Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ముప్పదినాల్గవ యధ్యాయము - కుశిక వరప్రసాదము

ఋచీక ఉవాచ :

బ్రహ్మణోత్రి స్సుతః సౌమ్యః సుత స్తస్యాపి చంద్రమాః |

సోమస్య తు బుధః పుత్రో బుధ పుత్రః పురూరవాః || 1

శ్రుతాయు స్తనయ స్తస్య పుత్ర స్తస్యాపి నగ్నజిత్‌ | తస్యాపి కాంచనః పుత్రః సుహోత్ర స్తస్య చాత్మజః || 2

తస్య జహ్నుః స్మృతః శ్రీమా& యేన గంగాతు జాహ్నవీ | సువ్రత స్తనయ స్తస్య చాలర్క స్తస్యచాత్మజః || 3

తస్య పుత్రో బలాకశ్చ కుశిక స్తస్య చాత్మజః | మహోదయే పురవరే సతు నిత్యం కృతాలయః || 4

ఏతస్మిన్నేవ కాలేతు శ్వశురః చ్యవనస్తవ | స్వ వంశసంకరం బుద్ధ్వా కుశికేభ్యో మహాయశాః || 5

కుశికానాం సముచ్ఛిత్త్యైన కుశికం నృపతిం య¸° | పూజితః కుశ##కేనాపి కుశికం వాక్మ మబ్రవీత్‌ || 6

రాజ& ! వక్ష్యామి కార్య తే యది శుశ్రూషసేనఘ! | స భార్యేణ చ కర్తవ్యం రాజ& శుశ్రూషణం త్వయా || 7

కుశిక ఉవాచ :

స్వమేవేదం తవగృహం యథేష్టం వస | భార్గవ! | శక్తిత స్తవ శుశ్రూషాం కరిష్యే భార్యయా సహ || 8

ఋచీక ఉవాచ :

గృహోషితం తం చ్యవనం శుశ్రూషు రనహం కృతః | పూజయామాస సతతం సర్వకామ సమృద్దిభిః || 9

బహు సంఖ్యా& దినగణా& చ్యవనో నావ బుద్ధ్యతి | నిరాహారః స భార్యస్తం పర్యుపాస్తే మహీపతిః || 10

అకాలే ప్రాశయత్యన్నం కదాచిదపి దుర్లభం | కృత మిత్యేవ తద్రాజానివేదయతి సత్వరమ్‌ || 11

కదాచిద్బహు భుంక్తేన్నం న భుంక్తే దివసా& బహూ& | ధనేనచ తదీయేన తర్పయామాసవై ద్విజా& || 12

కదాచి ద్దీపయత్యేవ వహ్నిం తాత గృహోద్భవమ్‌ | కదాచి చ్చ రథేయుక్తం స భార్యో రాజపుంగవమ్‌ || 13

రాజమార్గే ప్రతోదేన తు ద& యాతి యథేచ్ఛయా | తస్యాసౌ హితమేవేదం కర్మణా మనసా గిరా || 14

సమాచరతి యత్నేన భార్గవ ప్రియ కామ్యయా | యదా న వృజినం కించిత్‌ దృష్టవాం స్తస్య భార్గవ ! 15

తదా తస్య వరం ప్రాదా ద్వరం యన్మనసేప్సితమ్‌ || 16

చ్యవన ఉవాచ :

వరం వరయ! భద్రంతే ప్రసన్నోహం తవానఘ |

నిర్వ్యాజం తేనయా రాజ& ! సేవయానఘయా సదా || 17

కుశిక ఉవాచ :

యదిమేత్వం ప్రసన్నోసి భృగూణాం వంశవర్ధన ! |

వంశో బ్రాహ్మణతాం యాతు వరమేత ద్వృణోమ్యహమ్‌ || 18

చ్యవన ఉవాచ :

ఏతదేవధ్రువం భావీయన్మాం వరయసే నృప! | అస్మ ద్వంశాను వంశస్య బ్రాహ్మణ్యంతే భవిష్యతి || 19

తవ వంశకృతోస్మాకం క్షత్ర ధర్మో ద్విజోత్తమః | భవిష్యతి నరేంద్రేంద్ర ! చైతత్సు విదితం మమ || 20

ఏతజాజ్ఞత్వా సముత్సేధం చికీర్షుః స్వకులస్యతే | వికారైః క్రోధనార్థంతే గృహేహ మవసం చిరమ్‌ || 21

వికారం న తతో దృష్టం మయా భావ్యర్థచోదితమ్‌ |

తస్మా న్మాతు స్స్వయాప్రాప్తం వరమేతత్‌ సుదుర్లభమ్‌ || 22

కుశాశ్వనామా పుత్రస్తే భవితాతి స్వధార్మికః | తస్యాపి భవితాపుత్రో గాధి రిత్యేవ విశ్రుతః || 23

విశ్వామిత్రః సుతస్తస్య బ్రహ్మణ్య ముపలప్స్యతి | కృత్వా వైరం వసిష్ఠేన తపసా మహతా నృప ! 24

స్త్రీణాం చరు విపర్యాసా ద్విశ్వామిత్రస్య సంభవః | అస్మ ద్వంశానుభవితా నిర్వృత్తో భవ పార్థివ ! 25

యత్తే వినాశితం దగ్ధం భవితా తద్విశేషవత్‌ | భార్యయా సహితశ్చైవ జరాహీనో భవిష్యసి || 26

ఏవముక్త్వా గతే విప్రే రాజా పూర్ణ మనోరథః | ఉవాచ సుముఖీం భ##ద్రే | జరాశోక వివర్జితామ్‌ || 27

ఏతత్‌ సునేత్రే చ్యవనస్య వాక్యం కస్యాస్తి శక్తిర్భువి మానవస్య |

కర్తుం మృషాతేన వరోరమధ్యే ! | పౌత్రస్తవోగ్రో భవితా నృలోకే || 28

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే కుశిక వరప్రధానం నామ చతుస్త్రింశత్తమోధ్యాయః

ఋచీకుండు భార్యతో నిట్లనియె : బ్రహ్మకుమారుడు సౌముడగునట్టి అత్రి. ఆతని యెక్క కొడుకు చంద్రుడు. వానికొడుకు బుధుడు వాని కుమారుడు పురూరవుడు. వానికొడుకు శ్రుతాయువు. వానివాడు నగ్నజిత్తు వానివాడు కాంచనుడు. వాని నతుడు సుహోత్రుడు. వానికొడుకు జహ్నువు. ఆతనిచేతనే గంగానది జలాహ్నవి యననైనది. జహ్నువు కుమారుడు అలర్కుడు. వానికొడుకు బలాకుడు వానికొమరుడు కుశికుడు. అతడు మహోదయపురనిత్యనివాసి. ఈ తరుణమందే నీమామగారుచ్యవనుడు కుశికులవలనే తనవంశసాంకర్య మగుట విని తద్వంశ##చ్ఛేద మొనరింవ కుశికునిదరికేగెను. అతని పూజలందికొని యాయసతో రాజా ! నీవాలింపనెంతువేని యొకపని నీకు దెలిపెదను. నీవు నీభార్యయు గూడ నామాటవినవలసినది. అనవిని కుశికుడు ఇది నీస్వగృహమే - స్వేచ్ఛగనిందు వసింపుము. భార్యయు నేను నీకు శుశ్రూషయెనరింతును (నీచెప్పినమాటవిందుము) అనియె. అట్లు భార్యతో తనయింట విడిదిసేసిన చ్యవనుని యెట్టియహంకారము గొనక సర్వకామసమృద్ధుల నా చ్యవనుని పరిచరించెను. బహుదినములటు గడచెను. కానియెంత కాలమయ్యెనో చ్యవను డది గుర్తింపనే గుర్తింపడయ్యె ఆరాజు భార్యతో నిరాహారియై యాఋషి నుపాసించెను. చ్యవనుడొకప్పుడకాలమున సన్నము దినవలెననును. రాజు సర్వము సిద్ధమనెను. ఒకప్పుడు ఋషి తెగదినును ఒకతరి పెక్కు దినములు తిననేతినడు. ఈ రాజిచ్చిన సొమ్ములచే బ్రాహ్మణ సంతర్పణములు సేయుచు తండ్రి యింట నున్న యగ్ని నొక్కప్పుడుద్దీపింపజేయును. ఒకప్పుడు భార్యతో రథమెక్కి రాజావీథి నారాజు రథము లాగుచుండ ముని కోలంగ్రుచ్చి యాతనిం దోలుచు స్వేచ్ఛావిహారము సేయును. ఆ భార్గవుని ప్రియముగోరి యా ఱడు త్రికరణశుద్ధిగ యత్న పరుడై యాతని హితము నాచరించుచుండెను. అప్పుడు చ్యవనుడా రాజునందేకొంచెమేని తప్పిద మెప్పుడు కానడయ్యెనో యప్పుడా నృపునిం గని చ్యవనుడు రాజా! పుణ్యాత్ముడా ! వరము కోరుము శుభంబగుగాక. ఏమాత్రము కపటములేని యీ నీ సేవకు నీయెడ నేను బ్రసన్నుడ నైతిని అనకుశికుడు ఓ భృగువంశవర్ధన ! నీవు నాయెడ బ్రసన్నుడవేని నా వంశము బ్రాహ్మణత్వమునందుగాక ! వర మిది నేను కోరుచున్నాను. ఆన చ్యవనుడు ఈవు కోరితివిగాన ఇదే తప్పక జరుగును మా వంశమునకనువంశ##మైనవారికి బ్రాహ్మణ్యము గలుగగలదు. నీ వంశమువాడు క్షత్రియధర్ముడై బ్రాహ్మణుడు మావంశోచ్ఛేదముసేయగలడని యెరింగి మొత్తము కుశికవంశమును చ్ఛేదము సేయవలెనని యేను వచ్చి నీ యింట పెక్కు వికారములతో నివసించితిని. భావ్యర్థచోదితమైన యొక్క యించుకేని వికృతి నీయింట గనబడలేదు. అందు మీయమ్మవడిసిన యీ వరము మిక్కిలి దుర్లభ##మైనది. నీకు కుశాశ్వుడను కొడుకు గల్గును. అతడు పరమధార్మికుడగును. వానికి గాధి యుదయించును. వాని కుమారుడు విశ్వామిత్రడు మహాతపస్సుచేత వశిష్ఠునితో వైరముపెట్టుకొని బ్రాహ్మణ్యముంబడయగలడు. స్త్రీల చరువిపర్యాసముచే విశ్వామిత్రుడు పుట్టును. మా వంశానుసారముగ నదిజరుగును. కావున యింటికి మరలుము. ని నష్ణమైన దగ్ధమైనదెల్ల చక్కబడును. నవిశేషమగును. నీ భార్యయు నీవును ముదిమినందురు. అని యిట్లు పలికి విప్రుండరుగ నారాజు పూర్ణమనోరథుడై జరాశోకములులేని సుముఖియైన భార్యంగని కల్యాణి! ఇది చ్యవన మహర్షిమాట. నీ మనుమడు (పౌత్రుడు) ఉగ్రమూర్తియగునన్న యా మాటను అబద్ధముగావించుటకీ మానవలోకమున నేమానవునికి శక్తి యున్నది ?

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కుశికవరప్రదానమను ముప్పదినాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters