Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఆరువదిమూడవ అధ్యాయము - చతుర్థ దివసయుద్ధవర్ణనము మార్కండేయః - చతుర్థే೭హని సంప్రాప్తే కృత పూర్వాహ్ని కక్రియః శైలూషస్తు వినిష్క్రమ్య గంధర్వా నిదమబ్రవీత్ |1 యోధయధ్వం రణ సర్వే భరతం రిపు మాగతమ్ | అహం మధ్యే ప్రవేక్ష్యామి భరతస్య బలార్ణవమ్ || 2 తత్ర తాన్ ఘాతయిష్యామి భరతస్యాను యాయినః | ఏతదుక్తే తథే త్యుక్త్వా సంప్రతీక్షన్త రాఘవమ్ || 3 భరతో೭పి మహాతేజాః రథేనై కేన దృశ్యతే | భరత స్యాను సై#్యన్యంచ భూభుజాం సమపద్యత || 4 త త్సైన్యం ప్రావిశ ద్ఘోరం శైలూషో రణ దర్పితం | చకార కదనం తత్ర నరవారణ వాజినామ్ || 5 గంధర్వ సైన్యే చ తథా భరతో೭పి శరోత్కరైః | చకార కదనం ఘోరం వైశ్వానర సమప్రభైః || 6 రాజానం కోష్ఠకే కృత్వా శైలూషం వివిధైశ్శరైః ఛాదయామాసు రవ్యగ్రా మేఘా ఇవ మహీధరమ్ || 7 గోవాసనస్తు సప్తత్యా చిచ్ఛేద సమరే శ##రైః ద్విజిహ్వశ్చ త్రిసప్తత్యా రాజా దాశేరక్తస్తు యః || 8 సుబాహుస్తం చతుష్షష్ట్వా దశభి స్తం సుయోధనః | కుమార స్సప్త సప్తత్యా శ్రేణిమాన్ దశభి స్త్రిభిః || 9 శూరః షష్ట్వా చ నిర్భిద్య బలబంధుః శ తేన చ | ద్వావిం శత్యా తతస్త క్షః పుష్కరో నవభి శ్శరైః 10 శ##తేన విజయ శ్చైనం జయో జిత్వా త్రిభి శ్శరైః | ప్రత్య విధ్యత తాన్ సర్వాన్ శైలూషో దశభి శ్శరైః || 11 నృత్యన్నివ రథో పస్థే మహాబల పరాక్రమః | ధను శ్చిచ్ఛేద భ##ల్లేన సుబాహోః సుమహాత్మనః || 12 హయాం శ్చ కార నిర్జీవాం స్తథై వాంశు మతోనృప | పద్మంరథస్థం చిచ్ఛేద చిహ్నం గోవాస నస్యతు || 13 సుయోధన రథాత్ క్షప్రం పాతయా మాస సారథిమ్ | బలబంధో స్తథా ఛత్రం పాతయా మాస యాదవః 14 తథా೭న్యాన్ వి సు ఖాం శ్చ క్రే శ##రైః స్సన్నత పర్వభిః | తతస్త స్య క్షురప్రేణ ధను శ్చి చ్ఛేద పుష్కరః || 15 అథా೭న్యం చాప మాదాయ పుష్కరస్య రణ రుషా | చకార తురగాన్ సర్వాన్ నిర్జీవాన్ సమరప్రియః || 16 పుష్కర శ్చ సమారుహ్య తక్షస్య రథ ముత్తమమ్ | వవర్ష శర వర్షేణ శర వర్షేణ శైలూషం రణ మూర్ధని || 17 శైలూషో7పి జఘానా శ్వాన్ రథా త్తక్షస్య యాదవ | విరథౌ తౌ గదాపాణీ భ్రాతరౌ యుద్ధ దుర్మదౌ || 18 శైలూషేణ సమారూఢౌ గదా హస్తౌ తరస్వినౌ | అభ్యాశే భ్రాతరౌ దృష్ట్వా జగామా೭ దర్శనం తతః || 19 మాయావీ స తు గంధర్వో రథముత్సృజ్య యాదవ | శూన్యం దృష్ట్వా రథోపస్థం విలక్షౌ భాతరౌ తదా || 20 ఆదిత్యే೭ స్త మను ప్రాప్తే విని వృత్తౌ రణా జిరాత్ | భరతో೭పి తథా కృత్వా గంధర్వాణాం మహాహనమ్ | న్యవర్తత మహారాజ | సంధ్యా కాలే రణాజిరాత్ || 21 గత్వైవ రాజన్ | సచ రాజువేశ్మ తత్రోష్య రాత్రిం రఘువంశనాథః | నిశావసానే పునరేవబుద్ధ శ్చ కార యుద్ధం సహితోనృ వీరైః || ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే చతుర్థ దివస యుద్ధ వర్ణనం నామ త్రిషష్ట్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః మార్కడేయుడనియె. నాల్గవరోజున శైలూషుడు పూర్వాహ్ణము నందలి క్రియలు జరిపికొని వెలికివచ్చి గంధర్వులంగని యిట్లనియె. మీరు భరతునితో నందరుం గలిసికొని పోరుడు. నేను సేనాసముద్రము రణమద్యమందు బ్రవేశించి భరతుని యనుయాయులను గూల్చెదననియె. వారు భరతుని నెదురుకొన నెదురు చూచిరి. భరతు డొక్క రథమునెక్కి యెదుట గనబడెను. ఆయన వెంటరాజసైన్యములు నడచెను. శైలూషుడు ఘోరమైన సేనను జూచి చతురంగ బలములతో దలపడెను. మేఘములు పర్వతముల నట్లు గ్రమ్మి భరత బలములు శైలూషునొక మూలకుదరిమి శర వర్షము గురిపించిరి. గోవాసనుడు డెబ్బది ద్విజిహ్వుడు (దాశేరకుడు) సుబాహువఱువదినాల్గు సయోధనుడు పది కూమారుడు డెబ్బదియేడు శ్రేణిమంతుడు ముప్పది శూరుడరునది బలబంధువు నూరు తక్షుడిరువదిరెండు పుష్కరుడు తొమ్మిది విజయుడు నూరు జయుడ మూడు శైలూషుడు పదియును బాణముల భరత సైన్యముం గొట్టిరి. తేఱు మొగసాల (ముందు) నృత్యము సేయుచున్నట్లుండి భల్లముచే (ఈటె) సుబాహువు ధనువుం ద్రెంచెను. అంశమంతుని గుఱ్ఱములం గూల్చెను. గోవాసనుని రథమందున్న పద్మము గుర్తును గొట్టివేసెను. సుయోధన సారథింబడ ద్రోసెను. బలబంధుని గొడుగు పడ వేసెను. మరియుంగల యోధలను బెడమొగము పెట్టించెను. పుష్కరుడా మీద వాని ధనుస్సు ఛేదించెను. బలబంధు డింకొక విల్లు గొని పుష్కరుని గుఱ్ఱములం గత ప్రాణములం బొనరించెను. పుష్కరుడు తక్షని రథమెక్కి శైలూషునిపైనమ్ముల జడివానగురియించెను. శైలూషుడు పుష్కరుని తేరి గుఱ్ఱములం గూల్చెను. ఇద్దరును విరథులై గదలుగొనిన తక్ష పుష్కరులను నయ్యన్నదమ్ములపై శైలూషు డెక్కెను. ఎక్కినంతలోనే మాయమయ్యెను. మాయావి వాడదృశ్యు డగుట చూచి వారిద్దరు వెఱగుపడి సూర్యాస్తమయ మయినంతట రణరంగము నుండి మఱలి పోయిరి. భరతుడును నవ్విధమున గంధర్వులతో మహారణముసేసి సంధ్యా సమయమైనదని యట నుండి వెనుదిరగెను. రాజ శిబిరమున కేగి యతడారేయి నటనుండి వేకువ లేచి నర వీరులతో గూడ యుద్ధము సేసెను. ఇదిశ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున చతుర్థదివసయుద్ధవర్ణనమను రెండువందల యరువదిమూడవ అధ్యాయము.