Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల అరువదిఐదవ అధ్యాయము- షష్ఠదివసయుద్ధము

మార్కండేయః - తతస్తు షష్ఠే సంప్రాప్తే ది వసేభూరి దక్షిణ | చక్రతు స్సమరం వీరౌ శైలూష భరతా వుభౌ || 1

ససైన్యౌ పృథివీ పాల! శ##రై రాశీ విషోవమైః | శైలూషేణ సమాసక్తో భరతో వాహినీ వతిః ||2

సూర్యరశ్మేశ్శరేణా జౌ శిరశ్చిచ్ఛేద శత్రుహా | సూర్య రశ్మిం రణ హత్వా ఏకలవ్యం మహారథమ్‌ || 3

శ##రేణ పాతయా మాస రథోపస్థా దరిందమమ్‌ | గంధర్వ నృపతి ర్దృష్ట్వా ప్రధానౌ తౌసుతౌహతౌ || 4

శక్త్యా బిభేద విజయం తథా చక్రేణ పుష్కరమ్‌ | తోమరేణ తథా తక్షం గదయా చ సుయోధనమ్‌ || 5

వివశుస్తే రథో పస్థం విసంజ్ఞాః సర్వ ఏవతు | నియంతృ భి శ్చ సమరా త్సర్వ వినా పవాహితాః || 6

తతస్తు భరతః క్రుద్ద శ్చతుర్భి స్తస్య సాయకైః | చకార యుధి నిర్జీవాం స్తు ర గాశ్చైవ యాదవ ః 7

చకార చ శరవ్రాతై ర్విముఖీ కృత విక్రమమ్‌ | తతోధైర్యేణ సందార్య శరవేగం మహాత్మనః || 8

ఆరురోహ రథం శీఘ్రం సుసన్నధ్ధో మహాబలః | రథ మారుహ్య వివ్యాథ శ##రేణానత పర్వణా || 9

భరతో హృదయే గాఢం ముమోహ స చ తాడితః | ఏతస్మి న్నంతరే ముక్తో హాహాకార స్సురాసురైః || 10

అప్రహృష్టైః ప్రహృష్టై శ్చ విమూఢే రఘునందనే | హాహాకారేణ మహతా లబ్ధ సంజ్ఞః స రాఘవః || 11

ఆకృష్య బలవచ్చాపం శైలూషస్య మహద్ధనుః | ద్విధా చకార రాజేంద్ర! శైలూషం చాహనద్‌ భృశమ్‌ || 12

స చ్ఛిన్న ధన్వా వేగేన గదా మాదాయ సత్వరః | ప్రేషయా మాస ధర్మజ్ఞ! భరతస్య మహాత్మనః || 13

ఆపతం తీం గదాం దృష్ట్వా భరతో రణమూర్ధని | ద్విదా చకార చక్రేణ సర్వ సైన్యస్య పశ్యతః || 14

తత స్స పరిఘం శీఘ్రం చిక్షేప భరతం ప్రతి | తమా పతన్తం చిచ్ఛేద చతుర్భి స్సాయకైర్దృఢమ్‌ || 15

తతోన్యధ్ధను రాదాయ సాయకా నేనక వింశతిం | చిక్షేప స మహారాజ! భరతస్య రథం ప్రతి || 16

ఛిత్వా తాన్‌ భరతః సర్వాన వధీ త్తస్య సారథిమ్‌ | తథా చ చతురో వాహాన నయద్యమ సాదనమ్‌ || 17

శైలూషం విరథం దృష్ట్వా గంధర్వాణాం మహాచమూః | వవర్షాయుధ వర్షేణ మేఘో వృష్ట్యేవ పర్వతమ్‌ || 18

సమోహ యిత్వా భరతం మోక్షయా మాస పార్థివ! | మోక్షయిత్వాచ రాజానం గతే 7స్తం రవి మండలే|| 19

కృత్వా వహారం తుగతః శిబిరాయ నరాధిపః || 20

హత్వా రథే నాగరథా శ్వ యోధాన్‌ సంప్రాప్య మద్యే నిశితైః పృషత్కైః |

రఘుప్రవీరోపి గృహాయ యాతః | సంపూజ్య మానో భువి మాన వేంద్రైః || 21

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ శైలూష భరతయుద్ధే షష్ఠయుద్ధ దివసోనామ పంచషష్ట్యుత్తర ద్విశతతమో ధ్యాయః

మార్కండేయుడనియె. ఆఱవరోజు రాగానే భరత శైలూషులు తీవ్రరణముగావించిరి. శైలూషునితోడి పోరులో భరతుడు సూర్యరశ్మియను గంధర్వు శిరము నరికెను. అటుపై నేకలవ్యుం గూల్చెను. గంధర్వుల రాజట్లు తనయిర్వురు కొడుకులు మడియుటగని విజయుని శక్తిచే చక్రముచే ఋష్కరునిం తోమరముతో తక్షుని గదచే సుయోధనునింగూల్చెను. వారందఱు తిలివిదప్పి రథము ముందఱనొఱగిరి. రథసారథులు వారిని రణభూమినుండి తలగించిరి. భరతుడపుడుగ్రుడై శైలూషుని నాల్గుగుఱ్ఱములంజంపెను. శరజాలమున శత్రువును జచ్చువడంజేసెను. అప్పుడు ధైర్యము గొని భరతుని బాణవేగము నోర్చుకొని గంధర్వపతి రథమెక్కి బాణము విసరెను. హృదయమున తగిలి భరతుడు మూర్ఛవోయెను. ఈ యెడ సురాసురులు హాహాకారములు సేసిరి. భరతుడు మూర్చనొందగ దిగులు పడిన సంతోషపడిన యిరువంకల హాహాకారములచే భరతుడు తిలివికొని రాఘవుడు ధనువు బలము కొలది నాకర్షించి శైలూషుని విల్లుని దునిమి వానిం గట్టిగ గొట్టెను. ధనువు తెగి వాడు గదంగొని భరతునిపైకి విసరెను. పైబడు నా గదంగని భరతుడు చక్రముచే దానిని రెండుగ ద్రుంచెను. ఆపై నతడు పరిఘయను నాయుదము విసర రగునందనుడు నాల్గమ్ములదాని వమ్మెనరించెను. ఆపై వేఱువింటి నందుకొని యిరువది యొక్క బాణములను భరత రథముపైకి విసరెను. వానింద్రెంచి వాని సారథిని భరతుడు గూల్చెను. వాని రథాశ్వములను యమనిలయమున కంపెను. శైలూషుని విరథుంగాగనుగొని గంధర్వసేన పర్వతముపై మేఘమట్లు శరవర్షము గురిసెను. భరతుడయ్యెడ మూర్చవోవ నతని వదలించికొని గంధర్వుడు మరలెను. సూర్యుడస్తమించెను. గంధర్వడు తన శిబిరమునకుంజనెను. రఘు ప్రవీరుడును మానవేంద్రుల మన్ననలందుకొనుచు తననివాసమునకుం జనియె.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున షష్ఠదివస యుద్ధవర్ణనమను లెండువందల ఆరువదిఐదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters