Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పదిరెండవ యధ్యాయము - బడబాగ్ని యుత్పత్తి మార్కండేయ ఉవాచ : సర్వదెవా తిదేవస్య బ్రాహ్మణస్తనయో భృగుః | పౌలోమ్యాం జనయామాస చ్యవనం భగవా& భృగుః || 1 యయాతి (శర్వాతి) జా సుకన్యాపి చ్యవనాత్ భృగునందనాత్ | ఆత్మవానంద ధీచంచ జనయామాస ధార్మికౌ ||2 ఋషిపత్నీ మహాభాగాచా೭೭త్మవానస్య నాహుషీ | ఔర్యం సంజనయామాస బుచీకాపర సంజ్ఞితమ్ || 3 యేన క్రోధాభిభూతేన దృష్టో೭గ్నిర్బడ బాముఖః | తస్య సత్యవతీ భార్యా కైశికీ గాధిజా శుభా || 4 తస్యాం సంజనయామాస పుత్రాణాం శత మూర్జితమ్ | జమదగ్ని శ్చ వత్సశ్చ తేషాం శ్రేష్ఠతమా వుభౌ || 5 స్త్రీణాం చరు విపర్యాసాత్ జమదగ్ని రజాయత || 6 వజ్ర ఉవాచ : కథ్యతాంమే యతోబ్రహ్మ& బాడబస్యచసంభవః | సంభవం జమదగ్నే శ్చ శ్రోతు మిఛ్చామి తత్వతః || 7 మార్కండేయుడనియె : బ్రహ్మ కుమారుడు భృగువు. ఆయనకు పౌలోమియందు చ్వవనుడు పుట్టె. శర్యాతి కుమార్తె సుకన్య చ్యవనుని వలన ఆత్మవానుడు దధీచుడు నను నిద్దరు ధర్మాత్ములగు బుత్రులం గాంచెను. ఆత్మవానుని భార్య నాహుషి (నహుషుని కూతురు) ఔర్వునిం గనెను. ఆతనికి ఋచీకుని భార్య సత్యవతి. కుశికవంశీయ. గాధి కూతురు. ఆమెయందు ఋచీకునికి నూరుగురు తనయులు గల్గిరి వారిలో జయదగ్ని వత్సుడుననువారు శ్రేష్ఠులు. ఋచీక భార్యబ చరువిపర్యాసమువలన జమదగ్ని జనించెను. అనవిని వజ్రుడు బాడబుని యొక్క జమదగ్ని యొక్కయు జన్మవృత్తాంతము సవిస్తరముగ నానతిమ్మన మార్కండేయుడిట్లనియె : మర్కండేయ ఉవాచ : భృగూణాం హైహయానాంచ వై రమాసీత్సుదారుణమ్ | ధనహేతో స్తదా పాపైః హైహయై ర్భృగవోహతాః || 8 యే೭పి గర్భగతా లాఃతే೭పితైర్విని షూదితాః | గర్భేషు హన్యమానేషు ఋషిః పరమ దుఃఖితః || 9 అరుణంధారయామాస గర్భేష్టం దీప్తతేటసమ్ | పూర్ణేకాలే తదాబాల ఊరుంభి త్వావ్యజాయత || 10 జాతమాత్రస్తు చుక్రోధ దేవతానాం మహాతపాః | హైహయైర్హన్యమానానాం బంధూనాం సుమహాత్మనామ్ ||11 భవద్భిర్నకృతంత్రాణం తస్మాత్ సర్వా& శపామ్యహమ్ తంక్రుదం పితరో హంతుం వారయామాసు రోజసా || 12 క్రోధః పుత్ర ! నకర్తవ్యః సహిశత్రుః నృణాం సదా | వయం సర్వే జితక్రోధాః క్షత్రియై ర్విని పాతితాః || 13 అస్మాకం న వధే శక్తాః క్షత్రియా హైహయాధిపాః | ఏవముక్తః పిత్రగణౖః ఋచీకస్తా నథా೭ బ్రవీత్ || 14 నహిమే శామ్యతి క్రోధో యుష్మన్నిధనకారితః | తస్మాద్దేవ గణా& సర్వాతే నిహనిష్యామి తేజసా || 15 ఏతస్మిన్నేవ కాలేతు మహీ తోయ సమాకులా | జగామ శరణం విష్ణుః సర్వభూత భవోద్భవమ్ || 16 శ్రీ భగవా& ఉవాచ : దేవా& ప్రతిసముత్పన్నం క్రోధ మౌర్వస్య యచ్చుభమ్ | తంప్రవిశ్య గ్రసిష్యామి తోయం సర్వం వసుంధరే || 17 మార్కండేయ ఉవాచ : ఇత్యేవ ముక్త్వా వసుధామౌర్వం క్రోధం సమావిశత్ | భూత్వాచ బడబావక్త్రః తచ్ఛరీరాత్ వినిః సృతః || 18 నత్రాతారో భవిష్యన్తి పుత్ర ! సర్వే దివౌకసః | క్రోధ శ్చాయం తవ వృథా న భవిష్యతి పుత్రక ! 