Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఆరువదిఆరవ అధ్యాయము - శైలూషవధ తతస్తు సప్తమే ప్రాప్తే దివసే యుద్ధ దుర్మదౌ | సమీయతు ర్మహాత్మానౌ శైలూష భరత వుభౌ || 1 తతస్తు భరతః ప్రాహ శైలూషం యుద్ద దుర్మదమ్ | ఆవయోః ప్రస్తుతం సైన్యం కిమేతైసై#్సనికైర్మృత్తేః || 2 నివారయస్వ సైన్యంస్వం వారయిష్యా మ్యహం స్వకమ్ | ఆవయో ర్ద్వైరథం యుద్ధం పశ్యన్తు వసుధాధిపాః || 3 త్వదీయాః సైనికా యే చ సురనాధాః | హతే మయి మదీయంతు సైన్యం కామం ప్రయుధ్యతామ్ || 4 సంగ్రామం వా కరోత్వాజౌ త్వదీయంతు హతేతవ్యి | ఏవముక్త స్తథే త్యుక్త్వావారయా మాస సైనికాన్ || 5 గంధర్వరాట్ సశైలూషో భరతో೭పి తథా స్వకాన్ | తతః ప్రవవృతే యుద్ధం తయోర్దేవా సురోపమమ్ || 6 పశ్యతాం సర్వ సైన్యాన్యం దేవానామపి పశ్యతామ్ | శరజాలేన మహతా ఛాదితార్క కరే రణ || 7 తతక్షతుస్తా వన్యోన్యం శ##రైః సన్నత పర్వభిః | పరస్పర శరాఘాత విసరచ్ఛోణితోక్షితౌ || 8 విరేజతు స్తౌ రాజేంద్ర! పుష్పితా వివ కింశుకౌ | ఉభౌ మహాదథా వీరౌ చోభౌ విశ్రుత పౌరుషౌ || 9 తతోభౌ వరధానుష్కౌ చోభౌ సమర దుర్మదౌ | కాంచనాంగ రథస్థౌతౌ చోభౌ సద్ధ్వజ శోభితౌ || 10 వీజ్యమానౌ తథైవోభౌ యోధాభ్యాం వరచామరైః | ఛత్రయోస్తౌ తదా ధస్తాచ్ఛు శుభాతే మహారథౌ || 11 ఉభా వస్త్ర ప్రతాపేన చక్రతు స్తుములం రణమ్ | అస్త్రయుద్ధం చిరంకృత్వా శరయుద్ధం ప్రచక్రతుః | 12 శరయుద్ధే వ్యతిక్రాన్తే అస్త్రయుద్ధం పునః | ఏవంతౌ దివసం కృత్వా యుద్ధం సంశ్రాన్తవవాహనౌ|| 13 రోపయన్తౌ శ్రమంరాజన్ : సమరేషు జిత శ్రమో | తతో గంధర్వరాజస్తు లంబమానే దివాకరే || 14 చకార తామసీం మాయాం యయాంధ మభవజ్జగత్ | అంధకారే తతో జాతే వాచో೭శ్రూయాన్త దారుణాః || 15 భరతో హన్యతాం శీఘ్రం భక్ష్యతాం పాత్యతాం తథా | అభ్యవర్తన్త భరతం సర్పవృశ్చిక కర్కటాః || 16 మర్కటా వానరా ఘోరాః సృగాలాః ద్వీపిన స్తథా | సింహవ్యాఘ్ర వరాహాశ్చ క్రవ్యాదా యేచ జాతయః ||17 అర్ద్యమాన స్స ధర్మాత్మ భరతసై#్త స్సుదుర్ముభైః | సౌరేణాస్త్రేణ తాం మాయాం బభంజ పరవీరహా || 18 తతస్తు మహతీం మాయాం స చకార మహాబుజః | ఉత్తస్థౌ సుమహాన్ మేఘ శ్ఛాదయిత్వా నభస్తలమ్ || 19 ప్రవవర్షచ ఘోరాణి శస్త్రజాలా న్యనే కశః నారాచా నర్ధనారాచాం స్తథైవ చషకాననాన్ || 20 వత్పదంతాం స్తథా వల్లాన్ కర్ణినాలీక గోముఖాన్ | క్షురప్రా నర్ధచంద్రాంశ్చ వరాహ వదనాం స్తథా || 21 గదాభుశుండీః ప్రాసాంశ్చ భిండిపాలాన్ పరశ్వథాన్ | హుడాన్ గుడాన్సలగుడాన్ చక్రఖడ్గాం స్తథా పరాన్ || 22 ఏతా నన్యాంశ్చ వివిధాన్ వవర్ష పరమాయుదాన్ | పతద్భి రాయుధై ర్ఘోరైర్బాధ్యమాన స్సరాఘవః || 23 వాయవ్యాస్త్రేణ తాం మాయాం నాశయామాస శత్రుహా | తతో బభూవ రాజేంద్ర! గంధర్వః పర్వతో మహాన్ || 24 క్షరత్ ప్రస్రవణో ఘోరః శిఖరైశ్చ సముచ్ఛ్రితైః | మాయాం తాం పార్వతీం శ్రీమాన్ వజ్రాస్త్రేణ రఘూద్వహః || 25 నాశయామాస రాజేంద్ర! సర్వసైన్యస్య పశ్యతః | హన్యమానాసు మాయాసు రూపాంశ్చక్రే సుదారుణాన్ || 26 యక్షాణాం రాక్షసానాంచ పిశాచానాం పతత్రిణామ్ | సింహవ్యాఘ్ర తరక్షూణాం కుంజరాణాం తథైవచ || 27 బభజ తస్యమాయాస్తాః దివ్యాసై#్రర్భరతో రుషా | హన్యమానాసు మాయాసు లాఘవాద్భరతం రణ || 28 మోహయామాస రాజేంద్ర! శైలూషో రణదర్పితః | భరతో೭పి ధనుష్కోట్యాం శరాగ్రేచ నిలీయతే || 29 ధ్వజాగ్రేచ రథాగ్రేచ తురగాగ్రే పునః పునః సాయకాన్ భారతాన్ శైఘ్ర్యాద్ధ్వంసయామాస యాదవ : 30 రాఘవా స్తుతుషు స్తస్య దేవ దైత్యాశ్చ సంఘశః | అసురా ముముచు ర్ఘోర మట్టహాసం సుదారుణమ్ || 31 దైత్యానా మట్టహాసేన భరతః కుపితో భృశమ్ | నారాయణాస్త్రం సంయోజ్య శ##రేణానతపర్వణా|| 32 ఇయేష హస్తుం తం క్రోధా ద్గంధర్వం రణగర్వితమ్ | అస్త్రం తత్సంహృతం జ్ఞాత్వా జగామ స్వం రథం త్వరన్ || 33 ఇయేష హన్తుం తం చాస్త్రం రుద్రాస్త్రేణతు దారుణమ్ | ఏతస్మిన్నేవకాలే తు ముమోచ భరత శ్శరమ్ || 34 కాలానల సమ ప్రఖ్యం సుపుంఖంసఫలం తథా | రాజితం వైనతేయస్య పక్షైః శత్రు వినాశనమ్ || 35 హత్వా రుద్రాస్త్ర వేగంతు రథస్థస్య మహీపతేః | బిభేద హృదయం రాజన్: వర్మ భిత్వాథ ೭ కాంచనమ్ || 36 రాజ్ఞశ్చ హృదయం భిత్వా భిత్త్వాచ వసుదాతలమ్ | స్నాత్వా రసాతలాంభస్సుతూర్ణం పున రపాగమత్ || 37 గంధర్వరాజో ೭భి హతః వరేనా న త పర్వణా | రథనీడే ధనుస్త్యక్త్వా మమార పరవీరహా || 38 మార్కండేయుడనియె. సప్తమదివస యుద్ధమందు భరతుడును శైలూషండును గదిసిరి. భరతుడు శైలూషునితో మనకు సేన లెందలకు? నాసైన్యమును నేను వారింతును. నీ సైన్యమును నీవు నాపుము. మనమిద్దరమే రథములనుండిదిగి పోరుదము. మన రణవినోదమును రాజులెల్లరును మన సైన్యములను మీద దేవతలును వినోదము దర్శింతురుగాక ! నేను హతుడైన తర్వాత నా సైన్యము నీ సైన్యముగాని పోరుగాక! అనినంత శైలూషుడు తనసేనను నిలిపివేసెను. భరుతడునట్లసేసి యిర్వురుందలపడిరి. బాణములను విసరికొనిరి. రక్తములందడిసి పూసిన కింశుకములట్లుండిరి. శస్త్రములు (మంత్రానుసంధితము) అస్త్రములు (అమంత్రకము) నెడనెడ మార్చుచు ననిసేసిరి. గంధర్వుడు సూర్యాస్తమయమైనంత చీకటిలో మాయాయుద్ధమారంభించెను. దానిచే లోకము నందంధ కారము గ్రమ్మెను. అపుడు భరతుని జంపుము. భక్షింపుము గూల్చుమను దారుణములైన కేకలు వినవచ్చెను. తేళ్ళు పితలును కోతులు కొండముచ్చులు నక్కలు పులులు సింహవ్యాఘ్ర వరాహములు ఘాతుకమృగములు భరతునిపై గురిసినవి. సౌరాస్త్రము చేవానినిగూల్చి యాతామసమాయాంధకారమును బటాపంచలు సేసెను. అంతపెద్దమబ్బుపట్టెను. అటుపైగంధర్వరాజు ఘోరములయిన శస్త్రములను నారాచములు అర్ధ నారాచములు చషకముఖమలుఉ వత్సదంతములు బల్లములు కర్ణి నాలీక గోముఖములను క్షురప్రములు అర్ధచంద్రములు వరాహవదనములు గదలు భుశుండి ప్రాసము భిండిపాలము పరశ్వథము హుడము గుడములగుడము చక్రమలు మఱిపెక్కింటి నుపయోగించి భరతువి వేధించెను. భరతుడు వాని మాయను వాయవ్యాస్త్రముచే నశింపజేసెను. అమీద శైలూషుడొక పర్వతమయి మీదినుండి కొండవాగులను గురిసెను. ఆపార్వతీమాయను శ్రీమంతుడు భరతుడు వజ్రాయుధముచే హరించెను. మాయాను హరింపవాడు దారుణ రూపప్రదర్శనము సేసెను. యక్షరాక్షసపిశాచ పక్షి సింహవ్యాఘ్రగజాది రూపములగు నామాయా రూపములను భరతుడు దివ్యాస్త్రములచే హతమొనర్చెను. ఆపై గంధర్వ మాయచే నతడు వింటికొప్పున శరాగ్రమున ధ్వజముపై రథముమీద గుఱ్ఱముపై మరిమరి యెట జూచిన నట లీనుడై చేసినయుద్ధముం దిలకించి భరతసైన్యములు సురాసురులును ఆశ్చర్య చకితులై యతనిని గొనియాడిరి. అసురులట్టహాసములుసేసిరి. దానమరియు మిక్కిలి కుపితుడై రాఘవుడు నారాయణాస్త్రము ననుసంధించి ప్రయోగించెను. అది సంహృతమగుటెరిగి రథమెక్కి రుద్రాస్త్రమును ప్రయోగించెను. అది కాలాగ్నియట్లు జ్వలించెను. సుపుంఖము సఫలమునై గరుడుని ఱక్కలతో గూడియుండెను. అది రథమెక్కిన శైలూషుని బంగారపు కవచముం బ్రద్దలుసేసి వాని గుండెలు పగిల్చి భూమిలో జొచ్చి పాతాళోదకములందు స్నానముసేసి తిరిగియమ్ములపొదిలోనికి వచ్చెను. గందర్వపతి యిట్లు హతుడై ప్రాణములు వాసి విల్లు జారవిడిచి రథముమోసలం ప్రాణములు విడిచెను. పితరం నిహతం దృష్ట్వా శైలూష తనయా రణ | క్రోధ దుఃఖ పరీతాస్తే భరతం రణ కర్కశమ్ || 39 వివ్యధు ర్భూపతిశ్రేష్ఠ! బాణౖ రాశీ విషోవమైః | ఆయుధై ర్వివిధాకారై స్తదా తేవై రణాజిరే 40 మాయాశ్చ వివిధా శ్చక్రు ర్బరతస్య విపత్తయే | అంతరిక్షంచ తై ర్వ్యాప్తం నానాహేతి ప్రవర్షిభిః | 41 అసై#్త్రశ్చ కేచి ద్భరతం ప్రవవర్షుః మహారథాః | భూరి భావాత్స యోధానాం మహస్త్రాణాం మహాబలాత్ || 42 ప్రతాపా దస్త్రజాలానాం సంశయం పరమంగతాః| కాలాస్త్ర మథ సాంవర్తం ముమోచ భరత స్తదా || 43 తస్మా దస్త్రా త్సహస్రాణి శస్త్రాణాం నిర్యయుస్తదా | గంధర్వ సైన్యం సకల మసై#్త్రసై#్తః ప్రత్యహన్యత || 44 శ##సై#్త్రః కేచిత్ విశిరసః కృత్వా గంధర్వ సత్తమాః వివాహాశ్చ కృతాః కేచిత్ కేచిద్రాజన్ ద్విధా కృతాః || 45 కేచిద్విబాహవశ్చైవ కేచి ద్వ్యంగాశ్చ యాదవ! గంధర్వాణాంచ తాః కోట్య స్తిస్రః సంగ్రామ శాలినామ్ || 46 క్షణ నాస్త్ర ప్రపాతేన భరతేన నిపాతితాః | గంధర్వసైన్యే నిహతే ప్రవవు ర్మారుతాః శివాః || 47 పుష్పవర్షం పపాతా೭థ భరతస్యతు మూర్ధని | దిశశ్చ నిర్మలీ భూతా దేవానాం విగతం భయమ్ ||48 తతో దేవ స్సహస్రాక్షః సర్వై స్సురగణౖ స్సమమ్ | విమానస్థో బభాషేదం భరతం దర్మవత్సలమ్ || 49 ఇంద్రః : పితామహ వరో ద్రేకా దవధ్యం దేవతా గణౖః | హతవానసి శైలూషం దేవబ్రాహ్మణ కంటకమ్ || 50 యస్మా త్తస్మా ద్వరం మత్తో గృహాణ రఘునందన| మార్కండేయః శతక్రతో ర్నిశ##మ్యైత ద్భరతో వాక్య మబ్రవీత్ || 51 భరతః త్వమీశః సర్వ దేవానాం తవేదం సకలం జగత్ | అచిరేణౖవ మరణం త్వదాజ్ఞా భంగకారిణామ్ || 52 భవతీహ సదాలోకే నిమిత్తం మద్విధో జనః | ప్రజాపతి కృతం భేదం కో మోక్తుం జగతి క్షమః || 53 వరశ్చయదిమే దేయః త్వయాదేవ ప్రదీయతామ్ | సింధోరుభయ కూలేషు కరిష్యామి పురద్వయమ్ || 54 గంధర్వ రక్షితే దేశే పుత్రయోరుభయోః కృతే | నివేశం తద వాప్నోతః ప్రసాదేన శతక్రతో || 55 మార్కండేయః : ఏవమస్త్వి త్యథోక్త్వైవ స్వర్లోకం వాసవో య¸° | వాసవేతు గతేనాకం రాజా చిత్రరథసతః || గంధర్వాణాం మహాతేజాః భరతం వాక్యమబ్రవీత్ | చిత్రరథః : గంధర్వా నిహతా వీరా మదాజ్ఞా భంగకారిణః || 57 త్ర్వయాతే ధర్మనిత్యేన దేవ బ్రాహ్మణ కంటకాః | తన్మే సముద్ధృతం శల్యం దేవానంచ ప్రియంకృతమ్ || 58 తస్మా త్సభాజయిత్వా త్వాం యాస్యామిత్రిదివం పునః | మార్కండేయః : భరత స్తమువాచాథ గంధర్వా నిహతా మయా || 59 తత ఏనంజనం తేషాం స్త్రియశ్చ పరిపాలయ | గంధర్వాః పరిపాల్యాస్తే తేషాం త్వం పరిపాలకః || 60 మదీయేనానురోధేన విశేషా త్కర్తు మర్హసి | సర్వేషాం చ తథా స్థానం పర్వతే గంధమాదనే || 61 పయాతా స్తవ తత్రస్థాః పాలయిష్యన్తి శాసనమ్ | ఏవం కరిష్య ఇత్యుక్త్వా పరిష్వజ్యచ పీడితమ్ || 62 సర్వజ్ఞం భరతం శ్రీమాన్ గంధర్వస్త్రిదివం య¸° || 63 రఘు ప్రవీరో೭పి రణ మఘోనం శత్రు నిహత్వా వరదాన యుక్తమ్ | విరాజమానో యశసా పరేణ జగామ రాజన్ ః ప్రహృష్టః 64 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషవధో నామ షట్‌షష్ట్యుత్తర ద్విశత తమో೭ధ్యాయః తండ్రి హతుడగుటచూచి వానికొడుకు భరతునిపై బాణములు కురిపించెను. వాని ప్రచండరణ కౌశలముంగని రఘూద్వహుడు కాలాస్త్రమును ప్రయోగించెను. అందుండి వేలకొలది యస్త్ర శస్త్రములు వెలువడి ముప్పదికోట్ల గంధర్వసైన్యమును హతమార్చెను. అది హతమైన శుభవాయువులువీచెను. భరతునిపై పూలవాన గురిసెను. దిక్కులు తెలివొందెను. బయమువాసెను. అంతట సహస్రాక్షుండు దేవతలతో విమానముపై వచ్చి ధర్మరతుడైన భరతునితో పితామహు వరబలముచే జావని వాని నీ దేవబ్రాహ్మణ కంటకునిజంపితివి. వరమిచ్చెదనడుగుమన నీవు సర్వదేవతాప్రభువవు.న ఈజగత్తునీది. నాయజ్ఞను భంగపరచువారలకు మరణము తప్పదు. నావంటివాడు నిమిత్తమాత్రుడు. బ్రహ్మవ్రాసిన విఘాతమునెవ్వడు తప్పింపగలడు? నాపై ప్రసన్నుడవేని సముద్రమిరువైపుల రెండుపురములనునిర్మింతును. ఆ ప్రదేశమీవరకు గంధర్వులపాలన నున్నది. నాకుమారుల కాపురమును రాజదానులగును. ఇట్లేయగునని వరమిచ్చయింద్రుడు స్వర్గమునకేగెను. అప్పుడు చిత్రరథుడను గంధర్వముఖ్యుడు నాయాజ్ఞ గంధర్వలుగూలిరి. దేవబ్రాహ్మణ కంటకుడు గూలినంత నా హృదయశల్యమువాసినది. నిన్నుగారవించి నేను స్వర్గమునకేగెదనన భరతుడిక నీ మిగిలిన యీజనమును స్త్రీజనమును పాలింపుము. విశేషించి నిర్ణయముగాన దీనింగావింపుము. అందరకును గంధమాదనమందు స్థానమున్నది. నీవాండ్రటకు జని నీయా న బాలింతురు. అనవిని యిట్లసేయుదునని చిత్రరథుడు బరతుం గట్టిగ గౌగలించికొని త్రిదివంబునకేగెను. భరతుడింద్ర శత్రువులనిట్లు పరిమార్చి వరమునడసి కీర్తిశాలియై స్వపురమున కానంద భరితుడై యేగెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శైలూషవధయను రెండువందల యరువది యారవ అధ్యాయము.