Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పది ఐదవ యధ్యాయము - పరశురామావిర్భావము మార్కండేయ ఉవాచ ః ఏవముక్త్వా సత్యవతీ కాలేపూర్ణే ద్విజోత్తమమ్ | జనయామాస ధర్మజ్ఞం జమదగ్నిం తపోధనమ్ ||
1 తతశ్చ జనయామాస వాత్స్యం నృగకులో ద్వహమ్ | తతో೭ష్టనవతిం పుత్రా& గోత్రాకారా& పృథక్ పృథక్ || 2 గాధేరపి తదా భార్యా జనయామాస పుత్రకమ్ | విశ్వామిత్ర మితిఖ్యాతం యుతం బ్రాహ్మణ తేజసా|| 3 జితో యుద్ధే వసిష్ఠేన మన్యునా యస్స పార్థివః | బ్రాహ్మణ్యం తపసా లేభే ధర్మాత్మా సంశితవ్రతః || 4 రాజా ప్రసేన జిన్నామ సుతాం తస్యాథ రేణుకామ్ | పత్న్యర్థే ప్రతి జ్రగాహ జమదగ్ని ర్మహా తపా ః || 5 సాతం వనగతం భక్త్యా నిత్యం పర్యచరత్ వనే | రచాచి దథ ఘర్మర్తౌ మధ్యం ప్రాప్తే దివాకరే || 6 క్రీడార్థం ప్రాస్యతి చిరం జమదగ్ని ర్మహా తపాః | క్షిప్తా ః క్షిప్తా ః శరాస్తేన రేణుకా చారులోచనా || 7 ఆనయామాస ధర్మజ్ఞా భర్తుర్వచన కారిణీ | అథార్కతాప సంతప్తా దహ్యమానాక్షి పంకజా || 8 పుష్పితస్యచ వృక్షస్య ఛాయా మాసాద్య విష్టితా | విశ్రమ్యతుముహూర్తం సా భర్తుర్నిన్యే శరోత్తమమ్ || 9 తాం ప్రాప్తాం కుపితో భర్తా జమదగ్ని రభాషత | క్రీడతో మే శ##రైర్భద్రే! విఘ్నం కిం కృతవత్యసి || 10 న బిభేషి చ మాం భ##ద్రే ! త్వథ వాప్యవ మన్యసే || 11 రేణుకోవాచ ః అర్కాగ్నితాప సంతప్తా క్షణమాత్రం మహావ్రత ! | ఆపారయన్తీ విశ్రాన్తా తస్మాత్త్వం క్షంతు మర్హసి || 12 మార్కండేయ ఉవాచ ః రేణుకాయా వచశ్శుత్వా జమదగ్ని ర్మహాతపాః | జాతరోషస్తదా సూర్యే సాయకాన్ క్షేప్తు ముద్యతః || 13 ఏతస్మిన్నేవ కాలేతు విప్రరూపో దివాకరః | శీఘ్ర మాగమ్య తేజస్వీ జమదగ్ని మభాషత || 14 సూర్య ఉవాచ ః స్వభావ ఏషమే బ్రహ్మ&! యదహం దహనాత్మకః | వర్తతశ్చ స్వభావేన నమేత్వం క్రోద్ధు మర్హసి || 15 పుత్రస్తే೭హం భవిష్యామి త్వస్యామేవ ద్విజోత్తమ ! | సురకార్యం కరిష్యామి లోకానాంచ హితం మహత్ || 16 ఇయంచ పత్నీ ధర్మజ్ఞా రేణుకా తవ సాంప్రతమ్ | ఛత్రోపానహ మేతన్మే గృహ్ణాతు వరవర్ణినీ || 17 తస్యానుకంపయా ఛత్రం తథా బ్రహ్మా& ఉపానహౌ | మయా సృష్టౌ జగత్యస్మి& ! నిత్యమేవ భవిష్యతి|| 18 ఛత్రోపానహయో ర్దానం లోకేశ్రేష్ఠం భవిష్యతి | ఛత్రోపానహ దానేన నర స్స్వర్గం గమిష్యతి || 19 ఏవముక్తస్తు సూర్యేణ జమదగ్ని ర్మహాతపాః | సంపూజ్య సూర్యం జగ్రాహ సవితు స్సకలం వచః || 20 తతస్సూర్యే తతేదీవీ సూర్య పుత్రాపురా సతీ | పుత్రం కనీయసం రామం జనయామాస రేణుకా || 21 తమన్వావ సుషేణశ్చ వసు ర్విశ్వావసుస్తథా | తేషాం జఘన్యజో రామో విష్ణు ర్మానుష రూపధృక్ || 22 అంశేన జాతేభువి దేవదేవే సునిర్వృతా భూమి రథో బభూవ | హృతాం చ మేనే దితిజ ప్రజాతాం పీడాం నృణాం స్వస్యచ సా ధరిత్రీ || 23 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వ్రజసంవాదే రామోత్పత్తిర్నామ పంచ త్రింశత్తమో೭ధ్యాయః మార్కండేయుడనియె : సత్యవతి యీమాటలాలించి నెలలునిండ ధర్మజ్ఞుడు తపస్వియునైన జమదగ్నిం బ్రాహ్మణు గనెను. భృగుకులోద్ధారకుని వాత్స్యుని నా తరువాత ప్రసవించెను. అటుపైని గోత్ర ప్రవర్తకులయినవారిని తొంబదియెనిమిదిమందిని గనెను. గాధి భార్య బ్రాహ్మణతేజస్సంపన్నుడయిన యొక్కని విశ్వామిత్రుని బుత్రునింగనెను. వశిష్ఠునిచే నతడోడిపోయి దీక్షబూని తపస్సుచే బ్రాహ్మణ్యమును బొందెను. జమదగ్ని ప్రసేనజిత్తు కుమారిని రేణుకను బరిణయమాడెను. ఆయన క్రీడార్థము (ఆటగా) బాణములను విసరుచుండెను. వానిని రేణుక భర్త యానతిందెచ్చి మరలమరల యందించుచుండెను. అట్లు కొంతవడి సన నామె సూర్యతాపమున దపించి పాదపద్మములుకాల నలసి యొక పుష్పించిన చెట్టునీడను నిలువబడెను. ఒక ముహూర్తమట్లట విశ్రమించి. భర్త విసిరిన బాణమును గొనితెచ్చెను. అంత నతడు కుపితుడై బాణములతోనాడుకొనుచున్న నా యాటకు విఘ్నముసేసితివేల ? నేనన్న భయములేదా? లేక నన్నవమానింతువా? యన రేణుక సూర్యువేడిమికుడికెత్తి యొక క్షణ మేమియుం జేయలేక విశ్రమించి, తిని. ఓ మహాతపస్వీ ! దానికి నన్ను క్షమింపదగుదువు. అనవిని జమదగ్ని రోషముగొని సూర్యునిపైకి బాణముల జిమ్మబూనెను. ఈసమయమందే సూర్యుడు బ్రాహ్మణరూపియై సత్వరమువచ్చి జమదగ్నితో నిట్లనెను. బ్రహ్మణ్యుడా ! అగ్నిస్వరూపుడనగుట నిది నా స్వభావము. నైజ్రపవర్తనుడనైన నాయెడ నీవు కోపపడదగదు. ఈమెయందే నేను నీపుత్రుడ నయ్యెదను. దేవతల కార్యమును లోకహితమును నొనరింపగలను. ఈమె నీ ధర్మపత్ని సుకుమారమూర్తి. ఇదిగో యీ గొడుగును పాదుకలను నీమె యిపుడు గైకొనుగాక ! ఆమెయెడల జాలిచే ఛత్రమును ఈ పాదుకలను నేను సృష్టించితిని. ఇప్పటినుండి యివి జగత్తునందుగూడ నుపయుక్తములు కాగలవు. గొడుగును ఉపానహములను (చెప్పులజోడును) దానముసేయుట చాల శ్రేష్ఠముకాగలదు. వానిం దానమిచ్చి నరుడు స్వర్గముల బొందును. ఆనవిని మహాతపస్వి జమదగ్ని భాస్కరుని బూజించి యాయన మాటలనెల్ల గైకొనెను. (అంగీకరించెను) అవ్వల భానుండు సన నా రేణుకాదేవి సూర్యుడు తన కుమారుడుగానైనదై (సూర్యతేజస్సు గర్భమునందు ప్రవేశించినదన్న మాట) రాముని (పరశురాముని) కడగొట్టుబిడ్డగా గనెను. అతనికి ముందు పుట్టినవారు సుషేణుడు వసువు విశ్వావసువుననువారు. వారితరువాత పుట్టినవాడు రాముడు. సాక్షాద్విష్ణువే మానుషరూపము ధరించినాడు. మహావిష్ణువు తన యంశముతో నవని నవతరించినంతట భూదేవి మిక్కిలి సంతృప్తిని సంతోషమును బొందినది. రాక్షసముఖ్యులవలన నరులకుం దనకు గలుగుచున్న పీడ యింతతో విరగడయైనట్లు తలంచెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పరశురామావిర్భావమను ముప్పదియైదవ యధ్యాయము.