19 ఏవముక్తస్తు భృగుణా ఋచీకో೭గ్ని మభాషత | పూర్వోత్తరే సమాసాద్య సుముద్రేవస ! పుత్రక || 20 పిబ& తత్ర సదావేగ మంభసాం సుమహాద్యుతే | అస్మాకం తు కులేభావీ క్షత్రధర్మా ద్విజోత్తమః 21 క్షత్రియాణాం సముచ్ఛేదం యః కరిష్య త్యనేకశః | ఏవముక్తస్తు పిత్రావై పిబ& మాసాష్టకం జలమ్ || 22 చైత్రమాసం సమారభ్య నిత్యమాన్తే సుఖీజలే | పీతం మాసాష్టకం తోయం జఠరే భస్మసాద్గతమ్ || 23 పూత్కృత్య మాసా& చతురః శిశిరాఖ్యే మహీతలే | నిత్యం హిమౌఘం సృజతి తస్మాదపి సమీరణః 24 హిమాచలే పాతయతి ప్రవాహో నామపార్థివ | ఏషాతోయా ద్దిమోత్పత్తిః హిమర్తౌ యస్య సంభవంః || 25 వృద్ధిక్షయ విహీనస్య కథితం తవ ధార్మిక || 26 ఉత్పత్తి రేషా తవ బాడబాగ్నేః ప్రోక్తా మయాభూమిపతిప్రధాన | శ్రుత్వాపియాం ముంచతి మోహజాలం సంసార జాతేశ్చయథాప్రవృద్ధః || 27 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే - ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే బడబాగ్య్నుత్పత్తిర్నామ ద్వాత్రింశో೭ధ్యాయః భృగువులకు హైహయులకు దారుణవైరమేర్పడెను. ధననిమిత్తముగా పాపులు హైహయులు భృగువులను హతమొనర్చిరి. గర్భమందున్న శిశువులనుగూడ చంపిరి. అయ్యెడ భృగుమహర్షి దుఃఖించి మహాతేజస్వియగు అరుణుడను శిశువును దన గర్భమందు ధరించెను. ప్రసవసమయమునంతట నాశిశువాయన తొడను ఛేదించుకొని పుట్టెను. పుట్టగానే యా మహాతపస్వి దేవతల యెడ కోపముగొని నావారిని హైహయులు చంపుచుండ మీరు రక్షణ యీయలేదు గావున మిమ్మిదుగో వధింతుననియె. అయ్యెడ నాతని పితరులు శపింపవలదని తమ యోపినంత చెప్పి వారించిరి. వారు నాయనా ! కోపముగొనవలదు. అది మానవులకు శత్రువు. క్షత్రియులచే గూల్చబడిన మేము కోపముం గెల్చినవారము. ఆ పాపులు మమ్ము సంహరింపగలవారు కారు. అని పిత్రగణములు దెలుప విని యా శిశువు ఋచీకుడు మిమ్ము సంహరించినాడన్న కారణమున గల్గిన యీ కోపము నాది చల్లారుటలేదు అందుచే నా ప్రతాపముచే నీదేవతలందరిని జంపెందననియె. ఈ సమయమందే భూదేవి నీటిలో మునిగి సర్వభూతకర్తయగు విష్ణుని శరణుజొచ్చెను. అప్పుడు విష్ణుభగవానుడు ఔర్వునికి దేవతల యెడల గల్గిన కోపము శుభకరమైనది అందేను బ్రవేశి చి సర్వజలమును ద్రావివైచెదనని యా కోపమునం జొచ్చినంత నతడు బడబాముఖుండై యాతని శరీరమునుండి వెలువడెను. దేవతలు రక్షణ యీయరైరి. నీ యీ కోపమా వృథాపోనిది. అని తండ్రి భృగుండన ఋచీకు డగ్నిం గని పుత్రా! నీవు పూర్వోత్తర సముద్రములందు వసించి యందు యుదక ప్రవాహమును ద్రావుము. మన కులమందు క్షత్రతేజస్వి బ్రహ్మణోత్తముడుదయింపగలడు. అతడు సర్వక్షత్రియోచ్ఛేద మొనరించును. అని తండ్రి పలుక నాబాలుడు బాడబాగ్ని యను పేర చైత్రమాస మారంభించి యెనిమిదినెలలు సముద్రోదకముం ద్రావెను. అ ఉదకము త్రావగానే యాతని జఠరమున భస్మమైపోయెను. ఈ భస్మమును శిశిర ఋతువున నాల్గు మాసములు ఫూత్కరించి (పుక్కిలించి యుమిసి) నంతట నది గడ్డకట్జిన మంచుగ తయారగును. దానిని ప్రవాహమను వాయువు హిమలయము మీదికి విసరివైచును హిమవదృతువున నీటినుండి మంచు పెట్టెడివిధ మిదియే. దీనికి వృద్ధిక్షయములు లేవు. ఓ రాజ శ్రేష్ఠా | బాడబాగ్ని యొక్క యుత్పత్తి యిది నీకు దెల్పితిని. జ్ఞాని సంసార మోహమునుండి ముక్తుడైనట్లెది విని మోహవిముక్తుడయ్యెదవు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున బడబాగ్ని యుత్పత్తియను ముప్పది రెండవ యధ్యాయము