేన సమాక్రాంతం మహీతలమ్ | తాసా మాశ్వాసనం చక్రే విద్వాన్నాడా యనో ద్విజః ||
47 ఏతస్మి న్నేన కాలేతు తందేశ మపరాజితః | గంధర్వేంద్రః సమభ్యాగా ద్భరతేన ప్రచోదితః ||
48 స తత్థ్సాన మథా భ్యేత్య జనం సర్వం యథా విధి | ఆశ్వాస యా మాస తదా రాజా చిత్రరథః శ##నైః ||
49 సత్కారం లంభ యా మాస శైలూషం తనయైస్సహ | రాజ్ఞా చిత్ర రథేనాథ గంధర్వాస్తే ప్రదితాః ||
50 రాజ్ఞ శ్ఛక్రుశ్చితాం కాష్ఠైః సుశుషై#్క ర్బహు భిస్తదా | పుత్రాణా మస్య సర్వేషాం యోధానా మప్యశేషతః ||
50 చందనా గురుకాష్ఠైస్తే తథా కాలీయకస్యతు ||
51 చితాం గంధైశ్చ తైలైశ్చ ప్రజ్వాల్య చ ఘృతేన తే | సంస్కారయిత్వా తాన్ సర్వాన్ నగరాయ వవ్రజుః ||
52 గంధర్వరాజ వచసా తత స్సర్వో మహాజనః | నాడాయనం పురస్కృత్య ప్రయ¸° గంధ మాదనమ్ ||
53 నివేశం కృతనాం స్తత్ర రామ పర్వత రోధసి | కృత్వా నివేశనం తత్ర సర్వే చిత్ర రథాజ్ఞయా || సుఖ మూషు ర్మహా రాజ పాల్య మానామహాత్మనా ||
54 బభూవ తత్రాపి పుర ప్రధానే శైలూష పౌత్రస్తు జనస్య రాజన్! | గంధర్వ రాజస్తు చకార తస్య సంరక్షణం రాఘవ ముఖ్య వాక్యాత్ ||
55 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే గంధర్వస్త్రీ విలాపో నామ అష్ట షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః. ఒక్కతె తల తెగి మొండెమైనవాని నింకొకతె బాహువులు తెగిపోయినవానిని రెండుతునకలయిన వాని వేరొకతె గ్రద్దలు రాబందులు పీకితొని తినువాని నింకొకతెయుం జూచి హోరుమని యేడ్చిరి. ఒకతె చూడలేక దరికే రాలేదయ్యె. మరికొందరా కుణపముల గుట్టలం దొక్కికొని దొట్రువడుచు పరిభ్రమించిరి. చేతుల రొమ్ములం బాదుకొనుచు జుట్టు పీకుకొనుచు ఎండకన్నె రుగని యంతఃపుర స్త్రీలు జుట్టు విరబోసికొని యందరుచూడ నేడ్చిరి. హా కాంత హా మహారాజ హా మహాజనవల్లభ సురేశ్వర దర్ప భంజన! చంద్రనిభానన ! మగడా! నీ బుద్ధిని చావువంక ద్రిప్పినదెవరు? హా! రాజా! ప్రేయసినట్లే నేలం గౌగలించుకొంటివే! ఓప్రియ వల్లభ! బాహువలతో ఇట్లీయవనిం గౌగలించుకొనుటకు సిగ్గుపడవేమి? ఈ ధరణి రజస్వలగదా! (ధూళిగ్రమ్మినదియని శ్లేష) పరుండుట ఛీ ఛీ! మా యెదుటనేనా యీపని చేయుట! ఖేచరుడవయ్యు (గనసంవాసి-దేవతామూర్తి) నీకెల్లతరి నీధా త్రిపైననే మోహమా? పాపము! నాడాయనుడు చెప్పినాడు. కాని యీ కష్టము కనిపెట్టుకొనియున్నందున నీవది వినిపించుకొనవైతివి. నీ కీ ధారుణి ప్రియురాలైన కానిమ్ము! అయినను నీవు సత్కులప్రసూతుడవు గావున మాయెడగూడ దాక్షిణ్యము సూప న్యాయముగదా! (దాక్షిణ్యము=దక్షిణనాయకత్వము-అనేకమంది నాయకులున్న నందరియందు సమప్రీతి సూపువాడు దక్షిణ నాయకుడు) అనుకోని యీ నీ ప్రయాణముచే (స్వర్గయాత్రచే) మేము కష్టాలపాలుగావింపబడినాము. ఒ శత్రునాశన! మాటమాత్రముననేని మమ్మోదార్పుము. బట్టబయల రాజు పడక యిది బాగుండదు. కావున లేలెమ్ము. జాగుసేయకు. తల్పమందు పరుండుము. మేము మదనునిచే (మన్మథునిచే) మదముచేతను గూడ (¸°వన సౌందర్యాది మదముచేత) ప్రేరితలము. నిన్ను బాసి యెవ్వని కంఠ గ్రహణ మొనరింతుము? కృతాంతుడు (సర్వ జీవుల నంతము సేయువాడు) బలవంతుడు ప్రభూ! నిన్ను లాగికొని యముడు పోయినాడు. నాడాయనుని మాట నీవు వినిపించుకొని యుంటివేని నీతోడి వియోగము నీకిది వచ్చెడిది కాదు. అయ్యో! మేను కదలక నేల నీవు నిదురించితివి. లేచి ఓ వీర! మమ్ము కౌగలించి