Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఆరువదినాల్గవ అధ్యాయము - పంచమదివసయుధ్ధవర్ణనము

మార్కండేయః - తతోహ్ని పంచమే ప్రాప్తే భరతో యుద్ధ దుర్మదః | కల్యముత్థాయ రాజేంద్ర | కృత పూర్వాహ్ణిక క్రియః || 1

జగామ హన్తుం గంధర్వాన్‌ బలముత్సృజ్య పృష్ఠతః | శైలూషోపి రణం త్యక్త్వా నరేంద్ర నిధనేచ్ఛయా || 2

జగామైక రథైనైవ రణకర్మ విశారదః | తయోరాసీ న్మహాఘోరః సంప్రహార స్సుదారుణః || 3

దేవాసుర రణ ప్రఖ్యః సూర్య స్యోదయనం ప్రతి | తయోస్తు యుధ్యతో రాజన్‌ గంధర్వాణాం బలార్ణవమ్‌ || 4

చాదయా మాస భరతః శ##రై స్సన్నత పర్వభిః | తచ్చ రాజ్ఞా ముదీర్ణానాం బలం సాగర సన్నిభమ్‌ || 5

చాదయా మాస గంధర్వః శ##రై రాశీ విషో పమైః బలమేఘే వినిర్యాతే శర వృష్ఠి సుదారుణ || 6

ధారయేతాం మమారాజ! శైలూష భరతా వుభౌ | అన్తరిక్షే శరవ్రాతాం శ్చిచ్ఛిదతు రరిం దమౌ || 7

సైన్యయో శ్చ తథా చక్రుః కదనం ఘోర దర్శనమ్‌ | తయోశ్చా పచ్యుతై ర్బాణౖః నిపాతి త హయద్విపైః || 8

రణ విసస్రు ర్బూపాల ! స్రవంత్యోరక్త నిమ్నగాః | వహన్త్యో నరదేహాని యక్షరాక్షస సేవితాః || 9

తాభ్యాం ముక్తైః శరవ్రాతై ర్గగనే సూర్యరశ్మయః | న ప్రాకాశంత రాజేంద్ర | ఏకచ్ఛాయే నభఃస్థలే | సైనికాన్‌ ఘాత యన్తౌ తౌ రక్షమాణౌ చ సారథీ | 10

ఛిందమానౌ రణ వీరౌ పరముక్తాం స్తథా యుధాన్‌ | జనయా మా సతుర్వీరౌ సురాణా మపి విస్మయమ్‌ || 11

తద్యుద్ధం పూజయా మాస పుష్ప వర్షేణ వాసవః | తౌ ప్రబుద్దౌ దినం సర్వం వరివాణ ధనుర్ధరౌ || 12

నాసీ దేకతర స్యాపి రణ తస్మిన్‌ పరాజయః | తతోస్తం భగవ త్యర్కే ప్రయాతే పృథివీ పతే:

పరస్పర స్యాను మతే శిబిరాయైవ జగ్మతుః || 13

అథోష్య రాత్రిం గృమ యోః ప్రవిష్టౌ రాత్ర్యన్త మాసాద్య తదా రణాయ |

భూయో మహేంద్రోపమ: సంప్రయాతౌ ప్రహర్ష యన్తౌ స్వబలాని వీరౌ || 14

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే భరత శైలూషయుద్ధే పంచమ దివస యుద్ధ వర్ణనం నామ చతుష్షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః

మార్కండేయుడనియె. అయిదవరోజున భరతుడు వేకువనేలేచి ప్రాతరనుష్ఠానము గావించి గంధర్వులపైకి చనెను. అయ్యిర్వురకు దారుణసమరమయ్యెను. భరతుడు తీవ్రబాణములగురియ గంధర్వుడును సర్పములట్టి యలుగులను విసరెను. నింగినే యా బాణములను ద్రెంచిరి ఘోర సమరమున రక్తపుటేరు ప్రవహించెను. అందనేకనరశరీరములు దేలిపోయెను. ఆవిసిరిన బాణములచే సూర్యరశ్మి గప్పుపడిపోయెను. సైనికులనొకవంక గూల్చుచు సారథుల నొకవంక గాపాడుకొనుచు నరివిముక్త శరవ్రాతమును శత్రుకవచములంజెండాడుచు నిద్దరు నొకరి కొకరు దీసిపోని మహారణమునొనరించిరి. ఆదిచూచి వేల్పులుంగూడ యచ్చెరువు వడిరి. వాసవుడా సంగరమును బూలవానం బూజించెను. అంతట రవిగుంక య్రెండొరుల యనుమతితో శిబిరములకుం జనిరి. రేయితుద మరల తమతమ బలములం బ్రహర్షింపజేయుచు ననికి నడచిరి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పంచమదివ సయుద్దవర్ణనమను రెండువందలయరువది నాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters