Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పదవ యధ్యాయము - ఆదిత్య దర్శనము మార్కండేయ ఉవాచ: సదదర్శ తతోగత్వా విపులం సూర్యమండలమ్ | చంద్రమండల మానేన మానం యస్యచ సంస్క్రతమ్ || 1 యత్తత్ర్పజ్వలితం పిండం పిండతస్య విభావసోః | దేవదేవస్య యద్ధామ వాసుదేవస్య ధీమతః || 2 తస్య ధర్మ ః పరం పిండం బ్రహ్మాండాంతరం దీపనమ్ | ఆధారం సర్వభూతానాం జఠరస్థం హుతాశనమ్ || 3 పంచధా೭వస్థితం దేహే సర్వేషాం ప్రాణినాం స్మృతః | ఆలోచకః పాచకశ్చ రోచకో గంజక స్తథా || 4 భ్రాజకశ్చ తథా దేవః సర్వేషాం ప్రాణినాం తథాః | యన్మయం దేహినాం చక్షుర్యశ్చక్షు ర్దక్షిణస్తథా || 5 సవై దేవాదిదేవస్య వాసుదేవస్య కీర్తితః | అగ్నౌప్రాస్తా೭೭హుతి స్సమ్యక్ నిత్యం యత్రోప తిష్ఠతే || 6 యస్యదత్తం సదాతేజః సర్వేషా మేవ తేజసా | యస్మా దంబు ధరోత్పత్తిః యస్మాద్వర్షణ సంభవః || 7 యస్మా త్ర్పవర్తతే సర్వం కాలచక్రం తథైవచ | ఓషధీనాం పరః పాకః పరం యస్మాన్న విద్యతే || 8 తన్మండల మథా೭೭సాద్య కృత్వా రూపంతు తె జసమ్ | వివేశ మండలం భిత్వా తన్మధ్యం శంకర స్తదా || 9 సో೭ంగుష్ఠ మాత్రం పురుషం దృక్‌శక్తి మివ వేష్టితమ్ | తై జసం దృష్ఠవా& రుద్రస్తుష్టావ చ మహాద్యుతి || 10 మార్కండేయుడనియె : ఈశ్వరుడేగి చంద్రమండలము యొక్క కొలత ననుసరించి చక్కగకొలిచి సరిచూడబడిన సువిశాలమైన సూర్యమండలముం దర్శించెను. ముద్దగా చేయబడిన ప్రజ్వలించుచున్న యా బింబము దేవదేవుడగు వాసుదేవుడుండు ధామము(ఇల్లు-తేజస్సు) ఆ భానువు యొక్క పిండము ముద్ద ధర్మము అది సర్వభూతముల కాధరమై జఠరమందున్న యగ్నియది (వైశ్వానరాగ్ని) సర్వప్రాణి శరీరములందది యైదువిధములుగనున్నది. అవి 1. ఆలోచకము ( ) 2. పాచకము 3. రోచకము
4. గంజకము 5. భ్రాజకము దేహుల కన్ను (చూపు) అదే. అదే దేవతలకెల్ల దేవతయైన వాసుదేవుని కుడికన్నని వేదములు వర్ణించినవి. అగ్ని యందుంచబడిన ఆహుతి సరిగా నిరంతర మెట కేగునో, ఎవ్వని వెలుగుచే నెల్లరకు వెలుగీయబడినదో, ఏనివలన వారిధర్మములు(మేఘములు) ఏర్పడునో, వేనివలన వర్షము కల్గునో ఎవ్వనివలన కాలచక్రమెల్ల త్రిప్పబడునో ఓషదుల పాక మెవ్వనివలన గాక కాదో అట్టి తేజోమూర్తిమండలము భేదించుకొని శంకరుడు అట్టి తేజోమూర్తియై ప్రవేశించెను. ఆతడచ్చట అంగుష్ఠమాత్రుడై జీవుల దృక్ఛక్తి యంతయు నొకచో ప్రోగువడినట్లున్న తైజసుడైన పురుషుం దర్శించి మహాద్యుతియైన రుద్రుడు స్తుతించెను. త్వాం నమస్యామి దేవేశ ! తేజసాం తు పరం నిధిమ్ | ఆరాధ్యస్త్వం వరేణ్య స్త్వం సర్వభూత భవోద్భవః || 11 స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం తథా భవా& | అనంత శ్చాప్రమేయ స్త్వం సూక్ష్మాత్ సూక్ష్మతర స్తథా || 12 మయా సమర్పితం తేజః సకలం త్వయి భాస్కర ! | మత్తస్త్వం నహి భిన్నో೭సి నచ దేవా జ్జనార్దనాత్ || 13 అహం విష్ణుర్భవా& విష్ణుః బ్రహ్మావిష్ణుః ప్రభాకర ! అస్మాకం సకలం ధామ త్వయి తిష్ఠతి భాస్కర ! 14 ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా | ప్రజానాంతు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే || 15 రసానాంచతథా೭೭దానాత్ రవి రిత్యభిధీయసే | ఆదిత్య స్త్వం తథా దానాత్ మిత్రత స్త్వం మైత్రభావతః || 16 పుష్ణాసి సకలా& లోకా& తేన పూషా నిగద్యసే | ధారణా చ్చ తథా ధాతా యమనా దర్యమా తథా || 17 అంశు స్త్వమంశుధారిత్వాత్ విసర్గా ద్వరుణ స్తథా | భగ స్సౌభాగ్యవాచ్యత్వాత్ త్వష్టా సర్వక్రియా కృతే ః || 18 సర్వజన్తు సమత్వాచ్చ వివస్వా న భిధీయతే | క్రమణాచ్చ తథా విష్ణురీశిత్వా దింద్ర ఉచ్యతే || 19 తస్మాత్త్వయా ప్రజాకార్యం కర్తవ్యమవిచారితమ్ | స్థావరై ర్జంగమ స్థైర్వా భూమిర్భారాభిపీడితా || 20 కదాచిజ్జంగమై ర్భూమిః సూర్య భారేణ పీడితా | కదాచిత్ స్థావరై రద్య భారద్వితయ పీడితా || 21 అర్జునే నృపతౌ వృద్ధిః పరా భాస్కర ! శాఖినాం | దైత్యాః క్షత్రియతాం ప్రాప్య పీడయన్తిచ మేదినీమ్ || 22 రుద్రకృత సూర్యస్తుతి దేవేశ ! తేజోనిధియైన పరముని నిన్ను మ్రొక్కెద. నీవారాధ్యుడవు వరేణ్యుడవు సర్వభూత సముద్భవ హేతువవు. తమరు స్వర్గద్వారము ప్రజాద్వారము మోక్షద్వారమును. అనంతుడవు ఆప్రమేయుడవు సూక్ష్మాతిసూక్ష్ముడవు. ఓ భాస్కరా ! నేనెల్ల తేజస్సును నీయందర్పించితిని. నాకంటె జనార్దనునికంటె నీవన్యుడవుగావు నేను విష్ణువను నీవు విష్ణువవు బ్రహ్మవిష్ణువు ఓ ప్రభాకరా ! మా అందరి యంత వెలుగు నీయందున్నది. నా జగత్తు యొక్క వెలుగు వలసి కావలసినవాని యెల్లవేళల జగత్తు యొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే సవిత యని రసము వితరణము సేయుటచే రవియని దానము సేయుటచే ఆదిత్యుడని మైత్రభావమును సర్వప్రాణులయెడ బాటించుటచే మిత్రుడని సర్వలోకములం దోషించుటచే పూషయని ప్రపంచమును ధరించుటచే ధాత యని యమించుటచే(నియమములో హద్దులో నుంచుటచే) అర్యముడని అంశుధారివగుట) (కిరణములధరించువాడగుట) అంశువని విసర్గముచే (అవనిపై వానగా నీరును వదలుటచే) వరుణుడని సౌభాగ్య శబ్దముచే పిలువబడుటచే భగుడని సర్వక్రియాక ర్తవగుటచే త్వష్టయని, సర్వజంతుసముడగుటచే వివస్వంతుడని జగదాక్రమణముచే విష్ణువని ఈశుండగుట(పాలకుడగుట)చే ఇంద్రడని వ్యాపనముచే విష్ణువని పేర్కొనబడుదువు. కావున నీవేమియు నాలోచింపక ప్రజాకార్యమీపుసేయవలయును. భూమి స్థావరజంగమ భూతకోటి భారముచే పీడితయైనది. ఒకపుడు జంగముములచేతను నొకపుడు స్థావరములచే, ఈనాడు రెండు బరువులచే సూర్యా ! పీడింపబడుచున్నది. కార్తవీర్యర్జునుడు రాజైన యిత్తరి చెట్లు తెగ పెరిగినవి. దైత్యులు క్షత్రియులై మేదినిం బీడించుచున్నారు. అన సూర్యుండిట్లనియె: సూర్య ఉవాచ : తవ దర్శన కామేన ప్రాగేవ నకృతా మయా | స్థావరై ర్జంగమైః సర్వా ప్రకృతిస్థా వసున్ధరా || 23 యథాపూర్వం తథా೭ద్యాహం కరిష్యామి మహేశ్వర ! సాంప్రతం బ్రాహ్మణో భూత్వా చార్జునేనైన వ పాదపాన్ || 24 రుద్ర ఉవాచ: సర్వా& వినాశయిష్యామి శాసనేన తథా೭ర్జునమ్ | వసిష్ఠా ద్యోజయిష్యామి తతో೭ంశేన వసుంధరామ్ || 25 భృగు వంశే కరిష్యామి తతో నిఃక్షత్రియాం ప్రజామ్ || మార్కండేయ ఉవాచ : ఇత్యేవముక్త స్త్రిపురాంతకారీ సూర్యేణ సద్రశ్మి విరాజితేన || జగామ ధామ స్వమసౌ బిభేతి యత్సర్వలోకాన్ జగతాం ప్రధానః || 26 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే - ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఆదిత్య దర్శనం నామ త్రింశత్తమో೭ధ్యాయః నీ దర్శనము కోరి యింతకుమున్న స్థావరజంగమ పీడనందిన వసుంధరను సహజస్థాయికిం దేనైతిని. ఇపుడింతకు మున్నున్న స్థితికిం దెచ్చెదను. ఇపుడు బ్రాహ్మణుడనై కార్తవీర్యార్జునునిచేతనే ఎల్ల చెట్లం గూల్పించెద. శాసించి వానిని వశిష్ఠునితో గలిపి మామీద నా యంశముచే (అంశావతారమెత్తి) వసుమతి భృగువంశము వశమొనరించెద. ఆమీద ప్రజను నిఃక్షత్రియము గావింతును. అని ఉత్తమకిరణ విరాజితుడు సూర్యుండు పలుక సర్వజగత్ప్రధానుడు సర్వలోకభయంకరుడు(రుద్రుడు) నిజధామము (కైలాసమునకు) నకు ఏగెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ఆదిత్యదర్శనమను ముప్పదియవ యధ్యాయము.