ముద్దువెట్టుకొనవా? సమరమందు వీరులంగెలిచి వసుధాధిపతులం గూల్చియు నీ వొక్కనిచే ఒక్క మానమాత్రునిచే నెట్లు పడితివి. నీ మేనెక్కడ. నీ తేజస్సెక్కడ (తేజస్సు=ప్రతాపము). ఆ నీసిరి యెక్కడ? నీ బలమెక్కడ? నీయా శ్వేతచ్ఛత్ర మేమైనది? నీయా చామర మెందున్నది? ఆ పీఠమేది? ఆ శృంగారమేది? నీ కొడుకు లెక్కడ? ఆ విలాసమేది? ఆ లక్ష్మీకళ##యేది? ఆ వందిమాగధు లతిశ్రేష్ఠులేమైరి? నీకు జామరములు వీచు నాపరమరమణీయ మూర్తులారమణులేరి? ఇప్పడే నీకెడ బడితిమి: ఇప్పుడే నీకై మోహపడుచుంటిమి. ఇప్పుడే మాకు స్మరణీయుడవై పోయితివి. మాకు వల్లభుడవు సరియే. కాని సర్వజన వల్లభుడవు నీవు. స్వర్గ మందలి కాంతాజనము కాంత తరము కాబోలు! కాదేని నీ జనముం బాసి నీవా జనమునకై యేల (ప్రీతి) ముచ్చట బడుదువు? స్వేచ్ఛా సంచారివి గదా నీవు (సర్వ స్వతంత్రుడవు) నీ వేల యీ బుద్ధి (తలపు) గొంటివి. ఎవ్వని ప్రార్థనముచే నీకీ యుద్ధముపై శ్రద్ధ పెరిగినది? నీచే లాలింపబడ నీ కత్యంత ప్రియమైన యీ జనమును నీయీ దీర్ఝ ప్రయాణమందు జేయవలసిన దేమో మాటమాత్రమైన యనుగ్రహమైన నీవు చేయవలసినది. మా జనమును విడిచి రాజా! మేముద్యానములందు విచిత్ర వనములందు నుపవనములందును నీతో మేమాడు కొందుము. ఎల్లలోకము గనుగొన్న నించు కేని యీర్ష్య గొనము. నిశ్చయముగ మా గుండెలు వజ్రసారములు (వజ్రమంత) దృఢములయియుండును. అటులేగాని ప్రాణముల వాసిన నిన్ను జూచియు నూరు వ్రక్కలు గావలసినవి గాలేదు. కర్పూర చంద నార్ద్ర శరీర! హంసతూలికాతల్పశయన రక్తమనందడిసి పుడమిపై సొంపుదఱిగి యున్నావు. ఘటల విడి (బెదరి మందం దప్పి చెదరి) నీ యేనుగు లెటెవోయినవి. తురంగము లెక్కడ? గజములెట? ఇంద్రునికి బ్రతి స్పర్ధులైన నీయోధు లెటువోయిరి? మహాసైన్యమందు నిలిచిన ఖడ్గబాణములు దాల్చి నిన్ను రాఘవుడెట్లు పరలోకమందించెను? యముని సమదృష్టి చేతనే నీకువణకు పుట్ట వలసినది. అట్టి నీ విపుడు మనుష్య మాత్రునిచే సంగ్రామ మందీల్గితివి. అందుచే నీవారమైన మేమిపుడు జీవితముపై నిరాశులమైనా మేమి చేయుదుము? నమేస్తి కల్పో దృష్టిర్వా మేన సోర్దృష్టి సంగతిః అని యిట్లు విలపించి శైలూషుని స్త్రీలు వానిం గౌగలించి కౌగలించి యవని తలమున బడిపోయిరి. తలలు బాదుకొనిరి జీవితము లేచిపోయిన యతని నూరక చూచు చుండిరి. చూచిచూచి మూర్ఛవడిరి. ధరణితల మెల్ల రోదన శబ్దముచే నిండిపోయెను. తెలిసిన ద్విజుడు గాన నాడాయనుడు వారినోదార్పెను. ఇదే సమయమున బరతుని ప్రేరణచే గంధర్వరాజు (చిత్రరథుడు) ఆచోటికివచ్చి యా జనము నెల్ల నోదార్చెను. శైలూషునికి వాని కొడుకులచే యథావిధి సంస్కారము సేయించెను. వారు వానికి కాష్ఠము పేర్చి వారి కొడుకులకు సర్వయోధులకు చందనా గురుకాలీయకాదికాష్ఠములచే గంధములచే తైలములచే నేతిచే బ్రజ్వలింపజేసి వారందరికి సంస్కారమొనరించి నగరమునకేగిరి. గంధర్వరాజు శైలూషుడు చివరిదశలో జెప్పినమాటననుసరించి గంధర్వమహాజనమెల్ల నాడా యనునిమున్నిడుకొని గంధమాదనమునకుంజనిరి. చిత్రరథాజ్ఞతో గంధర్వులు రామ పర్వతముపై నివేశనమొనరించియాతనిచేపాలితులై యటసుఖముగా వసించిరి. అక్కడగూడ శైలూషుని పౌత్రుడా జనమునకు ప్రభువై భరతునిమాటంబట్టి వారి సంరక్షణము సేసెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణమందు ప్రథమఖండమున గంధర్వస్త్రీ విలాప మను రెండువందలఅరువదియెనిమిదవ అధ్యాయము.