Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పదిమూడవ యధ్యాయము - సత్యవతి చరువిపర్యాసము మార్కండేయ ఉవాచ: ఔర్వస్య భార్య ధర్మజ్ఞా నామ్నా సత్యవతీ శుభా | వనే పర్యచరత్ భక్త్యా గాధిజా భృగునందనమ్ || 1 తస్యాః పరమయా భక్త్యా భర్తా తోష ముపాగతః | ఉవాచతాం వరారోహాం ఋచీకో భృగునందనః || 2 ఋచీక ఉవాచ : వరం వరయ సుశ్రోణి ! యత్తే మనసి వర్తతే ! తోషితో೭హం త్వయా భ##ద్రే ! వనే శుశ్రూషయా వద! || 3 సత్యవత్యువాచ : మాతుః ప్రయచ్ఛమేపుత్రం భగవ& ! వీర్యవత్తరమ్ | పుత్రం మమచ ధర్మజ్ఞం, యుతం బ్రాహ్మణతేజసా|| 4 ఋచీక ఉవాచ : చరుద్వయం పరిష్యామి మాతురద్ధే తధా తవ | యస్య సంప్రాశనాత్, పుత్రంత్వచైవ జనయిష్యసి || 5 మార్కండేయ ఉవాచ : ఏవముక్త్వా తదాచక్రే ఋచీకస్తు చరుద్వయమ్ | ఏతస్మి& సకలంక్షాత్రం తేజశ్చక్రే సవైష్ణవమ్ || 6 శ్వశ్రర్థేతంచరుం కృత్వా ద్వితీయే సన్యవేశయత్ | బ్రాహ్మం రౌద్రంచ యత్తేజః పత్న్సర్థ్రేతవా& చరుమ్ || 7 ఋచీక ఉవాచ : అయంప్రాశ్యస్తయా భ##ధ్రే ! త్వయంమాత్రా చరుస్తవ | అశ్వత్థా೭೭లింగనం కార్యం మాత్రాతత్రతదా శుభే || తథైవౌదుంబరస్యాపి త్వయా రాజీవలోచనే || 9 మార్కండేయ ఉవాచ : ఏవముక్తాతతో గత్వా మాత్రే సర్వం న్యవేదయత్ || 10 తత స్తా మబ్రవీన్మాతా గాధేఃపత్నీ యశస్విని | ధ్రువం భగవతా పుత్ర స్తవ పుత్ర చికీర్షయా || 11 శ్రేష్ఠేన తేజసా యుక్త శ్చరు రేష కృతః శుభే | తస్మా చ్చరు విపర్యాసం మదర్థేకురు మాచిరమ్ || 12 అలింగనే విపర్యాసం ద్రుమయోః క్రియతాం తథా | సా మాతు ర్వచనం సర్వం చక్రే గౌరవ యంత్రితా || 13 సగర్భా సగతే కాలే భర్తా వచన మబ్రవీత్ || 14 ఋచీక ఉవాచ : ధ్రువంచరు విపర్యాసో ద్రుమయోశ్చత్వయా కృతమ్ | యేన త్వమసితా పాంగి ! యుక్తా క్షత్రియ తేజసా || 15 బ్రాహ్మేణ తేజసాయుక్తం కృతవానస్మి తే చరుమ్ | మాతు స్తే చారుసర్వాంగి తథా క్షత్రియ తేజసా|| 16 కృతంచరు విపర్యాసం సా విప్రం జనయిష్యతి | క్షత్ర ధర్మరతం పుత్రం విప్రం త్వం జనయిష్యసి || 17 సత్యవత్యువాచ : మాతుర్మతాత్కృతమిదం భగవ& ! క్షంతు మర్హసి | క్షత్రధర్మ రతః పుత్రో నమే భవితు మర్హతి|| 18 ఋచీక ఉవాచ : ఏవమస్తునతే పుత్రఃక్షత్ర ధర్మా భవిష్యతి | పౌత్రస్త్వవశ్యం భవితా భావ్యర్థ విధి చోదితః || 19 సత్యవత్యువాచ : సర్వేశ్వరస్త్వం భగవ& ! కిమర్థం ! పౌత్రస్య మే క్షత్రియ భావముగ్రమ్ ! నివర్తతుంచేచ్ఛసి మాతులేన వద్వ తన్మే యదితేయ గుహ్యమ్ || 20 శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే చరు విపర్యాసో నామ త్రయస్త్రింశ త్తమో೭ధ్యాయః. మార్కండేయు డనియె : ఔర్వుని భార్య సత్యవతి. అమె గాధి కూతురు. భృగునందనుని తన భర్త నరణ్యమునం బరిచరించెను. అమె పరమ భక్తికి మెచ్చి భర్త ఋచీకుడు సుందరీ ! నీ మదింగల కోరిక కోరుకొనుము. కల్యాణి ! నీ సేవలకేను సంతుష్ఠుడనైతినన సత్యవతి మా అమ్మకు పరాక్రశాలియగు తనయు నుగ్రహింపుము. నాకు బ్రాహ్మణతేజస్సంపన్నుని బుత్రుని దయసేయుము. అనవిని ఋచీకుడు రెండు చరువులనేర్పరచి యొకదానియందు వైష్ణవతేజస్సమన్విత క్షాత్రతేజస్సంతయు నించి అత్తగారికొరకిచ్చెను. రెండవ చరువునందు బ్రాహ్మ తేజస్సు రౌద్రమును నించి భార్యకని యేర్పరచెను. ఏర్పరచి యిదీ నీవు యిది మీ యమ్మయు గైకొనుడు దీని ప్రాశించి మీయమ్మ రావిచెట్టుం (అశ్వత్థము) గౌగలించుకొనవలెను. నీవు ఉదుంబరమును (మేడిచెట్టును)కౌగలించుకొనవలెననియె. అది విని సత్యవతి తల్లితరికేగి యది తెలిపెను. గాధి భార్య (సత్యవతి తల్లి) కూతురుంగని నిజమే భగవంతుడు నీ భర్త నీ పుత్రసంతతికై శ్రేష్ఠమైన తేజస్సు నింపి యీ చరువు నీకై యేర్పరచినాడు. కావున యీచరువుల విపర్యాసమును (తారుమారు) చేయుము. యాయా చెట్లను గౌగలించుటలో గూడ విపర్యాసము వెంటనే కానిమ్ము. అనవిని యావిడ తల్లియెడ గౌరవము ననుసరించి యామె చెప్పినది చెప్పినట్లు సేసెను. కాలము గడువ గర్భవతియైన యాబిడంగని భర్త(ఋచీకుడు) నీవు చరువుల మార్చితివి చెట్లం గౌగలింపులోగూడ మార్పుచేసితివి. ఇది నిక్కము దాన నీవు క్షత్రియ తేజస్సుతో గూడి కొన్నావు. నీకై నేను బ్రహ్మతేజస్సంపూర్ణమైన చరువుం జేసియిచ్చితిని. ఓ సర్వాంగసుందరి! మీ తల్లికి క్షత్రియ తేజస్సు నించిన చరువు గల్పించిలిని. చరువిపర్యాసము జరిగినది ఆమె బ్రహ్మణునిం గనును నీవు క్షత్రధర్ముడైన విప్రునిం గందువు అనెను. అంతట స్యతవతి మా అమ్మ ముచ్చటననుసరించి యిట్లు చేసితిని. భగవంతుడా! క్షమింపనగును. క్షత్రధర్ముండగు కొడుకు నాకు గలుగదగదు అన ఋచీకుడు ; ఇట్లే యగుగాక! నీవు క్షాత్రధర్ముడు గలుగడు కాని విధిప్రేరణచే నీకు గలుగు పౌత్రుడు మాత్రము క్షత్రియ తేజస్వి కాగలడు అనియె. అదివిని సత్యవతి నీవు సర్వేశ్వరుడవు(సర్వసమర్థుడవు) గదా! నా పౌత్రునికి (మనుమనికి) మాత్రము ఉగ్రమైన క్షత్రియధర్మము విధి చితివదిమాత్రమేల? నీవు మేనమామవగుదువుగదా? దీనిని నీవెల మరల్పదలపవు. ఇది రహస్యవిషయము గాదేని యానతిమ్మనియె. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున సత్యవతి చరువిపర్యాసమను ముప్పదిమూడవ యధ్యాయము.