Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

మూడవ అధ్యాయము

యజ్ఞవరాహప్రాదుర్భావము

మార్కండేయ ఉవాచ :

బ్రహ్మరాత్ర్యాం వ్యతీతాయాం విబుద్ధే పద్మసంభ##వే | విష్ణుస్సిసృక్షు ర్భూతానాం జ్ఞాత్వాభూమిం జలాంతగామ్‌ || 1

జలక్రీడారుచి శుభం కల్పాదిషు యథాపురా | వారాహ మా శ్రితో రూప ముజ్జహార వసుంధరామ్‌ || 2

వేదపా ద్యూప దంష్ట్రశ్చ చతుర్వక్త్రశ్చతుర్ముఖః | అగ్నిజిహ్వోదర్భరోమా బ్రహ్మశీర్షొ మహాతపాః || 3

అహోరాత్రేక్షణోదివ్యో వేదాంగశ్ర్శుతిభూషణః | ఆజ్యనాస స్ర్సువతుండ స్సామఘోష స్వనోమహాన్‌ || 4

ధర్మస్సత్యమహాః శ్రీమాన్‌ కర్మవిక్రమ సత్క్రతః | ప్రయశ్చిత్తమయోధీరః ప్రాంశుజాను ర్మహాయశాః|

ఉద్గాత్రాంత్రో హోమలింగః ఫలబీజ మహౌషధిః || 5

వాయ్వంతరాత్మా మంత్రాస్థి ర్వికటస్సోమశోణితః | వేదస్కంధో హవిర్గంధోహవ్య కవ్యాతివేగవాన్‌ || 6

ప్రాగ్వంశ కాయో ద్యుతిమాన్‌ నానాదీక్షాభిరన్వితః | దక్షిణా హృదయో యోగీ మహాక్రతు మయోమహాన్‌ || 7

ఉపాకర్మేష్టిరుచిరః ప్రవర్గ్యావర్తభూషణః | మాయా పత్నీ సహాయోవై మహాశృంగఇవోదితామ్‌ || 8

మహీం సాగర పర్యంతాం సశైలవనకాననామ్‌ | ఏకార్ణవజలభ్రష్టా మేకార్ణవ గతః ప్రభుః 9

దంష్ట్రాగ్రేణ సముద్ధృత్య లోకానాం హిత కామ్యయా | ఆది దేవో మహాయోగీ చకారజగతీం పునః || 10

ఏవంజ్ఞాత్వా వరాహేణ భూత్వాభూత హితార్థినా | ఉద్ధృతా పృథివీదేవీ జలమధ్యగతాపురా || 11

ఉద్ధృత్య భూమిం నవిభుర్మహాత్మా వరాహరూపేణ జలాంతరస్థామ్‌ |

చక్రే విభాగం జగతస్తదీశో యథాయథా తచ్ఛృణు రాజసింహ ! 12

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే మార్కండేయ వజ్ర సంవాదే వరాహప్రాదుర్భావోనామ తృతీయో7ధ్యాయః.

మార్కండేయుడనియె : బ్రహ్మకు రాత్రిగడువ నాతడుమేల్కొన విష్ణువు భూతసృష్టిగావింప నీటనున్న భూమినుద్ధరించుట కింతముందట్లు కల్పాదియందు జలక్రీడారతుడై వారాహ రూపముధరించి యీధరణి నుద్ధరించెను. అత్తఱి నాతని పాదములునాల్గు నాల్గువేదములు. యూపస్తంభములు కోరలు. నాల్గు ముఖములు నలుమోములవాడు (బ్రహ్మ). అగ్నినాలుక, రోమములు దర్భలు. మహాతపస్వి బ్రహ్మశిరస్సు . అహోరాత్రములు నేత్రములు. వేదాంగములు కర్ణభూషణములు. ఆజ్యము (నెయ్యి). ముక్కు. స్రువము తుండము(ముట్టె). సామఘోషము స్వనము(ధ్వని). ఘర్మము(చెమట) సత్యతేజస్సు. కర్మ విక్రమము (అడుగులు పెట్టుట-నడకయన్న మాట) ప్రాయశ్చిత్తమయుడు ఉన్నతజానువులు గలవాడు (జానువు=మోకాళ్ళు) ఉద్గాత ప్రేవులు హోమము లింగము. ఓషధులు ఫలబీజములు (వృషణములు) : అంతరాత్మ వాయువు మంత్రములు అస్థులు. సోమము రక్తము వేదములు మూపులు హవిస్సు గంధము (వాసన హవ్యకవ్యములు వేగములు. ప్రాగ్వంశము నానావిధదీక్షా సహితమయి తేజరిల్లు శరీరము. దక్షిణ హృదయము. యజ్ఞస్వరూపుడైన యోగి యీవరాహమూర్తి. ఉపాకర్మ - ఇష్టి యాయనతళుకులు. ప్రవర్గ్య సుడులు. మాయ పత్ని. పెద్దకొమ్మున నో యుదయించిన భూమిని పర్వతములతో వనములతో నున్న దానిని లోకహితముగోరియే కార్ణవ జలములందు మునిగిన దానినెత్తి అయ్యాదిదేవుడు మహాయోగి యీ జగతిని రూపొందించెను. భూతహితార్థియై యిట్లెత్తి యీ భూమిని విభాగమొనరించెను. ఆయొనరించిన తీరువినుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము-ప్రథమ ఖండమున యజ్ఞవరాహప్రాదుర్భావమను మూడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters